ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు మార్చి: క్వశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ (ఇది ఇంగ్లీషు, మలయాళము, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది) 20.00 రూ. ల చందాకు. ఇది అందుబాటులో లేనిచోట, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని 40.00 రూ. ల చందాకు అందించవచ్చు. (చిన్నసైజు 20.00 రూ. లు) దానితోపాటు ప్రత్యేక అందింపులోని 192 పేజీల పాత పుస్తకాలు ఒక్కొక్కటి 6.00 రూ. లకు అందించవచ్చు. ఏప్రిల్, మే: కావలికోట పత్రిక ఒక సంవత్సరానికి చందా 60.00 రూ. లు. దీనికే ఆరు నెలలకుగాని, మాసపత్రికలకు ఒక సంవత్సరానికిగాని చందా 30.00 రూ. లు. (మాసపత్రికలకు ఆరునెలల చందా లేదు.) ఇటీవల ఇండియా భాషల్లోని సంచికల ప్రచురణ వ్యవధిలో మార్పులు జరుగుతూండడంవల్ల, చందాలను సేకరించేటప్పుడు మీరు ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోవాలని జ్ఞప్తిచేస్తున్నాము: కావలికోట ప్రస్తుతం కన్నడ, మలయాళం, మరాఠి, తమిళం, తెలుగు భాషల్లో పక్షపత్రికగాను; బెంగాలి, గుజరాతి, హింది, నేపాలి, ఉర్దు భాషల్లో మాసపత్రికగాను ముద్రించబడుతుంది. ప్రస్తుతం అవేక్! తమిళం, మలయాళం భాషల్లో పక్షపత్రికగాను; గుజరాతి, కన్నడ, తెలుగు భాషల్లో మాసపత్రికగాను వెలువడుతుంది. జూన్: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని 40.00 రూ.ల చందాకు. అది అంగీకరించబడనిచోట, 192 పేజీల పుస్తకమేదైనా 12.00 రూ.లకు అందించవచ్చు. ఇంగ్లీషులో లైఫ్—హౌ డిడ్ ఇట్ గెట్ హియర్? బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్? అనే పుస్తకాన్ని 40.00 రూ.లకు అందించవచ్చును.
గమనిక: పైన పేర్కొన్న సాహిత్యాల కొరకు ఇంకా ఆర్డర్ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్ ఆర్డర్‌లో (S-14) ఆర్డర్ చేయాలి.
◼ సంఘంతో సహవసిస్తున్న ప్రతి ఒక్కరూ వాచ్‌టవర్, అవేక్! పత్రికల కొరకు క్రొత్త మరియు తిరిగికట్టే చందాలను, ఆలాగే పత్రికల కొరకు చేసే తమ వ్యక్తిగత చందాలను సంఘంద్వారానే పంపాలి.
◼ సంఘాధ్యక్షుడు గాని లేదా ఆయన నియమించిన మరొకరుగాని మార్చి 1 లేదా ఆ తర్వాత వీలైనంత త్వరగా సంఘంలోని జమా లెక్కలను తనిఖీ చేయాలి. ఇది చేసిన తర్వాత సంఘంలో ప్రకటించండి.