కీర్తనలు
94 ప్రతీకారం తీర్చుకునే దేవా, యెహోవా,+
ప్రతీకారం తీర్చుకునే దేవా, ప్రకాశించు!
2 భూలోక న్యాయాధిపతీ,+ లే.
గర్విష్ఠులకు తగిన శాస్తి చేయి.+
3 ఎంతకాలం యెహోవా,
ఎంతకాలం దుష్టులు ఉల్లసిస్తూ ఉంటారు?+
4 వాళ్లు పిచ్చి వాగుడు వాగుతారు, అహంకారంగా మాట్లాడతారు;
తప్పుచేసే వాళ్లంతా తమ గురించి గొప్పలు చెప్పుకుంటారు.
5 యెహోవా, వాళ్లు నీ ప్రజల్ని నలగ్గొడుతున్నారు,+
నీ స్వాస్థ్యాన్ని బాధిస్తున్నారు.
6 వాళ్లు విధవరాలిని, పరదేశిని చంపుతారు,
తండ్రిలేని పిల్లల్ని హత్య చేస్తారు.
8 బుద్ధిలేని ప్రజలారా, ఈ విషయం అర్థంచేసుకోండి;
మూర్ఖులారా, మీరు ఎప్పటికైనా లోతైన అవగాహన చూపిస్తారా?+
9 చెవిని తయారుచేసిన దేవుడు వినలేడా?
కంటిని తయారుచేసిన దేవుడు చూడలేడా?+
10 దేశాల్ని సరిదిద్దే దేవుడు క్రమశిక్షణ ఇవ్వలేడా?+
ప్రజలకు జ్ఞానాన్ని బోధించేది ఆయనే!+
11 మనుషుల ఆలోచనలు యెహోవాకు తెలుసు,
అవి వ్యర్థమైనవని ఆయనకు తెలుసు.+
12 యెహోవా,* నువ్వు సరిదిద్దే మనిషి,
నీ ధర్మశాస్త్రంతో నువ్వు బోధించే వ్యక్తి ధన్యుడు;*+
13 దుష్టుల కోసం గుంట తవ్వబడే వరకు,+
కష్టకాలంలో నువ్వు అతనికి మనశ్శాంతి దయచేస్తావు.
15 ఎందుకంటే తీర్పు మళ్లీ న్యాయంగా ఉంటుంది,
హృదయంలో నిజాయితీ ఉన్నవాళ్లంతా దాన్ని పాటిస్తారు.
16 దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు లేస్తారు?
తప్పుచేసే వాళ్లకు వ్యతిరేకంగా ఎవరు నా తరఫున నిలబడతారు?
17 యెహోవా నాకు సహాయం చేసుండకపోతే,
నేను త్వరగా నశించిపోయేవాణ్ణి.+
18 “నా పాదం జారుతోంది” అని నేను అనుకున్నప్పుడు,
యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమ నన్ను ఆదుకుంటూ వచ్చింది.+
23 ఆయన, వాళ్ల దుష్ట పనులు వాళ్లమీదికే వచ్చేలా చేస్తాడు.+
వాళ్ల చెడుతనంతోనే వాళ్లను నాశనం చేస్తాడు.
మన దేవుడైన యెహోవా వాళ్లను నాశనం చేస్తాడు.+