శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
మార్చి 12తో ఆరంభమగు వారము
పాట 180 (100)
10 ని: స్థానిక ప్రకటనలు. మేలో ఆక్జలరీ పయినీర్గా చేయుటకు ఇప్పుడే పథకము వేసుకొనుము. ఏప్రిల్ మరియు మే మాసములకు అవసరమగు అదనపు పత్రికలకు ఆర్డరు వేయుము. ఏ పాత పుస్తకములు అందుబాటులోయున్నవో సంఘమునకు తెలుపుము.
20 ని: “నిపుణతగల పనివారు దేవుని వాక్యమును సరిగా ఉపయోగించుట” ప్రశ్నాసమాధానములు. సమయము అనుమతించుకొలది చూపబడిన లేఖనములను చదువుము. మొట్టమొదట మనము పరిచారకులము అని నొక్కి తెల్పుము. బైబిలునుపయోగించుటలో నిపుణత కొరకు పోరాడుము. కేవలము సాహిత్యము అందించుటతో తృప్తి చెందకుము. పాఠశాల లేక సేవాకాపరి క్రొత్త ప్రచారకుడు న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ (1984 ఎడిషన్)లోని అంశములతో పరిచయము కలిగియుండునట్లు సహాయపడుటను ప్రదర్శించును.
15 ని: ప్రశ్నా భాగము. పెద్దచే ప్రసంగము. స్థానిక అవసరమనకు తగినట్లుగా తెలివియైన మరియు నిర్దిష్టమైన అన్వయింపును చేయును. ప్రేక్షకులను చర్చలోకి దించవచ్చును.
పాట 190 (107) ముగింపు ప్రార్థన.
మార్చి 19తో ఆరంభమగు వారము
పాట 85 (44)
10 ని: స్థానిక ప్రకటనలు, మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకొనబడిన ప్రకటనలు. ఈ వారాంతములో అందరు ప్రాంతీయ సేవలో యుండునట్లు ప్రోత్సాహించుము. స్థానిక ప్రాంతములో ఫలవంతముగా ఉపయోగించగల క్రొత్త పత్రికలలోని శీర్షికలను పునఃసమీక్షించుము. అకౌంట్స్ రిపోర్టు. ఫిబ్రవరిలో పంపిన చందాలు ముట్టినట్లు సొసైటి తెలిపిన వాటిని చదువుము. స్థానిక సంఘమునకు మద్దతుగా యిచ్చిన చందాలను గూర్చి సహోదరులను మెచ్చుకొనుము.
15 ని: “ప్రత్యేక ఆసక్తిగల పత్రికలు సిద్ధముగా యున్నవి.” ప్రసంగము మరియు ప్రశ్నలతో అంశమును చర్చించుట. వీధిసాక్ష్యము, యాదృచ్ఛిక సాక్ష్యము (తటస్థ సాక్ష్యము) లేక పత్రికామార్గములో (మాగజైన్ రూట్లో) పత్రికలను అందించడంలో మీ ప్రాంతంలోని ప్రచారకుల అనుభవాలను చేర్చుము.
20 ని: పత్రికలను అందించుటలో అభ్యాసయుక్తమైన సలహాలు. ఈ క్రింది సలహాలను చర్చించి వాటిని అన్వయించుకొనుటద్వారా వ్యాఖ్యానించనిమ్ము. (1) పత్రికలను బాగుగా చదివి అందులోని శీర్షికలను బాగుగా తెలుసుకొనియుండుము. (2) ఆ సమాజమునకు ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించు శీర్షికలను ఎన్నకొనుము. (3) పత్రికలతో సాయంకాల సాక్ష్యమును ప్రయత్నించుము. (4) కేవలము ఒకే అంశముమీద మాట్లాడి ఒక్క పత్రికనే ఉన్నతపరచుము. ఇతర పత్రికను దానికి జతగా అందించుము. (5) నెమ్మదిగాను, స్పష్టమైన మరియు స్నేహపూర్వకమైన స్వరముతో మాట్లాడుము. స్థానిక ప్రాంతములో పత్రికలను అందించుకొలది, ఈ అభ్యాసయుక్తమైన సలహాలను ప్రయత్నించమని అందరిని ప్రోత్సాహించుము.
పాట 6 (4) ముగింపు ప్రార్థన.
మార్చి 26తో ఆరంభమగు వారము
పాట 207 (112)
8 ని: స్థానిక ప్రకటనలు. వారాంతములోని సేవా ఏర్పాట్లను కూడా కలుపుము. దైవపరిపాలనా వార్తాలు.
7 ని: క్రమమైన కుటుంబ బైబిలు పఠనము యొక్క ప్రయోజనములు. ప్రసంగము. దశాబ్దములుగా యెహోవా సంస్థ కుటుంబ శిరస్సులను తమ కుటుంబ సభ్యులతో కుటుంబ బైబిలు పఠనమును చేయుమని ప్రోత్సహించియున్నది. అటువంటి పఠనము కుటుంబవలయములో ప్రేమ మరియు సమాధానకరమైన ఆత్మను కలుగజేయుటకు దోహదపడును. పిల్లలు సమర్పించుకొన్న యెహోవా సేవకులుగా యెదిగి, స్థానిక సంఘములో మంచి ప్రభావముతో, తరచు పూర్తికాలసేవలోను ప్రవేశించిరి. ఇది క్రైస్తవ తల్లిదండ్రులకును, వారి అభివృద్ధిని గమనించుచున్న యితరులకును సంతోషమును తెచ్చినది.
17 ని: యవ్వనుల హృదయములను చేరుట. ప్రత్యేకముగా యవ్వనుల కొరకు తయారు చేయబడిన సాహిత్యములనుండి అంశములను పెద్ద క్లుప్తముగా చర్చించును. క్రమమైన కుటుంబపఠనముతోపాటు సందర్భ సహితముగా ఉత్పన్నమౌ, ఆత్మీయ చర్చలవలనకూడా కుటుంబసభ్యలు ప్రయోజనము పొందుదురు. పిల్లలతో ఆప్యాయమైన సంబంధమున్న తండ్రి గల కుటుంబ చర్చను ప్రదర్శించుము. వారి చర్చ ప్రశ్నాసమాధానములతో కూడినదికాక అప్పటికప్పుడు తమ వ్యాఖ్యానములను ఒకరితోఒకరు పంచుకొనునట్లు ఉండును. కుటుంబములోని ఒక పిల్లవాడు తమ పొరుగువారి పిల్లలతో బంతి ఆడుకొనవచ్చా అని అడిగాడు. యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకములోని 64-7 పేజీలలోని సమాచార పరిశీలనతో వివరించుము. అందులో యిమిడియున్న లేఖనసూత్రములను అర్థము చేసుకొని వాటిని అంగీకరించుచున్నాడాయని తెలుసుకొనుటకు పరిశోధనాత్మకమైన ప్రశ్నలను వేసిరి. సన్నిహిత స్నేహితులు అదే వయస్సువారై ఉండనవసరములేదను దానిని నొక్కి తెల్పుము. పుస్తకములోని భాగములను చదివిన యువకులను ఎన్నుకొని వారి పరిశీలనలను తెలుపనిమ్ము. ఆ సమాచారము ఎందుకు ప్రయోజనకరమో వారి చూపనిమ్ము. యువకులు ఆ పుస్తకమును చదువునట్లు ప్రోత్సహించి వారి కుటుంబచర్చలలో చేర్చునట్లు అందలి సమాచారముతో పరిచయము కలిగియుండవలసిన అవరసరతను తల్లిదండ్రులతో నొక్కి తెల్పుము.
13 ని: పిల్లలను పెంచుటలో విజయము పొందిన లేక పొందుతున్న తల్లిదండ్రులతో పెద్ద ఇంటర్వ్యూ చేయుట. వారు పొందిన సంతోషమును, క్రమమైన మరియు అర్థవంతమైన బైబిలు పఠనము చేయుటకు వారు దేనిని సహాయకరముగా కనుగొన్నది నొక్కితెల్పుము. తల్లిదండ్రులు కుటుంబపఠనమును, క్రమముగా చేయుటకును యువకులు అందుకు సహకరించుటకును హృదయమును తాకునట్లు కోరుము. పరిస్థితులు ఎల్లప్పుడు అంత అనుకూలముగా యుండవు. కుటుంబములోయున్నవారంతా కలిసి పనిచేయవలసియున్నారు. అట్లు చేయుటద్వారా జీవమునకు పోవు మార్గమున ఉంచుకొనునట్లు ఒకరికొకరు సహాయపడగలరు.—1 తిమో. 4:16.
పాట 123 (63) ముగింపు ప్రార్థన
ఏప్రిల్ 2తో ఆరంభమగు వారము
పాట 172 (92)
5 ని: స్థానిక ప్రకటనలు. కావలసినన్ని సర్వైవల్ పుస్తకములను తీసుకొని ఈ వారాంతసేవలో వాటిని అందించుటలో పూర్తి భాగము వహించుమని అందరిని ప్రోత్సహించుము.
22 ని: “సువార్తనందించుట—వ్యక్తిగత నిశ్చయతతో,” శీర్షికయొక్క ప్రశ్నాసమాధానముల చర్చ.
18 ని: “పయినీరు సేవద్వారా యెహోవాయందు నమ్మకమును కనపరచుట.” సేవాకాపరిద్వారా ఆసక్తికరమైన మరియు ఉత్సాహవంతమైన ప్రశ్నాసమాధానముల పరిశీలన. కష్టములను అధికమించుచు వారు పొందిన సంతోషములను ఉన్నతపరచుచు ఒకరు లేక యిద్దరు పయినీర్లతో ఇంటర్వ్యూ, పయినీర్లకు అభ్యాసయుక్తముగా సహాయమునందించుటకు స్థానికముగా ఏమి జరుగుచున్నది వివరించుము.
పాట 14 (6) ముగింపు ప్రార్థన.