ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం రూ.15.00 చందాకు. ఇది సంఘంలో ఇంకా లభ్యం కానట్లయితే అప్పుడు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 25.00 (పెద్ద సైజు రూ. 45.00) చందాకు ఇవ్వవచ్చు. ఏప్రిల్ మరియు మే: కావలికోట లేక తేజరిల్లు! కొరకు చందాలు. పక్షపత్రికల ప్రచురణలకు ఒక సంవత్సర చందా రూ. 90.00. మాసపత్రికల ప్రచురణలకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రిక ప్రచురణలకు ఆరు నెలల చందా రూ. 45.00. మాసపత్రికల ప్రచురణలకు ఆరునెలల చందా లేదు. చందా కట్టడానికి నిరాకరించినట్లయితే, విడి పత్రికలను ఒక్కొక్కదాన్ని రూ. 4.00కు ప్రతిపాదించాలి, లేదా సముచితమైన చోట, కుటుంబ జీవితము పుస్తకాన్ని కూడా ప్రతిపాదించవచ్చు. జూన్: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని రూ. 15 చందాకు. ప్రత్యామ్నాయంగా, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ.25.00 (పెద్ద సైజు రూ. 45.00) చందాకు ప్రతిపాదించవచ్చు. సముచితమైన చోట లేదా ఈ రెండు పుస్తకాలతోపాటు కుటుంబ జీవితము అనే పుస్తకాన్ని కూడా ప్రతిపాదించవచ్చు.
◼ జనవరి 1996 మన రాజ్య పరిచర్యలో ప్రకటించిన ప్రకారం, ఈ సంవత్సరంలోని జ్ఞాపకార్థ ఆచరణ కాలం కొరకైన ప్రత్యేక బహిరంగ ప్రసంగం దాదాపు అన్ని సంఘాల్లోను ఆదివారం ఏప్రిల్ 21న ఇవ్వబడుతుంది. “వక్ర జనాంగం మధ్య నిందారహితులుగా ఉండడం” అనేది ప్రసంగ శీర్షిక. ఏప్రిల్ 2న జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యే వారిని ఆహ్వానించేందుకు ప్రత్యేక ప్రయత్నం చేయాలి.
◼ ఏప్రిల్ 29, 1996 మొదలుకొని నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం సంఘ పుస్తక పఠనంలో పరిశీలించబడుతుంది. సంఘాలు దీనిని మనస్సులో ఉంచుకుని స్థానికంగా ఉపయోగించే భాషల్లో ఆ పుస్తకం యొక్క కావలసినంత స్టాకు కలిగి ఉండాలి.
◼ మార్చి 1, 1996 నుండి కొన్ని సాహిత్యాల క్రొత్త ధరలు అమలులోకి వస్తాయని గమనించండి:
పయినీరు సంఘం మరియు ప్రజలు
డిలక్స్ బైబిల్ నెం. 12 (రెఫరెన్సులు) రూ. 150.00 రూ. 23.00
డిలక్స్ బైబిల్ పాకెట్ సైజు రూ. 150.00 రూ. 230.00
లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) రూ. 400.00 రూ. 470.00
కన్‌కారడన్స్ రూ. 75.00 రూ. 100.00