పత్రికలు ఉపయోగించి ఇతరులకు మేలు చేయండి
1 కావలికోట మరియు అవేక్! పత్రికల ఇటీవలి సంచికలను పొందుటకు మనమెంతగా సంతోషిస్తాము. వాటిలో అందజేయబడిన సమాచారం నుండి ప్రయోజనం పొందుటకు వీలైనంత త్వరగా వాటిని చదువుటకు మనకు లభించే అవకాశాన్ని బట్టి మనం సంతోషిస్తాము. మనకు వ్యక్తిగతంగా సహాయపడే సమాచారం కొరకు చూడటమేకాక, ఇతరులకు పత్రికలను అందజేసేటప్పుడు ఉపయోగించగల విషయాల కొరకు చూడటం మంచి ఆలోచనే. మన సంఘ క్షేత్రంలో వున్నవారికి ప్రత్యేకంగా తగినవిధంగా వుండేవిషయాలను మనం మార్క్ చేసుకోవచ్చు, లేదా స్థానికంగా శీర్షికను ఎలా అందజేయవచ్చు, మాట్లాడదగ్గ విషయాలను మనకు మనం గుర్తుచేసుకోవటానికి వీలుగా మన పత్రికలోని మార్జిన్లో వ్రాసుకోవచ్చు కూడా.
2 మన పత్రికలకు సహనశక్తివుంది. మనం ఇటీవలి పత్రికలను అందజేయుటకు మొదటగా ప్రయత్నించినప్పటికీ, పాతసంచికలలో వున్న సమాచారం పాతదైపోదు గనుక వాటిని పడవేయవలసిన అవసరం లేదు. సాక్ష్యమిచ్చునప్పుడు అందుబాటులో ఉండేవిధంగా పాతసంచికలను మీ సంచిలో వుంచుకోండి. గృహస్థుని ప్రత్యేక అవసరత తెలిసినప్పుడు ఇవి విశేషంగా ఉపయోగపడతాయి. పాత పత్రికను అందజేసేటప్పుడు, పత్రికల కొరకు మనం సేకరించే చందా గురించి చెప్పడం సబబుగానే వుంటుంది.