దేవుని వాక్యపు శక్తి
1 దేవుని వాక్యం శక్తిగలది. (హెబ్రీ. 4:12) బైబిలు నుండి నేర్చుకున్న వారు విషయాలను వ్యక్తిగతంగా అన్వయిస్తున్న కారణంగా మంచిగామారిన లక్షలాదిమంది ప్రజల జీవితాలలో దీని రుజువును నేడు మనం చూడగలము. దేవుని వాక్యపు జ్ఞానాన్ని యేసు శిష్యులు ఇతరులతో పంచుకున్న మొదటి శతాబ్దములోను ఇది సత్యమై యుండెను.—రోమా. 12:2.
2 ప్రజలు బైబిలు బోధలనుండి ప్రయోజనం పొందాలంటే, వారు బైబిలును దేవుని వాక్యమని గుర్తించి, బైబిలును కచ్చితముగా అర్థం చేసికోవాలి. (1 థెస్స. 2:13) డిశంబరు నెలలో, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అందించుట ద్వారా బైబిలు విలువను గూర్చి మరింతగా నేర్చుకొని, దానిని కచ్చితముగా అర్థం చేసికొనే అవకాశాన్ని మనం ప్రజలకిస్తాం.
3 నిరంతరము జీవించగలరు అనే పుస్తకములోని కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఎందుకు పునఃసమీక్షించకూడదు? విషయసూచిక యెహోవా దేవుని మరియు యేసుక్రీస్తు పాత్రను గూర్చి, మరణము, నరకము, దుష్టాత్మలు, పునరుత్థానము, దేవునిరాజ్యమును గూర్చి చర్చించే అధ్యాయాలకు నడుపును. దానిలో ఎన్నో ఫొటోలు, దృష్టాంతాలు కలవు. ఆ పుస్తకములోని సువార్తను మన ప్రాంతంలోని ప్రజలు వినవలసిన అవసరముందని దృఢముగా నమ్మి, నిజమైన ఉత్సాహముతో దాని నందించుటకు ఈ అంశాలు మనకు సహాయపడతాయి. శ్రేష్ఠమైన ఈ సాహిత్యము యెడల మన ఉత్సాహం ఫలితంగా గృహస్థుడు మన రాజ్య వర్తమానానికి, మనం అందించే సాహిత్యానికి మరింత సిద్ధమనస్సుతో ప్రతిస్పందిస్తాడు.
4 మానవజాతికి భవిష్యత్తు ఏమి కలిగియున్నదో నిజంగా తెలిసికోవాలని ఇష్టపడే గృహస్థుని మనం కలిసికున్నప్పుడు ఈ పుస్తకాన్ని మనమెలా ఉపయోగించగలం? భూమియెడల, మానవజాతియెడల దేవుని సంకల్పమేమై యున్నదో వివరించే 1 అధ్యాయమందలి 12, 13 పేజీలను నొక్కితెల్పి, ఈ మహాగొప్ప ఆశీర్వాదములు సమీపమందే ఉన్నవని మనం సూచిస్తాము. మనం 155-158 పేజీలవైపు అతని అవధానాన్ని త్రిప్పవచ్చును. ఈ చిత్రాల ప్రక్కనే వ్రాయబడిన లేఖనాల్ని చదవడం మీ చర్చ బైబిలుపై ఆధారపడియున్నదని ఆ గృహస్థునకు హామియిచ్చును.
5 క్రైస్తవమత సామ్రాజ్య ప్రవర్తననుబట్టి అనేకమంది బైబిలును దేవుని వాక్యంగా అంగీకరించుటకు నిరాకరిస్తారు. యెహోవాసాక్షులు ఫలించే ఫలాలకు ఇతర మతాలు ఫలించే ఫలాలకు మధ్యనున్న భేదాన్ని చూపించుటకు “సత్యమైన మతమును గుర్తించుట” అనే 22వ అధ్యాయాన్ని ఈ సందర్భంలో సమర్థవంతంగా ఉపయోగించ వచ్చును.
6 మన ఇంగ్లీషు బైబిలునుండి మనమొక లేఖనాన్ని చదివితే, న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ లో ఉపయోగింపబడిన భాషా స్పష్టతను గూర్చి గృహస్థుడు వ్యాఖ్యానించవచ్చు. లేదా గృహస్థుడు మనం చెప్పిన వర్తమానమందు ఆసక్తి చూపించిననూ, అతనియొద్ద బైబిలు లేకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం ఉపయోగిస్తున్న బైబిలుకున్న ఉన్నతాంశాలను ఆలాగే దీన్ని ఇతరులకు మనం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామో దాని కారణాలను మనం వారికి వివరించవచ్చును. ఇతర సంగతులతోపాటు, బైబిలు వెనుకగల విషయసూచికను, “చర్చనీయ బైబిలు అంశములను” చూపించవచ్చును. గృహస్థునికి న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అందించే అవకాశాన్ని ఇది మనకు ఇవ్వవచ్చును, ఒకవేళ అది మనవద్ద లేకపోతే ఒక క్రొత్త ప్రతి తీసుకొని మరలా వస్తామని మనం చెప్పవచ్చును.
7 బైబిలుద్వారా యెహోవా మానవజాతితో తన వ్యవహారాలను వెల్లడించి, ఆ విధంగా తన అద్భుతమైన వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేశాడు. యెహోవాను గూర్చి, ఆయన వాక్యపు శక్తిని గూర్చి నేర్చుకొనుటకు ఇతరులకు సహాయపడుటలో మనము న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ మరియు నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని సమర్థవంతముగా ఉపయోగిద్దాము.—2 కొరిం. 10:4.