కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/92 పేజీలు 3-4
  • రాజ్య విస్తరణయందు పాలుపంచుకొనుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రాజ్య విస్తరణయందు పాలుపంచుకొనుట
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • అంతర్జాతీయ నిర్మాణములో సరిక్రొత్త పంథా
    తేజరిల్లు!—1992
  • రాజ్యమందిర నిర్మాణం —పరిశుద్ధసేవలో ఒక ప్రాముఖ్యమైన అంశం
    మన రాజ్య పరిచర్య—2006
  • మీ సమయాన్ని, శక్తిని ఇవ్వగలరా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • విదేశాల్లోని క్రైస్తవ సహోదరులకు వారు సేవచేస్తున్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1992
km 1/92 పేజీలు 3-4

రాజ్య విస్తరణయందు పాలుపంచుకొనుట

1 “ఎంత ఆశ్చర్యకరమైన మార్పులు!” “ఎంత వేగముగా సంభవించెను!” “సోవియట్‌ యూనియన్‌లో మన సహోదరులకు ఎంత ఆశీర్వాదకరము!”

2 అవ్యక్త అడ్డుబాట్ల మధ్యను ఆగష్టు చివరినుండి సెప్టెంబరు తొలిభాగము వరకు సోవియట్‌ యూనియన్‌లో విజయవంతముగా వరుసగా జరిగిన సమావేశములప్పుడు ఈ మాటలు వినబడెను. ఈ వేసవిలో సోవియట్‌ యూనియన్‌నందు జరిగిన ఏడు సమావేశములలో మొత్తము 74,252 మంది హాజరుకాగా, 7,820 మంది బాప్తిస్మము తీసికొనిరి. దీనికితోడు, తూర్పు ఐరోపా సమావేశములలో 2,95,924 కంటే ఎక్కువమంది సమావేశమైరి.

3 నిశ్చయముగా, మొదటి శతాబ్దములో వలెనే, ప్రవక్తయగు యెషయా మాటలు నెరవేర్పును కలిగియున్నవి: “చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. . . . నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు, . . . వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.” అవును, రాజ్య విస్తరణ ముందుకు సాగుచున్నది! యేసు క్రీస్తు పరిపాలించుచున్నాడు! మరియు ప్రవచనము ఇంకను చెప్పుచున్నట్లుగా: “ఇది మొదలుకొని మితిలేకుండా దానికి [అధిపతి పాలనకు] వృద్ధియు క్షేమమును కలుగును.”—యెష. 9:2, 3, 7.

4 తూర్పు ఐరోపాలో అద్భుతరీతిగా సాగుచున్న అభివృద్ధిని తట్టుకొనుటకు జర్మనీలో ముద్రణా సదుపాయముల కొరకు ఎడతెగని నిర్మాణము అవసరమై యున్నది. ఈ విస్తరణకు మద్దతునిచ్చుటకు అచ్చటనున్న మన సహోదరులు సంతోషముగా ఉన్నారు. ఈ విస్తరణ యేసు చెప్పిన చారిత్రాత్మకమైన ప్రవచన నెరవేర్పుకు సూటిగా దోహదపడును: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్త. 24:14.

5 ఇంకా గొప్పనైన విస్తరణ అమెరికా సంయుక్త రాష్ట్రములలో కొనసాగుచున్నది. ఏప్రిల్‌తో ఆరంభమగు తర్వాతి గిల్యాదు తరగతిలో రెండింతల విద్యార్థులు అనగా 50 మంది ఉందురని, సెప్టెంబరులో జరిగిన గిల్యాదు గ్రాడ్యుయేషన్‌లో ప్రకటింపబడెను! చివరకు ఈ పాఠశాల, ప్యాటర్సన్‌, న్యూయార్కులో, దాదాపు మూడు సంవత్సరముల నుండి నిర్మాణములోవున్న, వాచ్‌టవర్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో ఏర్పాటుచేయబడును. ఆశ్చర్యములేదు అనేకమంది ఈ విధముగా అడుగుదురు: “ప్యాటర్సన్‌లో పని ఎలా జరుగుచున్నది?”

6 ప్యాటర్సన్‌ భవన సముదాయము: ఇక్కడ పని వేగముగా, అనుకున్న దానికంటే ముందుగా జరుగుచున్నదని తెల్పుటకు మేము సంతోషించుచున్నాము. ప్యాటర్సన్‌ ఇన్‌ యొక్క ఏడు భవనములు—ఎడ్యుకేషనల్‌ సెంటర్‌నుండి నడిచి వెళ్లగల్గునంత దగ్గరలోనేవున్న 150-గదుల హోటల్‌—ఆలాగే రహదార్లు, వాహనముల నిలుపు స్థలములు మరియు ప్రదేశమంతటిని తీర్చిదిద్దు సహాయక పనులు పూర్తి అయినవి. ఎడ్యుకేషనల్‌ సెంటర్‌ పని పూర్తి అయినప్పుడు, ప్రపంచమంతటినుండి వచ్చు సందర్శకుల వసతి కొరకు సమీపమందలి నివాసము ఉపయోగింపబడును. అయితే దానిలో ప్రస్తుతము, భవన సముదాయపు నిర్మాణపు పనిలో పాల్గొనుచున్న బేతేలుకుటుంబ సభ్యులు షుమారు 300 మంది ఉన్నారు.

7 మొత్తం ఇప్పుడు అక్కడ ఈ పనిలో 650 మంది స్వచ్ఛంద సేవకులున్నారు! వీరిలో అనేకులకు ఆ ప్రాంతములో ఉండుటకు వసతి ఏర్పాటు చేయబడినది, మరియు వారు ప్రతి రోజు పనివున్న ప్రాంతమునకు వెళ్లివత్తురు. ఈ సంవత్సరము తొలిభాగమున న్యూయార్క్‌ టైమ్స్‌ విలేఖరి ఒకరు ఇలా వ్రాశాడు: “ఈశాన్య పుట్‌నామ్‌ కౌంటిలో రూట్‌ 22కు పైగాచూస్తే ఒక కొండపై పట్టణము కూర్చున్నట్టుగా ఉన్నది, ఆ భవన సముదాయపు నిర్మాణపు పని ఎడతెరిపి లేకుండా సాగుచున్నది . . . అందరు—ఇంజనీర్లు, వాస్తుశిల్పులు, నమూనా గీసేవారు, వడ్రంగులు, కాంక్రీటు పనివారు, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, శ్రామికులు—చర్చి సభ్యులైయుండి వారాలు మొదలుకొని సంవత్సరముల వరకు పనిచేయుటకు స్వచ్ఛందముగా వచ్చినవారే. జీతము కాదుగాని, అనుకోని ఖర్చుల నిమిత్తము కొంత నిర్ణీతవేతనము మాత్రమే వారు పుచ్చుకొందురు.”

8 చివరకు ఆ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో, ఒక వంటగది, తరగతి గదులు, కార్యాలయములు, గ్యారేజిలు, 1,200 మందికి వసతినివ్వగల ఆరు నివాస భవనములు మరియు ఒక్కొక్కదానిలో 1,600 మంది కూర్చొనగల ఒక భోజనపు గది, ఒక ఆడిటోరియంతో కలుపుకొని 17 భవనములు ఉండును. ప్రస్తుతమునకు భవన సముదాయములోని రెండు భవనములు పూర్తి అయినవి, నాలుగు ఇంకా నిర్మాణములో ఉన్నవి, మరి ఐదు 1992 ఏప్రిల్‌ ప్రారంభించబడును. చివరి ఆరు భవనముల నిర్మాణము ఆ తర్వాత ఆరంభమగును. ఈ వేసవిలో రాష్ట్రీయ మరియు స్థానిక అధికారులు వేస్ట్‌వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ మరియు వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లను నెలకొల్పుటకు అంగీకరించినప్పుడు ఒక క్రొత్త మైలురాయి చేరుకొనబడెను.

9 నిర్మాణపు పనిలోవున్న స్వచ్ఛంద పనివారు శ్రేష్ఠమైన ఆత్మీయ ప్రయోజనములు పొందుచున్నారు. వాస్తవానికి, స్వచ్ఛంద సేవకులుగా అర్హత పొందు వారందరు ఆత్మీయ వ్యక్తులై యుండవలెను. (1 కొరిం. 2:14, 15) ప్రతి పని దినారంభమున ఆ దినముయొక్క బైబిలు వచనమును వారానందింతురు. వారములో మూడురోజులు, స్వచ్ఛంద పనివారిలోనుండి ముందుగనే ఏర్పాటుచేయబడిన వారు చర్చలో భాగము వహింతురు, కాగా వేరే ఉదయములలో ప్యాటర్సన్‌ స్వచ్ఛంద సేవకులు బ్రూక్లిన్‌ కేంద్ర కార్యాలయమునుండి వచ్చు చర్చను వినుటకు ఆడియో సంబంధము కలుపబడును. దానికితోడుగా, సోమవార సాయంకాలములు నిర్మాణపు పనిలోవున్న స్వచ్ఛంద సేవకులందరి ప్రయోజనార్థమై వాచ్‌టవర్‌ పఠనము నిర్వహించబడును. అయినను, న్యూయార్కులో వృద్ధియగుచున్న పెద్ద నిర్మాణపు పనులలో ప్యాటర్సన్‌ మాత్రమే ఒకటి కాదు.

10 బ్రూక్లిన్‌ విషయమేమి?: 1990, ఆగష్టు 30వ తారీఖున, 30 అంతస్తుల వసతి సౌకర్యమును నిర్మించుటకు సొసైటికి భవననిర్మాణ అనుమతి ఇవ్వబడెనని ప్రకటించినప్పుడు, సంతోషభరితమైన బేతేలు కుటుంబము ఆనందమును వ్యక్తపరచెను. ఆ తర్వాతి నెలలో ఆ స్థలమందున్న తొమ్మిది అంతస్తుల కర్మాగారమును కూలగొట్టుట ఆరంభమాయెను. ఆ పిమ్మట 1991 జనవరిలో, క్రొత్త భవనముయొక్క 100- బై 200-అడుగుల పునాది త్రవ్వకము ఆరంభమాయెను. త్వరలోనే ఆ త్రవ్వకము, 30 అడుగుల క్రింద సైడ్‌వాక్‌ లెవెల్‌ (పేవ్‌మెంట్‌) పూర్తిగావించబడెను. ఈ భవన ప్రాంతమునకు మరియు దీనికి ఎదురుగావున్న వాచ్‌టవర్‌ సొసైటి కర్మాగారమునకు సమీపమున సబ్‌వే సొరంగము ఉన్నందున ఇంజనీరింగ్‌ జాగ్రత్తలు తీసికొనవలసి యుండెను.

11 ఆరునెలలలోనే పునాది పని పూర్తి అయినది. భూమి ఉపరితలమునకు క్రిందగల రెండు అంతస్తులలో ఒక వంటగది, ఆహారనిల్వల గది, ఇతర అనుబంధ సేవలు, ఆలాగే నాలుగువేలకు పైగా వ్యక్తులకు భోజనగది ఉండును. ఆ భవనముయొక్క ఫ్రేంవర్క్‌ కొరకు తయారుచేయు బారీ ఉక్కు కాలమ్స్‌ మరియు బీమ్స్‌ కలిసి 70,00,000 పౌండ్ల బరువు తూగును. జూలైలో ఈ ఫ్రేంవర్క్‌ నిలువబెట్టుట ఆరంభమయినది. సెప్టెంబరు నాటికి ఇటుకపని మేషన్‌ పని ప్రారంభమగును, ఆ పిమ్మట త్వరలోనే బ్రూక్లిన్‌ స్కైలైన్‌లో భవనముయొక్క రంగు మరియు ఆకారము ఒక ప్రత్యేక అంశమైయుండును.

12 సొసైటి ఏర్పాటుచేసిన వాణిజ్య నిర్మాణపు సంస్థయొక్క పని వచ్చే వేసవినాటికి పూర్తగును. అనగా 378-అడుగుల ఎత్తుగల భవనపు గుల్ల (షెల్‌) అప్పటికి సొసైటికి ఇవ్వబడునని దాని భావము, కాగా స్వచ్ఛంద సేవకులైన సాక్షులు ఆ భవనమును పూర్తిచేయుదురు. లాబీ, భోజనపు గది, మరియు వంటగది కలుపుకొని దాని మొదటి 12 అంతస్తులు, 1993 చివరి భాగానికల్లా అందుబాటులోనికి వచ్చునని మేము నిరీక్షించుచున్నాము. బ్రూక్లిన్‌లో వున్న వసతి సదుపాయములన్నియు నిండియున్నందున, మన లేఖన ఆజ్ఞను నెరవేర్చుటకు ఈ క్రొత్త గృహము ఎంతైనా అవసరము.—మత్త. 24:14.

13 మీరేమి చేయగలరు?: ఇప్పటికే సహోదర సహోదరీలు ఎంతోచేశారు. గడచిన సంవత్సరాలలో అమెరికా సంయుక్త రాష్ట్రముల అన్ని ప్రాంతాలనుండి 14,000 మందికంటే ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు న్యూయార్కుకు వచ్చి వివిధ నిర్మాణపు పనులలో సహాయము చేశారు. ప్రేమతో వారుచేసిన శ్రమదానము ఎంతగానో మెచ్చుకొనబడింది, కాగా సొసైటి వారికి, వారి ప్రయత్నములకు మద్దతునిచ్చిన వారి భార్యలకు, ఇతర కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెల్పుటకు ఇష్టపడుచున్నది. అయితే ప్రశ్న ఏమంటే, ఇటువంటి నిర్మాణపు పనులలో పనిచేయుటకు నిన్ను నీవు లభ్యపరచు కొనగలవా?—హెబ్రీ. 13:16.

14 నిజానికి, అందరూ అలా చేయలేరు. అయితే నీవు ఇంకను ఎంతో చేయగలవు. ఉదాహరణకు, స్వచ్ఛంద సేవకులు తాత్కాలికముగా నిర్మాణపు పనిలో పనిచేయుచుండగా అనేకమంది పెద్దలు మరియ పరిచారకులు సంఘ అవసరతలయెడల శ్రద్ధచూపుటలో సహాయపడగలరు. (నెహెమ్యా 4:19-22 పోల్చుము.) సహాయము చేయుటకు మరో ఆవశ్యకమైన మార్గమేదనగా, ఖర్చులకు సహాయపడుటకు స్వచ్ఛందముగా విరాళములిచ్చుటయే. ది న్యూయార్క్‌ టైమ్స్‌ నందు ప్రచురించిన అంచనా ప్రకారము, “క్రొత్త [ప్యాటర్సన్‌] భవన సముదాయము పూర్తియగు నాటికి 130 మిలియన్ల (13 కోట్ల) డాలర్లు ఖర్చగును.” స్వచ్ఛంద సేవకుల సహాయముతో నిర్మాణము పూర్తియగునాటికి ఖర్చు బహుశ దానిలో సగము మాత్రమే ఉండును, అయినను అది ఇంకను పెద్దమొత్తమే. ఇప్పుడు ప్రతినెల లక్షలాది డాలర్లు ఖర్చు చేయబడుచున్నవి.

15 మోషే దినములలో ఆలయ గుడారమును నిర్మించుటకు, ఆలాగే సొలొమోను నడిపింపు క్రింద జరిగిన ఆలయ నిర్మాణమునకు చెప్పుకోదగ్గ వస్తుసంపత్తియు అవసరమై యుండెను. అయితే, కావలసినదంతయు సమకూర్చుటకు యెహోవా ప్రజల హృదయములను స్పందింపజేసెను. (నిర్గ. 35:4-6, 21, 22; 36:3-6; 1 దిన. 29:3-9) ప్రపంచవ్యాప్త రాజ్య ప్రకటనయొక్క విస్తరణలో నిస్సందేహముగా ప్రాముఖ్యమైన భాగము కలిగియుండు ఈ భవన నిర్మాణపు పనులకు ఈనాడు ఆయావ్యక్తులు, సంఘములు, మరియు సర్క్యూట్లు చందాలు ఇచ్చుచున్నవి. ఈ అద్భుతకరమైన విస్తరణ పనికి మద్దతునిచ్చుటలో నీవును భాగము వహించగలవా?

16 నీవట్లు చేయగల్గినట్లయిన, అటువంటి చందాలను వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్టు సొసైటి ఆఫ్‌ ఇండియా, పోస్టు బ్యాగ్‌ 10, లోనావ్ల, మహారాష్ట్ర 410 401కు పంపించండి.

17 నిర్మాణపు స్థలములలో పనిచేయగల్గినను లేకపోయినను లేక వాటికి ధన సహాయము చేయగల్గినను లేకపోయినను, దేవుని రాజ్యాసక్తులు భూవ్యాప్తముగా విస్తరింపబడు పర్యంతము ఈ భవన నిర్మాణపు పనులు విజయవంతమగుటకు మనమందరము ప్రార్థించగలము. ఆయన పనిని తుదముట్టించుటకు మనము కృషిచేయుచుండగా, మన పరలోకపు తండ్రి మనలనందరిని వర్ధిల్లజేయును గాక.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి