ప్రకటనలు
◼ అందించవలసిన సాహిత్యాలు సెప్టెంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం రూ. 25.00 చందాకు (పెద్ద సైజు రూ. 45.00) ఇవ్వాలి. గృహ బైబిలు పఠనాలను ఆరంభించేందుకు ప్రయత్నాలు జరగాలి. అక్టోబరు: తేజరిల్లు! లేక కావలికోట కొరకు చందాలు. పక్షపత్రిక సంచికకు ఒక సంవత్సర చందా రూ 70.00. మాసపత్రికకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రికకు ఆరు నెలల చందా రూ. 35.00. మాసపత్రికకు ఆరునెలల చందా లేదు. నవంబరు: సాధ్యమైన చోటెల్లా, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకంతోపాటు పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదమును (ఆంగ్లం) రూ. 75.00కు అందించాలి. ప్రత్యామ్నాయంగా, దేవుని కొరకైన మానవుని అన్వేషణ (ఆంగ్లం) అనే పుస్తకాన్ని రూ. 45.00కు అందించవచ్చు. గృహస్థులకు ఆంగ్లం తెలియనిచోట, క్రితం మన రాజ్య పరిచర్యలో ప్రత్యేక అందింపుగా పేర్కొనబడిన పుస్తకాల్లో 192 పేజీల ఏదైన ఒక పుస్తకాన్ని రూ. 8.00కు అందించవచ్చు. మా వద్ద ఇప్పటికీ లభ్యమయ్యే ఈ కోవకు చెందిన పుస్తకాల పట్టిక కొరకు ఆగస్టు 1995 మన రాజ్య పరిచర్యలోని ప్రకటనల కాలమ్‌ను చూడండి. కొన్ని భాషల్లో ఈ కోవకు చెందిన పుస్తకాలేవీ కూడా స్టాకులో లేవు గనుక, నేపాలి తెలిసినవారికి జీవితమును అనుభవించుము! అనే బ్రోషూర్‌ను, పంజాబి లేదా బెంగాలి తెలిసినవారికి మన సమస్యలు లేదా ఇదిగో! . . . సమస్తము అనే బ్రోషూర్‌లను అందించాలి. మలయాళం ఇష్టపడేవారికి మీ యౌవనమును పరిపూర్ణముగా—ఆస్వాదించుము! అనే పుస్తకాన్ని రూ. 15.00కు ఇవ్వవచ్చు. ఈ పుస్తకం ప్రత్యేక వెలకు ఇవ్వవలసింది కాదని దయచేసి గమనించండి. డిశంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకానికి రూ. 45.00 చందా. దానికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అదే చందాకు (నిరంతరము జీవించగలరు అనే పుస్తకం చిన్న సైజు రూ. 25.00కు) అందించవచ్చు.
గమనిక: పైన పేర్కొన్న సాహిత్యాల కొరకు ఇంతవరకూ రిక్వెస్ట్ చేయని సంఘాలు తమ తరువాయి రిక్వెస్ట్ ఫారమ్ (S-AB-14)లో అలా చేయాలి.
◼ సంఘాధ్యక్షుడు లేదా ఆయన నియమించిన మరొకరు సెప్టెంబరు 1కి లేదా దాని తరువాత సాధ్యమైనంత త్వరగా సంఘ అకౌంట్లను తనిఖీ చేయాలి. దాని తరువాత సంఘంలో ప్రకటించాలి.
◼ అక్టోబరులో సహాయ పయినీరింగ్ చేయడానికి పథకం వేస్తున్న ప్రచారకులు త్వరగా తమ దరఖాస్తులను ఇవ్వాలి. సాహిత్యానికి మరియు ప్రాంతానికి కావలసిన ఏర్పాట్లు చేసేందుకు ఇది పెద్దలను అనుమతిస్తుంది.
◼ బహిష్కరించబడిన మరియు సహవాసం మానుకున్న వ్యక్తులెవరైనా తిరిగి రావడానికి మొగ్గుచూపుతున్నట్లయితే ఆ విషయాన్ని గురించి ఇవ్వబడిన మార్గ నిర్దేశాల కొరకు ఏప్రిల్ 15, 1991 కావలికోట (ఆంగ్లం)ను పరిశీలించమని గుర్తు చేయబడుతున్నారు.
◼ పూనాలోని “ఆనందమయ స్తుతికర్తలు” జిల్లాసమావేశ ప్రధాన కార్యాలయ చిరునామా, Mr. P. Suryavanshi, Flat F-28, Pimple Apartments, Near Post Office, Kasarwadi, Pune, MAH 411 034గా మారింది.