క్షేత్రసేవా ముఖ్యాంశాలు
ఏప్రిల్ 2011
మన దేశంలో, 2011 సేవా సంవత్సరం జరిగిన ప్రకటనా పనిని యెహోవా ఆశీర్వదించాడని స్పష్టమౌతోంది. 94,954 మంది జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యారు, గత సంవత్సరం హాజరుతో పోలిస్తే ఇది 8.5 శాతం ఎక్కువ. 17,222 మంది సహాయ పయినీరు సేవ చేసి, ఏప్రిల్ నెలలో జరిగిన ప్రత్యేక ప్రకటనా పనికి ఎంతో చక్కగా మద్దతిచ్చారు. ముందెప్పుడూ లేనంతగా ప్రచారకుల సంఖ్య 34,912కు, క్రమ పయినీర్ల సంఖ్య 3,206కు, బైబిలు అధ్యయనాల సంఖ్య 41,554కు చేరుకుంది.