ప్రశ్నా భాగము
• సొసైటినుండి కాక యితర మూలములనుండి లభించు టేప్‌రికార్డింగ్‌లను యెహోవాసాక్షులు ఎట్లు దృష్టించవలెను?
సొసైటి అనేక రూపములలో విస్తారమైన ఆత్మీయ ఆహారమును అందించుచున్నది. వీటిలో కేసెట్ టేప్ రికార్డింగ్స్‌ను యిమిడియున్నవి. ఈ కేసెట్ రికార్డింగులలో బైబిలు, మరియు సొసైటి పబ్లికేషన్స్‌పై అనగా ది వాచ్‌టవర్, అవేక్!, మై బుక్ ఆఫ్ బైబిల్ స్టోరిస్, మరియు లిజనింగ్ టు దిగ్రేట్ టీచర్ మొదలగు వాటిపైన ఆధారపడిన, కేసెట్ టేప్ రికార్డింగ్స్ ఉన్నవి. కింగ్‌డం మెలొడీస్ మరియు అనేక డ్రామాలు ఉత్పత్తి చేయబడినవి. ఏమైనను, వీటిలాంటివలెనే కనిపిస్తూ ప్రవేటుగా సర్కులేట్ చేయబడుతున్న కేసెట్స్ విషయములో మనము జాగ్రత్త వహించవలసియున్నాము. మనది నమ్మకమును వ్యక్తపరచు సహోదరత్వమైనందున కొన్నిసార్లు కొందరు యితరులనుండి వచ్చిన టేపులను వాటి మూలమును గమనించకయే అంగీకరించి వినవచ్చును.
కొన్నిసార్లు అట్లు పంచబడుతున్న రికార్డెడ్ ప్రసంగములు ఊహకు దరిదాపుగా యుంటూ లేక ఉద్రేకపూరిత భావము నుండి వెలువడినవై యున్నవి. కాబట్టి 2 తిమోతి 3:14 లోని పౌలు హెచ్చరికను అనుసరించుట తెలివితో కూడిన విషయము కాదా? అచ్చట పౌలు, మోసపరచు వంచకులను గూర్చి హెచ్చరించిన తరువాత మనము ఎవరిని వినుచున్నామో తెలుసుకొను ప్రాముఖ్యతను ఆయన నొక్కి తెల్పెను. పరిశుద్ధ “లేఖనములయందు వ్రాసియున్న సంగతులను” “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని”చే అందచేయబడిన ఆత్మీయ ఆహారమును అతిక్రమించి వెళ్లుచున్న దేనినైనను వినకుండ ఉండు నిశ్చయతను కలిగియుండవలసియున్నాము.—1 కొరిం. 4:6; మత్త. 24:45-47.
కొన్ని ప్రాంతములో పిల్లలకు బైబిలును బోధించు టేపులు అడ్వటైజ్ చేయబడుతూ అమ్మబడుచున్నవి. ఈ టేపులు వివరముగా భావమును తెలియపరచు ఉద్దేశ్యముతో సహోదరులవలన ఉత్పత్తి చేయబడి కొన్ని సంఘముల మధ్య పంచబడియున్నవి. ఇందు ఉద్దేశ్యము మంచిగా ఉన్నట్లు కనబడుచున్నను, ఇది దైవపరిపాలనా సంబంధమైనవాటిని వ్యక్తిగత ప్రయోజనములకు ఉపయోగించుదానికి సమానముగా యెంచబడదా? (మన రాజ్య సేవ జూలై 1977, పేజి 4, జనవరి 1980, పేజి 4; మన రాజ్య సేవ అక్టోబరు, 1987 పేజి 3ను చూడుము.) మన పిల్లలకు శిక్షణయిచ్చుటకు యెహోవా సంస్థ సరిపోవు దానికన్న ఎక్కువ బైబిలు ఆధారిత బోధను అందించుచున్నది. కావున అట్టి టేపుల పంపకమును మేము నిరుత్సాహపరచుదుము.
కొంతమంది వ్యక్తులు సంఘకూటములు, అసెంబ్లీల, మరియు పెద్ద సమావేశ కార్యక్రమములను తమ వ్యక్తిగత ఉపయోగార్థమై టేపు రికార్డింగు చేసుకొనవచ్చును. అట్టి రికార్డింగులు కొన్ని సరైన కారణములచేత కూటములకు హాజరుకాలేకపోయిన సంఘములోని యితర సభ్యులవలనను మెచ్చుకొనబడవచ్చును. ఏమైనను, ఇవి మాత్రము సహోదరులందరికి సాధారణముగా పంచుటకు లేక అమ్ముటకును చేయబడకూడదు. మన ఆత్మీయ ప్రోత్సాహాము మరియు యెదుగుదల నిమిత్తమై యెహోవా తన సంస్థద్వారా అందించు వాటన్నింటిని పూర్తిగా ఉపయోగించుదుము గాక.