సాహిత్య ప్రతిపాదనలు
మార్చి: కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించండి.
ఏప్రిల్, మే: కావలికోట లేక తేజరిల్లు! పత్రికల చందాలు. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 90.00. మాస పత్రికలకు వార్షిక చందా, పక్షపత్రికలకు ఆరు నెలల చందా రూ. 45.00. మాస పత్రికలకు ఆరు నెలల చందా లేదు. చందా కట్టనట్లైతే, విడిపత్రికలను ఒక్కొక్క దానినీ రూ. 4.00లకు ప్రతిపాదించాలి.
కావలికోట పత్రిక పంజాబీ ఉర్దూ భాషల్లో (ఈ భాషల్లో ఇది మాసపత్రిక) మినహా మిగిలిన అన్ని భారతీయ భాషల్లోనూ నేపాలీ భాషలోనూ పక్షపత్రిక అనే విషయాన్ని చందాలు కట్టిస్తున్నప్పుడు దయచేసి గుర్తుంచుకోండి.
తేజరిల్లు! పత్రిక మలయాళం, తమిళ భాషల్లో పక్షపత్రిక, కానీ కన్నడ, గుజరాతీ, తెలుగు, నేపాలీ, మరాఠీ, హిందీ భాషల్లో మాసపత్రిక. పంపిణీదారుల త్రైమాసిక తేజరిల్లు! ప్రతులు ఉర్దూ, పంజాబీ, బెంగాలీ భాషల్లో సంఘాలకు లభ్యమౌతాయి, కానీ ఈ మూడు భాషల్లోనూ చందాలు స్వీకరించబడవు.
జూన్: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించండి. గృహ బైబిలు పఠనాల్ని ప్రారంభించేందుకు ప్రయత్నించడంలో శ్రద్ధను కనపర్చండి.
గమనిక: పైన పేర్కొన్న ప్రచార సాహిత్యాల్లో వేటినైనా ఇంతవరకూ రిక్వెస్ట్ చేయని సంఘాలు, తమ తరువాతి లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-AB-14) నందు రిక్వెస్ట్ చేయాలి.
▪ తేజరిల్లు! పత్రిక ఇప్పుడు నేపాలీ భాషలో మాస పత్రికగా ప్రచురించబడుతోంది. వార్షిక చందా రూ. 45.00. దీనికి ఆరు నెలల చందాలేదు.
▪ ఏప్రిల్ 8, 1997 సంచికతో ఆరంభమై, తేజరిల్లు! పంజాబీ భాషలో త్రైమాస పత్రికగా ప్రచురించబడుతుంది. ఈ సంచిక కోసం సంఘాలు వెంటనే డిస్ట్రిబ్యూటర్ ఆర్డరును పంపించాలి, అయితే పంజాబీ తేజరిల్లు! పత్రికకు చందాలు స్వీకరించబడవని దయచేసి గమనించండి.