10
అన్నివేళలా లోబడిన యేసు
అమ్మానాన్నలకు లోబడడం మీకు ఎప్పుడూ సులువేనా?— ఒక్కోసారి కష్టమే. అమ్మానాన్నలకు, యెహోవాకు యేసు లోబడ్డాడని మీకు తెలుసా?— కష్టమనిపించినప్పుడు కూడా అమ్మానాన్నలకు లోబడవచ్చని ఆయన ఉదాహరణ మీకు నేర్పిస్తుంది. అదెలాగో తెలుసుకుందాం.
యేసు భూమ్మీదకు రాకముందు పరలోకంలో తన తండ్రి యెహోవా దగ్గర ఉన్నాడు. అయితే యేసుకు భూమ్మీద కూడా అమ్మానాన్నలు ఉన్నారు. యేసువాళ్ల నాన్న యోసేపు, అమ్మ మరియ. వాళ్లు యేసుకు అమ్మానాన్నలు ఎలా అయ్యారో తెలుసా?—
యేసు ఈ భూమ్మీద పుట్టి, ఇక్కడ జీవించాలనే ఉద్దేశంతో యెహోవా పరలోకం నుండి ఆయన ప్రాణాన్ని మరియ గర్భంలోకి మార్చాడు. నిజంగా అదో అద్భుతం! తల్లి కడుపులో బిడ్డ ఎలా ఎదుగుతాడో మరియ కడుపులో యేసు కూడా అలాగే ఎదిగాడు. ఆ తర్వాత తొమ్మిది నెలలకు యేసు పుట్టాడు. అలా మరియ, ఆమె భర్త యోసేపు భూమ్మీద యేసుకు అమ్మానాన్నలు అయ్యారు.
యేసుకు 12 ఏళ్లు ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆయనకు తన పరలోక తండ్రి యెహోవా మీద ఎంత ప్రేమ ఉందో అది చూపించింది. యేసువాళ్ల కుటుంబమంతా పస్కా పండుగ కోసం చాలా దూరంలో ఉన్న యెరూషలేముకు వెళ్లినప్పుడు ఆ సంఘటన జరిగింది. తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు, యోసేపు మరియలకు యేసు ఎక్కడా కనిపించలేదు. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నట్టు?—
యేసు ఆలయంలోనే ఎందుకు ఉండిపోయాడు?
వెంటనే యోసేపు మరియలు మళ్లీ పరుగుపరుగున యెరూషలేముకు వెళ్లి యేసు కోసం అంతటా వెదికారు. ఆయన కనబడకపోయేసరికి వాళ్లు చాలా కంగారుపడ్డారు. కానీ మూడు రోజుల తర్వాత ఆలయంలో కనిపించాడు! యేసు అక్కడే ఎందుకు ఉండిపోయాడు?— ఎందుకంటే, తన తండ్రి యెహోవా గురించి అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకోగలడు. యేసు యెహోవాను ప్రేమించాడు, ఆయనను సంతోషపెట్టడానికి ఏమి చేయాలో నేర్చుకోవాలనుకున్నాడు. యేసు పెరిగి పెద్దయ్యాక కూడా యెహోవాకు లోబడే ఉన్నాడు. అలా చేయడం కష్టమనిపించినా, దానివల్ల బాధలు వస్తాయని తెలిసినా సరే యేసు లోబడ్డాడు. మరి యోసేపు మరియలకు కూడా ఆయన లోబడ్డాడా?— అవును, లోబడ్డాడని బైబిలు చెబుతోంది.
యేసు నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?— కష్టమనిపించినా సరే మీరు మీ అమ్మానాన్నలకు లోబడాలి. మరి మీరు వాళ్లకు లోబడతారా?—
మీ బైబిల్లో చదవండి
లూకా 1:30-35; 2:45-52