యెషయా
66 యెహోవా ఇలా అంటున్నాడు:
“ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం.+
2 యెహోవా ఇలా అంటున్నాడు:
“స్వయంగా నా చేతులే వీటన్నిటినీ చేశాయి,
అవన్నీ అలాగే వచ్చాయి.+
అయితే వీళ్లను, అంటే
విరిగిన మనసు కలిగి, నా మాటకు భయపడే వినయస్థుల్ని నేను చూస్తాను.+
3 ఎద్దును వధించేవాడు, మనిషిని చంపేవాడిలా ఉన్నాడు.+
గొర్రెను బలి ఇచ్చేవాడు, కుక్క మెడను విరగ్గొట్టేవాడిలా ఉన్నాడు.+
కానుక అర్పించేవాడు, పంది రక్తాన్ని అర్పించేవాడిలా ఉన్నాడు!+
సాంబ్రాణితో జ్ఞాపకార్థ అర్పణను అర్పించేవాడు,+ మంత్రాలతో దీవించేవాడిలా* ఉన్నాడు.+
వాళ్లు తమకు నచ్చిన దారుల్ని ఎంచుకున్నారు,
అసహ్యమైనవాటిని బట్టి సంతోషిస్తున్నారు.
4 కాబట్టి నేను వాళ్లను శిక్షించడానికి మార్గాల్ని ఎంచుకుంటాను,+
వాళ్లు భయపడేవాటినే వాళ్లమీదికి రప్పిస్తాను.
ఎందుకంటే నేను పిలిచినప్పుడు ఎవ్వరూ పలకలేదు;
నేను మాట్లాడినప్పుడు ఎవ్వరూ వినలేదు.+
వాళ్లు నా దృష్టిలో చెడ్డవైనవి చేస్తూ వచ్చారు,
నాకు నచ్చని వాటిని ఎంచుకున్నారు.”+
5 యెహోవా మాటకు భయపడేవాళ్లారా, ఆయన ఏం చెప్తున్నాడో వినండి:
“మిమ్మల్ని ద్వేషించి, నా పేరును బట్టి మిమ్మల్ని దూరం పెట్టే మీ సహోదరులు, ‘యెహోవా మహిమపర్చబడాలి!’ అని అంటున్నారు.+
కానీ ఆయన ప్రత్యక్షమై మీకు సంతోషం తెస్తాడు,
వాళ్లేమో అవమానాలపాలు అవుతారు.”+
6 నగరంలో కోలాహలం వినిపిస్తోంది, ఆ శబ్దం ఆలయం నుండి వస్తోంది!
అది యెహోవా తన శత్రువులకు తగిన శాస్తి చేస్తున్న శబ్దం.
7 పురిటినొప్పులు రాకముందే ఆమె బిడ్డను కన్నది.+
ప్రసవవేదన మొదలవ్వకముందే మగబిడ్డను కన్నది.
8 అలా జరిగిందని ఎవరైనా ఎప్పుడైనా విన్నారా?
అలాంటివాటిని ఎవరైనా చూశారా?
ఒక్కరోజులో ఒక దేశానికి జన్మనివ్వడం వీలౌతుందా?
ఒక్కసారిగా ఒక జనమంతా పుడుతుందా?
అయితే, సీయోనుకు ప్రసవవేదన మొదలవ్వగానే ఆమె కుమారుల్ని కన్నది.
9 “నేను పురిటినొప్పులు కలిగించి, బిడ్డ పుట్టకుండా చేస్తానా?” అని యెహోవా అడుగుతున్నాడు.
“ప్రసవవేదన కలిగించి, గర్భం మూసుకుపోయేలా చేస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నాడు.
10 యెరూషలేమును ప్రేమించేవాళ్లారా,+ మీరంతా ఆమెతోపాటు సంతోషించండి, ఆనందించండి.+
ఆమె గురించి దుఃఖిస్తున్నవాళ్లారా, మీరంతా ఆమెతో కలిసి అధికంగా ఉల్లసించండి.
11 ఎందుకంటే ఓదార్పు అనే ఆమె చనుపాలు తాగి మీరు పూర్తిగా తృప్తిపొందుతారు,
మీరు కడుపునిండా తాగి, ఆమె గొప్ప వైభవాన్ని బట్టి సంతోషిస్తారు.
12 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు:
మీరు వాటి పాలు తాగుతారు, వాళ్లు మిమ్మల్ని చంకనెత్తుకొని తీసుకొస్తారు,
తమ మోకాళ్ల మీద మిమ్మల్ని ఆడిస్తారు.
13 తల్లి తన కుమారుణ్ణి ఓదార్చినట్టు
నేను మిమ్మల్ని ఓదారుస్తూ ఉంటాను;+
యెరూషలేము విషయంలో మీరు ఊరట పొందుతారు.+
14 మీరది చూస్తారు, మీ హృదయాలు సంతోషిస్తాయి,
మీ ఎముకలు లేతగడ్డిలా వర్ధిల్లుతాయి.
15 “ఎందుకంటే మహాకోపంతో ప్రతీకారం చేయడానికి,
అగ్నిజ్వాలలతో గద్దించడానికి+
యెహోవా అగ్నిలా దిగివస్తాడు,+
ఆయన రథాలు సుడిగాలిలా ఉన్నాయి.+
16 ఎందుకంటే యెహోవా అగ్నితో తీర్పును అమలుచేస్తాడు,
అవును, ఖడ్గంతో మనుషులందర్నీ శిక్షిస్తాడు;
యెహోవా చేతిలో హతులైన వాళ్లు చాలామంది ఉంటారు.
17 “మధ్యలో ఉన్న వ్యక్తిని అనుసరిస్తూ తోటల్లోకి*+ ప్రవేశించడానికి తమను తాము పవిత్రపర్చుకుంటూ, శుద్ధీకరించుకుంటూ, పందుల మాంసాన్ని,+ అసహ్యమైన వాటిని, చుంచెలుకల్ని+ తినే వాళ్లంతా ఒకేసారి నాశనమౌతారు” అని యెహోవా అంటున్నాడు. 18 “వాళ్ల పనుల గురించి, వాళ్ల ఆలోచనల గురించి నాకు తెలుసు కాబట్టి, అన్ని దేశాలకు, భాషలకు చెందిన ప్రజల్ని సమకూర్చడానికి నేను వస్తున్నాను; వాళ్లు వచ్చి నా మహిమను చూస్తారు.”
19 “నేను వాళ్ల మధ్య ఒక సూచనను పెడతాను. తప్పించుకున్న వాళ్లలో కొందర్ని ఇప్పటివరకు నా గురించిన వార్త వినని, నా మహిమను చూడని దేశాలకు అంటే విలుకాండ్రు ఉండే తర్షీషు,+ పూలు, లూదు+ దేశాలకు; తుబాలుకు, యావానుకు,+ సుదూర ద్వీపాలకు పంపిస్తాను. వాళ్లు దేశాల మధ్య నా మహిమను ప్రకటిస్తారు.+ 20 ఇశ్రాయేలు ప్రజలు శుభ్రమైన పాత్రలో యెహోవా మందిరంలోకి కానుక తెచ్చినట్టు, వాళ్లు అన్నిదేశాల్లో నుండి మీ సహోదరులందర్నీ గుర్రాల మీద, రథాల మీద, కప్పు ఉన్న బండ్ల మీద, కంచర గాడిదల మీద, వేగంగా నడిచే ఒంటెల మీద ఎక్కించుకొని యెహోవాకు కానుకగా తీసుకొస్తారు;+ నా పవిత్ర పర్వతమైన యెరూషలేముకు వాళ్లను తీసుకొస్తారు” అని యెహోవా అంటున్నాడు.
21 “వాళ్లలో కొంతమందిని నేను యాజకులుగా, లేవీయులుగా తీసుకుంటాను” అని యెహోవా అంటున్నాడు.
22 “నేను చేయబోతున్న కొత్త ఆకాశం, కొత్త భూమి+ ఎలాగైతే నా ముందు ఎప్పటికీ నిలిచివుంటాయో, అలాగే నీ సంతానం,* నీ పేరు కూడా ఎప్పటికీ నిలిచివుంటాయి”+ అని యెహోవా అంటున్నాడు.