కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g19 No. 3 పేజీలు 4-5
  • శారీరక ఆరోగ్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శారీరక ఆరోగ్యం
  • తేజరిల్లు!—2019
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి
  • చెడు అలవాట్లకు దూరంగా ఉండండి
  • ఇంకొన్ని బైబిలు సూత్రాలు
  • 1 | ఆరోగ్యం కాపాడుకోండి
    తేజరిల్లు!—2022
  • మీ శరీరానికి నిద్ర ఎందుకవసరం
    తేజరిల్లు!—1995
  • నాకు మంచిగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • ఆరోగ్య సంరక్షణ విషయంలో లేఖనాల నిర్దేశాన్ని పాటిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
తేజరిల్లు!—2019
g19 No. 3 పేజీలు 4-5
ఒకతను బైబిలు చదువుతున్నాడు

శారీరక ఆరోగ్యం

బైబిలు వైద్యానికి సంబంధించిన పుస్తకం కాదు. కానీ, ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడే మంచి సలహాలు అందులో ఉన్నాయి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చగల కొన్ని బైబిలు సూత్రాల్ని పరిశీలించండి.

మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి

బైబిలు సూత్రం: “ఏ మనిషీ తన శరీరాన్ని ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి, సంరక్షించుకుంటాడు.”—ఎఫెసీయులు 5:29.

అంటే: మన శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని ఈ బైబిలు సూత్రం మనల్ని ప్రోత్సహిస్తుంది. ప్రజల జీవనశైలి వల్లే చాలారకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఒక పరిశోధన చెప్తుంది. కాబట్టి, మన జీవనశైలి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మరింత ఆరోగ్యంగా ఉండగలుగుతాం.

మీరేం చేయవచ్చు:

  • పౌష్టికాహారం. ఆరోగ్యకరమైన ఆహారం తినండి, సరిపడా నీళ్లు తాగండి.

  • చురుగ్గా ఉండండి. మీరు ఏ వయసు వాళ్లయినాసరే, చివరికి అంగవైకల్యం ఉన్నా లేక ఎంతోకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా శారీరక శ్రమ వల్ల మీ ఆరోగ్యం మెరుగౌతుంది. మీకు కావల్సినవాళ్లు, వైద్యులు మీరు ఏ ఎక్సర్‌సైజ్‌లు చేయవచ్చో చెప్పగలరు, అయితే వాటిని చేయాల్సింది మాత్రం మీరే!

  • తగినంత నిద్రపోండి. ఎక్కువకాలం పాటు సరిపడా నిద్రపోకపోతే, తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. నిద్రపోవాల్సిన సమయంలో వేరే పనులు చేస్తుండడంవల్ల ప్రజలు నిద్రలేమికి గురౌతారు. కాబట్టి తగినంత సమయం నిద్రపోవాలని నిర్ణయించుకుంటే, మీ ఆరోగ్యం బావుంటుంది.

చెడు అలవాట్లకు దూరంగా ఉండండి

బైబిలు సూత్రం: “మన శరీరానికి, మనసుకు ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం.”—2 కొరింథీయులు 7:1.

అంటే: మన శరీరానికి హానికలిగించే పొగాకులాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. వాటివల్ల చాలామంది రోగాల బారిన పడుతున్నారు, చనిపోతున్నారు.

మీరేం చేయవచ్చు: ఉదాహరణకు మీకు పొగతాగే అలవాటు ఉంటే, దాన్ని ఎప్పటినుండి మానేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని, ఆ తేదీని మీ క్యాలెండర్‌లో నోట్‌ చేసుకోండి. అలా నోట్‌ చేసిన తేదీకి ఒక్కరోజు ముందు మీ సిగరెట్లను, యాష్‌ట్రేలను, లైటర్లను, ఈ అలవాటుకు సంబంధించిన ఇతర వస్తువుల్ని పడేయండి. ఇతరులు పొగతాగే ప్రదేశాలకు వెళ్లకండి. మీకు మద్దతిచ్చే స్నేహితులకు మీ నిర్ణయం గురించి చెప్పండి.

ఇంకొన్ని బైబిలు సూత్రాలు

ఒకతను బైబిలు చదువుతున్నాడు

మీ దగ్గర్లో ఉన్న ఒక యెహోవాసాక్షిని అడిగి ఒక బైబిలు తీసుకోవచ్చు

జాగ్రత్తలు పాటించండి.

“క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానిమీదనుండి యెవడైనను పడుటవలన నీ యింటిమీదికి హత్యదోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను.”—ద్వితీయోపదేశకాండము 22:8.

కోపాన్ని అదుపు చేసుకోండి.

“కోప్పడే విషయంలో నిదానించే వ్యక్తికి గొప్ప వివేచన ఉంది, ముక్కోపి తన తెలివితక్కువతనాన్ని ప్రదర్శిస్తాడు.”—సామెతలు 14:29, NW.

అతిగా తినకండి.

“అతిగా తినేవాళ్లతో సహవసించకు.”—సామెతలు 23:20, NW.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి