కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/97 పేజీ 7
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవులు అంత్యక్రియలను గౌరవపూర్వకంగా, మర్యాదకరంగా, దేవుడు ఇష్టపడే విధంగా జరిపించాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • అంత్యక్రియల విషయంలో క్రైస్తవ దృక్కోణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • అంత్యక్రియల గురించి యెహోవాసాక్షుల అభిప్రాయమేంటి?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మన రాజ్య పరిచర్య—1997
km 3/97 పేజీ 7

ప్రశ్నా భాగం

◼ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను చేయడంలో సంఘ మద్దతు కోరబడినప్పుడు, ఈ క్రింది ప్రశ్నలు తలెత్తవచ్చు:

అంత్యక్రియల ప్రసంగాన్ని ఎవరు ఇవ్వాలి? ఇది కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన నిర్ణయం. మంచి పేరున్న బాప్తిస్మం తీసుకొనిన ఏ సహోదరున్నైనా వాళ్లు ఎంపిక చేసుకోవచ్చు. ఓ ప్రసంగీకున్ని ఏర్పాటు చేయమని పెద్దల సభను కోరినట్లైతే, సొసైటీ అవుట్‌లైన్‌ ఆధారంగా ప్రసంగాన్ని ఇచ్చేందుకు వాళ్లు సాధారణంగా సమర్థుడైన ఓ పెద్దను ఎంపిక చేస్తారు. మరణించిన వ్యక్తిని పొగడ్తలతో ముంచెత్తకపోయినప్పటికీ, ఆయన లేక ఆమె చూపించిన మాదిరికరమైన లక్షణాలపై అవధానాన్ని నిలపడం సముచితం కావచ్చు.

రాజ్యమందిరాన్ని ఉపయోగించుకోవచ్చా? పెద్దల సభ అనుమతి లభించినట్లైతే, క్రమంగా జరిగే కూటాల సమయానికి అంతరాయం కలగకపోతే దానిని ఉపయోగించుకోవచ్చు. మరణించిన వ్యక్తి మంచి పేరును కల్గివుండి సంఘ సభ్యుడైతే లేక సంఘసభ్యుని మైనరు పిల్లవాడైతే రాజ్యమందిరాన్ని ఉపయోగించుకోవచ్చు. మరణించిన వ్యక్తి క్రైస్తవత్వానికి విరుద్ధమైన ప్రవర్తన మూలంగా బహిరంగ అపఖ్యాతికి గురైనట్లైతే లేక సంఘంపై అననుకూలమైన ప్రభావాన్ని చూపించే ఇతర కారణాలు ఏవైనా ఉంటే, మందిరాన్ని ఉపయోగించడానికి అనుమతించకూడదని పెద్దలు నిర్ణయించవచ్చు.—మన పరిచర్య పుస్తకంలో 62-63 పేజీలు చూడండి.

సాధారణంగా, అవిశ్వాసులైన వ్యక్తుల అంత్యక్రియల ఆచరణకు రాజ్యమందిరాలు ఉపయోగించబడవు. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు బాప్తిస్మం పొందిన ప్రచారకులుగా చురుకుగా సహవసిస్తున్నట్లైతే, మరి ఆ వ్యక్తి సత్యం విషయంలో అనుకూలమైన దృక్పథాన్నీ, సమాజంలో తన మంచి ప్రవర్తననుబట్టి ఓ మంచి పేరునూ కల్గివున్నాడని సంఘంలో తగినంతమంది ప్రచారకులు ఎరిగివున్నట్లైతే, అలాగే అంత్యక్రియల ఆచరణలో ఏవిధమైన లౌకిక ఆచారాలూ చేర్చబడకపోతే మినహాయింపు ఇవ్వవచ్చు.

రాజ్యమందిరాన్ని ఉపయోగించడానికి అనుమతించినప్పుడు, అంత్యక్రియల ఆచరణలో సాంప్రదాయకంగా శవపేటికను ఉంచడం అవసరమో కాదో అనే విషయాన్ని పెద్దలు పరిశీలించాల్సివుంది. అది సాంప్రదాయకమైనదైతే, దాన్ని రాజ్యమందిరంలోనికి తీసుకు రావడానికి వాళ్లు అనుమతించవచ్చు.

లౌకిక సంబంధమైన ప్రజలకు చేసే అంత్యక్రియల ఆచరణ విషయమేమిటి? మరణించిన వ్యక్తికి సమాజంలో మంచి పేరువుంటే, అతని ఇంటి దగ్గరగానీ లేక సమాధుల స్థలం దగ్గరగానీ ఓదార్పును ఇచ్చే బైబిలు ప్రసంగాన్ని ఒక సహోదరుడు ఇవ్వవచ్చు. అనైతిక ప్రవర్తననుబట్టీ, అక్రమ ప్రవర్తనబట్టీ పేరుగాంచిన వ్యక్తి లేక బైబిలు సూత్రాలకు పూర్తిగా భిన్నమైన జీవితాన్ని గడిపాడనీ పేరుగాంచిన వ్యక్తి అంత్యక్రియల ఆచరణను నిర్వహించడానికి సంఘం తిరస్కరిస్తుంది. మిశ్రమ విశ్వాసంతో మిళితమైన అంత్యక్రియల ఆచరణను నిర్వహించడంలోగానీ లేక మహాబబులోనుకు సంబంధించిన చర్చీల్లో ఒకదానిలో నిర్వహించబడే అంత్యక్రియలకు సంబంధించిన ఏవిధమైన ఆచరణలోనైనాగానీ ఏ సహోదరుడూ మతగురువుతో కచ్చితంగా భాగం వహించడు.

మరణించిన వ్యక్తి బహిష్కరించబడిన వాడైతే అప్పుడేం చెయ్యాలి? సాధారణంగా సంఘం భాగం వహించదు లేక రాజ్యమందిరం ఉపయోగించబడదు. ఒకవేళ ఆ వ్యక్తి పశ్చాత్తాపపడినట్లుగా, సంఘంలోనికి తిరిగి తీసుకోబడాలనే కోరికను వ్యక్తపర్చినట్లుగా తగిన రుజువు ఉన్నట్లైతే, అంత్యక్రియలు జరిగే ఇంటిదగ్గర గానీ లేక స్థలంలో గానీ అవిశ్వాసులకు సాక్ష్యాన్నిచ్చేందుకూ, బంధువుల్ని ఓదార్చేందుకూ బైబిలు ఆధారిత ప్రసంగాన్ని ఒకదానిని ఇవ్వడానికి ఒక సహోదరుని మనస్సాక్షి అతనిని అనుమతించవచ్చు. అయినప్పటికీ, ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు, ఆ సహోదరుడు పెద్దల సభను సంప్రదించడమూ, వాళ్లు చెప్పేవాటిని పరిగణనలోనికి తీసుకోవడం జ్ఞానయుక్తమైన విషయం కాగలదు. ఆ సహోదరుడు జోక్యం చేసుకోవడం జ్ఞానయుక్తంకాని పరిస్థితుల్లో, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకరైన ఓ సహోదరుడు బంధువుల్ని ఓదార్చడానికి ప్రసంగాన్ని ఇవ్వడం సముచితమైన విషయం అవ్వొచ్చు.

ఈ క్రింద ఇవ్వబడిన కావలికోట (ఆంగ్లం) సంచికల్లోనూ, తేజరిల్లు! (ఆంగ్లం) సంచికల్లోనూ నడిపింపు కొరకైన మరింత సమాచారాన్ని కనుగొనవచ్చు: అక్టోబరు 15, 1990, 30-1 పేజీలు; సెప్టెంబరు 15, 1981, 31వ పేజీ; మార్చి 15, 1980, 5-7 పేజీలు; జూన్‌ 1, 1978, 5-8 పేజీలు; జూన్‌ 1, 1977, 347-8 పేజీలు; మార్చి 15, 1970, 191-2 పేజీలు; అలాగే సెప్టెంబరు 8, 1990, 22-3 పేజీలు; మార్చి 22, 1977, 12-15 పేజీలు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి