ప్రశ్నాభాగం
◼ సంఘంలో తీర్మానాలు ప్రవేశపెట్టేటప్పుడు ఏ పద్ధతిని అనుసరించాలి?
ఆస్తి కొనడం, రాజ్యమందిరాన్ని నిర్మించడం, దాని నమూనా మార్చడం, సొసైటీకి ప్రత్యేక చందాలు పంపడం లేదా ప్రయాణకాపరి ఖర్చులను వహించడం వంటి ప్రధానమైన విషయాలకు నిర్ణయాలు తీసుకోవాలంటే దానికి తీర్మానం అవసరం. సంఘం నిధులను ఖర్చు చేసే ప్రతిసారి అందరి అంగీకారం కొరకు, తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే సాధారణంగా శ్రేష్ఠమైన మార్గము.
ప్రపంచవ్యాప్త ప్రకటన పని కొరకు యిప్పటికే ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా సొసైటీకి యిస్తున్న చందా కాకుండా, ప్రతి నెల ప్రత్యేకంగా కొంత డబ్బు సొసైటీకి పంపాలని సంఘం ఒక్కసారే తీర్మానించవచ్చు, అలాగే, అవసరమైన పరికరాలు కొనడం, శుభ్రం చేయడం వంటి రాజ్యమందిరాల మామూలు అవసరాలకు తీర్మానం అవసరం లేదు.
నిజంగా ఒక అవసరం ఏర్పడినప్పుడు, పెద్దల కూటమి దాన్ని గూర్చి పూర్తిగా చర్చించాలి. ఫలానిది చేద్దామని సగం కంటే ఎక్కువ మంది అంగీకరించినట్లయితే, పెద్దల్లో ఒకరు, బహుశా సంఘ సేవా కమిటీ సభ్యుడు, సేవా కూటంలో చదివి వినిపించడానికి వ్రాతపూర్వక తీర్మానాన్ని తయారు చేయాలి.
అధ్యక్షుడుగా సేవ చేస్తున్న పెద్ద, ప్రస్తుతమున్న అవసరతను, దాన్నెలా తీర్చాలన్న పెద్దల సిఫారసును క్లుప్తంగా, స్పష్టంగా వివరించాలి. అప్పుడు సంఘానికి ఉపయుక్త ప్రశ్నలను అడిగే అవకాశం యివ్వాలి. ఆ సమస్య కొంచెం క్లిష్టమైనదైతే, ప్రతి ఒక్కరు దాని గురించి ఆలోచించి. తమ అంగీకారాన్ని తెలపడానికి తరువాతి సేవా కూటానికి దాన్ని వాయిదా వేయాలి. తమ సమ్మతిని సంఘ సభ్యులు చేతులు పైకెత్తడం ద్వారా తెలపాలి.
చట్టరీత్యావున్న అవసరాలు మరొక విధంగా సూచించనట్లయితే, కార్పొరేషన్ విషయాల్లో, రాజ్యమందిర ఋణాల విషయంలో చేసినట్లే, ఆ తీర్మానాన్ని అంగీకరించే అవకాశం సమర్పించుకుని బాప్తిస్మం పొందిన సభ్యులకు మాత్రమే పరిమితమై ఉంటుంది. పొరుగు సంఘాలనుండి వచ్చిన సాక్షులు ఇందులో పాలుపంచుకోడం సరికాదు.
తీర్మానం అంగీకరించబడిన తర్వాత, తేదీ వ్రాసి, సంతకం చేసి, సంఘ ఫైలులో దాన్ని ఉంచాలి.