అక్టోబరు కొరకైన సేవా కూటములు
అక్టోబరు 4తో ప్రారంభమయ్యే వారం
పాట 225 (21)
10 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్యనుండి ఎన్నుకోబడిన ప్రకటనలు. మీ ప్రాంతంలో క్రొత్త సంచికలను ఉపయోగించే పద్ధతులను పేర్కొనండి. పత్రికా మార్గాలను ప్రారంభించే ఉద్దేశంతో, పత్రికలిచ్చిన ప్రతివారిని తిరిగి సందర్శించవలసిన ప్రాముఖ్యతను తెల్పండి. యింటివారు యథార్థమైన ఆసక్తిని కనపరచినప్పుడు, చందాను అందించవచ్చు.
15 నిమి: జూన్ 15, 1993 కావలికోటలో “మీ ఆరాధనా స్థలాన్ని మీరు గౌరవిస్తారా?” అనే శీర్షికపై ఒక పెద్ద ప్రసంగించును. సమాచారాన్ని స్థానిక పరిస్థితులకు అన్వయించండి. ఒక విశేష సమస్య ఉన్నట్లైతే, చాతుర్యంతో సరైన సలహాను అందించండి.
20 నిమి: అక్టోబరు మాసంలో మీ యింటింటి పరిచర్యను విస్తృతపర్చండి. సేవాధ్యక్షుడు లేక మరో అర్హతగల సహోదరుడు, యింటింటి పరిచర్య ప్రాముఖ్యతను గూర్చి ప్రేక్షకులతో చర్చిస్తాడు. అక్టోబరులో అందించబోవు వివిధ సాహిత్యాలు, ఏన్నో రకాలుగా మాట్లాడడానికి సహాయపడతాయి. వీటిని ప్రదర్శించండి: (1) తేజరిల్లు! లేదా కావలికోటల క్రొత్త సంచికల్లోని ఒక శీర్షికలోనికి నడిపే సంభాషణను ప్రచారకుడు మొదలుపెడతాడు. ఇంటివారు కనుపర్చిన ఆసక్తినిబట్టి, ప్రచారకుడు క్రొత్త సంచికలను లేదా కరపత్రాన్ని అతనికి అందించవచ్చు. (2) ప్రచారకుడు మ్యాన్‌కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్ పుస్తకాన్ని చూపించే ఉద్దేశంతో సంభాషణను ప్రారంభిస్తాడు. పరిస్థితులకనుగుణంగా ఒక పుస్తకాన్నో లేక రెండు పత్రికలనో అందించడానికి ప్రచారకుడు నిర్ణయించవచ్చు. (3) తటస్థసాక్ష్యాన్ని ప్రారంభించడానికి ప్రచారకుడు ఒక కరపత్రాన్ని ఉపయోగిస్తాడు, తర్వాత ఆసక్తిగల ఆ వ్యక్తికి క్రొత్త సంచికలను అందిస్తాడు. (4) పత్రికా మార్గాన్ని కల్గివున్న ఒక ప్రచారకుడు, చందాను అందించడానికి నిర్ణయించుకుంటాడు. అక్టోబరు నెలలో తమ యింటింటి పరిచర్యను విస్తృతపర్చుకోడానికి ఇలాంటి పద్ధతులు ప్రచారకులందరినీ ప్రోత్సహించాలి. సంఘంలోనున్న కొందరు ఈ నెలలో సహాయ పయినీర్లుగా చేస్తున్నారనడంలో సందేహంలేదు. చేయగల్గే స్థితిలోనున్న వారు పయినీర్లుగా చేరడానికి సమయం మించిపోలేదు.
పాట 42 (18), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 11తో ప్రారంభమయ్యే వారం
పాట 4 (19)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. చందా ముట్టినట్లు తెల్పిన వివరాలను చదవండి, ప్రపంచవ్యాప్తంగా జరిగే పనికి, ఆలాగే స్థానిక సంఘ అవసరతలకు తమ ఉదాత్త సహకారానికై వారిని మెచ్చుకోండి. వారమునందలి ప్రాంతీయ సేవా ఏర్పాట్లను పునఃసమీక్షించండి, అంతేగాక ప్రచారకుల ఉత్సాహవంతమైన మద్దతును మెచ్చుకోండి.
15 నిమి: “ఇంటింటి పరిచర్యలో మన పత్రికలను ఉపయోగించుట.” ప్రేక్షకులతో చర్చ. ప్రాంతీయ సేవలోనూ తటస్థసాక్ష్యమందు మనం కలిసే ప్రజలకు ఉత్సాహంగా పత్రికలందించటానికి మంచి కారణాలున్నాయి. పత్రికలపై తేదీ వేయబడినను, పత్రికా దినంలో క్రొత్త సంచికలను అందించవలసియున్నను, పాత పత్రికలను అందించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు మనం సందేహించనవసరం లేదు. అయితే, మీరందించే పత్రికలు శుభ్రంగా పాడుకాకుండ వుండేట్లు చూసుకోండి. ఒక అర్హతగల ప్రచారకునిచేత నాల్గవ పేరాలో సూచించబడిన ప్రదర్శనను చేయించండి.
20 నిమి: “మీ పిల్లలు ప్రచారకులా?” ఈ శీర్షికను ప్రశ్నా సమాధాన రూపంలో నిర్వహించాలి. సమయం అనుమతిస్తే పేరాలను, సూచించబడిన లేఖనాలను చదవండి. తలిదండ్రులు తమ పిల్లలకు ఎలా శిక్షణను యిస్తున్నారో క్లుప్తంగా వ్యాఖ్యానించడానికి సమయాన్నివ్వండి.
పాట 157 (73), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 18తో ప్రారంభమయ్యే వారం
పాట 65 (36)
5 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు.
15 నిమి: “మన పరిచర్యలో నిష్పక్షపాతాన్ని ప్రదర్శించండి.” ప్రశ్నా సమాధానాలు. ముఖ్యంగా మీ ప్రాంతానికి సంబంధించిన అంశాలను ఈ శీర్షికనుండి ఉన్నత పర్చండి.
15 నిమి: “ఆసక్తిగల వారియెడల శ్రద్ధకనపర్చండి.” ప్రేక్షకులకు కొన్ని ప్రశ్నలు వేసి చేసే ప్రసంగం. తమ ప్రాంతంలో ప్రచారకులు ఎలా ఆసక్తికల్గించారో ప్రదర్శించండి లేదా తేజరిల్లు! కావలికోట పత్రికలను తీసుకున్నవారిని తిరిగి దర్శించే విలువను చూపే యిటీవలి అనుభవాన్ని ఒక ప్రచారకుడు వివరించనీయండి.
10 నిమి: స్థానిక అవసరతలు లేక జూలై 1, 1993 కావలికోట సంచికలోని “తొలి క్రైస్తవులు, లోకము” అనే మొదటి శీర్షికపై ఆధారపడిన ఉత్తేజకరమైన ప్రసంగం. మొదటి శతాబ్ద క్రైస్తవుల మాదిరిని ఈనాడు మనము కూడ అనుసరించవలసిన అవసరతను నొక్కి తెల్పండి.
పాట 60 (40), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 25తో ప్రారంభమయ్యే వారం
పాట 75 (22)
10 నిమి: స్థానిక ప్రకటనలు. వారములోని ప్రాంతీయ సేవా ఏర్పాట్లను గూర్చి కూడా చెప్పండి, అంతేకాకుండా రానున్న దినాల్లో ప్రాంతీయ సేవయందు ప్రచారుకులు ఉపయోగించదగు క్రొత్త ప్రతులలోని విషయాలవైపుకు వారి అవధానాన్ని మరల్చండి. సమయమనుమతిస్తే, మీ ప్రాంతానికి తగిన రెండు లేక మూడు అందింపులను ప్రదర్శించండి. ఆసక్తిని కనుపర్చిన వారందరిని పునర్దర్శించే అవసరతను గుర్తు చేయండి.
15 నిమి: బి ప్రిపేర్డ్ టు కమ్‌ఫోర్ట్ మోర్నింగ్ వన్స్ (రీజనింగ్ పుస్తకంలోని 102-4వ పేజీలపై ఆధారపడివుంది). (3 నిమి.) మరణానికి సంబంధించిన అన్ని ఆచారాలనూ యెహోవాసాక్షులు తృణీకరించరని ఈ భాగాన్ని నిర్వహించే సహోదరుడు చూపిస్తాడు. (5 నిమి.) మృతులను గూర్చి ప్రలాపించునప్పటి కొన్ని పారంపర్యాచారాలను యెహోవాసాక్షులు ఎందుకు విసర్జిస్తారో ఒక యెహోవాసాక్షి తన సహోద్యోగితో, రీజనింగ్ పుస్తకం, 102-3 పేజీలను ఆధారంచేసుకుని చర్చిస్తాడు. (7 నిమి.) పేజీలు 103-4లో “ఇఫ్ సమ్‌వన్ సేస్—” అన్న అంశం క్రిందవున్న భాగాన్ని ప్రేక్షకులతో చర్చించండి.
20 నిమి: “గృహ బైబిలు పఠనాన్ని నిర్వహించుట.” ప్రశ్నాసమాధాన రూపంలో శీర్షికను నిర్వహించండి. పరిశీలించబడే పేరాలోని సమాచారానికి సూచించబడిన లేఖనాలు ఎలాంటి ఆధారాన్ని అందిస్తున్నాయో చూపే, మంచి సిద్ధపాటుతో కూడిన ఒక ప్రదర్శనను ఏర్పాటు చేయండి. అదే ప్రదర్శనలో, విద్యార్థి సత్యాన్ని తన స్వంతం చేసుకోడానికి సహాయపడేందుకు ప్రచారకుడు ఉప ప్రశ్నలు వేస్తాడు. యునైటెడ్ ఇన్ వర్షిప్ లేక నిరంతము జీవించగలరు పుస్తకంనుండి ఎన్నుకోబడిన భాగాన్ని ఉపయోగించండి.
పాట 78 (29), ముగింపు ప్రార్థన.