కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/98 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1998
మన రాజ్య పరిచర్య—1998
km 1/98 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు జనవరి: సగం ధరకు లేదా ప్రత్యేక ధరకు సొసైటీ లిస్ట్‌ చేసిన 192 పేజీల పుస్తకాల్లో దేనినైనా ప్రతిపాదించవచ్చు. (మన రాజ్య పరిచర్య జూలై 1997, పేజీ 6, మరియు ఏప్రిల్‌ 14, 1997 తేదీన సొసైటీ పంపిన ఉత్తరాన్ని చూడండి.) స్థానిక భాషల్లో అలాంటి పుస్తకాలు లభ్యం కానప్పుడు, జ్ఞానము పుస్తకాన్ని గానీ లేదా కుటుంబ సంతోషం పుస్తకాన్ని గానీ ఒక్కొక్కదాన్ని రూ. 20.00 చొప్పున ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకం రూ. 25.00 చందాకు (పెద్ద సైజు రూ. 45.00) లేదా సగం ధరకు లేదా ప్రత్యేక ధరకు సొసైటీ లిస్ట్‌ చేసిన 192 పేజీల పుస్తకాల్లో దేనినైనా ప్రతిపాదించవచ్చు. స్థానిక భాషల్లో ఆ పుస్తకాలు లభించనప్పుడు జ్ఞానము లేదా కుటుంబ సంతోషం పుస్తకాలను ఒక్కొక్కదాన్ని రూ. 20.00 చొప్పున ప్రతిపాదించవచ్చు. మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకము రూ. 20.00 చందాకు ప్రతిపాదించవచ్చు. గృహ బైబిలు పఠనాలను ప్రారంభించడంపై దృష్టి కేంద్రీకరించండి. ఏప్రిల్‌, మే: కావలికోట, తేజరిల్లు! కొరకు చందాలు.

◼ జనవరి 5తో ప్రారంభమయ్యే వారంలో జరిగే సేవా కూటంలో, హాజరైన బాప్తిస్మం పొందిన ప్రచారకులందరూ లిటరేచర్‌ కౌంటర్‌ నుండి అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డులను, తమ పిల్లలకోసం ఐడెంటిటీ కార్డులను పొందవచ్చు.

◼ ఈ సంవత్సరం శనివారం, ఏప్రిల్‌ 11న సూర్యాస్తమయం తర్వాత జ్ఞాపకార్థ దినాన్ని జరుపుకోవడానికి అందరికీ సౌకర్యవంతంగా ఉండే ఏర్పాట్లను సంఘాలు చేసుకోవాలి. ప్రసంగం కొంచెం ముందుగానే ప్రారంభమైనప్పటికీ, జ్ఞాపకార్థ చిహ్నాలను అందరికీ అందించడం సూర్యాస్తమయానికి ముందు ప్రారంభం కాకూడదు. మీ ప్రాంతంలో సూర్యాస్తమయ సమయాన్ని నిర్ధారించుకోవడానికి స్థానిక అధికారిక మూలాలను సంప్రదించండి. ప్రతి సంఘము తమ స్వంత జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవడం కోరదగినదే అయినప్పటికీ ఇది అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. అనేక సంఘాలు ఒకే రాజ్య మందిరాన్ని ఉపయోగిస్తున్నచోట్ల, ఒకటి లేక రెండు సంఘాలు ఆ సాయంత్రం మాత్రం వేరే స్థలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. జ్ఞాపకార్థ కూటం మరీ ఆలస్యంగా ప్రారంభం కాకూడదు, ఆసక్తిగల క్రొత్తవారు హాజరుకావడానికి అననుకూలంగా ఉండకూడదు. అదే సమయంలో, నిర్ణీత సమయ పట్టిక మరీ దగ్గరగా ఉండి, ఆచరణకు ముందూ అటుపిమ్మట సందర్శకులను పరామర్శించడానికీ, ఆసక్తిగలవారికి ముందుముందు ఆధ్యాత్మిక సహాయం అందించడానికి ఏర్పాట్లు చేయడానికీ, లేక పరస్పరం ప్రోత్సహించుకోవడానికీ సమయం లేకుండేలా ఉండకూడదు. అన్ని విషయాలనూ కూలంకషంగా పరిశీలించిన తర్వాత, ఈ జ్ఞాపకార్థ కూటానికి హాజరయ్యేవారు ఆచరణనుండి పూర్తి ప్రయోజనాన్ని పొందేందుకు ఏ ఏర్పాట్లు సహాయం చేస్తాయో పెద్దలు నిర్ణయించాలి.

◼ 1998 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలోని ప్రత్యేక బహిరంగ ప్రసంగం మార్చి 29న ఇవ్వబడుతుంది. దానికి ఔట్‌లైన్‌ ఇవ్వబడుతుంది. ఆ వారంలో ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనంగానీ, ప్రాంతీయ సమావేశంగానీ, ప్రత్యేకదిన సమావేశంగానీ జరుగుతున్న సంఘాల్లో ఆ తర్వాతి వారంలో ప్రత్యేక ప్రసంగం ఇవ్వబడుతుంది. 1998, మార్చి 29కి ముందు ఏ సంఘంలోనూ ఆ ప్రత్యేక ప్రసంగాన్ని ఇవ్వకూడదు.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (T-21)—కొంకణి (రోమన్‌ లిపి), పంజాబీ

కృంగిన వారికి ఓదార్పు (T-20)—కొంకణి (రోమన్‌ లిపి), పంజాబీ

లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? (T-22)—కొంకణి (రోమన్‌ లిపి), పంజాబీ

◼ స్టాకు అయిపోయిన ప్రచురణలు:

అద్వితీయ సత్య దేవుని ఆరాధనలో ఐక్యమయ్యారు—తమిళం

జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?—తెలుగు

“నీ రాజ్యము వచ్చుగాక”—ఆంగ్లం, కన్నడ, తమిళం

బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా?—ఆంగ్లం

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి