పయినీరు సేవద్వారా యెహోవాయందు నమ్మకమును కనపరచుట
1 రాజ్యాసక్తులను మొదట పెట్టుటకు యెహోవాయందు నమ్మకము అవసరము. (కీర్త. 56:11; సామె. 3:5; మత్త. 6:33) ప్రపంచము ప్రాముఖ్యమని తలంచువాటినుండి మన మనస్సులను ప్రక్కకు త్రిప్పి ఆత్మీయవిలువలపై మన మనస్సును కేంద్రీకరించవలసియున్నాము. ఒక ప్రక్క లోకము వస్తుసంబంధమైన కోరికను కలిగియుండ ప్రేరేపించుచుండగా యెహోవా మాత్రము నిజముగా ప్రాముఖ్యమగు వాటితో తృప్తికలిగియుండుడని మనలను కోరుచున్నాడు.—1 తిమో. 6:8; ఫిలి. 1:10.
2 యెహోవా ఆజ్ఞలను గంభీరముగా తీసుకొను యవ్వనులకు ప్రత్యేకముగా ఇది ఒక సవాలైయున్నది. విజయవంతమైన జీవితమునకు ఉన్నతవిద్య తప్పనిసరి అని చెప్పు వారి ఉపాధ్యాయులు, తోటియీడు వారిద్వారా వారు వత్తిడి చేయబడవచ్చును. అయితే వస్తుసంబంధమైన అవసరతలు తమకు ఉన్నవని గుర్తిస్తూనే, అనేకమంది క్రైస్తవ యువకులు తెలివితో అట్టి వత్తిడులను ఎదిరిస్తూ పయినీరు పరిచర్యను తమ జీవితవృత్తిగా చేసుకొందురు. తమ అవసరతల నిమిత్తమై యెహోవావైపు చూచెదరు.—కీర్త. 62:2; 68:19; 1 తిమో. 5:8; 6:9, 10.
వ్యక్తిగత పరిస్థితులను పునఃసమీక్షించుకొనుము
3 1982 నవంబరు 15, ది వాచ్‌టవర్ మనలో ప్రతి ఒక్కరిని యిలా అడుగుకొనుటకు ప్రోత్సహించినది: “నేను పయినీరును కాను అను విషయమును నిజముగా నేను యెహోవాయెదుట సమర్థించుకొనగలనా?” విశదమైనరీతిగా అప్పుడు అనేకులు పయినీరు చేయగల స్థానములో లేరు. అయినను, హృదయపూర్వకముగా చేసిన సేవ ఎంతయైనను అది ఎప్పుడూ యెహోవాకు అంగీకారమేనని తెలుసుకొన్నవారై వారు నిరుత్సాహపడలేదు. (మీకా 6:8; 2 కొరిం. 8:12) ఆ తరువాత, వ్యక్తిగత పరిస్థితులు మారినకొలది, 1982 వాచ్‌టవర్ సంచికను తిరిగి పరిశీలించుటయనునది ఇటీవల రెగ్యులర్ పయినీరు సేవలో ప్రవేశించిన వేలాది మందిలో భాగస్తులగునట్లు కొంతమందికి తోడ్పడినది.
4 పైన చెప్పబడిన విషయము 1982లో ముద్రించబడినప్పుడు పయినీరు సేవలో ప్రవేశించుటకు మీ వ్యక్తిగత పరిస్థితులు మిమ్ములను ఆపు చేసియున్నట్లయిన అవి యిప్పుడు మారియున్నవా? అమెరికాసంయుక్త రాష్ట్రములలో గత సంవత్సరము 17,000 పైగా పయినీరు అప్లికేషన్లు వచ్చినవి. నిస్సందేహముగా వీరిలో అనేకులు ఇంతకుముందే పయినీర్లు కావలయుననుకున్నారు. కాని పరిస్థితులు మారునంతవరకు వారు వేచియుండవలసి యుండిరి.
5 కొన్నిసార్లు, అవసరమైన మార్పు పయినీరు సేవనుగూర్చి వ్యక్తియొక్క మానసిక వైఖరికి సంబంధించినదై యుండవచ్చును. లేక సేవకొరకు మంచి కాలనిర్ణయ పట్టికను వేసుకొనుట అయ్యే యుండవచ్చు. కొన్నిసార్లు వ్యక్తిగత బాధ్యతలు, లేక కర్తవ్యముల విషయములలో పయినీరు సేవకు మార్గము తెరచునట్టి మార్పు చేసుకొనుట అవసరమై యుండవచ్చును. కాబట్టి, మనలనుగూర్చి మన పరిస్థితులను గూర్చి యథార్థముగా అంచనా వేసుకొనుటతోపాటు దానిని యెహోవాకు చేయు మన ప్రార్థనలో ఒక క్రమమైన విషయముగా చేయుట మంచిది. వేలాదిమంది అట్లు చేసి పయినీరు సేవయొక్క ఆశీర్వాదములను అనుభవించుచున్నారు.
6 మీ పరిస్థితులను గూర్చిన యథార్థమైన అంచనా మీరు పయినీరు సేవ ప్రారంభించుటకు ఎంతో దూరము లేదని సూచించిన ఇప్పుడే క్రమమైన పద్ధతిలో చేయు ఆక్జిలరీ పయినీరు సేవను యిప్పుడే ఎందుకు ప్రారంభించకూడదు? కొద్ది నెలలలోనే మీరు బహుశా పునర్దర్శనములను, బైబిలు పఠనములను సంపాదించవచ్చును. ఇది అతిసులభముగా రెగ్యులర్ పయినీర్ సేవలోకి మారుటకు సాధ్యమైతే క్రొత్తసేవా సంవత్సరము ప్రారంభము కాకమునుపే అలా చేయుటకు అది మీకు సహాయపడును.
7 ఈ దుష్టవిధానముయొక్క అంత్యదినములలో ఎంతో గొప్ప విషయములను యెహోవా నెరవేర్చుచున్నాడు. మనలో ప్రతిఒక్కరము ఆయనకు దగ్గరగా సమీపించి “దినమెల్ల” ఆయన నామమును స్తుతించుటకు ఇదియే సమయము. (కీర్త. 145:2; యాకో. 4:8) అట్లు చేయుటకు మీ పరిస్థితులు అనుమతించి, మీరు అర్హులైయున్నట్లయిన యెహోవాయందు మీరు నమ్మకముంచుచున్నట్లు పయినీరు సేవ మరొక సాక్ష్యముగా ఉండనివ్వండి.—కీర్త. 94:18.