కీర్తనలు
ఒకటో భాగం
(1-41 కీర్తనలు)
1 దుష్టుల సలహా ప్రకారం నడుచుకోకుండా,
పాపుల మార్గంలో నిలబడకుండా,
ఎగతాళి చేసేవాళ్లతో కూర్చోకుండా ఉండే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.+
అతను చేసే ప్రతీది సఫలమౌతుంది.+
4 కానీ దుష్టులు అలా ఉండరు;
వాళ్లు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు.
6 నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు,+
దుష్టుల మార్గం నాశనమౌతుంది.