మార్చిలోని సేవా కూటాలు
మార్చి 2తో ప్రారంభమయ్యే వారం
పాట 3 (16)
8 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: ‘నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి.’ పెద్ద ఇచ్చే ప్రసంగం. జ్ఞాపకార్థ దినానికి హాజరుకావాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ మన పరిచర్య పుస్తకంలోని 80-1 పేజీలలోని సమాచారంపై క్లుప్తంగా వ్యాఖ్యానించండి.
22 నిమి: “నిత్యజీవ నిరీక్షణను ఇతరుల్లో నాటండి.” శీర్షికను ప్రేక్షకులతో చర్చించండి. సంభాషణను కొనసాగించడానికి ప్రశ్నలను ప్రతిభావంతంగా ఎలా ఉపయోగించవవ్చో క్లుప్తంగా వివరించండి. అందింపులో ఉపయోగించదగిన జవాబును స్ఫురింపజేసే ప్రశ్నలకూ, దృక్పథాన్ని రాబట్టే ప్రశ్నలకూ కొన్ని ఉదాహరణలను ఇవ్వండి. (పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం) 51-52 పేజీల్లోని 10-12పేరాలను చూడండి.) ఇవ్వబడిన ప్రారంభ అందింపుల్లో ఒక దానినీ, దానితోపాటు బైబిలు పఠనాన్ని ప్రారంభించడాన్ని చూపించే పునర్దర్శనాన్నీ సమర్ధుడైన ఒక ప్రచారకుడు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయండి.
పాట 88 (6), ముగింపు ప్రార్థన.
మార్చి 9తో ప్రారంభమయ్యే వారం
పాట 60 (17)
8 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: 1998 వార్షిక పుస్తకము (ఆంగ్లం) పూర్తి ప్రయోజనాన్ని పొందండి. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సాధించిన దైవపరిపాలనా పురోభివృద్ధులను ఉన్నతపరుస్తూ, 3-6, 31 పేజీలను తండ్రి తన కుటుంబంతో పునఃసమీక్షిస్తాడు. దినవచనాన్నీ, వార్షిక పుస్తకములో కొన్ని భాగాల్నీ భోజన వేళల్లో కలిసి చదివి, చర్చించడం మూలంగా కుటుంబం పొందిన ప్రయోజనాల్ని పరిశీలిస్తారు, ఈ సంవత్సరమంతా అలా చేస్తూ ఉండాలని నిర్ణయించుకుంటారు.
22 నిమి: “మనమా లక్ష్యాన్ని మళ్ళీ సాధిస్తామా?” (1-11 పేరాలు) ప్రశ్నా జవాబులు. 1998 వార్షిక పుస్తకములో నివేదించబడినట్లుగా సహాయ పయినీరు సేవ కొరకైన గత సంవత్సరపు ఉన్నతాంశాల్ని తెలియజేయండి. ఆ సమయంలో స్థానికంగా సహాయ పయినీరుసేవ చేసినవారి సంఖ్యను ప్రస్తావించండి. పయినీరు సేవ నుండి మనం వెంటనే పొందే వ్యక్తిగత ప్రయోజనాల్ని చర్చించి, ఈ అదనపు ప్రయత్నం సంఘపురోభివృద్ధికి ఎలా దోహదపడుతుందో చూపించండి. ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ఎక్కువ మంది పయినీరుసేవ చేయడానికి మద్దతునిచ్చేందుకు స్థానికంగా ప్లాన్ చేసిన సేవా ఏర్పాట్లను క్లుప్తంగా తెలియజేయండి. కూటం ముగిసిన తర్వాత ప్రచారకులు దరఖాస్తులను పొందవచ్చు.
పాట 195 (8), ముగింపు ప్రార్థన.
మార్చి 16తో ప్రారంభమయ్యే వారం
పాట 43 (4)
8 నిమి: స్థానిక ప్రకటనలు. మార్చి 29న ఇచ్చే ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి హాజరయ్యేందుకు ఆసక్తిగలవారందరినీ ఆహ్వానించండి. ఆ ప్రసంగం పేరు “బైబిలును మీరెందుకు నమ్మవచ్చు.”
15 నిమి: స్థానిక అవసరాలు.
22 నిమి: “మనమా లక్ష్యాన్ని మళ్ళీ సాధిస్తామా?” (12-29 పేరాలు) ప్రశ్నా జవాబులు. మన పరిచర్య పుస్తకములో 113-14 పేజీల్లో సంక్షిప్తంగా తెలియజేయబడిన అర్హతల్ని పునఃసమీక్షించండి. సహాయ పయినీరుసేవ ఒకరిని క్రమ పయినీరు సేవకు ఎలా సంసిద్ధులను చేస్తుందో వివరించండి. గత వేసవిలో సహాయ పయినీరుసేవ చేసిన వారు 60 గంటల్ని వెచ్చించడానికి తమ షెడ్యూల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నారో తెలియజేయడానికి వారిలో కొందరిని ఆహ్వానించండి. ఇన్‌సెర్ట్‌లోని చివరి పేజీలో ఉన్న ఏ నమూనా షెడ్యూల్ వారి విషయంలో బాగా పనిచేసింది? సమయముంటే, కావలికోట జనవరి 15, 1988, 6వ పేజీలోనూ, 1987 వార్షిక పుస్తకము 48-9, 245-6 పేజీల్లోనూ ఉన్న అనుభవాల్ని చెప్పండి. కూటం ముగిసిపోయిన తర్వాత దరఖాస్తుల్ని తీసుకోమని ప్రచారకుల్ని ప్రోత్సహించండి.
పాట 224 (28), ముగింపు ప్రార్థన.
మార్చి 23తో ప్రారంభమయ్యే వారం
పాట 94 (5)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్ 11న జరగబోయే జ్ఞాపకార్థదిన ఆచరణకు ఆసక్తి ఉన్న వారిని ఆహ్వానించడం మొదలుపెట్టమని అందర్నీ ప్రోత్సహించండి. ఆహ్వాన పత్రిక ప్రతిని చూపించండి, అందర్నీ ఆహ్వానపత్రికలను తీసుకోమనీ, వాటిని ఈ వారాంతంలో పంచిపెట్టమనీ ప్రోత్సహించండి. ఏప్రిల్ నెలలో సహాయ పయినీరుసేవ చేసే వారందరి పేర్లను ప్రకటించండి. దరఖాస్తులను ఇవ్వడానికి ఇప్పటికీ సమయం ఉందని వివరించండి. ఏప్రిల్ నెల కొరకు ఏర్పాటు చేయబడిన సేవా కూటాల షెడ్యూల్‌ను క్లుప్తంగా తెలియజేయండి.
20 నిమి: ప్రాంతీయ సేవ కొరకు క్రొత్తవారిని సిద్ధపర్చండి. ప్రసంగమూ, ప్రేక్షకులతో చర్చ. జ్ఞానము పుస్తకంలో బైబిలు పఠనాన్ని నిర్వహిస్తున్న వారు, తమ విద్యార్థి ప్రాంతీయ సేవలో పాల్గొనేలా అతడ్ని సంసిద్ధుణ్ణి చేసే విషయాన్ని పరిశీలించాలి. జ్ఞానము పుస్తకం 105-6 పేజీల్లో 14వ పేరాలోనూ, 179వ పేజీలో 20వ పేరాలోనూ చెప్పబడిన విషయాన్ని ఎత్తి చూపించండి. క్రొత్తవారు బాప్తిస్మం పొందని ప్రచారకులుగా గుర్తించబడడానికి కావలికోట నవంబరు 15, 1988 (ఆంగ్లం) లో 16-17 పేజీల్లో 7-10 పేరాల్లో తెలుపబడిన పద్ధతిని పునఃసమీక్షించండి. సేవను ప్రారంభించడంలో బాప్తిస్మం తీసుకొనని క్రొత్త ప్రచారకులకు సహాయపడేందుకు మన రాజ్య పరిచర్య జూన్ 1996 ఇన్‌సెర్ట్‌లో 19వ పేరాలో ఇవ్వబడిన సలహాలను పరిశీలించండి.
15 నిమి: ప్రశ్నాభాగము. ప్రశ్నాజవాబులు. మన పరిచర్య పుస్తకం 131వ పేజీ, 1, 2 పేరాల్లోని సమాచారాన్ని పెద్ద పునఃసమీక్షిస్తాడు.
పాట 47 (11), ముగింపు ప్రార్థన.
మార్చి 30తో ప్రారంభమయ్యే వారం
పాట 29 (18)
12 నిమి: స్థానిక ప్రకటనలు. తమ తమ మార్చి నెల ప్రాంతీయ సేవా రిపోర్టులను ఇవ్వమని అందరికీ గుర్తుచేయండి. పత్రికల తాజా సంచికలను ప్రదర్శించి, వాటిని ప్రతిపాదించేటప్పుడు మీరే శీర్షికల్ని ఉన్నతపరుస్తారో తెలియజేయండి, కొన్ని నిర్దిష్టమైన సంభాషణా అంశాల్ని ప్రస్తావించండి. “జ్ఞాపకార్థ దిన జ్ఞాపికలు” పునఃసమీక్షించండి. జ్ఞాపకార్థ దినం కొరకు స్థానికంగా చేసిన ఏర్పాట్లను వివరించండి. బైబిలు విద్యార్థులూ, ఆసక్తికల్గిన వ్యక్తులూ హాజరయ్యేలా సహాయపడేందుకు అందరూ తమ తమ నిర్దిష్టమైన పథకాలను వేసుకోవాలి. ప్రతిదినము లేఖనములను పరిశీలించుటలో ఏప్రిల్ 6-11 తారీఖుల కొరకు ఇవ్వబడిన జ్ఞాపకార్థ బైబిలు పఠన షెడ్యూల్‌ను అనుసరించేలా నిశ్చయం చేసుకోవాలని అందరికీ జ్ఞాపకం చేయండి.
13 నిమి: “పిల్లలారా—మా ఆనందం మీరే!” ప్రశ్నాజవాబులు. కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 1, 1987 25వ పేజీలోని అనుభవాన్ని చెప్పండి.
20 నిమి: ఆధ్యాత్మిక అలసటకు వ్యతిరేకంగా పోరాడే మార్గాలు. కావలికోట (ఆంగ్లం) జనవరి 15, 1986 పేజీ 19లో ఉన్న బాక్సును ఇద్దరు పెద్దలు చర్చిస్తారు. “అలసట లక్షణాలు”లో ప్రతీదాన్నీ దానికి ఎదురుగా ఉన్న “సహించుకొనేందుకు సహాయకాలు”నుండి ఒకరెలా ప్రయోజనాన్ని పొందవచ్చో లేఖనాధారంగా వివరించండి. తర్వాత ఇద్దరు ప్రచారకుల్ని ఇంటర్వ్యూ చేయండి. వాళ్లు తమ ఆధ్యాత్మిక బలాన్ని కాపాడుకొనేందుకు అలాంటి అంశాల అన్వయింపు వారికి ఎలా సహాయపడిందో వ్యాఖ్యానించమనండి.
పాట 140 (26), ముగింపు ప్రార్థన.