సమస్తమునకు సృష్టికర్తయైన వానిని ఘనపరచుము
1 19వ శతాబ్దములో మానవజాతిని అంధకారమందు ముంచివేయుటకు సాతాను ఒక పన్నాగమును పన్నినది. అదేమనగా పరిణామ సిద్ధాంతము. (2 కొరిం. 4:4) ఈ సిద్ధాంతము బైబిలుయొక్క సృష్టి వృత్తాంతమును, మరియు మానవుడు పాపములో పడుటను మొండిగా వ్యతిరేకించునదైయున్నది. యేసు విమోచనాబలిని, రాజ్యము మరియు నిత్యాశీర్వాదములను గూర్చిన బైబిలు బోధలను అది అర్థరహితమైనవాటిగా చేయుచున్నది. అంతేగాక పరిణామసిద్ధాంతము బలత్కారము, యుద్ధము, లైంగిక అవినీతి మరియు సమస్త విధములైన అక్రమమునకు త్రోవనేర్పరచుచున్నది. ఈ మరణకరమైన బోధ యొక్క అపాయములనుగూర్చి మానవజాతిని ఎవరు హెచ్చరింతురు?
2 అక్టోబరు మాసములో యెహోవాయొక్క సృష్టికర్తృత్వమునుగూర్చి ప్రకటించుటయందు మనమెంతో పని తొందర గలిగియుందుము గనుక మనమట్లు చేయుదుము. ఇంటింటి పరిచర్యలో, వీధిపనిలో, లౌకిక ఉద్యోగములోని విరామ సమయములో, మరియు పాఠశాలయందు లైఫ్—హౌ డిడ్ ఇట్ గెట్ హియర్? బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్? అను పుస్తకమును ప్రదర్శించుచుందుము. పరిణామ సిద్ధాంతము మానవజాతియొక్క సృష్టికర్తను ఎట్లు అగౌరవపరచుచున్నదో ప్రతి ఒక్కరు తెలిసికొనవలెననుట మన కోరికైయున్నది.
ఫలవంతమైన సాక్ష్యమిమ్ము
3 తటస్థముగానో లేక ఇంటింటనో సాక్ష్యమిచ్చునప్పుడు పరిణామమునుగూర్చి కొందరు వ్యక్తపరచిన బలమైన అభిప్రాయములను కల్గియుండు వార్తా భాగములను సూచించుచు సంభాషణను ప్రారంభించుటకు మీరు యిష్టపడవచ్చును. బహిరంగ పాఠశాలలో పరిణామ సిద్ధాంతము బోధించబడవచ్చునా లేదా యను ప్రశ్న విషయములో అనేక భావములు వ్యక్తపరచబడినవి. వీటికి సంబంధించిన వాదములను, తీవ్ర తర్కములను ఒక వ్యక్తి విన్నను లేక చదివియున్నను, ఈ విషయమునుగూర్చి సూటిగా తెలియజేయు బైబిలు వాక్యమునందు ఆయన ఎంతో ఆసక్తిని కనుగొనవచ్చును. తదుపరి హెబ్రీయులు 3:4లో ఏమి చెప్పబడినదో ఆ వచనమును చదివి దానిపై క్లుప్తముగా వ్యాఖ్యానించుము.
4 ఒక వ్యక్తి కొంత మత సంబంధమైన భావములు గలవానిగా కనిపించినట్లయిన, మతసంబంధమైనవారు మరియు పరిణామమును నమ్మువారు వ్యక్తికానటువంటి “ప్రకృతి”కి, లేక వ్యక్తిగా సంబోధించబడు “ప్రకృతి తల్లి”కి మనము చూచు అద్భుతమైన వాటన్నిటి వెనుకయున్న సృష్టించుశక్తిగా తరచు ఘనతనిస్తారని నీవు చెప్పవచ్చును. అయితే మన గొప్ప ఉపకారి లేక అద్భుతమైన విశ్వమంతటిని సృష్టించినవానిని గుర్తించకుండా బైబిలు విడిచిపెట్టలేదు. అవధానమును ప్రకటన 4:11 వైపునకు లాగవచ్చును. లేఖనమును చదివిన తరువాత ఈ విషయమును గూర్చి వ్యక్తి తనంతటతానే తనను వ్యక్తపరచుకొనుటకు కోరవచ్చును. నీవు క్రియేషన్ పుస్తకములోని నిర్దిష్టమైన ఒకటి లేక రెండు అంశములతో దానిని ముడిపెట్టవచ్చును. అనుకూలముగానున్నయెడల పుస్తకమును చదవమని ప్రోత్సహించవచ్చును.
పాఠశాలయందు
5 యెహోవాకు యౌవనసేవకులైన మీరంతా మీ క్రియేషన్ పుస్తకమును పునర్విమర్శ చేసికొని మీ తోటి విద్యార్థులకు మరియు టీచర్లకు ఆసక్తిని కలిగించు మార్గములను పరిశీలించండి. కొందరు కేవలము వారి బల్లపై సాహిత్యమును విడిచి వచ్చుటద్వారానే చర్చకు ఆహ్వానించగలుగునని కనుగొనిరి. ఇతరులు టీచర్లను, స్కూలు పరిపాలనాధికారులను క్రియేషన్ అంశముపై మాట్లాడుటకు సమీపించి, అనేక పుస్తకములను అందించగల్గిరి.
6 ప్రతివారు యెహోవాను ఘనపరచు లోకములో జీవించు ఉత్తరాపేక్షయందు మనమందరము ఆనందించెదము. మహిమవంతమైన ఆత్మీయప్రాణులు యెహోవా యెదుట సాగిలపడి ఈ విధముగా ప్రకటించుటను యెహోవాను ప్రకటనలో చూచెను: “యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు యెహోవా మాదేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట పడవేసిరి.” (ప్రక. 4:11, NW) మనమును అక్టోబరులో చేయు మన పరిచర్యయందు ఆ మాటలనే ప్రతిధ్వనించుదుముగాక!