మా పాఠకుల నుండి
ఒక యుద్ధదేవుడా? ఫిబ్రవరి 8, 1994, తేజరిల్లు! నందు “బైబిలు ఉద్దేశము . . . యెహోవా యుద్ధ దేవుడా?” అనే చక్కని శీర్షికను అందించినందుకు కృతజ్ఞతలు. కొన్ని సంవత్సరాలుగా అనేకమంది అలాగే ప్రశ్నించారు. మేము దానిని కుటుంబపరంగా ఒక సందర్భంలో పరిశీలించాం. మీ శీర్షికతోపాటు, నేను చేసిన పరిశీలన, నా ప్రశ్నకు సమాధానం దొరుకునట్లు చేసింది.
ఎస్. టి., అమెరికా
తల్లి-పాలు మేము “తల్లిపాలకు అనుకూలమైన సాక్ష్యం.” అనే శీర్షికను చదువుటకు సంతోషించాం. (జనవరి 8, 1994) ప్రస్తుతం నా భార్య మా పాపకు తన పాలనే ఇస్తున్నది. పాలనివ్వడం వల్ల తల్లి భౌతికంగా క్షీణిస్తుందనే వాస్తవాన్ని ఈ శీర్షికలో ప్రస్తావించలేదు. బహుశ, రాత్రులందు పాలివ్వడం ప్రతి స్త్రీకి సాధ్యంకాక పోవచ్చు. ఉదాహరణకు, మా విషయంలో, నా భార్య కొద్దిగా నిద్రలోకి జారుకున్నట్లైతే, అది ఆమెకు చాలా కష్టము.
టి. కె., జర్మనీ
పరిశీలించినందుకు మీకు కృతజ్ఞతలు. క్రొత్తగా తల్లులైనవారు ఈ విషయంలో అనుభవించే కొన్ని కష్టాలను గూర్చి క్రిందటి శీర్షికలు చర్చించారు. ఉదాహరణకు, జూన్ 8, 1983, మరియు మార్చి 22, 1986, “అవేక్!”లను చూడండి.—ఎడిటర్.
చాలా దూరం? మీ పత్రికలో “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ‘చాలా దూరం’ అంటే ఎంతదూరం?” అనే (ఫిబ్రవరి 8, 1994) శీర్షికకు ధన్యవాదాలు. నేను బాప్తిస్మం తీసుకొన్న క్రైస్తవునిగా ఉంటూ ఇప్పటికి దాదాపుగా ఒక సంవత్సరం పైగా అయ్యింది, మరి ఈ విషయంలో యెహోవా దృక్కోణమేమిటో అని ఆశ్చర్యపడేవాడ్ని. ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు నేను ప్రశంసిస్తున్నాను. అది సులభం కానప్పటికి, నేను యెహోవా నియమాలకు కట్టుబడి జీవించుటకు తీర్మానించుకొన్నాను.
సి. ఎస్., అమెరికా
కొన్ని నెలలుగా నేను అలాంటి శీర్షిక కోసమే ఎదురు చూస్తున్నాను. తొమ్మిది మాసాలుగా నేను చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాను, మరి ఈ శీర్షిక వచ్చినప్పుడే, వెంటనే నా బాయ్‌ఫ్రెండుకు ఫోన్ చేసాను. ఇంతటి సున్నితమైన మరియు మృదువైన విషయాలపై మాకు ఉపదేశిస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతలు.
ఎ. పి. జి. ఎస్., బ్రెజిల్
హృదయపూర్వకంగా నేను ఈ శీర్షికను ప్రశంసిస్తున్నాను. ఇది సరిగ్గా నాకు అవసరమైనప్పుడు వచ్చింది. నాకు 16 సంవత్సరాలు, మరి నాలాగే ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి సన్నిహితంగా వుండాలని ఆలోచిస్తున్నాను. నిజంగా వ్యభిచారం తప్పు అని నాకు తెలుసు, కాని ముద్దు పెట్టుకోవడం మరియు ఆలింగనం చేసుకోవడం చాలా దూరం వెళ్లినట్లు కాదనుకున్నాను. అయితే ఈ శీర్షికతో, వివాహం చేసుకునే వయస్సొచ్చేంత వరకు అలాంటి పనులన్నియు చాలా దూరం! పోతున్నాయని నేను గ్రహించగలిగాను.
యమ్. హెచ్., జపాను
నేను యౌవనస్థురాలిని కాను, కాని నేను ఒంటరిగానే ఉంటున్నాను, నాకు అదే ప్రశ్న వచ్చింది. నేను ఒక వ్యక్తితో కలిసి తిరుగుతున్నాను, పూర్తికాల సువార్తికురాలిగా, సమాధానం నాకు తెలిసే ఉండాలి. అయితే మీరు భావోద్రేకంలో చిక్కుకున్నప్పుడు, మీ తీర్పు అస్పష్టమైన స్థితిలో ఉండగలదు. ఈ శీర్షిక సమాయానుకూలంగాను, నేను కలిసి తిరుగుతున్న క్రైస్తవునితో ఈ విషయాన్ని గూర్చి మాట్లాడుటకు చాలా గొప్పగా సహాయం చేసింది. మేము ఇద్దరం కలిసి దానిని చదువుకున్నాం మరియు మేము అందరిముందు మర్యాదగా నడుచుకోవాలని యిష్టపడుతున్నాము.
యమ్. అర్., అమెరికా
నేను ఈ విషయమై వివరణకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నేను ఈ శీర్షిక యొక్క అంశాన్ని చూసానో, నేను ఎంతో ఆశ్చర్యపోయాను. నేను ఆతురతతో చదివాను, నేను సరిగ్గా ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు నాకు తెలిసింది.
ఎస్. జీ., ఇటలీ
రక్తరహిత వైద్య నిర్వహణ “యెహోవాసాక్షులు మరియు వైద్య సిబ్బంది సహకరిస్తున్నారు,” అనే శీర్షిక విషయమై (మార్చి 8, 1994), నేను మీకు కృతజ్ఞుడను. దానిని నేను చదువుతుండగా, నా కన్నులనుండి మెప్పుతో నిండిన ఆనందబాష్పాలు రాలాయి. మేమెన్నడూ ఈ సమస్యను ఎదుర్కోనప్పటికిని మాలో కొందరికి తెలియని కొంత కష్టమైన పనిని ఈ శీర్షికనందు వివరించారు. రక్త వివాదాంశం యెడల మా విశ్వాస పరీక్షను ఏదో ఒకనాడు మాలో ఎదుర్కొనబోయే వారి కోసం, మా పక్షంగా ఆసక్తిదాయకంగా పనిచేసే మా సహోదరులున్నారని తెలుసు కోవడమనేది గొప్ప ఓదార్పుకరము.
బి. బి., అమెరికా