కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • yc పాఠం 13 పేజీలు 28-29
  • ప్రజలకు సహాయపడాలనుకున్న తిమోతి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రజలకు సహాయపడాలనుకున్న తిమోతి
  • చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తిమోతి—సేవచేయడానికి సిద్ధంగావుండేవాడు, సేవచేయడానికి ఇష్టపడేవాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • పౌలు, తిమోతి
    నా బైబిలు పుస్తకం
  • తిమోతి—‘విశ్వాసమునుబట్టి నిజమైన కుమారుడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి మనకేమి సహాయం చేయగలదు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
yc పాఠం 13 పేజీలు 28-29
అమ్మ యునీకే, అమ్మమ్మ లోయి దగ్గర నేర్చుకుంటున్న బాల తిమోతి

13

ప్రజలకు సహాయపడాలనుకున్న తిమోతి

తిమోతి అనే యువకుడికి ప్రజలకు సహాయం చేయడమంటే ఎంతో ఇష్టం. దానికోసం అతను చాలా ప్రాంతాలు తిరిగాడు. అందుకే అతని జీవితం ఆనందంగా, ఉత్సాహంగా సాగిపోయింది. అతను చేసినదాని గురించి తెలుసుకోవాలనుందా?—

తిమోతి వాళ్ల అమ్మ, అమ్మమ్మ అతనికి యెహోవా గురించి నేర్పించారు

తిమోతి లుస్త్ర అనే పట్టణంలో పెరిగాడు. వాళ్ల అమ్మ యునీకే, అమ్మమ్మ లోయి చిన్నప్పటి నుండే తిమోతికి యెహోవా గురించి నేర్పించారు. తిమోతి పెద్దవాడవుతుండగా, యెహోవా గురించి ఇతరులకు నేర్పించాలనే కోరిక అతనిలో కలిగింది.

పౌలు వేరే ప్రాంతాల్లో ప్రకటనా పని చేయడానికి తనతో రమ్మని తిమోతిని అడిగాడు. తిమోతి అప్పటికి ఇంకా యువకుడే. అయితే పౌలు అడిగినప్పుడు తిమోతి, ‘అలాగే, వస్తాను!’ అన్నాడు. వేరేచోటికి వెళ్లి ప్రజలకు సహాయం చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడు.

పౌలుతో కలిసి తిమోతి మాసిదోనియలోని థెస్సలొనీక అనే పట్టణానికి వెళ్లాడు. అక్కిడికు వెళ్లాలంటే వాళ్లు చాలా దూరం నడిచి ఓడ ఎక్కాలి. చివరకు వాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఆ పట్టణంలో చాలామందికి యెహోవా గురించి నేర్పించారు. కానీ కొంతమంది వీళ్ల మీద కోప్పడ్డారు, వీళ్లకు హాని చేయాలని చూశారు. అందుకే పౌలు, తిమోతి అక్కడ నుండి వెళ్లిపోయి వేరే ప్రాంతాల్లో ప్రకటించాల్సి వచ్చింది.

ఓడలో అపొస్తలుడైన పౌలుతో కలిసి ప్రయాణిస్తున్న తిమోతి

తిమోతి జీవితం ఆనందంగా, ఉత్సాహంగా సాగిపోయింది

కొన్ని నెలల తర్వాత, మళ్లీ థెస్సలొనీకకు వెళ్లి సహోదరులు ఎలా ఉన్నారో చూసిరమ్మని పౌలు తిమోతికి చెప్పాడు. అపాయకరమైన ఆ పట్టణానికి మళ్లీ వెళ్లాలంటే చాలా ధైర్యం కావాలి! అయినా, అక్కడున్న సహోదరులు ఎలా ఉన్నారో ఏంటో చూడాలనే తపనతో తిమోతి వెళ్లాడు. అయితే మంచివార్తతో పౌలు దగ్గరకు తిరిగొచ్చాడు. థెస్సలొనీకలోని సహోదరులు క్షేమంగా ఉన్నారు!

తిమోతి చాలా సంవత్సరాలు పౌలుతో కలిసి పనిచేశాడు. తన దగ్గర తిమోతిలాంటి వాళ్లు ఎవ్వరూ లేరని, సంఘాలకు సహాయం చేయడానికి తిమోతియే సరైనవాడని పౌలు ఒక ఉత్తరంలో రాశాడు. తిమోతి యెహోవాను, ప్రజలను ప్రేమించాడు.

మీరు ప్రజలను ప్రేమిస్తున్నారా? వాళ్లకు యెహోవా గురించి నేర్పించాలని అనుకుంటున్నారా?— అలాగైతే, తిమోతి జీవితంలాగే మీ జీవితం కూడా ఆనందంగా, ఉత్సాహంగా సాగిపోతుంది!

మీ బైబిల్లో చదవండి

  • 2 తిమోతి 1:3-5; 3:14, 15

  • అపొస్తలుల కార్యములు 16:1-5; 17:1-10

  • 1 థెస్సలొనీకయులు 3:1-7

  • ఫిలిప్పీయులు 2:19-22

ప్రశ్నలు:

  • తిమోతి ఎక్కడ పెరిగాడు?

  • తిమోతికి పౌలుతో కలిసి వెళ్లడం ఇష్టమేనా? ఎందుకు?

  • తిమోతి థెస్సలొనీకకు మళ్లీ ఎందుకు వెళ్లాడు?

  • తిమోతి జీవితంలాగే మీ జీవితం కూడా ఆనందంగా, ఉత్సాహంగా సాగిపోవాలంటే ఏమి చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి