కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/90 పేజీ 3
  • నీ అలవాటు ఏమి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నీ అలవాటు ఏమి?
  • మన రాజ్య పరిచర్య—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒకరినొకరు పురికొల్పుకొనుట
  • యెహోవాసాక్షుల మీటింగ్స్‌ మీకు ఎలా సహాయం చేస్తాయి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మనం ఆరాధన కోసం ఎందుకు కలుసుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • క్రైస్తవ సమావేశాల్ని ప్రశంసించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • కూటాల్లో మరింత ఆనందాన్ని పొందడం ఎలాగంటే
    మన రాజ్య పరిచర్య—1999
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1990
km 6/90 పేజీ 3

నీ అలవాటు ఏమి?

1 క్రైస్తవ కూటములు మన యెహోవా ఆరాధనలో ముఖ్యమైన భాగమైయున్నవి. అపొస్తలుడైన పౌలు సరైన విధముగా “కొందరు మానుకొనుచున్నట్టుగా” మనము సమాజముగా కూడుకొనుట మానుకొనరాదని మనలను గట్టిగా ప్రోత్సహించుచున్నాడు.​—హెబ్రీ. 10:25.

2 క్రైస్తవకూటములలో సహోదరులతో కూడుకొను విషయమందు అటువంటి అభిప్రాయమునే నీవును కలిగియున్నావా? దీని విషయమై నీ పద్ధతి ఏమి బయలుపరచుచున్నది? సంఘ పుస్తక పఠనములతోపాటు అన్ని కూటములకు క్రమముగా హాజరగుదువా? లేక కొన్ని కూటములకు హాజరగుటను వాడుక చొప్పున తప్పిపోవుచున్నావా? నీ జీవితమందు సంఘకూటములు ఏ స్థానమును కలిగియున్నవి? ఇతరులను కూడా కూటములకు క్రమముగా హాజరగునట్లు ప్రోత్సాహమిచ్చుచున్నావా? జ్ఞాపకార్థ కూటమునకు హాజరైనవారిని క్రమముగా కూటములకు హాజరు కావలసినదని ప్రోత్సహించుచున్నావా?

3 మన నిత్య కృత్యములు ఏమైనప్పటికిని పౌలు సలహాను తక్కువగా యెంచరాదు. ఒక క్రైస్తవుడు ఒకానొక సమయమున అనారోగ్య కారణముచేతగాని, అనివార్య కారణములవలనగాని హాజరగుటకు తప్పిపోవు పరిస్థితులు ఏర్పడినను అది అతని అలవాటు మాత్రము కాకూడదు. (రోమా. 2:21) దైవపరిపాలనా సంబంధమైన అనేక కార్యక్రమములతోపాటు శ్రద్ధ వహించవలసిన ఎన్నో బాధ్యతలున్నప్పటికిని ఒక క్రైస్తవుడు అతి ప్రాముఖ్యమైన వాటిని నిర్ణయించుకొనవలసియున్నాడు. (ఫిలిప్పీ. 1:10) క్రైస్తవకూటములు అతి ప్రాముఖ్యమైన విషయములలో భాగమైయుండి క్రైస్తవుని యొక్క ఆత్మీయ క్షేమము నిమిత్తము ముఖ్యమైనవైయున్నవి.

ఒకరినొకరు పురికొల్పుకొనుట

4 పౌలు రోమీయులకు వ్రాసినప్పుడు వారిని చూడగోరుచున్నానని చెప్పాడు. ఎందుకు? ఎందుకనిన వారు “స్థిరముగా” ఉండుటకై ఆత్మసంబంధమైన వరము నిచ్చుటకొరకు, (రోమా. 1:11) ఆయన వారు చదువుకొనుటకు కేవలము వ్రాయబడిన సమాచారమును అనగా ఒక ఉత్తరమును వ్రాసి పంపుటయందు మాత్రమే సంతృప్తిచెందక వారితో సహవసించుట ప్రాముఖ్యమని తలంచెను. అవును, దాని అవసరతనుగూర్చి యింకను యిలా వ్రాయుచున్నాడు: “మనము ఒకరి . . . చేత ఒకరము ఆదరణ పొందవలెనని” లేక రెఫరెన్సు బైబిలు పుట్‌నోట్‌లో చెప్పబడినట్లు: “కలసి ఒకరికొకరము ప్రోత్సహింపబడుటకు.” (రోమా. 1:12) అపొస్తలుడైనటువంటి పౌలు క్రైస్తవ సహవాసము ద్వారా వచ్చు ప్రోత్సాహాపు అవసరతను గుర్తించియున్నాడు.

5 ఆ ప్రకారముగానే నేడుకూడా మన కూటములలో ప్రేమయందు సత్క్రియలయందు ఒకరినొకరము పురికొల్పుకొనవలయును. స్నేహపూరితమైన చిరునవ్వు, హృదయపూర్వక అభినందన ఇతరులపై మంచి ప్రభావమును కలిగించును. నిర్మాణాత్మకమైన వ్యాఖ్యానములు, బాగుగా సిద్ధపడిన ప్రోగ్రాము భాగములు, ఇతరులలోని ఆత్మీయాభివృద్ధిని చూచుట మరియు కేవలము కూటములలో సహోదరుల మధ్య ఉండుటయే ఎంతో ప్రోత్సాహకరముగా నుండగలదు. ఒకవేళ దినాంతమునకు మనము అలసిపోయినను, సాధారణముగా కూటము తదుపరి చాలా బాగున్నట్లు భావించుకొనుటను మనము కనుగొందుము. క్రైస్తవ స్నేహభావము, సహోదరులు మనయెడల చూపు ప్రేమ “మనముందున్న పందెమును ఓపికతో తుదముట్టించుటకు మనలను నడుపును.” (హెబ్రీ. 12:1) దేవుని వాక్యమును జాగ్రత్తగా వినుట ద్వారా సంశయము లేక మన నిరీక్షణను బహిరంగముగా చేపట్టి యుండుటకు సిద్ధము చేయబడుదుము. నిజముగా కూటములలో నుండుటవలన లభించు ఆశీర్వాదములు అనేకములు కలవు.

6 ఇంతకు ముందుకంటె మరి అధికముగా ఇతరులను ప్రేమ విషయములోను, మేలైన కార్యముల విషయములోను పురికొల్పవలసియున్నాము. అన్ని క్రైస్తవ కూటములకు హాజరగుటకు మనము చేయు ప్రయత్నములు పట్టుదలతో కూడినవైయుండవలెను. మనకై మనము సమాజముగా కూడుకొనుటను మానుకొను పద్ధతిలో లేక ఆ అలవాటులో పడగోరము. ఇతరులను, మరియు మెమోరియల్‌కు హాజరైన వారిని ప్రోత్సహించుటకు లేక సహాయము చేయుటకు మనము మనఃపూర్వక ప్రయత్నము చేయవలెను. ఈ విధముగా ఇతరుల యెడల మన ప్రేమను క్రైస్తవ కూటములయెడల మెప్పును చూపుదుము.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి