ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: జనవరి: లివ్ ఫరెవర్ పుస్తకము పెద్దది 40 రూ. చిన్నది 20 రూ. ఫిబ్రవరి మరియు మార్చి: 192 పేజీల పాతపుస్తకములను రెంటిని 12 రూ. ప్రత్యేక అందింపు. ప్రాంతీయభాషలో: ఒక 192 పేజీల పాతపుస్తకము 6 రూ. ఏప్రిల్: యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకము 20 రూ. (ఇది లభ్యము కానిచోట ప్రత్యేక అందింపు పుస్తకములను అందించుము, రెండు 12 రూ. ఒకటి 6 రూ.) మే మరియు జూన్: ది వాచ్‌టవర్ కొరకు ఒక సంవత్సరము చందా 50 రూ. ఆరునెలల చందాలు మరియు నెలసరి పత్రికల ఒక సంవత్సరము చందా 25 రూ. (నెలసరి పత్రికలకు ఆరునెలల చందా లేదు.) చందా అందింపబడనిచోట, రెండు పత్రికలు ఒక బ్రోషూరు కలిపి 8 రూ. అందించవచ్చును.
◼ ఈ సంవత్సరము (1992) జ్ఞాపకార్థదిన ఆచరణ ఏప్రిల్ 17, శుక్రవారము సూర్యాస్తమయము తర్వాత జరుగును. ఆ తారీఖున ఏ ఇతర సంఘకూటములను నిర్వహించకూడదు.
◼ క్రొత్త వార్షిక వచనము 1992 కొరకు, “నిరీక్షణగలవారై సంతోషించుచు . . . ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.”—రోమీయులు 12:12. (క్రొత్త వార్షిక వచనము సాధ్యమైనంత త్వరలో సంఘములన్నింటిలో ఉండవలెనని సూచింపబడుచున్నది.)
◼ వచ్చే సంవత్సరము (1993) జ్ఞాపకార్థదిన ఆచరణ ఏప్రిల్ 6, మంగళవారము సూర్యాస్తమయము తర్వాత జరుగును. ఈ ఆచరణ కొరకు వేరేయితర సదుపాయముల అవసరమున్నప్పుడు లభ్యమగు హాల్స్ కొరకు సహోదరులు అవసరమైన రిజర్వేషన్‌లు లేక కాంట్రాక్టులు చేసికొను నిమిత్తము 1993 జ్ఞాపకార్థదిన ఆచరణయొక్క ఈ తేది ముందుగా ఇవ్వబడినది.
◼ రానైయున్న నెలలలో పత్రికలు ఎక్కువ అవసరమున్న సంఘములు తమ ఆర్డర్లను ఈ క్రింది తేదీల లోపుగా ఆఫీసుకు పంపవలెను: ఏప్రిల్ సంచికలకు జనవరి 15; మే సంచికలకు ఫిబ్రవరి 15; జూన్ సంచికలకు మార్చి 15.