మన పరిచర్యలో నిష్పక్షపాతాన్ని ప్రదర్శించడం
1 “దేవుడు పక్షపాతి కాడు” అని పేతురు పేర్కొన్నాడు, అయితే “ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొ. 10:34, 35) స్పష్టంగా పేర్కొనబడిన ఆ సత్యానికి తగినట్లుగా ఈనాడు మన పరిచర్య కొనసాగుతోంది. కాబట్టి, ప్రతి ఒక్కరికి సువార్త అందజేయటంలో మనలను అడ్డగించే దేనినైనా మనం ఎదుర్కొనే ప్రతి ప్రయత్నాన్ని చేయడం ప్రాముఖ్యం.
2 కొన్ని ప్రాంతాల్లో మనం యింటింటి పరిచర్య చేసేటప్పుడు, మన సంఘంలో మాట్లాడే భాషను మాట్లాడలేని లేక అర్థం చేసుకోలేని ప్రజలను కలవడం క్రొత్తేమీ కాదు. మనం ప్రకటించే రాజ్య వర్తమాన ప్రయోజనాన్ని పూర్తిగా పొందడాన్ని భాష కొందరిని అడ్డగిస్తోంది. వీరిలో సంజ్ఞ భాషలో సంభాషించే చెవిటివారు వున్నారు. ఇలాంటి ప్రజలకు సువార్తను ప్రభావవంతంగా అందించడంలో ఎదురయ్యే యీ భాషా అడ్డంకును మనం ఎలా అధిగమించగలం?
3 సొసైటి, 1991లో విదేశీ భాషా ఫాలోఅప్ స్లిప్, S-70a పత్రాన్ని అమెరికాలోని అన్ని సంఘాలకు పంపింది. తాము నివసించే ప్రాంతమందలి సంఘాల్లో సంజ్ఞ భాషను ఉపయోగించేవారితో సహా, ఆ సంఘానికి చెందిన భాషను మాట్లాడనివారికి రాజ్య వర్తమానం తమకు చెందిన భాషలోనే పొందే అవకాశం వుందని వారికి హామీ యివ్వడమే ఈ స్లిప్ ఉద్దేశం.
4 మీరు మీ ప్రాంతంలో చెవిటివారిని గాని లేక సంఘంలో మాట్లాడే భాషను అర్థం చేసుకోలేనివారిని కలిస్తే, ఈ స్లిప్పుల్లో ఒక దానిని స్పష్టంగా పూరించండి. ఆ వ్యక్తి సత్యం యెడల ఆసక్తిని కనపర్చకపోయినా మీరు దాన్ని పూరించాలి. ఆ వ్యక్తి పేరు అన్ని సమయాల్లోనూ దొరుకకపోవచ్చు, అయితే మీరు అతని చిరునామాను, మాట్లాడే భాషను వ్రాయాలి. సేవా రిపోర్టులు వేసే పెట్టెలో ఈ స్లిప్‌ను వేయవచ్చు. సెక్రెటరి (కార్యదర్శి) ఈ స్లిప్పులను సమకూర్చి, వాటి ప్రామాణికత, స్పష్టతలను పరిశీలించి, ఆ భాషను మాట్లాడే వారికి సహాయపడే గుంపునకో లేక దగ్గిర్లోనున్న సంఘానికో వాటిని పంపుతాడు.
5 కొన్ని సందర్భాల్లో యిది అవసరం కాకపోవచ్చు. ఉదాహరణకు, అమెరికాలోని అనేక స్పానిష్ భాషా సంఘాలకు తమ ప్రాంతంలో స్పానిష్ భాష మాట్లాడే ప్రజలు ఎక్కడ జీవిస్తున్నారో తెలుసు. మరో వైపు, ఒక భాషను మాట్లాడే ప్రజలు, వేర్వేరు ప్రాంతాల్లో జీవిస్తుండవచ్చు. అలాంటి భాషను మాట్లాడే సంఘం లేక గుంపు ఎంతో ప్రాంతాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది మరి వారు తమ సహాయాన్ని అందించడానికి అటువంటి ప్రజలను కనుగొనడానికి చేసే సహాయాన్ని వారు గుణగ్రహిస్తారు.
6 ఆ ప్రాంతంలో అవసరమైన భాషలో సాక్ష్యమివ్వడానికి ఒక సంఘం గానీ లేక ఒక గుంపు గానీ లేకపోతే, స్థానిక సంఘంలో ఆ భాష తెలిసిన వారితో సంభాషించగల ప్రచారకుడు ఉండవచ్చు. సిటీ ఓవర్సీయర్ను సంప్రదించిన తర్వాత కూడ ఆ భాష వచ్చిన వారెవరూ లేకపోతే, సాక్ష్యం యివ్వడానికి స్థానిక సహోదరులు తమకు చేతనైనదంతా చేయాలి. భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! అనే బ్రోషూరు, యిటువంటి సందర్భాల్లో ఎంతో సహాయకరంగా ఉంటుందని నిరూపించబడింది.
7 అవసరమైనప్పుడల్లా ఫాలోఅప్ స్లిప్పులను ఉపయోగించడానికి ప్రతి ప్రచారకుడూ సంసిద్ధంగా వుండాలి. సంఘంలో S-70a ప్రతులు లేకపోతే, ఒక చిన్న కాగితంపై ఆ సమాచారాన్ని వ్రాసి, పైన వర్ణించిన విధంగా పంపించవచ్చు. ప్రజల భాష ఏదైనప్పటికీ ప్రతివారికి సువార్తనందించే యథార్థ ప్రయత్నం చేయడం ద్వారా, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్న” దేవుడైన యెహోవాను మనం పోలివుంటాము.—1 తిమో. 2:4.