ప్రకటనలు
◼ జ్ఞాపకార్థదిన ఆచరణ జరుగు కాలంకొరకైన ప్రత్యేక బహిరంగ ప్రసంగం, ఈ సంవత్సరం ఆదివారం ఏప్రిల్ 6వ తారీఖున అనేక సంఘాల్లో ఇవ్వబడుతుంది. ఈ ప్రసంగం పేరు, “ప్రాపంచిక మాలిన్యాలనుండి పరిశుభ్రపర్చుకొంటూ ఉండడం.” మనందరమూ హాజరవ్వాలి. ఈ ప్రసంగానికి హాజరయ్యేందుకు జ్ఞాపకార్థ దినానికి హాజరైన ఆసక్తిగల వ్యక్తులకు మనం సహాయం చేయాలి. మనం వినబోయే విషయాలు, దేవున్ని ప్రీతిపర్చాలనే మన నిశ్చయాన్ని పునరుద్ధరించేందుకు తప్పకుండా కారణమవ్వాలి.
◼ మహాగొప్ప మనిషి పుస్తకంలో నుండి పఠిస్తున్న సంఘపుస్తక పఠనాలనుండి పూర్తి ప్రయోజనం పొందేందుకు, మనరాజ్య పరిచర్య ఏప్రిల్ 1993, 8వ పేజీలోవున్న చక్కని మార్గనిర్దేశకాల్ని దయచేసి పరిశీలించండి. ప్రతీ పాఠాన్ని సిద్ధపడాల్సిన పద్ధతినీ, సంఘపుస్తక పఠనం అనుసరించాల్సిన పద్ధతినీ ఆ శీర్షిక వివరిస్తోంది. ఈ సమాచారాన్ని పునఃసమీక్షించడం ద్వారా పుస్తక పఠన నిర్వాహకులూ, పుస్తక పఠనానికి హాజరయ్యేవారందరూ ప్రయోజనాన్ని పొందుతారు.
◼ ప్రతి సమాజంలోనూ, సంవత్సరంలోని వేర్వేరు కాలాల్లో, పాఠశాలలనుండి పిల్లలకూ, ఉద్యోగాలనుండి పెద్దలకూ శెలవులు దొరికే లోకసంబంధమైన పండుగ దినాలు ఉంటాయి. ఇవి, ప్రాంతీయ సేవలో విస్తృతంగా భాగం వహించేందుకు సంఘానికి మహత్తరమైన అవకాశాల్ని కలుగజేస్తాయి. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు వస్తాయో పెద్దలు ముందుగానే చూసుకోవాలి, శెలవు దినాల్లో గుంపుగా సాక్ష్యమిచ్చేందుకు చేయబడిన ఏర్పాట్లను ముందుగా సంఘానికి తెలియజేయాలి.
◼ సంఘ పైవిచారణకర్త గానీ లేక ఆయనచే నియమించబడిన మరొకరు గానీ మార్చి 1వ తారీఖునగానీ లేక అటు తర్వాత సాధ్యమైనంత త్వరలోగానీ సంఘ లెక్కల్ని ఆడిట్ చేయాలి. ఇలా ఆడిట్ చేసిన తర్వాత సంఘానికి ప్రకటించాలి.
◼ కన్నడ, తెలుగు, మరాఠీ భాషల్లో ముద్రించబడుతున్న కావలికోట పత్రిక, మనరాజ్య పరిచర్యల సంచికలన్నిటిలోనూ మార్చి 1, 1997 మొదలుకొని ఆ భాషల్లో లభ్యమౌతున్న పాటల బ్రొషూరులో నుండి తీసుకొనబడిన ప్రత్యామ్నాయ పాటల సంఖ్యలు ఇవ్వబడతాయి. ఈ భాషల్లో నిర్వహించబడుతున్న కూటాల్లో ఇంగ్లీషు పాటలను కాదుగానీ, స్వభాషలోని పాటలనే పాడాలి. ప్రచారకులూ, కూటాలకు హాజరైన వారూ తమ స్వంతభాషలో ఉన్న రాజ్య గీతాలతో బాగా పరిచయం కల్గివుండేందుకు ఇది ప్రోత్సహిస్తుంది.