దేవుని వాక్యము—మానవునిది కాదు
1 “ఆ హేతువుచేతను, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక దేవుని వాక్యమని అంగీకరించితిరి.” (1 థెస్స. 2:13) అపొస్తలుడైన పౌలు ఒనర్చిన ఆసక్తితో కూడిన ప్రకటనకు ఎంతటి ఆదరణ!
2 పౌలు దేవుని వాక్యమును బాగుగా ఎరిగియుండెననుటకు ఏ సందేహములేదు. “ది బైబిల్—గాడ్స్ వర్డ్ అర్ మాన్స్?” అను నూతన పుస్తకము బైబిలు యెహోవా దేవుని వాక్యమని దృఢపరచి దానియందు విశ్వాసమును నిర్మించుటలో మిక్కిలి ఉపయుక్తమైనది. పౌలుయొక్క ఆసక్తిని అనుకరించుట ద్వారా, వెదకువారందరికి ఆ వాక్యము తమలో కూడా కార్యము జరిగించునట్లు మనము సహాయము చేయవచ్చును.
3 ఈ క్రింద ఉదహరింపబడిన కొన్ని అంశములు నీ అందింపులో ఉపయోగపడును. అవేమనగా: “ఏన్ అల్ టైమ్ బెస్ట్ సెల్లర్,” పేజి 7: “ది బైబిల్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ టెక్ట్స్,” పేజి 19; “వాట్ ఆర్కియాలజీ కేన్ అండ్ కెనాట్‌డు,” పేజి 50; “మోడరన్ క్రిటిసిజమ్ ఫౌండ్ వాంటింగ్,” పేజి 56; “వై నో మిరాకల్స్ టుడే?” పేజి 85. ఆచరణ యోగ్యమైన అంశములన్నియు ప్రత్యేకముగా పుస్తకములోని చివరి అధ్యాయమగు “ది బైబిల్ అండ్ యు”లో కనుగొనవచ్చును.
4 సొసైటి ద్వారా లభ్యమగు అనేక సాహిత్యముల ద్వారా తగినవేళయందు అవసరమైన ఆత్మీయాహారము సమృద్ధిగా లభించు ఏర్పాటును బట్టి మనమెంత కృతజ్ఞత గలవారమై యున్నాము. ఇటువంటి ఆత్మీయ సంబంధమైన మణిని ఇతరులకు జూలై నెలయందు ప్రాంతములో అందించుటద్వారా మన మెప్పును ప్రదర్శించుటకు నిర్ణయించుకొందాము.