మన పత్రికల్ని బాగా ఉపయోగించండి
1 వార్తా పత్రికల్ని విక్రయించే ఓ స్థలాన్ని మీరు సమీపించినప్పుడు, మీరేమి చూస్తారు? పత్రికల్ని. వీధి మూలనున్న కొట్టులో మీ చూపును ఆకట్టుకొనేవి ఏమిటి? పత్రికలే. తపాల తీసుకువెళ్లే వ్యక్తి నడుం తపాల సంచుల బరువుతో వంగిపోయేలా చేసేవి ఏమిటి? పత్రికలు. అలాగే అనేకమంది ప్రజలు చదివేవి ఏమిటి? పత్రికలు. 10 నుండి 18 ఏళ్ల వయస్సు మధ్యనున్న ప్రతి 10మందిలో 9మంది చొప్పున అలాగే, అంతే శాతం పెద్దల్లోనూ ప్రతినెలా కనీసం ఓ పత్రికను చదువుతారని సర్వేలు తెలియజేశాయి. ప్రపంచం పత్రికా శ్రద్ధగలది.
2 యథార్థహృదయంగల వ్యక్తుల్ని కావలికోట మరియు తేజరిల్లు! ఎడల శ్రద్ధగల వారిగా మనం చేయగలమా? మనం కావలికోట మరియు తేజరిల్లు! ఎడల శ్రద్ధగలవారమైతే, అలా చేయగలం. మనకేది సహాయపడగలదు? ఈ సలహాలను పరిశీలించండి:
◼ పత్రికల్ని చదవండి: ఒక ప్రయాణ కాపరి, తన సర్క్యూట్‌లోని సగటున ప్రతి ముగ్గురు ప్రచారకుల్లో ఒకరు మాత్రమే కావలికోట, తేజరిల్లు!ల ప్రతి సంచికను ఈ చివర నుండి ఆ చివర వరకూ చదువుతున్నారని నివేదించాడు. మీరూ చదువుతారా? మీరు ప్రతి శీర్షికను చదువుతుండగా, ‘ఈ సమాచారాన్ని—ఓ తల్లి, ఓ అజ్ఞేయతావాది, ఓ వ్యాపారవేత్త, ఓ యౌవనస్థుడు—ఎవరు ప్రశంసిస్తారు?’ అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీ వ్యక్తిగత ప్రతిలో, పత్రికను అందించేటప్పుడు మీరు ఉపయోగించగల్గే ఒకటి లేక రెండు అంశాల్ని గుర్తు పెట్టుకోండి. తర్వాత ఒకటి లేక రెండు వాక్యాల్లో ఆ అంశంపై ఆసక్తిని మీరెలా రేకెత్తించవచ్చో ఆలోచించండి.
◼ కచ్చితమైన పత్రికా ఆర్డర్‌ని కల్గివుండండి: ప్రతి సంచికకు సంబంధించిన ప్రతుల యొక్క నిర్దిష్టమైన సంఖ్య కొరకు ఓ వాస్తవమైన ఆర్డరును పత్రికల్ని పర్యవేక్షించే సహోదరునికి ఇవ్వండి. ఈ విధంగా, మీరు మీ కుటుంబ సభ్యులు క్రమంగా, తగినన్ని ప్రతులను కల్గివుంటారు.
◼ ఓ క్రమమైన పత్రికా దినాన్ని ఏర్పాటు చేసుకోండి: అనేక సంఘాలు పత్రికా సాక్ష్యం కొరకు ప్రధానంగా ఉద్దేశింపబడిన దినాన్ని అట్టే పెట్టుకున్నాయి. సంఘ పత్రికా దినానికి మీరు మద్దతును ఇవ్వగలరా? అలాకానట్లైతే, పత్రికా వీధి సాక్ష్యం కొరకు, ఇంటింటి పనిలోనూ పత్రికా మార్గంలోనూ పత్రికల్ని వ్యక్తిగతంగా పంపిణీ చేయడం కొరకు కొంత సేవా సమయాన్ని అప్పుడప్పుడూ ఉపయోగించేందుకు ప్రయత్నించండి.
◼ “కావలికోట” మరియు “తేజరిల్లు!”ల ఎడల శ్రద్ధగలవారిగా ఉండండి: మీరు ప్రయాణిస్తున్నప్పుడు లేక షాపింగ్‌కి వెళ్లినప్పుడు పత్రికా ప్రతుల్ని తీసుకు వెళ్లండి. మీరు తోటి పనివారితోనూ పొరుగువారితోనూ పాఠశాలలోని తోటి విద్యార్థులతోనూ లేక ఉపాధ్యాయులతోనూ మాట్లాడినప్పుడు వాటిని ప్రతిపాదించండి. తరచూ ప్రయాణం చేసే ఓ దంపతులు, తమ ప్రక్కనే కూర్చొన్న ప్రయాణికునితో సంభాషణ ప్రారంభించడానికి తాజా పత్రికల్లోని ఓ విషయాన్ని ఉపయోగిస్తారు. వారు అనేక ఆహ్లాదభరితమైన అనుభవాల్ని పొందారు. కొంతమంది యౌవనస్థులు తమ ఉపాధ్యాయులకు లేక తోటి విద్యార్థులకు ఆసక్తికరమైన శీర్షికలని వారు భావించే వాటిని పాఠశాలకు క్రమంగా తీసుకెళ్తారు. మీ పొరుగునవున్న షాపులకు వెళ్లేటప్పుడు తక్కువ దూరమైనా మీతోపాటు పత్రికల్ని తీసుకెళ్లి, మీ వ్యవహారాన్ని ముగించిన తర్వాత వ్యాపారస్థులకు వాటిని ప్రతిపాదించండి. మనలో చాలామంది క్రమంగా పెట్రోలు పోయించుకుంటాం; పెట్రోలు బంకులో పనిచేసే వ్యక్తికి పత్రికల్ని ఎందుకు ప్రతిపాదించకూడదు? బంధువులు చూడ వచ్చినప్పుడు, ప్రజా రవాణా సౌకర్యాల్ని మీరు ఉపయోగించేటప్పుడు లేక మీరు ఒక అప్పాయింట్‌మెంటు కొరకు వేచివున్నప్పుడు వాటిని అందుబాటులో ఉంచుకోండి. ఇతర సముచితమైన సందర్భాల్ని మీరు ఆలోచించగలరా?
◼ క్లుప్తమైన పత్రికా అందింపును సిద్ధపడండి: కొంచెమే చెప్పడానికి ప్రణాళిక వేసుకోండి కాని దాన్ని చక్కగా చెప్పండి. ఉత్సాహంగా ఉండండి. హృదయాన్ని ఆకట్టుకోండి. స్పష్టంగా చెప్పండి. ఓ శీర్షిక నుండి ఒక అభిప్రాయాన్ని తీసుకొని, దాన్ని కొన్ని మాటల్లో వ్యక్తపర్చి, పత్రికల్ని ప్రతిపాదించండి. వాటిని అందించే శ్రేష్ఠమైన మార్గమేమిటంటే ఓ ఆసక్తికరమైన విషయంపై ప్రశ్నను రేకెత్తించి, తర్వాత లేఖనాధారమైన జవాబును ఇచ్చే ఓ శీర్షికను చూపించడమే. దీన్ని ఎలా చేయవచ్చో చూపించే కొన్ని ఉదాహరణలను పరిశీలించండి:
3 మీరు పెరుగుతున్న నేరస్థాయిపై ఓ శీర్షికను ఉన్నతపరుస్తున్నట్లైతే మీరిలా అడగవచ్చు:
◼ “మనం నేర భయం లేకుండా రాత్రివేళ నిద్రపోవడాన్ని మన కొరకు సాధ్యం చేసేందుకు కావల్సిందేమిటి?” విషయాలు కుదుటపడడాన్ని గూర్చి గృహస్థుడు నిరాశావాదియై ఉండవచ్చు. అనేకమంది ప్రజలు అదేవిధంగా భావిస్తారని మీరు ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు, అతనికి ఆసక్తికరమైనదౌతుందని మీరు విశ్వసిస్తున్న కొంత సమాచారాన్ని మీరు కల్గివున్నారని చెప్పండి. తర్వాత శీర్షికలోని సముచితమైన విషయాన్ని చూపించండి.
4 కుటుంబ జీవితమును గూర్చిన శీర్షికను అందించేటప్పుడు, మీరిలా చెప్పవచ్చు:
◼ “ఈ దినాల్లో జీవనోపాధి సంపాదించుకొని, కుటుంబాన్ని పోషించడం అనేది ఓ నిజమైన సవాలుగా ఉందని అనేకమంది ప్రజలు తెల్సుకుంటారు. ఈ విషయంపై అనేకమైన పుస్తకాలు వ్రాయబడ్డాయి, కాని మన సమస్యల పరిష్కారాలపై నిపుణులు కూడా ఏకీభవించడం లేదు. విశ్వసనీయమైన నడిపింపును పొందేందుకు మనం వెళ్లగలిగే చోటు ఏదైనా ఉందా?” తర్వాత పత్రికలోని ఒక ప్రత్యేకమైన వ్యాఖ్యానాన్ని సూచించండి.
5 ఓ సామాజిక సమస్యను గూర్చిన శీర్షికను చూపిస్తున్నప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “నేడు అనేకమంది ప్రజలు ఒత్తిడికి లోనౌతున్నారు. మనం ఇలా జీవించాలని దేవుడెన్నడూ ఉద్దేశించలేదు.” తర్వాత ఇప్పుడు జీవిత సమస్యల్ని ఎదుర్కోవడానికి, భవిష్యత్తులో ఓ శాశ్వతమైన పరిష్కారం కొరకు నిరీక్షణను అందించడానికి శీర్షికలోని సమాచారం మనకెలా సహాయపడగలదో చూపించండి.
6 వీధి సాక్ష్యం ప్రభావవంతమైనది: వ్యవహర్త [ఆంగ్లం] (మన రాజ్య పరిచర్య) జనవరి 1940 సంచికలో, పత్రికల్ని ఉపయోగిస్తూ వీధి సాక్ష్యం ఇవ్వడం కొరకు ఓ ప్రత్యేకమైన రోజును షెడ్యూల్ వేసుకోమని మొట్టమొదటిసారిగా ప్రచారకులు ప్రోత్సహించబడ్డారు. మీరు అప్పుడప్పుడు వీధి సాక్ష్యంలో భాగం వహిస్తారా? మీరలా చేస్తున్నట్లైతే, మీరు ఉపయోగించే పద్ధతి నిజంగా ప్రభావవంతమైనదేనా? అనేకమంది ప్రజలు దాటి వెళ్లిపోతున్నా గుర్తించకుండా కొంతమంది ప్రచారకులు రద్దీగావున్న వీధి మూల నిలబడి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం గమనించబడింది. పత్రికలు పట్టుకొని ప్రక్క ప్రక్కన నిలబడడం కన్నా, వేరుగావుండి ప్రజల్ని సమీపించడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఒక్క వ్యక్తే గనుక అపరిచితుల్ని సమీపిస్తే వారు ఆగి, క్లుప్తంగా వినవచ్చు, అయితే సంభాషణలో మునిగిపోయివున్న ఓ గుంపును సమీపించడానికి కొద్దిమంది బాటసారులే చొరవ తీసుకుంటారు. వీధిలో మనల్ని ఎంతోమంది గమనిస్తారు కాబట్టి దేవుని పరిచారకులకు తగినట్లు చక్కగా తలదువ్వుకోవడం మరియు నమ్రతను చూపించే వస్త్రాలను ధరించుకొనే ప్రత్యేక అవసరతవుంది.—1 తిమో. 2:9, 10.
7 ఇంటింటా పత్రికల్ని పంపిణీ చేయడం: పత్రికల్ని ప్రతిపాదించడానికి ఉన్న మార్గం వీధి సాక్ష్యం మాత్రమే కాదు, ఇంటింటి పరిచర్యలో కూడా వాటిని ప్రతిపాదించగలం, ప్రతిపాదించాలి. ప్రజల్ని వారి ఇళ్లల్లో సందర్శించినప్పుడు ఒకటో రెండో లేఖనాల్ని పంచుకోవడం ద్వారా, ఆ నెల కొరకు సూచించబడిన ప్రతిపాదనను అంటే అది పుస్తకమైనా, చిన్న పుస్తకమైనా లేక చందాయైనా ప్రతిపాదించడం ద్వారా మూడు నుండి ఎనిమిది నిమిషాల వరకు మాట్లాడడానికి మనం సాధారణంగా ప్రణాళిక వేసుకుంటాం. అయితే సంఘం ఓ పత్రికా దినాన్ని నియమించినప్పుడు, (అనేక సంఘాలు ప్రతి శనివారం చేస్తాయి,) పత్రికల్ని మాత్రమే ప్రతిపాదిస్తూ—మీరు వీధి పనిని మధ్యాహ్నాం చేయడానికి నిర్ణయించుకోవచ్చు కాని ఉదయకాలం ఇంటింటి పనిని చేయాలి. అలాంటి పత్రికా పనిలో, ఇంటింటా మనమిచ్చే అందింపు క్లుప్తంగా—కేవలం 30 నుండి 60 సెకన్లు మించకుండా—ఉండాలి, సాధారణంగా లేఖనాన్ని చూపించకుండా పత్రికల్ని ప్రతిపాదించవచ్చు. ఆసక్తి చూపిస్తే వ్రాసుకోవాలి, ఆసక్తిగల వ్యక్తుల్ని పునర్దర్శించాలి. లేక అదే ప్రాంతాన్ని మరో తేదీన ప్రచార సాహిత్యాల్ని ఉపయోగిస్తూ నిదానంగా పూర్తిచేయవచ్చు. అయితే త్వరితంగా చేసే పత్రికా పని యొక్క విలువను ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదు. నిజానికి, వీధి సాక్ష్యంతో పోల్చిచూస్తే, ఇంటింటా పత్రికల్ని ప్రతిపాదన చేయడం తరచూ ఈ క్రింది దానిని సులభంగా ప్రారంభించేలా చేస్తోంది:
8 పత్రికా మార్గాలు: పత్రికా క్రమాన్ని కల్గివున్న వారు, ప్రాంతాలు క్రమంగా పూర్తి చేయబడినా కూడా అనేక పత్రికల్ని అందిస్తారు. పత్రికా మార్గాలు సంభవనీయ గృహ బైబిలు పఠనాలకు ఓ శ్రేష్ఠమైన మూలాలు.
9 పత్రికల్ని బట్వాడా చేయడానికి మీరు క్రమంగా పునర్దర్శనాల్ని చేసినప్పుడు, మీకు గృహస్థునికి మధ్య ఆదరణ, స్నేహశీలత పెరుగుతాయని మీరు కనుగొంటారు. మీరు వారికి పరిచయమయ్యేకొద్దీ లేఖనాధారిత విషయాల్ని గురించి సంభాషించడం సులభం అవుతుంది. ఇది ఓ ప్రతిఫలదాయకమైన గృహ బైబిలు పఠనం ఆరంభించేందుకు నడిపించగలదు. పునర్దర్శనాల్లో పత్రికల ఎడల స్పష్టమైన ప్రశంస వ్యక్తమైన చోట చందాను ప్రతిపాదించండి. మీరు గృహస్థుని కల్సిన ప్రతిసారీ ఓ పునర్దర్శనంగా రిపోర్టు చేసుకోవచ్చని జ్ఞాపకముంచుకోండి.
10 ఎప్పుడూ పత్రికల్ని తీసుకున్నా, “మీరు నాతో చెబుతున్న వాటిని నేను విశ్వసించను,” అని చెప్పిన ఓ స్త్రీకి ఒక సహోదరి పత్రికల్ని, క్రమంగా తీసుకొని వెళ్లేది. తరువాత ఓ సందర్శనంలో, భర్త ఇంటిలో ఉండడాన్ని ఆ సహోదరి చూసింది. స్నేహపూర్వకంగా మాట్లాడిన తర్వాత, గృహ బైబిలు పఠనాన్ని ఆరంభించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. పఠనంలో చేరడానికి వచ్చిన ముగ్గురు కుమారులతో ఆ సహోదరి స్నేహం చేసుకుంది. చివరకు, తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు యెహోవాకు తమ జీవితాల్ని సమర్పించుకొని, బాప్తిస్మం పొందారు. ఇప్పటివరకూ, ఆ కుటుంబంలో 35 మంది సభ్యులు సత్యాన్ని అంగీకరించారు. ఇదంతా తన పత్రికా మార్గంలో ఆ సహోదరి పునర్దర్శనం చేసినందుననే!
11 పత్రికా మార్గాన్ని ప్రారంభించడానికి అనేక మార్గాలున్నాయి. మీ అందింపుల్ని గూర్చిన రికార్డును కేవలం భద్రపర్చుకొని, తాజా సంచికలతో ప్రతి రెండు వారాలకు తిరిగివెళ్లే ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా ఓ పత్రికా మార్గాన్ని మీరు ప్రారంభించవచ్చు. “మా తదుపరి సంచికలో” అనే పతాక శీర్షిక క్రిందనున్న సమాచారాన్ని ఉపయోగించడం ఒక మార్గం. మీరు పునర్దర్శించినప్పుడు, మునుపు మీరు ప్రస్తావించిన శీర్షిక మీ దగ్గర ఉందని గృహస్థునికి చెప్పండి. లేక, పునర్దర్శనం చేసేటప్పుడు, మీరిలా చెప్పవచ్చు: “నేను ఈ శీర్షికను చదివినప్పుడు, ఇది . . . మీకు ఆసక్తిని కల్గించవచ్చని నేను అనుకున్నాను.” తర్వాత ఆ శీర్షికపై కొన్ని క్లుప్తమైన వ్యాఖ్యానాలుచేసి, దానిని ప్రతిపాదించండి. మీరు పునర్దర్శనాన్ని ముగించేటప్పుడు, ఐదు సరళమైన విషయాల్ని మీ ఇంటింటి సేవా రికార్డుపై వ్రాసుకోండి: (1) గృహస్థుని పేరు, (2) గృహస్థుని చిరునామా, (3) సందర్శనా తేదీ, (4) అందించిన సంచికలు మరియు (5) ఉన్నతపర్చబడిన శీర్షిక. కొంతమంది ప్రచారకులు, తమ లిస్టులో 40 లేక అంతకన్నా ఎక్కువ పునర్దర్శనాల్ని సమకూర్చుకోవడం ద్వారా పత్రికా మార్గాల్ని పెంపొందించుకోవడంలో ఎంతో సాఫల్యాన్ని పొందారు!
12 వ్యాపార ప్రాంతం: వ్యాపార ప్రాంతంలో పని చేసిన ప్రచారకులచే అనేక పత్రికలు అందించబడ్డాయి. అంగడంగడి పని మీరు చేసి చూశారా? కొన్ని సంఘాల్లో ఈ సేవలో భాగం వహించడం మరీ పరిమితమై ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. మొదట్లో, వ్యాపార ప్రాంతంలో ప్రజల్ని సందర్శించడానికి కొంతమంది జంకినా వారు కొన్ని సార్లు ప్రయత్నించిన తర్వాత అది ఆసక్తికరంగానూ ప్రతిఫలదాయకంగానూ ఉందని వారు కనుగొన్నారు. మీరు ప్రారంభించడానికి సహాయపడేందుకు ఓ అనుభవజ్ఞుడైన ప్రచారకుడినో లేక పయినీరునో ఎందుకు అడగకూడదు?
13 అంగడంగడి పనిచేయడంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కనీసం వ్యాపార వేళల్లో ఇంటి-వద్ద-లేని వారు కొద్దిమందే ఉంటారు! వ్యాపారస్థులు, దుకాణదారులు తమకు విశేషంగా ఆసక్తిలేకపోయినప్పటికీ కూడా సాధారణంగా మర్యాదగా ప్రవర్తిస్తారు. ఉదయాన్నే త్వరగా ప్రారంభించండి; మీరు బహుశా సాదరంగా ఆహ్వానింపబడవచ్చు. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్న తర్వాత, వ్యాపారస్థుల్ని ఇంటి దగ్గర కనుగొనడం అరుదని, కాబట్టి కావలికోట మరియు తేజరిల్లు!ల తాజా సంచికల్ని వారు పనిచేసే చోట ప్రతిపాదించేందుకు కేవలం కొద్ది క్షణాల నిమిత్తం వారిని మీరు సందర్శిస్తున్నారని చెప్పవచ్చు. వారు ప్రపంచ సంఘటనలను ఎప్పటికప్పుడు తెల్సుకోవాల్సిన అవసరతవున్నా చదవడానికి సమయంలేనందున అనేకమంది వ్యాపారస్థులు మన పత్రికల్ని ప్రశంసిస్తున్నారని సూచించండి. మత, రాజకీయ లేక వాణిజ్య పక్షపాతం లేకుండా ఓ తాజా దృక్కోణం నుంచి ఈ పత్రికలు ఆలోచనను రేకెత్తించే సమాచారాన్ని అందిస్తాయి. వ్యాపార ప్రాంతంలో కనుగొనబడిన ఆసక్తిగల వ్యక్తులతో పత్రికా మార్గాన్ని పెంపొందింప చేయవచ్చు.
14 కుటుంబ సమేతంగా సిద్ధపడండి: మీ ప్రాంతంలో ఉపయోగించడానికి తాజా పత్రికల్లోని ఏ శీర్షికలు చర్చించేందుకు తగినవిగా ఉంటాయో మీ కుటుంబ పఠనం చేసుకొనే సమయంలో కొంత సమయాన్ని కేటాయించవచ్చు. పిల్లలతోపాటు కుటుంబ సభ్యులు తమ తమ అందింపులను అభ్యసించడంలోనూ “నేను బిజీగా ఉన్నాను,” “మాకు మా స్వంత మతంవుంది,” లేక “నాకు ఆసక్తిలేదు,” అనేటటువంటి తలెత్తే సాధారణ ఆటంకాలను అధిగమించడంలోనూ వంతులను తీసుకోవచ్చు. కుటుంబమంతా పత్రికా పంపిణీలో ఓ క్రమమైన భాగం కల్గివుండడాన్ని, మంచి సహకారం సాధ్యం చేయగలదు.
15 పుస్తక పఠన నిర్వాహకులు తోడ్పడగలరు: సాధ్యమైతే, సంఘమంతా రాజ్య మందిరంలో కూడుకోవడానికి బదులు, పుస్తక పఠనాలు జరిగే చోట లేక ప్రాంతానికి సమీపంలోవున్న ఓ ప్రచారకుని ఇంటిలో పత్రికా దినాన ప్రాంతీయ సేవా కూటాల్ని షెడ్యూల్ వేయాలి. ప్రాంతీయ సేవా కూటాలకు బాధ్యత వహించే వారు గుంపు కొరకు ప్రత్యేకమైన సలహాలతో బాగా సిద్ధపడి ఉండాలి. వీటిలో ఒక నమూనా ప్రదర్శన మరియు తాజా సంచికల్లో నుండి స్థానికంగా ఆసక్తిని రేకెత్తించేందుకు ఉపయోగపడే ఒకటి లేక రెండు విషయాల్ని చేర్చవచ్చు. గుంపును సంస్థీకరించడంతో పాటు ప్రాంతీయ సేవ కొరకైన కూటాలు 10 నుండి 15 నిమిషాలకు మించకుండా క్లుప్తంగా ఉండాలి. ప్రాంతీయ సేవ చేసే సమయమంతటిలో గుంపు బిజీగా ఉండేందుకు సరిపడినంత ప్రాంతం ఉండేలా పుస్తక పఠన నిర్వాహకులు చూడాలి.
16 పత్రికల ఎడల ప్రశంసను చూపండి: మన రాజ్య పరిచర్య జూలై 1993 సంచికలో ప్రచురించబడిన “కావలికోట మరియు అవేక్!లను సరిగా ఉపయోగించుట” అనే శీర్షిక ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని సూచించింది: “కావలికోట మరియు అవేక్!లు వాటి ప్రచురణ తేదీనుండి ఒకటి లేక రెండు నెలల్లో అందజేయబడక పోయినప్పటికీ వాటి విలువ తగ్గిపోదని గుర్తుంచుకోండి. సమయం గడవడంతో వాటిలోని సమాచారం యొక్క ప్రాముఖ్యత తక్కువకాదు, . . . పాత పత్రికలన్నీ పేరుకుపోయేలా చేసి వాటిని ఎప్పటికీ ఉపయోగించకపోతే ఆ విలువైన పరికరాల ఎడల మెప్పులేనట్లే అవుతుంది. . . . పాత సంచికలను ప్రక్కన పెట్టి వాటి గురించి మరచి పోవటానికి బదులు, ఆసక్తిగల వారికి వాటిని అందజేయుటకు ప్రత్యేక ప్రయత్నం చేయడం . . . మంచిది కాదా?”
17 సత్యాన్ని గురించి అన్వేషిస్తున్న యథార్థహృదయంగల వ్యక్తులు నేడు అనేకమంది ఉన్నారు. ఒక పత్రికలో ఉన్న సమాచారమే వారిని సత్యంలోకి నడిపించడానికి సరిగ్గా అవసరమైనదై ఉండవచ్చు! ప్రకటించేందుకు ఓ పులకరింపజేసే వర్తమానాన్ని మనకు యెహోవా అనుగ్రహించాడు, ఆ వర్తమానాన్ని ఇతరులకు అందజేయడంలో ఓ ప్రముఖమైన పాత్రను మన పత్రికలు నిర్వహిస్తున్నాయి. పత్రికలను అందించడం విషయంలో భవిష్యత్తునందు మీరు మరింత శ్రద్ధగలవారై ఉంటారా? ఈ వారాంతంలోనే ఈ సలహాల్లో కొన్నింటిని మీరు అన్వయించుకుంటారా? మీరలా చేస్తే మీరు అధికంగా ఆశీర్వదించబడ్తారు.
అభ్యాససిద్ధమైన సలహాలు:
◼ పత్రికను ముందుగా చదివి, శీర్షికలతో పరిచయం కల్గివుండండి.
◼ మీ ప్రాంతంలోని జనాసక్తికరమైన ఏదైనా ఒక విషయంతో వ్యవహరిస్తున్న శీర్షికనొక దానిని ఎంపిక చేసుకోండి.
◼ పురుషులైనా, స్త్రీలైనా లేక యౌవనులైనా విభిన్నమైన ప్రజలకు సరిపడే ఓ అందింపును సిద్ధపడండి. పత్రిక గృహస్థునికి ఎలా సంబంధించిందో, దానిని కుటుంబమంతా ఎలా ఆనందించవచ్చో చూపించండి.
◼ ఎక్కువ మంది ప్రజలు ఇంటివద్ద ఉన్నప్పుడు మీ ప్రాంతీయ సేవా కార్యక్రమంలో భాగం వహించడానికి ప్రణాళిక వేసుకోండి. పత్రికలతో సాయంకాల సాక్ష్యం కొరకైన ఏర్పాట్లను కొన్ని సంఘాలు చేస్తాయి.
◼ మీ అందింపు క్లుప్తంగానూ సూటిగానూ ఉండేలా చూసుకోండి.
◼ మరీ వేగంగా మాట్లాడకండి. మీరు చెప్పేది వింటున్న వ్యక్తికి ఆసక్తిగా లేకపోతే, వేగంగా మాట్లాడడం ఏమీ సహాయపడదు. రిలాక్స్‌గా ఉండడానికి ప్రయత్నించండి, గృహస్థుడు ప్రత్యుత్తరం ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి.
ఇంటింటా పత్రికల్ని ప్రతిపాదించడం:
◼ స్నేహపూర్వకమైన చిరునవ్వును, మార్దవంతో కూడిన స్వరాన్ని కల్గివుండండి.
◼ పత్రికల ఎడల ఆసక్తి కల్గివుండండి.
◼ నెమ్మదిగానూ స్పష్టంగానూ మాట్లాడండి.
◼ ఒకే ఒక అంశంపై మాట్లాడండి; ఆసక్తిని క్లుప్తంగా ప్రేరేపించి, గృహస్థునికి దాని విలువను చూపించండి.
◼ ఒక్క శీర్షికనే ఉన్నతపర్చండి.
◼ ఒక్క పత్రికను మాత్రమే చూపి, మరొక దానిని తోటి పత్రికగా ప్రతిపాదన చేయండి.
◼ పత్రికల్ని గృహస్థుని చేతికి ఇవ్వండి.
◼ మీరు తిరిగి రావడానికి ప్రణాళిక వేసుకున్నారని గృహస్థునికి తెలియజేయండి.
◼ పత్రికల్ని తిరస్కరిస్తే స్నేహపూర్వకంగానూ అనుకూల దృక్పథంతోనూ ముగించండి.
◼ ఆసక్తిగలవారందరిని గూర్చి, అందింపుల్ని గూర్చి ఇంటింటి సేవ రికార్డులో వ్రాసుకోండి.
పత్రికల్ని అందించడానికి అవకాశాలు:
◼ ఇంటింటి సాక్ష్యం
◼ వీధి సాక్ష్యం
◼ అంగడంగడి సాక్ష్యం
◼ పత్రికా మార్గం
◼ సాయంత్ర సాక్ష్యం
◼ పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు
◼ మునుపటి బైబిలు విద్యార్థుల్ని సందర్శించినప్పుడు
◼ ప్రయాణం చేస్తున్నప్పుడు, షాపింగ్ చేస్తున్నప్పుడు
◼ బంధువులు, తోటిపనివారు, పొరుగువారు, పాఠశాలలోని తోటివిద్యార్థులతో, ఉపాధ్యాయులతో మాట్లాడ్తున్నప్పుడు
◼ ప్రజా రవాణా సౌకర్యాల్లోనూ వేచివుండు గదుల్లోను