ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకము రూ. 20.00 చందాకు. గృహ బైబిలు పఠనాలను ప్రారంభించడంపై దృష్టి కేంద్రీకరించండి. ఏప్రిల్, మే: కావలికోట, తేజరిల్లు!ల కొరకు చందాలు. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 90.00. మాస పత్రికల వార్షిక చందా, పక్షపత్రికల ఆరు నెలల చందా రూ. 45.00. మాస పత్రికలకు ఆరు నెలల చందా లేదు. చందా కట్టడానికి నిరాకరించినట్లైతే, విడిపత్రికలను ఒక్కొక్క దానినీ రూ. 4.00లకు ప్రతిపాదించాలి. జూన్: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించండి. (పయినీర్లకు రూ. 15.00.) ప్రత్యామ్నాయంగా, ప్రత్యేక ధర పుస్తకాల లిస్టులో లేక సగం ధర పుస్తకాల లిస్టులో ఉన్న ఏ పాత పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు.
గమనిక: పైన పేర్కొన్న ప్రచార సాహిత్యాల్లో వేటిననైనా ఇంత వరకూ రిక్వెస్ట్ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-AB-14)నందు రిక్వెస్ట్ చేయాలి.
◼ ఏప్రిల్, మే నెలల్లో సహాయ పయినీర్లుగా సేవ చేయాలనుకునే ప్రచారకులు ఇప్పుడే పథకాలు వేసుకుని, ముందుగానే అప్లికేషన్‌లను ఇవ్వాలి. అవసరమైన ప్రాంతీయ సేవా ఏర్పాట్లను చేసేందుకు, కావలసినన్ని పత్రికలనూ, ఇతర సాహిత్యాలనూ స్టాక్‌లో ఉంచడానికి పెద్దలకు ఇది సహాయపడుతుంది. సహాయ పయినీరు సేవను చేసేందుకు ఆమోదాన్ని పొందిన వారి పేర్లను సంఘంలో ప్రకటించాలి.
◼ సంఘ పైవిచారణకర్త గానీ లేక ఆయన నియమించిన మరొకరు గానీ మార్చి 1వ తారీఖున లేక అటు తర్వాత సాధ్యమైనంత త్వరలో సంఘ లెక్కల్ని ఆడిట్ చేయాలి. ఇలా ఆడిట్ చేసిన తర్వాత సంఘానికి ప్రకటించాలి.