ప్రకటనలు
• సాహిత్య అందింపులు: మార్చి: 192 పేజీల పాత పుస్తకములు ఇంగ్లీషులో రెండు 10 రూ. ప్రాంతీయభాషలో ఒకటి 5 రూ. (ఉపయోగించిగల పుస్తకముల లిస్టు కొరకు దయచేసి 1988 ఫిబ్రవరి మ. రా. ప “ప్రకటనల” క్రింద చూడుము.) ఏప్రిల్: సర్‌వైవల్ ఇంటు ఎ న్యూ ఎర్త్ 10 రూ. చందా క్రింద. (ఈ పుస్తకము అందుబాటులో లేనప్పుడు 192 పేజీల ప్రత్యేక అందింపు పాత పుస్తకములను రూ. 10కి అందించుము.) ప్రాంతీయభాషలో: ప్రత్యేక అందింపు 192 పుస్తకములలో ఒకటి రూ. 5. మే మరియు జూన్: వాచ్‌టవర్‌కు చందా కట్టించుట. ఒక సంవత్సరమునకు రూ. 40. ఆరు నెలలు, నెలసరి పత్రికల సంత్సరము చందా రూ. 20. నెలసరి సంచికలకు ఆరునెలల చందా లేదు. జూలై: ప్రత్యేక అందింపు పాత పుస్తకములలో 192 పేజీలది ఒకటి రూ. 5. ఆగస్టు మరియు సెప్టెంబరు: స్కూల్ బ్రొషుర్ తప్ప 32 పేజీల బ్రొషూర్ ఏదైనను.
• సెక్రెటరీ మరియు సేవాకాపరి రెగ్యులర్ పయినీర్ల అందరియొక్క పనిని పునఃసమీక్షించవలెను. కోరబడిన గంటలను చేరుటలో ఎవరికైన కష్టముంటే సహాయము యివ్వబడు ఏర్పాటును పెద్దలు చేయవలెను. సలహాల కొరకు సొసైటి ఉత్తరములగు (S-201) అక్టోబరు 1, 1988, మరియు అక్టోబరు 1, 1989లను పునఃసమీక్షించుము. మరియు 1986 అక్టోబరు మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్ 12-20 పేరాలను చూడుము.
• జ్ఞాపకార్థదిన ఆచరణ ఏప్రిల్ 10, 1990 మంగళవారము జరుగును. ప్రసంగము ముందే ప్రారంభమైనను రొట్టె ద్రాక్షారసమును పంచుట సూర్యాస్తమయము కాకముందే ప్రారంభము కాకూడదు. మీ ప్రాంతములో ఎప్పుడు సూర్యుడు అస్తమించునో స్థానికముగా విచారించి తెలుసుకొనుము. ఆ తారీఖున ఏ ఇతర కూటములు జరుపబడకూడదు. సాధారణముగా మీ సంఘము మంగళవారము జరుగు కూటములను కలిగియున్నట్లయిన హాలు అందుబాటులోయున్న యెడల ఆ కూటమును వారములోని మరొక దినమునకు మార్చుకొనవచ్చును. మీ సేవాకూటము ఆ దినము జరుగవలసియుంటే మీ సంఘమునకు ప్రత్యేకముగా అన్వయించు వాటిని తదుపరి సేవాకూటములో చేర్చవచ్చును.
• సర్క్యూట్ ఓవర్‌సీర్‌లు స్లైడ్‌లతో చూపు ప్రసంగమును ఏప్రిల్ 1, తరువాత సాధ్యమైనంత త్వరలో ప్రారంభించవచ్చును.
• మరలా లభ్యమగుచున్న సాహిత్యములు:
• భూమిపై నిరంతర జీవితమును అనుభవించుట!—ఇంగ్లీషు, బెంగాలీ, బర్మా, కన్నడ, మళయాలము.