కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/97 పేజీలు 3-5
  • కావలెను—4,000 మంది సహాయ పయినీర్లు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కావలెను—4,000 మంది సహాయ పయినీర్లు
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రొత్త సేవా సంవత్సరంలో ఓ చక్కని లక్ష్యాన్ని పెట్టుకోండి
    మన రాజ్య పరిచర్య—2007
  • మనమా లక్ష్యాన్ని మళ్లీ సాధిస్తామా?—సహాయ పయినీర్ల కొరకు మరొక పిలుపు
    మన రాజ్య పరిచర్య—1998
  • నీవు సహాయ పయినీరుగా చేయగలవా?
    మన రాజ్య పరిచర్య—1992
  • యెహోవా గుణాతిశయములను ప్రచురం చేయండి
    మన రాజ్య పరిచర్య—2007
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1997
km 2/97 పేజీలు 3-5

కావలెను—4,000 మంది సహాయ పయినీర్లు

మార్చి, ఏప్రిల్‌, లేక మే నెలల్లో మీరు సహాయపయినీరు సేవను చేయగలరా?

1 “1,000 మంది ప్రచారుకులు కావాలి” అన్నది 1881 ఏప్రిల్‌ నెలలో ప్రచురించిన కావలికోట (ఆంగ్లం)లోని ఒక శీర్షికాంశం. “ప్రభువు తన జ్ఞానాన్ని ఇచ్చిన” సమర్పించుకున్న స్త్రీపురుషులు, బైబిలు సత్యాన్ని వ్యాపింపజేయడంలో తమకు సాధ్యమైనంత సమయాన్ని వెచ్చించమనే విన్నపం అందులో ఉంది. ప్రభువు పనికొరకే తమ సమయంలో సగం లేక అంతకంటే ఎక్కువ సమయాన్ని వెచ్చించగలవారు కోల్పోర్టర్‌ సువార్తికులుగా స్వచ్ఛందంగా పాల్గొనాలని వారు ప్రోత్సహించబడ్డారు, మీరు నేటి పయినీర్లకు ముందున్నవారు.

2 1800ల కాలం మారినప్పటికీ ఒక విషయం మాత్రం అలాగేవుంది. సువార్తను వ్యాపింపజేయడంలో దేవుని సమర్పిత సేవకులు తమకు వీలున్నంత సమయాన్ని వెచ్చిస్తూనే ఉండాలని కోరుకుంటారన్నదే. సంఘంలోని ప్రచారకులు రాజ్య పరిచర్యలో ఎక్కువ సమయాన్ని వెచ్చించే సహాయ పయినీరు సేవకులుగా పనిచేయడం ద్వారా తమ ప్రతిభను మెరుగుపర్చుకుంటారు.—కొలొ. 4:17; 2 తిమో. 4:5.

3 సహాయ పయినీరు సేవ ప్రారంభమైనప్పటినుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది సహోదర సహోదరీలు ఈ సేవను చేసి ఆనందిస్తున్నారు. పయినీరు పరిచర్యలోని ఈ రంగమందు ఇండియాలోనివారికి ఆసక్తి ఎంతగా పెరిగిందంటే 1994 ఏప్రిల్‌ నెలలో అంటే 14,000 మంది ప్రచారకులు మాత్రమే ఉన్న సమయంలో సహాయ పయినీరు చేసిన వారి శిఖరాగ్ర సంఖ్య 2,000లకు చేరుకుంది! ఆ నెలలో జరిగినంత పని మరే నెలలోనూ జరగలేదు. పరిచర్యలో వెచ్చించిన 3,33,489 శిఖరాగ్ర గంటలు, శిఖరాగ్ర స్థాయిలో 71,998 చిన్నపుస్తకాలూ 3,235 పత్రికా చందాలను సేకరించడంతో సహా పరిచర్యలోని ప్రతి రంగంలోనూ కొత్త శిఖరాగ్రాన్ని చేరుకోవడం జరిగింది. అప్పటినుండి గత రెండు సంవత్సరాలుగా ఈ మూడు శిఖరాగ్ర సంఖ్యలను అధిగమించడం జరగలేదు. ఇప్పుడు దేశంలో 17,000 మంది ప్రచారకులు ఉన్నారు కనుక 1994 ఏప్రిల్‌ నెలలో చేసే చక్కని పనిని రెండింతలు చేసే అవకాశం, అంటే అప్పటి కంటే ఎక్కువగా చేసే అవకాశం తప్పకుండా ఉంది.

4 మార్చి, ఏప్రిల్‌ మరియు మే నెలల్లో లేక వీటిలో ఒక నెలలో గానీ లేక అంతకంటే ఎక్కువ నెలల్లో గానీ సహాయ పయినీరు సేవ చేయాలనే లక్ష్యాన్ని కల్గివుండమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మార్చి నెల కూడా ఎందుకు? ఎందుకంటే ఈ ఏడాది క్రీస్తు మరణ జ్ఞాపకార్థదినం మార్చి 23 ఆదివారం నాడు వస్తుంది. మన ప్రభువునూ రక్షకుడునూ అయిన యేసుక్రీస్తు ప్రారంభించిన రాజ్య ప్రచార పనిలో ఆసక్తిగా పాల్గొనడం కన్నా జ్ఞాపకార్థదినానికి ముందు వారాలను గడిపే మరో శ్రేష్ఠమైన మార్గం లేదు. అలా మార్చిలో ఎంతో సాక్ష్యమివ్వడం ద్వారా క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణలో మనతోపాటు పాల్గొనమని అనేకమంది ఆసక్తిగలవారిని మనం ఆహ్వానించవచ్చు. మార్చి నెలకున్న మరో ప్రత్యేకతేమిటంటే మొట్టమొదటిసారిగా కుటుంబ సంతోషానికిగల రహస్యం అనే కొత్త పుస్తకాన్ని మనం అందిస్తాము. దీనికి తోడు, మార్చి నెలలో అయిదు శనివారాలూ అయిదు ఆదివారాలూ ఉన్నాయి కనుక వారాంతాల్లో ఎక్కువ ప్రాంతీయ సేవను చేసేందుకు అవి సహాయపడతాయి. దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరును ఉపయోగిస్తూ ఏప్రిల్‌, మే నెలలందు ఆసక్తితో పరిచర్యలో మనం మన ప్రయత్నాన్ని కొనసాగించడం ఆసక్తిగలవారిని పునర్దర్శించేందుకు కొత్త బైబిలు పఠనాలను ప్రారంభించేందుకు మనకు సహాయపడుతుంది. అంతేకాక, సమయోచితమైన కావలికోట, తేజరిల్లు! తాజా సంచికలతో ప్రత్యేకంగా వారాంతాల్లో మనం మన ప్రాంతంలోని వారందరినీ కలుస్తాము.

5 సహాయ పయినీరు సేవకు ఎవరు అర్హులు?: మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకం 113వ పేజీ ఇలా వివరిస్తోంది: “నీవు బాప్తిన్మం పొంది నీ పరిస్థతులేవైననూ, సత్ర్పవర్తన కలిగివుండి ప్రాంతీయ పరిచర్యలో 60 గంటలు గడుపుటకు ఏర్పాటు చేసికొనగలిగితే, మరి అలా ఒకటి లేక ఎక్కువ నెలలు సహాయ పయినీరుగా సేవచేయగలవని సంఘ పెద్దలు నమ్మితే, ఈ సేవాధిక్యత కొరకు నీవిచ్చే దరఖాస్తును పరిశీలించుటకు వారు సంతోషిస్తారు.” ఈ ఆధిక్యతను నిర్వహించేందుకు ఏప్రిల్‌ నెలలో మీ పనుల్లో సర్దుబాటు చేసుకోగలరా? బహుశ మార్చిలో కూడా అలా చేయగలరా? అలాగే మే నెలలో చేయగలరా? ఈ మూడు నెలలూ చేయలేకపోయినట్లైతే కనీసం ఏప్రిల్‌ నెలలోనైనా సహాయ పయినీరు సేవను చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

6 ప్రచారకుల హృదయపూర్వక మద్దతుతో పాటు పెద్దల సభ యొక్క అనుకూల దృక్పథం మూలంగా 4,000 మంది సహాయ పయినీర్లు కావాలనే ఈ పిలుపుకు వచ్చే ప్రతిస్పందన నిస్సందేహంగా సఫలీకృతమవ్వాలి. ఏప్రిల్‌ నెలలో ప్రతి సంఘమూ తమ ప్రచారకుల్లో కనీసం 25 నుండి 30 శాతం మంది సహాయ పయినీరు సేవ చేయాలనే గురిని కల్గివుండవచ్చు; కొన్ని సంఘాల్లో అంతకంటే ఎక్కువ శాతం మంది ఈ ఆధిక్యతలో భాగం వహించవచ్చు. మొదట పెద్దలూ పరిచర్య సేవకులు చేరడం ద్వారా వారు మంచి మాదిరిని ఉంచగలరు. (హెబ్రీ. 13:7) ఏప్రిల్‌ నెలలో గానీ లేక ఆ తర్వాత వచ్చే నెలల్లోగానీ ఎంతమంది తన కుటుంబంనుండి సహాయ పయినీర్ల శ్రేణిలో చేరగలరన్న విషయాన్ని కుటుంబ శిరస్సులు కనుగొనాలని ప్రోత్సహించడమైనది.—కీర్త. 148:12, 13; అపొస్తలుల కార్యములు 21:8, 9 పోల్చండి.

7 మీరు చేసే పూర్తికాల ఉద్యోగం, స్కూలు సమయం, కుటుంబ బాధ్యతలూ లేక ఇతర లేఖనాధార బాధ్యతలవల్ల సహాయ పయినీరు సేవ మీరు చేయలేరు అని త్వరపడి నిర్ణయించుకోకండి. దానిలో భాగం వహించడం కొందరికి సులభం కాకపోవచ్చు; అయినప్పటికీ, మంచి సంస్థీకరణ, యెహోవా ఆశీర్వాదం మూలంగా సఫలులుకాగలరు. (కీర్త. 37:5; సామె. 16:3) పయినీరు సేవలో భాగం వహించాలనే కోరిక మీ పరిస్థితులను నడిపించనివ్వండి; మీ పరిస్థితులు పయినీరు సేవ చేయాలన్న మీ కోరికను నడిపించనివ్వకండి. (సామె. 13:19) కనుక, యెహోవా ఎడల మరియు తోటి మానవుల ఎడలగల అచంచలమైన ప్రేమనుబట్టి ఒక నెలలో తమ పరిచర్యను విస్తృతపర్చుకునేందుకు సాధారణంగా ప్రతివారమూ తాము చేసే పనుల్లో సర్దుబాట్లు చేసుకున్నారు. (లూకా 10:27, 28) రాజ్య సేవ చేసేందుకు ప్రయాసపడేవారికి అనేక ఆశీర్వాదాలు వేచివున్నాయి.—1 తిమో. 4:10.

8 సహాయ పయినీరుసేవ సాధించేది: సహాయ పయినీరు సేవ చేసేందుకు వేలకొలది దేవునిసేవకులు హృదయపూర్వకంగా చేసిన ప్రయత్నాలు యెహోవాకు గొప్ప స్తుతులను తెస్తాయి. ఎక్కువమంది ప్రజల మధ్య సువార్తను వ్యాపింపజేసేందుకు ఈ రాజ్య ప్రచారకులు ప్రయాసపడినప్పుడు వారు వ్యక్తిగతంగా యెహోవాకు మరింత సన్నిహితులవుతారు, ఎందుకంటే ఆయన ఆత్మ మరియు ఆశీర్వాదాల కొరకు వారు ఆయనపై ఆధారపడతారు.

9 మన మధ్య సహాయ, క్రమ, ప్రత్యేక పయినీర్లు ఉండడం సంఘంలో అసలైన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వారు తమ పరిచర్యలోని అనుభవాలను గూర్చి మాట్లాడుతున్నప్పుడు వారి ఉత్సాహం పదిమందికి వ్యాపిస్తుంది. తమ స్వంత ప్రాధాన్యతలను అతి ప్రాముఖ్యమైన పరిచర్య పనిలో ఎక్కువగా భాగంవహించేందుకూ తమకున్న సానుకూలాన్ని తిరిగి బేరీజు వేసుకునేందుకు ఇతరులను కదిలిస్తుంది. 70 ఏళ్లప్పుడు బాప్తిస్మం పొందిన ఓ సహోదరి వెంటనే క్రమంగా సహాయ పయినీరు సేవను చేయడం ప్రారంభించింది. ప్రతినెలా సహాయ పయినీరు సేవ చేయడానికి ఈ వయస్సులో ఎందుకు అంతగా ప్రయాసపడుతున్నారు అని కొన్ని సంవత్సరాల తర్వాత అడిగినప్పుడు, 70 ఏళ్ళు వ్యర్థమైనట్లు భావిస్తున్నాననీ మరి మిగిలిన సంవత్సరాలను వ్యర్థం చేయదల్చుకోలేదని ఆమె చెప్పింది!

10 సహాయ పయినీరు పనిలో భాగంవహిస్తున్న ప్రతి వ్యక్తీ పరిచర్యలో తన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటాడు. ఓ యౌవన సాక్షి ఇలా అంగీకరించాడు: ‘నేను నా చిన్నతనంలో మా అమ్మానాన్నలతో ప్రకటన పనిలో పాల్గొనేవాణ్ణి. ప్రాంతీయ సేవ సరదాగా ఉండేది. అయితే కొంత కాలానికి స్కూల్లోని మిగిలిన పిల్లల్లో నేను వేరుగా కనిపించడం ప్రారంభమైంది. అప్పుడిక నా తోటి విద్యార్థులతో సత్యాన్ని గూర్చి మాట్లాడాలంటే ఏదోలా ఉండేది. ఇంటింటా ప్రకటించేటప్పుడు, స్కూల్లో నాకు తెలిసినవారిని నేను ఎక్కడ కలుస్తానో అనే భయం నాలో ఉండేది. నాకున్న సమస్య మానుష్య భయం. (సామె. 29:25) స్కూల్లో చదువు ముగిశాక, తాత్కాలికంగా పయినీరు సేవ చేసిచూద్దామని నేను నిర్ణయించుకున్నాను. అలా ఇంతకు మునుపు ఎప్పుడూలేనంతగా, ప్రకటించడం నాకు ఎంతో ప్రియమైనదయ్యింది. ఇక నేను దాన్ని ఎన్నడూ ఏదో సరదాగాగానీ లేక బరువైన భారంగాగానీ భావించలేదు. నా బైబిలు విద్యార్థులు సత్యంలో అభివృద్ధి చెందడం చూస్తుంటే, యెహోవా నా ప్రయత్నాలకు మద్దతునిస్తున్నాడనే రుజువునుబట్టి నేను ఎంతో తృప్తిని పొందాను.’ ఈ యౌవనుడు అలా క్రమపయినీరు సేవను కొనసాగించాడు.

11 ఆచరణాత్మక దృష్టికోణం నుండి చూస్తే సంఘంలో అనేకమంది సహాయ పయినీరు సేవకులుగా సేవ చేస్తున్నప్పుడు, ప్రాంతంలో పరిచర్యను మంచిగా చేయవచ్చు. అప్పుడప్పుడు మాత్రమే చేసే ప్రాంతాల్లో పనిచేసేందుకు సహాయపయినీర్ల సహాయాన్ని ప్రాంతాలను నియమించే సహోదరుడు కోరవచ్చు. మధ్యాహ్న భోజనాన్ని తీసుకుని వెళ్ళి ఒక రోజంతా సేవచేయడం ద్వారా దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా పనిచేయడం సాధ్యమౌతుంది.

12 పెద్దలు ముందుగానే ఏర్పాట్లు చేయాలి: ఎక్కువ మంది పాల్గొనేలా మిట్ట మధ్యాహ్నాలూ సాయంత్రాలతో సహా వారంలోని వివిధ సమయాల్లో వివిధ విధాల్లో సాక్ష్యమిచ్చేందుకు రానున్న మూడు నెలలకు ఏర్పాట్లు చేయవల్సి ఉంది. ఎప్పుడూ చేసే ఇంటింటి పనికి తోడు, వీధిసాక్ష్యం కొరకు, వ్యాపార స్థలాల్లో పనిచేయడం కొరకు, ఇళ్లలో లేనివారిని కలుసుకునేందుకూ సమయాన్ని కేటాయించండి. అలా చేయడం ద్వారా, పయినీరు సేవ చేసేవారికి ఆచరణయుక్తంగానూ అనుకూలంగానూ ఉన్న సమయంలో సంఘంతోకలిసి సేవలో పాల్గొనేలా పెద్దలు వారికి సహాయపడతారు. అన్ని ప్రాంతీయ పరిచర్య ఏర్పాట్లను గూర్చి సంఘానికి ముందుగానే పూర్తి వివరాలనివ్వాలి. సేవకు సంబంధించిన కూటాల నిర్వహణ చక్కగా సంస్థీకరించబడాలి. దానికి తోడుగా, సరిపడేంత ప్రాంతాన్ని కేటాయించాలి మరి తగినన్ని పత్రికలూ ఇతర ప్రచురణల సరఫరాకొరకు వెంటనే ఆర్డరు చేయాలి.

13 మీ వ్యక్తిగత సేవా షెడ్యూలును వేసుకోండి: మొదట్లో సహాయ పయినీరు సేవ అంటే భయపడ్డ ఓ సహోదరుడు ఇలా అన్నాడు: “ఇది నేనకున్నదానికంటే ఎంతో సులభం. దానికి మంచి షెడ్యూలు ఉంటే సరిపోతుంది.” ఈ ఇన్సర్ట్‌ వెనుక పేజీలో బహుశ మీకు ఆచరణయుక్తం కాగల సహాయపయినీరు షెడ్యూలు నమూనా ఉండడం చూశారా? ప్రతి వారం 15 గంటలు చొప్పున పరిచర్యకు కేటాయించడమే సహాయ పయినీరు సేవకు అవసరం.

14 సహాయ పయినీర్లుగా సేవచేసేందుకు గృహిణులూ రెండో షిఫ్ట్‌ ఉన్నవారూ తమ ఉదయకాల సమయాన్ని ప్రాంతీయ సేవకొరకు కేటాయించవచ్చు. స్కూలు పిల్లలూ మూడో షిఫ్ట్‌ పనివారూ సాధారణంగా మధ్యాహ్నాలను ప్రకటనా పనికి కేటాయించగల్గుతారు. పూర్తికాలం ఉద్యోగాలు చేసేవారు సాయంత్రాలు సాక్ష్యమివ్వడంతో సహా వారానికి ఒకరోజు సెలవు తీసుకుని పరిచర్య చేయడం లేక వారాంతాలను పూర్తిగా పరిచర్యలో గడపడం సాధ్యమైనట్లు కనుగొన్నారు. వారాంతాల్లో మాత్రమే ప్రాంతీయ సేవచేయగల్గినవారు అయిదు వారాంతాలున్న నెలలను ఎంచుకుంటారు. ఈ సంవత్సరం మార్చి, ఆగస్టు, నవంబరు నెలలు అలాంటివే. 6వ పేజీలో నమూనాగా ఇవ్వబడిన పూరింపని షెడ్యూలును ఉపయోగిస్తూ మీ వ్యక్తిగత పరిస్థితికి ఏ షెడ్యూలు ఆచరణాత్మకమైన వ్యక్తిగత సేవా షెడ్యూలు కాగలదోనని నిర్ణయించుకునేందుకు శ్రద్ధాపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి.

15 సహాయ పయినీరు సేవలో ఉన్న ఒక ప్రయోజనమేమిటంటే అది సరళంగా ఉంటుంది. ఏ నెలల్లో మీరు పయినీరు సేవ చేయాలనుకుంటున్నారో మీరే ఎన్నుకోవచ్చు మరి మీకిష్టమైనన్నిసార్లు మీరు సేవచేయవచ్చు. మీరు సహాయ పయినీరు సేవ క్రమంగా చేయాలనుకుంటున్నప్పటికీ అలా చేయలేనట్లయితే, సంవత్సరం పొడుగునా నెల విడిచి నెల చేయగలరేమో ఆలోచించగలరా? మరోవైపు కొందరు సహాయ పయినీర్లుగా ఎక్కువకాలంపాటు చేయగల్గుతున్నారు.

16 పూర్తికాల సేవకు సిద్ధపడడం: పయినీరు స్ఫూర్తి ఉన్న అనేకులు క్రమ పయినీరు సేవను చేయాలని ఇష్టపడతారు కానీ దానికి తగిన సమయం పరిస్థితులూ శక్తి వారికి ఉన్నాయో లేవో అని వారు ఆలోచిస్తుంటారు. నిస్సందేహంగా ఇప్పుడు క్రమ పయినీర్లుగా ఉన్న అనేకమంది సహాయ పయినీరు సేవను పూర్తికాలసేవకు ముందు, సిద్ధపర్చేదిగా ఉపయోగించారు. సహాయ పయినీరు షెడ్యూలును రోజుకు ఒక గంట చొప్పున ఎక్కువ చేసినా, లేక ప్రతివారం ఒక రోజంతా చేసినా క్రమ పయినీరు గంటలను చేరడం సులభమౌతుంది. అది మీకు సాధ్యమో కాదో కనుక్కునేందుకు, సహాయ పయినీరు సేవ చేస్తున్న ఒకటి లేక రెండు నెలలపాటు 90 గంటలు చేసేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు? అదే సమయంలో మీరు పునర్దర్శనాలనూ బైబిలు పఠనాలనూ అభివృద్ధిచేసుకుంటారు కనుక మీరు మంచి సమతుల్యమున్న పయినీరు పరిచర్యను ఆనందిస్తారు.

17 ఒక సహోదరి ఆరు సంవత్సరాలు క్రమంగా పయినీరు సేవను చేయడంలో ఆనందించింది. ఆ సంవత్సరాలన్నింటిలో తాను క్రమ పయినీరు సేవలో చేరాలన్నదే ఆమె గురి. అందుకని 90 గంటలను సంపాదించగల్గే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆశతో ఆమె నాలుగు వేర్వేరు ఉద్యోగాలను మార్చి చూసింది. అది సాధ్యమౌతుందో లేదో ప్రయత్నించి చూసేందుకు ప్రతి నెలా ఒకటి లేక రెండు షెడ్యూళ్లను ఆమె వేసుకునేది. వాటిని పరిశీలించి చూసినప్పుడు పూర్తికాల సేవను తాను చేయలేదని ఆమె భావించింది. అయినప్పటికీ, ఆయన నడిపింపు కోసం యెహోవాను ఎడతెగక కోరుతూనే ఉంది. ఒకరోజు సేవాకూటానికి సిద్ధపడుతున్నప్పుడు, అక్టోబరు 1991 మన రాజ్య పరిచర్యలోని ఒక శీర్షికను చదివింది, అది ఇలా పేర్కొంది: “ఇన్ని గంటలా అను దానిపై అసాధారణ దృష్టినుంచుటకు బదులు, సమకూర్చుపనిలో భాగమువహించు అవకాశమును వృద్ధిపరచుటపై ఎందుకు దృష్టిసారించకూడదు? (యోహా. 4:35, 36)” ఆమె ఇలా చెబుతోంది: “ఈ వాక్యాన్ని నేను అయిదారు సార్లు చదివాను అప్పుడు యెహోవా జవాబు ఇదే అని నాకు కచ్చితంగా అర్థమైంది. ఆ తరుణంలోనే క్రమపయినీరు సేవలో చేరాలని నేను నిర్ణయించుకున్నాను.” ఆమె పార్టైమ్‌ ఉద్యోగ సమయం అంత అనుకూలంగా లేకపోయినా క్రమ పయినీరు సేవ కొరకు ఆమె దరఖాస్తు చేసింది. ఒక వారం తర్వాత ఆమె షెడ్యూలు మారిపోయింది, సరిగ్గా ఆమెకు అవసరమైన పని సమయాన్నే ఆమెకు ఇవ్వడం జరిగింది. ముగింపులో ఆమె ఇలా చెప్పింది, “ఇది యెహోవా ఆశీర్వాదమేనంటే కాదనగలరా? మీరు యెహోవాను నడిపింపుకొరకు అడిగితే అది మీకు దొరుకుతుంది, దానినుండి పారిపోకండి, అంగీకరించండి.” క్రమ పయినీరు సేవ చేయాలని మీరు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నట్లైతే, బహుశ మార్చి, ఏప్రిల్‌, మే మూడు నెలలపాటు సహాయ పయినీరింగు చేసిన తర్వాత మీరూ పూర్తికాల పరిచర్యలో విజయాన్ని సాధించగలరని అంగీకరిస్తారు.

18 తన ప్రజలు ఈ ప్రత్యేక వసంత కాలపు కార్యక్రమంలో రక్షణ సువార్తను ప్రచురించేందుకు చూపే ఆసక్తికి యెహోవా తప్పక మద్దతునిచ్చి ఆశీర్వదిస్తాడు. (యెష. 52:7; రోమా. 10:15) ఏప్రిల్‌ నెలలో మీరు భాగంవహించడం ద్వారా 4,000 మంది సహాయ పయినీర్లు కావాలి అన్న పిలుపుకు మీరు ప్రతిస్పందించగలరా? మరి బహుశ మార్చి మరియు మే నెలల్లో కూడా?

[3వ పేజీలోని బాక్సు]

ఓ సహాయ పయినీరుగా ఎలా విజయాన్ని సాధించాలి

■ మీరు చేయగలరనే అనుకూల దృక్పథాన్ని కల్గివుండండి

■ మీ ప్రయత్నాలను ఆశీర్వదించమని యెహోవాకు ప్రార్థించండి

■ మీతో పయినీరు సేవను చేసేందుకు మరో ప్రచారకున్ని ఆహ్వానించండి

■ ఆచరణాత్మకమైన సేవా షెడ్యూలును తయారుచేసుకోండి

■ కావల్సినన్ని పత్రికలు ఆర్డరు చేయండి

■ సేవకొరకు సంఘం చేసే ఏర్పాట్లకు మద్దతునివ్వండి

■ అనియత సాక్ష్యమిచ్చే అవకాశాల కొరకు వెదకండి

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి