కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/09 పేజీలు 3-4
  • వేరే భాష మాట్లాడేవారికి ఎలా సహాయంచేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వేరే భాష మాట్లాడేవారికి ఎలా సహాయంచేయాలి?
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • గృహస్థులు మరో భాష మాట్లాడేవారైతే ఏమి చేయాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • మన పరిచర్యలో నిష్పక్షపాతాన్ని ప్రదర్శించడం
    మన రాజ్య పరిచర్య—1993
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—వేరే భాష మాట్లాడేవాళ్లకు సాక్ష్యమివ్వండి
    మన రాజ్య పరిచర్య—2015
  • మంచివార్త ప్రకటించే పద్ధతులు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 11/09 పేజీలు 3-4

వేరే భాష మాట్లాడేవారికి ఎలా సహాయంచేయాలి?

1. మన క్షేత్రంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఎవర్ని కూడా కలిసే అవకాశం ఉంది?

1 మనం ముఖ్యంగా మన సంఘంలో మాట్లాడే భాషవారికి ప్రకటించడానికి చూస్తాం. అయినప్పటికి యెహోవాలాగే మన క్షేత్రంలో ఉన్న ప్రతీఒక్కరి పట్ల నిష్పక్షపాతంగా ప్రేమ చూపించాలంటే, వేరే భాష మాట్లాడేవాళ్లకు కూడా దేవుని రాజ్య సందేశాన్ని ప్రకటించడానికి ప్రయత్నించాలి. (కీర్త. 83:18; అపొ. 10:34, 35) అలాంటి వారికి మనం ఎలా సహాయం చేయవచ్చు?

2. మన దగ్గర ఏ చిన్నపుస్తకం ఉంది, దాన్ని ఉపయోగించడానికి మనం ఎలా సిద్ధపడవచ్చు?

2 అన్ని దేశాల ప్రజలకు సువార్త ఉపయోగించండి: ఈ చిన్నపుస్తకాన్ని ఎప్పుడూ దగ్గర ఉంచుకోండి, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. మీ క్షేత్రంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో ప్రచురణలు అందుబాటులో ఉంటే కొన్నింటిని మీ దగ్గరుంచుకుని ఈ చిన్న పుస్తకంలోని సందేశాన్ని వాళ్లు చదివిన తర్వాత ఇవ్వవచ్చు. మళ్లీ ఎప్పుడు కలుస్తారో ఖచ్చితంగా చెప్పండి.

3. వేరే భాష వారెవరైనా ఆసక్తి చూపిస్తే మనమేమి చేయాలి?

3 తిరిగి కలవడానికి ఏర్పాటు చేయండి: అవతలి వారికి దేవుని గురించి, బైబిలు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని నిర్థారించుకున్న తర్వాత ప్లీజ్‌ ఫాలో అప్‌ (S-43) ఫారంను నింపి సంఘ కార్యదర్శికి ఇస్తే, ఆయన దాన్ని బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి భాష తెలిసిన వారు ఆయనను కలిసే ఏర్పాటు చేయబడుతుంది. సంఘ కార్యదర్శి ఆ ఫారం కాపీని సేవా పైవిచారణకర్తకు ఇవ్వవచ్చు. దానివల్ల ఆ భాష మాట్లాడే వారిలో ఆసక్తి ఎంతవరకు ఉందో ఆయనకు అవగాహన ఉంటుంది. ఆ భాష తెలిసిన ప్రచారకుడు వచ్చి ఆ వ్యక్తిని కలిసేంతవరకు, S-43 ఫారంను ఇచ్చిన ప్రచారకుడు ఆ వ్యక్తికున్న ఆసక్తిని పెంచడానికి ఆయనను కలుస్తుండవచ్చు. కొన్నిసార్లు, ఆసక్తి చూపించిన వారితో బైబిలు అధ్యయనం కూడా మొదలుపెట్టవచ్చు.

4. పరిచర్యలో మనం కలిసే వేరే భాష వారికోసం ప్రచురణలు ఎలా సంపాదించవచ్చు?

4 వేరే భాషా ప్రచురణలు: సంఘం వేరే భాషా ప్రచురణలు ఎక్కువగా ఉంచుకోకూడదు. అయితే సేవా పైవిచారణకర్త, ఏదైనా భాష మాట్లాడేవారిలో ఎక్కువమందికి ఆసక్తి ఉందని గమనిస్తే, ఆ భాషలో కొన్ని ప్రచురణలు సంఘానికి అందుబాటులో పెట్టవచ్చు. అలాగే ఇంటర్నెట్‌లో www.watchtower.org వెబ్‌సైట్‌ నుండి ప్రింట్‌ తీసుకునే వీలు ఉంది. అందులో వందలాది భాషల నుండి ఎంపిక చేసిన వేర్వేరు ప్రచురణలు ఉన్నాయి.

5. వేరే భాష వారిలో ఆసక్తి పెంచడానికి సంఘం ఏమి చేస్తుంది?

5 సంఘం ఏమి చేయలి? ఆసక్తి చూపించిన వారు మాట్లాడే భాషాసంఘం ఆ ప్రాంతంలో ఉంటే వారిని వారి భాషలోనే సంఘ కూటాలకు వెళ్లమని ప్రోత్సహించడం మంచిది. కొన్నిసార్లు ఆ దగ్గర్లో ఆ భాషా సంఘం లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆసక్తి చూపించిన వేరే భాష వారిని మీ సంఘంలో కూటాలకు రమ్మని పిలువవచ్చు. వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి, వారి మీద శ్రద్ధ చూపిస్తే వాళ్లు క్రమంగా రావడానికి ఇష్టపడవచ్చు. మొదట్లో వేరే భాషా, వేరే సంస్కృతి అవ్వడం వల్ల వారితో కలిసిపోవడం కష్టంగా ఉండవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల్లో ఉండే నిజమైన క్రైస్తవ ప్రేమ ఎలాంటి అడ్డంకులనైనా తొలగిస్తుంది.—జెఫ. 3:9; యోహా. 13:35.

6. మన క్షేత్రంలో ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష నేర్చుకుంటే ప్రయోజనం ఏమిటి?

6 మీ నగరంలో లేదా పట్టణంలో ఉండే ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష మీకు వచ్చా? రాకపోతే నేర్చుకుని ఆ భాష మాట్లాడేవారికి ఇంకా ఎక్కువగా సహాయం చేయవచ్చు. మన క్షేత్రంలోని ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష తెలిసుంటే వ్యతిరేకించేవారితో కూడా చక్కగా మాట్లాడవచ్చు. ఎందుకంటే ప్రజలు సాధారణంగా తమ భాషలో మాట్లాడేవారితో మాట్లాడడానికి ఇష్టపడతారు.—అపొ. 22:1, 2.

7. వేరే భాషా గుంపు ఎప్పుడు ఏర్పాటు చేయవచ్చు, అది ఎలా నిర్ణయించబడుతుంది?

7 గుంపు ఎలా ఏర్పాటు చేయాలి: ఏదైనా భాషా గుంపు ఏర్పాటు చేయాలంటే ఈ నాలుగు విషయాలు అవసరం. (1) ఆ భాష మాట్లాడేవారిలో సరిపడేంతమందికి ఆసక్తి ఉండాలి. (2) కనీసం కొంతమంది ప్రచారకులకైనా ఆ భాష తెలిసుండాలి లేదా నేర్చుకుంటుండాలి. (3) ఆ భాషలో వారానికి కనీసం ఒక్క కూటమైనా జరిపించడానికి ఒక పెద్ద లేదా పరిచర్య సేవకుడు ఉండాలి. (4) ఒక పెద్దల సభ ఆ గుంపు బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పైన చెప్పినవన్నీ ఒక మోస్తరుగా ఉంటే, పెద్దల సభ తమ సంఘంలో ఆ భాషా గుంపు ఉన్నట్లు అధికారికంగా గుర్తించమని బ్రాంచి కార్యాలయానికి రాస్తారు. (సంస్థీకరించబడ్డాం, 106, 107 పేజీలు చూడండి.) ఆ గుంపు బాధ్యతను చూసుకుంటున్నది, సంఘ పెద్దయితే “గుంపు పైవిచారణకర్త”గా, పరిచర్య సేవకుడైతే “గుంపు సేవకుడు”గా పరిగణించబడతారు. ఆ గుంపును చూసుకునే బాధ్యత వారిదే.

8. మన క్షేత్రంలోవున్న వేరే భాష మాట్లాడేవారికి సహాయం చేయడం గొప్ప అవకాశమని ఎలా చెప్పవచ్చు?

8 మన మాదిరికర్త యేసుక్రీస్తు మొదలుపెట్టిన ప్రపంచవ్యాప్త పరిచర్యను బాగా చేయాలంటే మన క్షేత్రంలోవున్న వేరే భాష మాట్లాడేవారికి కూడా సహాయం చేయాలి. మనం మన పని ఉత్సాహంగా చేసి, యెహోవా అన్యజనుల్ని కదిలించి వారిలో నుండి తన ఇష్టవస్తువులను ఎలా తీసుకొస్తాడో చూడవచ్చు.—హగ్గ. 2:7.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి