జ్ఞాపకార్థదిన జ్ఞాపికలు
ఏప్రిల్ 11, శనివారం జ్ఞాపకార్థదిన ఆచరణ జరుగుతుంది. పెద్దలు ఈ క్రింది విషయాలపై శ్రద్ధను కనపర్చాలి:
◼ కూటాన్ని నిర్వహించే సమయాన్ని నిర్ణయించేటప్పుడు, చిహ్నాలు సూర్యాస్తమయానికి ముందుగా అందించకుండా ఉండేలా నిశ్చయపర్చుకోవాలి.
◼ ఈ ఆచరణ జరిగే కచ్చితమైన సమయాన్నీ, స్థలాన్నీ ప్రసంగీకునితోపాటు అందరికీ తెలియజేయాలి.
◼ జ్ఞాపకార్థదిన ఆచరణకు తగిన రొట్టెనూ, ద్రాక్షామద్యాన్నీ సంపాదించి, సిద్ధంగా ఉండేలా చూడాలి.–ఫిబ్రవరి 15, 1985, కావలికోట (ఆంగ్లం), 19వ పేజీ చూడండి.
◼ ప్లేట్లనూ, గ్లాసుల్నీ, తగిన టేబుల్నీ, టేబుల్‌క్లాత్‌నీ ఆచరణ జరిగే హాలుకు ముందుగానే తీసుకొచ్చి వాటికి కేటాయించబడిన స్థలంలో ఉంచాలి.
◼ రాజ్యమందిరాన్ని గానీ లేక ఆ కూటం నిర్వహించబడే మరితర స్థలాన్నిగానీ ఎంతో ముందుగానే బాగా శుభ్రపర్చాలి.
◼ అటెండెంట్లనూ, చిహ్నాల్ని అందించే వారినీ ఎంపికచేసుకొని వారికి సరియైన పద్ధతిని గురించీ, వాళ్లు నిర్వహించే పనుల్ని గురించీ ముందుగానే ఉపదేశించాలి.
◼ అనారోగ్యంతో ఉండి, హాజరుకాలేని స్థితిలోవున్న అభిషిక్తులు ఎవరైనా ఉంటే వారికి చిహ్నాల్ని అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.
◼ ఒకే రాజ్యమందిరాన్ని ఒకటికన్నా ఎక్కువ సంఘాలు ఉపయోగించుకునేందుకు షెడ్యూలు వేయబడితే, వరండాలోనూ, ప్రవేశ మార్గాల్లోనూ, పుట్‌పాత్‌లపైనా, పార్కింగ్ స్థలాల్లోనూ అనవసరమైన రద్దీలేకుండా జాగ్రత్తపడేందుకు సంఘాల మధ్య మంచి సమన్వయం ఉండాలి.