కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 సమూయేలు విషయసూచిక

      • నాతాను దావీదును గద్దించడం (1-15ఎ)

      • బత్షెబ కుమారుడు చనిపోవడం (15బి-23)

      • బత్షెబకు సొలొమోను పుట్టడం (24, 25)

      • అమ్మోనీయుల రబ్బా నగరాన్ని స్వాధీనం చేసుకోవడం (26-31)

2 సమూయేలు 12:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 17:1; 29:29
  • +కీర్త 51:పైవిలాసం

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2010, పేజీ 21

2 సమూయేలు 12:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 5:13

2 సమూయేలు 12:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 11:3

2 సమూయేలు 12:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 11:4

2 సమూయేలు 12:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2010, పేజీ 21

2 సమూయేలు 12:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:1

2 సమూయేలు 12:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 7:8
  • +1స 18:10, 11; 19:10; 23:14

2 సమూయేలు 12:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 15:26, 28
  • +2స 3:7; 1రా 2:22
  • +2స 5:5
  • +2స 7:19

2 సమూయేలు 12:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:13
  • +నిర్గ 20:14, 17

2 సమూయేలు 12:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:18; 2స 13:32; 18:33; గల 6:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/1/2010, పేజీ 21

2 సమూయేలు 12:11

అధస్సూచీలు

  • *

    లేదా “నీ తోటివాడికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 12:15, 19; 13:10-15; 15:14
  • +నిర్గ 21:24; యోబు 31:9-11
  • +2స 16:21, 22

2 సమూయేలు 12:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 39:9; కీర్త 32:5; 51:పైవిలాసం; 51:4; సామె 28:13
  • +నిర్గ 34:6
  • +లేవీ 20:10; కీర్త 103:10

2 సమూయేలు 12:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 12:22; యోనా 3:8, 9

2 సమూయేలు 12:20

అధస్సూచీలు

  • *

    లేదా “రాజభవనంలోకి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రూతు 3:3; 2స 14:2
  • +2స 6:17

2 సమూయేలు 12:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 38:3, 5; యోవే 2:13, 14; ఆమో 5:15; యోనా 3:8, 9
  • +2స 12:16; యోవే 1:14

2 సమూయేలు 12:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ప్రస 9:6
  • +యోబు 30:23; ప్రస 3:20; అపొ 2:29, 34; 13:36
  • +ప్రస 9:5, 10

2 సమూయేలు 12:24

అధస్సూచీలు

  • *

    “శాంతి” అనే అర్థమున్న హీబ్రూ పదం నుండి వచ్చింది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 11:3
  • +1ది 3:5, 9; 22:9; 28:5; మత్త 1:6
  • +2స 7:12; 1ది 29:1

2 సమూయేలు 12:25

అధస్సూచీలు

  • *

    “‘యా’కు ప్రియమైనవాడు” అని అర్థం. “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 7:4, 5; 12:1; 1రా 1:8

2 సమూయేలు 12:26

అధస్సూచీలు

  • *

    లేదా “ఆ రాజ్య నగరాన్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 23:3, 6
  • +ద్వితీ 3:11; యెహో 13:24, 25
  • +2స 11:25; 1ది 20:1

2 సమూయేలు 12:27

అధస్సూచీలు

  • *

    ఆ నగర నీటి వనరుల్ని సూచిస్తుండవచ్చు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 11:1

2 సమూయేలు 12:28

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఆ నగరం నా పేరుతో పిలవబడుతుంది.”

2 సమూయేలు 12:30

అధస్సూచీలు

  • *

    బహుశా అమ్మోనీయుల దేవుని విగ్రహం కావచ్చు, వేరే చోట మోలెకు, మిల్కోము అని పిలవబడింది.

  • *

    అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 8:11, 12
  • +1ది 20:2, 3

2 సమూయేలు 12:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2005, పేజీ 27

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 సమూ. 12:11ది 17:1; 29:29
2 సమూ. 12:1కీర్త 51:పైవిలాసం
2 సమూ. 12:22స 5:13
2 సమూ. 12:32స 11:3
2 సమూ. 12:42స 11:4
2 సమూ. 12:6నిర్గ 22:1
2 సమూ. 12:72స 7:8
2 సమూ. 12:71స 18:10, 11; 19:10; 23:14
2 సమూ. 12:81స 15:26, 28
2 సమూ. 12:82స 3:7; 1రా 2:22
2 సమూ. 12:82స 5:5
2 సమూ. 12:82స 7:19
2 సమూ. 12:9నిర్గ 20:13
2 సమూ. 12:9నిర్గ 20:14, 17
2 సమూ. 12:10సం 14:18; 2స 13:32; 18:33; గల 6:7
2 సమూ. 12:112స 12:15, 19; 13:10-15; 15:14
2 సమూ. 12:11నిర్గ 21:24; యోబు 31:9-11
2 సమూ. 12:112స 16:21, 22
2 సమూ. 12:13ఆది 39:9; కీర్త 32:5; 51:పైవిలాసం; 51:4; సామె 28:13
2 సమూ. 12:13నిర్గ 34:6
2 సమూ. 12:13లేవీ 20:10; కీర్త 103:10
2 సమూ. 12:162స 12:22; యోనా 3:8, 9
2 సమూ. 12:20రూతు 3:3; 2స 14:2
2 సమూ. 12:202స 6:17
2 సమూ. 12:22యెష 38:3, 5; యోవే 2:13, 14; ఆమో 5:15; యోనా 3:8, 9
2 సమూ. 12:222స 12:16; యోవే 1:14
2 సమూ. 12:23ప్రస 9:6
2 సమూ. 12:23యోబు 30:23; ప్రస 3:20; అపొ 2:29, 34; 13:36
2 సమూ. 12:23ప్రస 9:5, 10
2 సమూ. 12:242స 11:3
2 సమూ. 12:241ది 3:5, 9; 22:9; 28:5; మత్త 1:6
2 సమూ. 12:242స 7:12; 1ది 29:1
2 సమూ. 12:252స 7:4, 5; 12:1; 1రా 1:8
2 సమూ. 12:26ద్వితీ 23:3, 6
2 సమూ. 12:26ద్వితీ 3:11; యెహో 13:24, 25
2 సమూ. 12:262స 11:25; 1ది 20:1
2 సమూ. 12:272స 11:1
2 సమూ. 12:302స 8:11, 12
2 సమూ. 12:301ది 20:2, 3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 సమూయేలు 12:1-31

సమూయేలు రెండో గ్రంథం

12 కాబట్టి యెహోవా నాతానును+ దావీదు దగ్గరికి పంపించాడు. నాతాను అతని దగ్గరికి వచ్చి+ ఇలా చెప్పాడు: “ఒక నగరంలో ఇద్దరు మనుషులు ఉండేవాళ్లు, ఒకతను ధనవంతుడు, మరొకతను పేదవాడు. 2 ధనవంతుని దగ్గర ఎన్నో గొర్రెలు, పశువులు ఉండేవి;+ 3 కానీ పేదవాడి దగ్గర తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడ గొర్రెపిల్ల తప్ప ఇంకేమీ లేదు.+ అతను దాన్ని బాగా చూసుకునేవాడు. అది అతనితో, అతని కుమారులతో పాటే పెరిగింది. అతని దగ్గరున్న కొద్దిపాటి ఆహారం నుండే అది తినేది, అతని గిన్నెలో నుండి తాగేది, అతని చేతుల్లో నిద్రపోయేది. అది అతనికి కూతురిలా మారింది. 4 తర్వాత, ఆ ధనవంతుని ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. ధనవంతుడు తన దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి కోసం భోజనం తయారుచేయడానికి తన సొంత గొర్రెల్లో, పశువుల్లో దేన్నీ తీసుకోలేదు. బదులుగా ఆ పేదవాడి గొర్రెపిల్లను తీసుకొని, తన దగ్గరికి వచ్చిన వ్యక్తి కోసం దాన్ని సిద్ధం చేశాడు.”+

5 అది వినగానే దావీదుకు ఆ వ్యక్తి మీద చాలా కోపం వచ్చింది; అతను నాతానుతో ఇలా అన్నాడు: “యెహోవా జీవం తోడు, ఆ పని చేసిన మనిషి మరణశిక్షకు అర్హుడు! 6 అతను కనికరం చూపించకుండా అలా చేశాడు కాబట్టి ఆ గొర్రెపిల్లకు బదులుగా నాలుగు గొర్రెపిల్లలు ఇవ్వాలి.”+

7 అప్పుడు నాతాను దావీదుతో ఇలా అన్నాడు: “ఆ మనిషివి నువ్వే! ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నేను నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాను,+ నిన్ను సౌలు చేతిలో నుండి రక్షించాను.+ 8 నీ ప్రభువు ఇంటిని,+ నీ ప్రభువు భార్యల్ని,+ ఇశ్రాయేలు, యూదా అంతటినీ నీకు ఇచ్చాను.+ అవి చాలవనుకుంటే, నేను నీకు ఇంకా ఎక్కువ ఇచ్చివుండేవాణ్ణి.+ 9 దేవుని దృష్టిలో చెడ్డపని చేసి నువ్వు యెహోవా వాక్యాన్ని ఎందుకు చిన్నచూపు చూశావు? నువ్వు హిత్తీయుడైన ఊరియాను కత్తితో చంపించావు!+ అమ్మోనీయుల కత్తితో అతన్ని చంపించి, అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు.+ 10 కాబట్టి నీ ఇంటి నుండి కత్తి ఎప్పటికీ తొలగిపోదు,+ ఎందుకంటే హిత్తీయుడైన ఊరియా భార్యను నీ భార్యగా చేసుకొని నువ్వు నన్ను చిన్నచూపు చూశావు.’ 11 యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నీ ఇంట్లో నుండే నీమీదికి విపత్తు వచ్చేలా చేస్తున్నాను;+ నీ కళ్లముందే నీ భార్యల్ని తీసుకొని వేరే మనిషికి* ఇస్తాను,+ అతను పట్టపగలే నీ భార్యలతో పడుకుంటాడు.+ 12 నువ్వు చేసింది రహస్యంగా చేశావు; కానీ నేను పట్టపగలు ఇశ్రాయేలీయులందరి ముందు ఇలా జరిగేలా చేస్తాను.’ ”

13 అప్పుడు దావీదు నాతానుతో, “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను”+ అన్నాడు. అందుకు నాతాను దావీదుతో ఇలా అన్నాడు: “అయితే యెహోవా నీ పాపాన్ని క్షమిస్తాడు.+ నువ్వు చనిపోవు.+ 14 కానీ ఈ విషయంలో నువ్వు యెహోవా పట్ల ఎంతో అగౌరవంగా ప్రవర్తించావు కాబట్టి, నీకు ఇప్పుడే పుట్టిన కుమారుడు ఖచ్చితంగా చనిపోతాడు.”

15 తర్వాత నాతాను తన ఇంటికి వెళ్లిపోయాడు.

ఊరియా భార్యకు పుట్టిన దావీదు కుమారుడు జబ్బుపడేలా యెహోవా చేశాడు. 16 దావీదు ఆ బాబు కోసం సత్యదేవుణ్ణి వేడుకున్నాడు. దావీదు ఉపవాసముంటూ, రాత్రుళ్లు తన గదిలోకి వెళ్లి నేలమీద పడుకునేవాడు.+ 17 కాబట్టి అతని ఇంటి పెద్దలు అతని దగ్గర నిలబడి, నేలమీద నుండి అతన్ని లేపడానికి ప్రయత్నించారు కానీ అతను ఒప్పుకోలేదు, వాళ్లతో కలిసి భోజనం చేయలేదు. 18 ఏడో రోజు ఆ బాబు చనిపోయాడు. కానీ బాబు చనిపోయిన సంగతి దావీదుకు చెప్పడానికి అతని సేవకులు భయపడ్డారు. వాళ్లు ఇలా అనుకున్నారు: “బాబు బ్రతికుండగా మనం అతనితో మాట్లాడాం కానీ అతను మన మాట వినలేదు. మరి ఇప్పుడు బాబు చనిపోయాడని మనం అతనికి ఎలా చెప్పగలం? అతను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో.”

19 తన సేవకులు గుసగుసలాడుకోవడం దావీదు చూసినప్పుడు, బాబు చనిపోయాడని అతనికి అర్థమైంది. దావీదు తన సేవకుల్ని, “బాబు చనిపోయాడా?” అని అడిగాడు. వాళ్లు, “చనిపోయాడు” అని చెప్పారు. 20 అప్పుడు దావీదు నేలమీద నుండి లేచాడు. అతను స్నానం చేసి, పరిమళ తైలం పూసుకొని,+ బట్టలు మార్చుకొని యెహోవా మందిరానికి+ వెళ్లి సాష్టాంగపడ్డాడు. ఆ తర్వాత అతను తన ఇంట్లోకి* వెళ్లి భోజనం తీసుకురమ్మని చెప్పి భోజనం చేశాడు. 21 అతని సేవకులు అతన్ని ఇలా అడిగారు: “నువ్వు ఎందుకు ఇలా చేశావు? బాబు బ్రతికున్నప్పుడేమో నువ్వు ఉపవాసముండి ఏడుస్తూ ఉన్నావు; కానీ బాబు చనిపోగానే లేచి భోజనం చేశావు.” 22 దానికి దావీదు ఇలా చెప్పాడు: “బాబు బ్రతికున్నప్పుడు నేను, ‘యెహోవా నా మీద అనుగ్రహం చూపించి బాబును బ్రతకనిస్తాడేమో’+ అనుకుని ఉపవాసముండి+ ఏడ్చాను. 23 కానీ ఇప్పుడు బాబు చనిపోయాడు, ఇక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? నేను అతన్ని వెనక్కి తీసుకురాగలనా?+ నేను అతని దగ్గరికి వెళ్తాను+ కానీ అతను నా దగ్గరికి తిరిగి రాడు.”+

24 తర్వాత దావీదు తన భార్య బత్షెబను+ ఓదార్చాడు. అతను ఆమె దగ్గరికి వెళ్లి ఆమెతో పడుకున్నాడు. కొంతకాలానికి ఆమె ఒక కుమారుణ్ణి కన్నది, అతనికి సొలొమోను*+ అని పేరు పెట్టారు. యెహోవా అతన్ని ప్రేమించాడు.+ 25 యెహోవా అతన్ని ప్రేమించాడు కాబట్టి అతనికి యదీద్యా* అనే పేరు పెట్టమని ఆయన నాతాను+ ప్రవక్త ద్వారా సందేశం పంపించాడు.

26 యోవాబు అమ్మోనీయుల+ రబ్బా+ నగరం మీద పోరాటాన్ని కొనసాగించి ఆ రాజనగరాన్ని* స్వాధీనం చేసుకున్నాడు.+ 27 అప్పుడు యోవాబు దావీదు దగ్గరికి సందేశకుల్ని పంపించి ఇలా అన్నాడు: “నేను రబ్బా మీద యుద్ధం చేసి,+ నీళ్ల నగరాన్ని* స్వాధీనం చేసుకున్నాను. 28 ఇప్పుడు నువ్వు మిగతా సైన్యాన్ని పోగుచేసి నగరం మీదికి వచ్చి దాన్ని స్వాధీనం చేసుకో. లేకపోతే నేను ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అవుతుంది, అప్పుడు పేరు నాకు వస్తుంది.”*

29 దాంతో దావీదు సైన్యాన్నంతటినీ పోగుచేసి రబ్బాకు వెళ్లి దానితో యుద్ధం చేసి, దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 30 తర్వాత అతను మల్కాము* తలమీద ఉన్న కిరీటాన్ని తీసుకున్నాడు. రత్నాలు పొదిగివున్న ఆ బంగారు కిరీటం బరువు ఒక తలాంతు.* ఆ కిరీటాన్ని దావీదు తలమీద పెట్టారు. దావీదు ఆ నగరం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము+ కూడా తీసుకున్నాడు.+ 31 అతను అక్కడి ప్రజల్ని తీసుకొచ్చి, వాళ్లచేత రంపాలతో రాళ్లను కోయించాడు, పదునైన ఇనుప పనిముట్లతో, ఇనుప గొడ్డళ్లతో పని చేయించాడు, ఇటుకలు తయారు చేయించాడు. అమ్మోనీయుల నగరాలన్నిటికీ దావీదు అలాగే చేశాడు. చివరికి దావీదు, అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగొచ్చారు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి