కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/95 పేజీ 1
  • అనుదినమూ యెహోవాను స్తుతించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అనుదినమూ యెహోవాను స్తుతించండి
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • యౌవనులారా, యెహోవాను స్తుతించండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ప్రతీరోజు యెహోవాను స్తుతించండి
    మన రాజ్య పరిచర్య—2009
  • మీరు అనియత సాక్ష్యం ఇవ్వగలరు!
    మన రాజ్య పరిచర్య—2010
  • సాక్ష్యమిచ్చుటకు ప్రతి అవకాశమును దృఢముగా చేబట్టుము—1వ భాగము
    మన రాజ్య పరిచర్య—1989
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1995
km 12/95 పేజీ 1

అనుదినమూ యెహోవాను స్తుతించండి

1 మన దేవుడైన యెహోవా అద్భుతమైన, ప్రేమగల సృష్టికర్త, సర్వ జీవానికీ సంతోషానికీ కారకుడాయనే. ఆయన గొప్పతనం దృష్ట్యా, నిశ్చయంగానే తన సృష్టియంతటి స్తుతిని అందుకునే అర్హతను ఆయన కల్గివున్నాడు. కీర్తన రచయిత చెప్పినట్లు మనం కూడా వ్యక్తిగతంగా ఇలా చెప్పాలనుకుంటాము: “నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును.” (కీర్త. 71:14, 15) దీన్ని చేసేందుకు, అనుదినమూ మనం యెహోవాను ఆరాధించే మార్గాలను వెదకాలి మరియు ఆయనను గూర్చీ ఆయన నీతిని గూర్చీ మరియు రక్షణ కొరకు ఆయన చేసిన ఏర్పాట్లను గూర్చీ మనం ఘనంగా మాట్లాడేందుకు పురికొల్పబడాలి.

2 యెహోవాను స్తుతించడంలో తొలి క్రైస్తవులు మంచి మాదిరినుంచారు. పెంతెకొస్తు నాడు బాప్తిస్మము పొందిన 3,000 మందిని గూర్చి అపొస్తలుల కార్యములు 2:46, 47 నందు మనం ఇలా చదువుతాం: “వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు . . . దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొంది[రి] . . . మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను.” వారు యెహోవాను గూర్చి మరియు ఆయన మెస్సీయాను గూర్చి అద్భుతమైన సత్యాలను నేర్చుకుంటుండేవారు. ఇతరులు యెహోవాను గూర్చి విని నేర్చుకుని స్తుతించేందుకు ప్రోత్సహిస్తూ వారి ఆనందం పదిమందికి వ్యాపించేదిగా ఉండింది.

3 అవకాశాలు ప్రతిదినమూ ఉన్నాయి: అనియత సాక్ష్యమివ్వడం ద్వారా తాము అనుదినం యెహోవాను స్తుతించగలమని నేడు అనేకులు కనుగొంటున్నారు. ముందుగా పథకం వేసుకోవడం వారు మరింత ఫలవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. అనియత సాక్ష్యంలో భాగం వహించాలని నిర్ణయించుకున్న ఓ సహోదరి, ఎవరో తన కారు కిటికీలను రెండింటినీ పగలకొట్టి లోపలికి జొరబడ్డారని తెలుసుకుంది. ఓ గ్యారేజీకి ఫోను చేసి, ఆ తర్వాత మెకానిక్కుకు సాక్ష్యమిచ్చేందుకు సిద్ధపడింది. ఆమె సిద్ధపాటులో యెహోవా నడిపింపుకొరకు ప్రార్థించడం కూడా ఇమిడివుంది. ఫలితంగా, ఆమె మెకానిక్కుకు ఒక గంటసేపు సాక్ష్యమిచ్చి, నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అతనికి అందించింది.

4 మరో సహోదరి, ఆమె ఆమె పొరుగింటి స్త్రీ, ఇద్దరూ కుక్కలను నడిపించేందుకు వెళ్లే సమయాల్లో క్రమంగా ఆ స్త్రీని కలిసేది. అలాగే ఒకసారి కలిసినప్పుడు, జీవిత సమస్యలను గూర్చి వారు గంభీరంగా చర్చించుకున్నారు, మరి ఆ చర్చ మరిన్ని చర్చలకు నడిపింది. కొంతకాలానికి, ఓ బైబిలు పఠనం ప్రారంభించబడింది. ఆమె దేవున్ని గానీ బైబిలునుగానీ విశ్వసించేది కాదు కనుక యెహోవాసాక్షులు తన ఇంటికి వచ్చివుంటే తాను వినివుండేదాన్ని కానని పొరుగింటామె కొంత కాలం తర్వాత చెప్పడం ఆసక్తికరం.

5 సేల్స్‌మ్యాన్లు లేక ఇతరులు తమ ఇంటికి వచ్చినప్పుడు సాక్ష్యమివ్వడం సాధ్యమౌతుందని కొందరు కనుగొన్నారు. జీవిత భీమాలను చేయించే ఒక వ్యక్తి ఐర్లాండ్‌లోని ఓ సహోదరిని కలిశాడు. తాను నిత్య జీవాన్ని అనుభవించేందుకు ఎదురు చూస్తున్నానని ఆమె వివరించింది. రోమన్‌ కాథోలిక్కుగా పెరిగిన ఈ వ్యక్తికి అది పూర్తిగా ఓ క్రొత్త విషయం. ఆయన నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని తీసుకుని, ఆ తర్వాతి వారం కూటానికి హాజరై, బైబిలు పఠించేందుకు అంగీకరించాడు. ఇప్పుడు ఈ సేల్స్‌మ్యాన్‌ ఓ బాప్తిస్మం తీసుకున్న సహోదరుడయ్యాడు.

6 యెహోవాను ప్రతిదినం స్తుతించేందుకు గల అవకాశాలను కనుగొనేందుకు మనమందరం మెలకువగా ఉండాలి. సందర్శకులకు కనిపించేట్లుగానూ వారికి సులభంగా అందించగలిగేట్లుగానూ కొన్ని పత్రికలను లేక కరపత్రాలను ఉంచుకోవడం సహాయకరంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పార్కులోని బెంచీపై కూర్చోవడం, విశ్రమించేందుకు కొద్దిసేపు కూర్చునే వారికి సాక్ష్యమిచ్చే అవకాశాల్నెన్నింటినో కలిగిస్తుంది. పాఠశాలలోని యౌవనులైన సాక్షులు కొందరు తమ బెంచీలపై బైబిలు సాహిత్యాలను పెడతారు. దాన్ని గమనించి ప్రశ్నలడిగేవారితో సంభాషణను ప్రారంభించేందుకు అది ఓ మార్గం. మీరు ఉపయోగించగల ఒకటి లేక రెండు లేఖనాలను జ్ఞాపకముంచుకోండి. మీకు సహాయపడమని యెహోవాను కోరండి. అలా చేసినందుకు మీరు ఆశీర్వదించబడతారు.—1 యోహా. 5:14.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి