నీవు సహాయ పయినీరుగా చేయగలవా?
1 యేసు తన అనుచరులను స్వేచ్ఛగా తమ్మునుతాము పరిచర్యలో ఉపయోగించుకొనుడనియు, అట్టి విధానముననుసరించుట వారికి సంతోషమును, అనేక ఆత్మీయ ఆశీర్వాదములను తెచ్చుననియు అభయమిచ్చెను. (మత్త. 10:8బి; అపొకా. 20:35) గత ఏప్రిల్‌లో మొట్టమొదటిసారిగా 877 మంది సహాయపయినీర్లుగా తమ పరిచర్యను వృద్ధిచేసికొనుట ద్వారా కలుగు ఆనందములను అనుభవించారు. నీవు ఈ సంవత్సరము ఏప్రిల్ నెలలో గాని మే నెలలోగాని లేక రెండునెలలలోనైనా సహాయపయినీరుగా ప్రవేశించుటద్వారా ఈ ఆశీర్వాదములలో పాలుపొందుదువా?—కీర్త. 34:8.
2 నీ పరిస్థితులను పరిశీలించుకొనుట: క్రింద పేర్కొనబడిన అనుభవములను పరిశీలించుకొలది నీకై నీవు ఇట్లడుగుకొనుము: ‘ఈ మాదిరులలో నేనును ఉండునట్లు నన్ను నేను చేసికొనగలనా? సహాయపయినీరుగా ఉండగలుగునట్లు నాకు అవకాశము కల్గించు అవసరమైన సర్దుబాట్లను నేనెట్లు చేసికొనగలను?’
3 అయిదుగురు పిల్లలను కలిగి, లౌకికముగా ఉద్యోగము చేస్తున్నను, ఒక సహోదరి సహాయపయినీరుగా చేయగలిగినది. ఆమెకు ఎటువంటి ప్రతిఫలము లభించినది? ఆమె భర్త మరియు పిల్లలు ఆమెకు మంచి మద్దతునిచ్చారు. సహోదరియొక్క మంచి మాదిరి ఫలితంగా మరుసటి నెలలో ఆమె భర్త బాప్తిస్మపొందని ప్రచారకుడుగా అగుటకు నడిపించబడెను.
4 ఒక సంఘములో పెద్దలందరు, పరిచారకులందరు ఒక నెలలో సహాయపయినీర్లుగా సేవచేశారు. వారిలో ఎక్కువమందికి లౌకిక ఉద్యోగములున్నవి, అయినను వారాంతములో వారు బహుఎక్కువగా ఆత్మీయ కార్యక్రమములలో పాల్గొన్నారు. ప్రకటన పనిలోను, ప్రాంతీయ సేవను వ్యవస్థీకరించుటలోను వారు అందించిన మంచి నాయకత్వము ఆ సంఘమంతటికి ప్రయోజనాన్ని కలుగజేసింది. మొత్తము 77 మంది ప్రచారకులలో 73 మంది ఏదోవిధమైన పయినీరు సేవలో ఆనెలలో పాల్గొనిరి.
5 ఒక 15-సంవత్సరముల పాఠశాల బాలిక తన రెండువారముల వేసవి సెలవులను సహాయపయినీరు సేవచేయుటకు ఉపయోగించి ఇలా అంటుంది: “నేను నిజంగా బేధాన్ని చూడగల్గితిని, ప్రత్యేకంగా సంభాషణను వృద్ధిచేసికొనుటలో. గుమ్మముయొద్ద ప్రజలతో అనేక మార్లు సంభాషించగలుగుతున్నాను.”
6 లౌకిక ఉద్యోగమునుండి రిటైరయినవారు రాజ్యాసక్తులను వెంబడించుటకు తరచు అతి శ్రేష్టమైన అవకాశములను కల్గియున్నారు. తన భర్త చనిపోయిన తరువాత ఒక 84-సంవత్సరముల సహోదరి ఇలా వ్రాసినది: “నా పిల్లలందరు పెరిగి పెద్దవారై కుటుంబములను కల్గియున్నారు. వారు నన్ను అలక్ష్యము చేయలేదు, గానీ వారి సందర్శనములు నాలో పోగొట్టుకున్నట్టి మరియు ఒంటరితనపు భావనలను తీసివేయలేక పోయినవి. అప్పుడు మా సంఘములోని పెద్దలలో ఒకరు సహాయపయినీరుగా సేవచేసి చూడమని సలహాయిచ్చారు. మొదట్లో వెనుకాడినను, చివరకు చేసి చూద్దామని నిర్ణయించుకున్నాను. ఎంత ఆనందము! సహాయపయినీరు సేవను అనుభవించటానికే, నేను ఇంత వయస్సువరకు బ్రతకాటానికి యెహోవా నన్ను అనుతించాడనే భావన నాకు కలిగింది. అప్పటినుండి ప్రతి నెల నేను సహాయపయినీరుగా చేయుటలో కొనసాగియున్నాను.”
7 ఇండ్లస్థలాలు, భవనములు అమ్మునట్టి ఒక సహోదరుడు పయినీరు సేవకు సమయము దొరుకునట్లుగా తాను ఇండ్లను చూపించే కాల పట్టికలో సర్దుబాట్లు చేసికొన్నాడు. ఇతరులు అలాగే తమ కార్యమును వృద్ధిచేసికొనునట్లు వారి ఉద్యోగములో సర్దుబాట్లు చేసికొన్నారు.
8 మీ పథకములను ఇప్పుడే వేసికొనుము: “ఏప్రిల్ మరియు మే నెలలలో సహాయ పయినీరుగా సేవచేయుటకు అనుకూలమైన పథకములను ఇప్పుడే ఎందుకు వేసికొనకూడదు? విజయవంతులమగుటకు, జాగ్రత్తగా పథకములు వేసికొనుట అవసరము. కుటుంబ బాధ్యతలున్నను, పూర్తికాల లౌకిక ఉద్యోగములున్నను, ఇతర లేఖన సంబంధమైన బాధ్యతలున్నను సహాయపయినీర్లుగా సేవ చేయగల్గియున్నవారి అనుభవములనుండి ఇది స్పష్టమవుచున్నది. వారి అనుభవమునుండి ప్రయోజనము పొందునట్లు, విజయవంతముగా పయినీరు సేవ చేసినవారితో మాట్లాడుము. అంతేగాక ఆయన సహాయమును అడుగుతూ యెహోవాను ప్రార్థనలో సమీపించుము.—యెషయా 40:29-31; యాకోబు 1:5.
9 సహాయపయినీర్లుగా సేవచేయుటకు వారి కార్యములను క్రమపరచుకొనువారు పొందు ఆనందములు అనేకములుండుననుటలో ఏ సందేహములేదు. నీవు ఇప్పటికీ పూర్తికాల సేవలో ఉండనట్లయిన, ఈ ఆధిక్యతను నీవు అనుభవించ కూడదా? సువార్తను ఇతరులతో పంచుకొనే నీ ఆధిక్యతను విస్తృతపరచుకొనుటకు నీవు ప్రయత్నించిన, యెహోవా నిశ్చయముగా నీపై గొప్ప దీవెనను క్రుమ్మరించును.—మలా. 3:10.