కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g25 No. 1 పేజీలు 12-13
  • ఇచ్చే గుణం చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇచ్చే గుణం చూపించండి
  • తేజరిల్లు!—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇవ్వడం ఎందుకు అలవాటు చేసుకోవాలి?
  • మీరేం చేయవచ్చు?
  • ఉదారంగా ఇచ్చేవాళ్లు సంతోషంగా ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • నేను ఎందుకు ఇతరులకు సహాయం చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • యెహోవా ఔదార్యానికి, అర్థంచేసుకునే మనస్తత్వానికి ఉన్న విలువను గుర్తించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • అందరితో మంచి సంబంధం కలిగివుండాలంటే ఏం చేయాలి?
    తేజరిల్లు!—2021
మరిన్ని
తేజరిల్లు!—2025
g25 No. 1 పేజీలు 12-13
ఒక కుటుంబం తమ గుడిసె బయట ఉన్న బల్ల చుట్టూ కూర్చుని, తమతోపాటు ఉన్న ఒక అతిథితో కలిసి సంతోషంగా భోంచేస్తున్నారు.

ధరలు పెరిగిపోతుంటే బ్రతికేదెలా?

ఇచ్చే గుణం చూపించండి

రేట్లు కొండెక్కి కూర్చోవడం వల్ల ఏమీ కొనలేక-తినలేక మీరు ఇబ్బందులు పడుతుండవచ్చు. అలాంటి సమయంలో ఇంకొకరికి పెట్టడమంటే, జరిగే పనేనా అని మీకు అనిపించవచ్చు. కానీ ఒకరికి పెట్టడం వల్ల మీకు లాభమే ఉంటుంది గానీ నష్టం రాదు. ఒక చేత్తో మీ రూపాయిని జాగ్రత్త చేస్తూనే, ఇంకో చేత్తో వేరేవాళ్లకు సహాయం చేయవచ్చు.

ఇవ్వడం ఎందుకు అలవాటు చేసుకోవాలి?

మీరు వేరేవాళ్లకు ఏ చిన్న సహాయం చేసినా మీకు సంతోషంగా ఉంటుంది, మంచి పని చేశారనే ఫీలింగ్‌ వస్తుంది. నిజానికి వేరేవాళ్లకు మంచి చేసినప్పుడు మీ శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. ఉదాహరణకు మన టెన్షన్‌లు, ఒత్తిళ్లు, ఆఖరికి నొప్పులు కూడా తగ్గవచ్చు. అంతేకాదు, మంచి నిద్ర కూడా పడుతుంది.

“తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొస్తలుల కార్యాలు 20:35.

మనం వేరేవాళ్లకు డబ్బులు గానీ ఇంకేదైనా గానీ ఇచ్చి సాయం చేస్తే, మనం అవసరంలో ఉన్నప్పుడు వేరేవాళ్లు చేసే సహాయాన్ని తీసుకోవడానికి మన మనసు ఒప్పుకుంటుంది. ఇంగ్లాండ్‌లో ఉంటున్న హవర్డ్‌ ఇలా అంటున్నాడు: “వేరేవాళ్లకు ఇవ్వడానికి లేదా సహాయం చేయడానికి నేను, నా భార్య ఎప్పుడూ ముందుంటాం. అలా చేసినప్పుడు, మాకు ఎవరైనా సహాయం చేస్తే తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించదు.” నిజమే, ఇచ్చే గుణం ఉన్నవాళ్లు ఇతరులు తమకు తిరిగి ఏదోకటి చేయాలని ఆశించరు. బదులుగా, కష్టంలో తమను ఆదుకునే నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోగలుగుతారు.

“ఇవ్వడం అలవాటు చేసుకోండి, అప్పుడు ప్రజలు మీకు ఇస్తారు.”—లూకా 6:38.

మీరేం చేయవచ్చు?

మీకు ఉన్నదాంట్లోనే ఇవ్వండి. మీ సంపాదన తక్కువే అయినా, అందులో నుండి కూడా మీరు వేరేవాళ్లకు ఎంతోకొంత ఇవ్వవచ్చు. బహుశా మీరు ఎక్కువ హడావిడి లేకుండా ఒక్క కూరతో భోజనం పెట్టినా చాలు! ఉగాండాలో ఉంటున్న డంకన్‌కి, ఆయన కుటుంబానికి వచ్చే ఆదాయం చాలా తక్కువే, కానీ వాళ్లకు ఇచ్చే గుణం మాత్రం చాలా ఎక్కువనే చెప్పాలి. డంకన్‌ ఇలా అంటున్నాడు: “ఆదివారాల్లో నేను, నా భార్య ఎవరో ఒకరిని ఇంటికి పిలిచి మాకు ఉన్నదాంట్లోనే వండిపెడుతుంటాం. అలా వాళ్లతో కలిసి తింటూ, కబుర్లు చెప్పుకోవడం అంటే మాకు చాలా ఇష్టం.”

నిజమే, వేరేవాళ్లకు సహాయం చేస్తున్నప్పుడు మీరు వివేచన చూపించాలి. ఉన్నదంతా వేరేవాళ్లకు ఊడ్చిపెట్టేసి మీకు, మీ కుటుంబానికి ఏమీ మిగలకుండా ఉండే పరిస్థితి తెచ్చుకోకండి.—యోబు 17:5.

ఇలా చేసి చూడండి: ఎవరినైనా ఇంటికి పిలిచి సింపుల్‌గా ఏదోకటి వండి పెట్టవచ్చు లేదా టీ, కాఫీ లాంటివి ఇవ్వవచ్చు. మీరు వాడకుండా పక్కన పెట్టేసిన వస్తువులు ఏమైనా ఉంటే మీ ఫ్రెండ్స్‌కి గానీ, ఇరుగు-పొరుగు వాళ్లకు గానీ ఇవ్వవచ్చు. అవి వాళ్లకు పనికొచ్చేవి అయితే వాడుకుంటారు.


మనసుంటే మార్గాలు ఎన్నో. కొన్ని గిఫ్ట్స్‌ని రూపాయి ఖర్చు లేకుండానే ఇవ్వవచ్చు. ఉదాహరణకు, మన టైమ్‌ పెట్టి వేరేవాళ్లకు అవసరమయ్యే కొన్ని పనులు చేయవచ్చు. మీరు దయగా రెండు మాటలు మాట్లాడడం కూడా ఒక గిఫ్ట్‌ కిందే లెక్క! కాబట్టి మీరు అవతలి వాళ్లను ఎంత ఇష్టపడుతున్నారో, వాళ్లంటే మీకు ఎంత ప్రేమ ఉందో చెప్పండి.

ఇలా చేసి చూడండి: ఎవరికైనా ఇంటి పనులు చేయడంలో గానీ, రిపేర్లు చేయడంలో గానీ, సరుకులు లాంటివి తేవడంలో గానీ సహాయం చేయండి. ఒక ఫ్రెండ్‌కి మీ మనసులోని మాటల్ని కార్డులో గానీ, మెసేజ్‌లో గానీ రాసి పంపించండి. మీరు వాళ్లను గుర్తు చేసుకున్నారనో, మిస్‌ అవుతున్నారనో చెప్పే ఒక్క మాటైనా చాలు.

మీరు గోరంత ఇచ్చినా చాలు మీకు కొండంత దీవెనలు వస్తాయి.

“మంచి చేయడం, మీకున్న వాటిని ఇతరులతో పంచుకోవడం మర్చిపోకండి.”—హెబ్రీయులు 13:16.

ఒక జంట పెద్ద వయసైన ఒకామె పెరట్లో ఉన్న ఆకుల్ని శుభ్రం చేయడానికి సాయం చేస్తున్నారు. ఆమె వాళ్ల కోసం తాగడానికి వేడివేడిగా టీ తీసుకొచ్చింది.
ట్రే.

“మా ఇల్లు చిన్నదే కావచ్చు, కానీ మా మనసు పెద్దగా ఉండేలా చూసుకుంటాం. ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, వాళ్లకు హెల్ప్‌ చేయడం మాకు చాలా ఇష్టం, అందులోనే మా ఆనందం ఉంది. మేము వాళ్లకు ఎక్కువగా ఇవ్వగలిగింది ఏదైనా ఉందంటే, అది మా సమయమే. అవసరమైతే కొన్నిసార్లు డబ్బులు కూడా ఇస్తాం. తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది అనే మాట ఎంత నిజమో మేము మా జీవితంలో పదేపదే రుచి చూశాం.”—ట్రే, ఇజ్రాయిల్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి