కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • od పేజీ 179-పేజీ 184
  • అనుబంధం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అనుబంధం
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ఇలాంటి మరితర సమాచారం
  • బాప్తిస్మం, దేవునితో మీ సంబంధం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • బాప్తిస్మం తీసుకోబోయే వాళ్లతో చేసే ముగింపు చర్చ
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం పెట్టుకోండి!
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • పిల్లలు బాప్తిస్మం తీసుకోవాలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
od పేజీ 179-పేజీ 184

అనుబంధం

క్రైస్తవ తల్లిదండ్రులకు ఒక సందేశం:

మీ ప్రియమైన పిల్లలు యెహోవాను ప్రేమించి, ఆయనకు సమర్పించుకోవాలని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటారు. మీ పిల్లల్ని బాప్తిస్మానికి సిద్ధం చేయడానికి మీరేం చేయవచ్చు? వాళ్లు ప్రాముఖ్యమైన ఆ చర్య తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధమౌతారు?

యేసు తన అనుచరులకు ఈ నిర్దేశాన్నిచ్చాడు: ‘అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి; వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి.’ (మత్త. 28:19) ఈ లేఖనం ప్రకారం, బాప్తిస్మం తీసుకోవాలనుకునే వ్యక్తి ముందుగా యేసు శిష్యుడు అవ్వాలి. అంటే అతను, క్రీస్తు బోధల్ని అర్థం చేసుకుని, వాటిని నమ్మడమే కాకుండా వాటిని జాగ్రత్తగా పాటించాలి. దాన్ని ఓ మోస్తరు చిన్నపిల్లలు కూడా చేయగలరు.

మీ పిల్లలకు మీరు మంచి ఆదర్శంగా ఉండండి; యెహోవా బోధల్ని వాళ్ల మనసుల్లో నాటండి. (ద్వితీ. 6:6-9) దానికి ఒక మార్గం, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం ఉపయోగించి అధ్యయనం చేయడం. అలా వాళ్లకు బైబిల్లోని ప్రాథమిక సత్యాలను బోధించండి, బైబిలు సూత్రాల ఆధారంగా ఎలా ఆలోచించాలో, వాటి ప్రకారం ఎలా జీవించాలో నేర్పించండి. తమ నమ్మకాల్ని సొంత మాటల్లో వివరించగలిగేలా మీ పిల్లలకు సహాయం చేయండి. (1 పేతు. 3:15) వాళ్లు మీ ద్వారా, అలాగే వ్యక్తిగత అధ్యయనం, కుటుంబ ఆరాధన, సంఘ కూటాలు, మంచి స్నేహితుల ద్వారా జ్ఞానాన్ని, ప్రోత్సాహాన్ని పొందుతారు. అవన్నీ వాళ్లు బాప్తిస్మం తీసుకునేలా ప్రగతి సాధించడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా వాళ్ల ప్రగతి కొనసాగుతూనే ఉంటుంది. మీ పిల్లలకు ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టండి.

సామెతలు 20:11 ఇలా చెప్తుంది: “పిల్లవాడు కూడా తన ప్రవర్తన పవిత్రంగా, సరిగ్గా ఉందో లేదో తన పనుల ద్వారా తెలియజేస్తాడు.” పిల్లలు, అమ్మాయిలే గానీ అబ్బాయిలే గానీ యేసు శిష్యులయ్యారని, బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్లు చేసే ఏ పనుల్ని బట్టి చెప్పవచ్చు?

బాప్తిస్మం తీసుకోవడానికి అర్హత సాధిస్తున్న పిల్లవాడు, తన తల్లిదండ్రులకు లోబడాలి. (అపొ. 5:29; కొలొ. 3:20) యేసుకు 12 ఏళ్లున్నప్పుడు, బైబిలు ఆయన గురించి మాట్లాడుతూ, “అన్నివేళలా వాళ్లకు [తన తల్లిదండ్రులకు] లోబడివున్నాడు” అని చెప్తుంది. (లూకా 2:51) నిజమే, మీ పిల్లవాడు పరిపూర్ణుడిగా ఉండాలని మీరు ఆశించరు. కానీ బాప్తిస్మం తీసుకోవాలనుకునే వ్యక్తి, యేసు అడుగుజాడల్లో నడవడానికి కృషిచేస్తాడు. తల్లిదండ్రులకు లోబడతాడనే పేరు తెచ్చుకుంటాడు.

అంతేకాదు, ఆ పిల్లవాడు బైబిలు సత్యాలు నేర్చుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తాడు. (లూకా 2:46) మీ పిల్లవాడు కూటాలకు హాజరవడానికి, వాటిలో పాల్గొనడానికి ఇష్టపడుతున్నాడా? (కీర్త. 122:1) అతనికి క్రమంగా బైబిలు చదవడం, వ్యక్తిగత అధ్యయనం చేసుకోవడం అంటే ఇష్టమా?—మత్త. 4:4.

బాప్తిస్మం తీసుకోవడానికి అర్హత సాధిస్తున్న పిల్లవాడు రాజ్య సంబంధ విషయాలకు మొదటి స్థానం ఇవ్వడానికి కృషి చేస్తాడు. (మత్త. 6:33) ఇతరులతో తన నమ్మకాల గురించి మాట్లాడడం తన బాధ్యతని గ్రహిస్తాడు. అంతేకాదు, అతను వేర్వేరు పద్ధతుల్లో పరిచర్య చేస్తాడు. టీచర్ల ముందు, తోటి విద్యార్థుల ముందు తాను ఓ యెహోవాసాక్షిగా గుర్తించబడడానికి సిగ్గుపడడు. అలాగే క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌లో తనకున్న నియామకాల్ని అశ్రద్ధ చేయడు.

అతను చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ, నైతికంగా పరిశుభ్రంగా ఉండడానికి కూడా కృషి చేస్తాడు. (సామె. 13:20; 1 కొరిం. 15:33) అతను ఎంచుకునే సంగీతం, సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వీడియో గేముల్నిబట్టి, అలాగే ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగిస్తున్నాడనే దాన్నిబట్టి ఆ విషయం మనకు అర్థమౌతుంది.

తమ తల్లిదండ్రులు చేసిన కృషికి చాలామంది పిల్లలు చక్కగా స్పందించారు; సత్యాన్ని తమ సొంతం చేసుకున్నారు, యౌవనంలోనే బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులయ్యారు. యెహోవాతో తమకున్న సంబంధం విషయంలో ప్రాముఖ్యమైన ఈ మైలురాయిని చేరుకునేలా మీ పిల్లలకు మీరు సహాయం చేస్తుండగా, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.

బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులకు ఒక సందేశం:

సంఘంలో, బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులుగా సేవచేయడం ఓ గొప్ప అవకాశం. మీరు సాధించిన ఆధ్యాత్మిక ప్రగతిని బట్టి మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. మీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆయన గురించి తెలుసుకున్నారు, ఆయన వాగ్దానాలపై విశ్వాసం ఉంచారు.—యోహా. 17:3; హెబ్రీ. 11:6.

యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయకముందు మీరు వేరే మత సంస్థతో ఏదోక విధంగా సహవసించి ఉండవచ్చు లేదా అసలు ఏ మతంతో సంబంధం లేకుండా ఉండివుండవచ్చు. లేదా, మీరు బైబిలు సూత్రాలకు విరుద్ధమైనదేదైనా చేస్తూ ఉండివుండవచ్చు. అయితే, ఇప్పుడు ఆ విషయంలో మీరు పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొందడం ద్వారా మీ విశ్వాసాన్ని చూపించారు. పశ్చాత్తాపపడడం అంటే గతంలో మీరు చేసిన తప్పుల విషయంలో తీవ్రంగా బాధపడడం అని అర్థం. మారుమనస్సు పొందడమంటే మీ చెడు మార్గాన్ని వదిలేసి, దేవుని దృష్టిలో సరైనది చేయాలని నిశ్చయించుకోవడం అని అర్థం.—అపొ. 3:19.

మరోవైపు, మీకు “పసితనం” నుండే పవిత్ర లేఖనాలు తెలిసివుండవచ్చు. అందువల్ల మీరు క్రైస్తవులకు తగని ప్రవర్తన నుండి, ఘోరమైన తప్పుల నుండి కాపాడబడి ఉండవచ్చు. (2 తిమో. 3:15) తోటివాళ్ల ఒత్తిడిని, అలాగే యెహోవాకు ఇష్టంలేని పనుల్ని చేయమనే ఇతర ఉరుల్ని ఎలా ఎదిరించాలో మీరు నేర్చుకున్నారు. సత్యారాధనను సమర్థించడం ద్వారా, మీ నమ్మకాల్ని ఇతరులకు చెప్పడం ద్వారా మీ విశ్వాసాన్ని చూపించారు. అంతేకాదు, మీరు క్రైస్తవ పరిచర్యలో మంచి శిక్షణ పొందారు. ఇప్పుడు, బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులుగా యెహోవాకు సేవ చేయాలని వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నారు.

మీరు యెహోవాను పెద్దయ్యాక తెలుసుకున్నా లేదా ఆయన మార్గాల గురించి చిన్నప్పటి నుండే నేర్చుకున్నా, ఇప్పుడు మీ ఆధ్యాత్మిక ప్రగతిలో మీరు ఎక్కబోయే మరో రెండు మెట్ల గురించి ఆలోచిస్తుండవచ్చు. అవే సమర్పణ, బాప్తిస్మం. మీరు ప్రార్థనలో యెహోవాకు మీ సమర్పణను చేసుకోవాలి; ఎల్లప్పుడు తనను మాత్రమే ఆరాధిస్తానని మీరు తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం గురించి ఆయనకు చెప్పాలి. (మత్త. 16:24) ఆ తర్వాత, మీరు చేసుకున్న సమర్పణకు గుర్తుగా మీరు నీళ్లలో బాప్తిస్మం తీసుకుంటారు. (మత్త. 28:19, 20) సమర్పణ, బాప్తిస్మం ద్వారా మీరు యెహోవా నియమిత పరిచారకులు అవుతారు. అదెంత గొప్ప అవకాశమో కదా!

కానీ బైబిలు అధ్యయనంలో నేర్చుకున్నట్లుగా, మీకు రకరకాల సవాళ్లు ఎదురవ్వవచ్చు. బాప్తిస్మం తీసుకున్న వెంటనే, “దేవుని పవిత్రశక్తి యేసును ఎడారిలోకి తీసుకెళ్లింది. అక్కడ అపవాది ఆయన్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు” అని గుర్తుంచుకోండి. (మత్త. 4:1) బాప్తిస్మం తీసుకుని క్రీస్తు శిష్యుడైన తర్వాత, మీకు మరిన్ని పరీక్షలు ఎదురవ్వవచ్చు. (యోహా. 15:20) ఆ పరీక్షలు వేర్వేరు విధాలుగా రావచ్చు, ఉదాహరణకు మీ కుటుంబం నుండి మీకు వ్యతిరేకత రావచ్చు. (మత్త. 10:36) లేదా తోటి విద్యార్థులు, తోటి ఉద్యోగస్థులు, పాత స్నేహితులు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. అయితే మార్కు 10:29, 30 లో యేసు చెప్పిన ఈ మాటల్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, నా కోసం, మంచివార్త కోసం ఇల్లును గానీ, అన్నదమ్ముల్ని గానీ, అక్కచెల్లెళ్లను గానీ, అమ్మను గానీ, నాన్నను గానీ, పిల్లల్ని గానీ, భూముల్ని గానీ వదులుకున్నవాళ్లు ఇప్పుడు 100 రెట్లు ఎక్కువగా ఇళ్లను, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్లను, తల్లుల్ని, పిల్లల్ని, భూముల్ని, వాటితోపాటు హింసల్ని పొందుతారు; అలాగే రానున్న వ్యవస్థలో శాశ్వత జీవితాన్ని పొందుతారు.” కాబట్టి యెహోవాకు దగ్గరగా ఉంటూ, ఆయన నీతి ప్రమాణాల ప్రకారం జీవించడానికి ఎల్లప్పుడూ కృషి చేయండి.

మీరు బాప్తిస్మం తీసుకోవాలని కోరుకుంటుంటే, ఆ విషయాన్ని పెద్దల సభ సమన్వయకర్తకు చెప్పండి. బాప్తిస్మానికి మీరు అర్హులా కాదా అనే విషయాన్ని నిర్ణయించడానికి పెద్దలు ఈ సందేశం తర్వాత ఉన్న ప్రశ్నల ఆధారంగా మీతో చర్చిస్తారు. మీ వ్యక్తిగత అధ్యయనంలో భాగంగా ఈ ప్రశ్నల్ని మీరు పరిశీలించడం మొదలుపెట్టవచ్చు.

ఈ చర్చలకు మీరు సిద్ధపడుతున్నప్పుడు, అక్కడున్న ప్రతీ లేఖనాన్ని చదవడానికి, ఆలోచించడానికి సమయం తీసుకోండి. కావాలనుకుంటే, మీరు ఈ పుస్తకంలోగానీ వేరే చోటగానీ నోట్సు రాసుకోవచ్చు. పెద్దలు మీతో చర్చిస్తున్నప్పుడు ఈ పుస్తకాన్ని తెరిచి పెట్టుకోవచ్చు, అలాగే మీరు రాసుకున్న నోట్సును ఉపయోగించవచ్చు. ఏదైనా ప్రశ్న అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే, మీతో బైబిలు అధ్యయనం చేస్తున్నవాళ్లను లేదా పెద్దల్ని సహాయం అడగడానికి వెనకాడకండి.

పెద్దలు మీతో చర్చిస్తున్నప్పుడు, వాళ్లు అడిగే ప్రశ్నలకు పెద్దపెద్ద జవాబులు లేదా క్లిష్టమైన జవాబులు చెప్పడం అవసరమని అనుకోకండి. జవాబులు సరళంగా, సూటిగా మీ సొంతమాటల్లో చెప్తే సరిపోతుంది. ప్రశ్నలకు జవాబులు చెప్తున్నప్పుడు వాటిలో చాలావాటికి మీరు సూటిగా జవాబు చెప్పడంతోపాటు వాటికి సంబంధించిన ఒకట్రెండు లేఖనాల్ని ఉపయోగించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

బైబిల్లోని ప్రాథమిక బోధలకు సరిపడా జ్ఞానం మీరు ఇంకా పొందకపోతే, మీకు సహాయం చేయడానికి పెద్దలు ఏర్పాట్లు చేస్తారు. అప్పుడు మీరు లేఖనాల్ని సరిగ్గా అర్థం చేసుకుని మీ సొంత మాటల్లో చెప్పగలుగుతారు, కొంతకాలానికి బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులు అవ్వగలుగుతారు.

[సంఘ పెద్దలకు గమనిక: బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్లతో చర్చించడానికి సంబంధించిన సూచనలు 208-212 పేజీల్లో ఉన్నాయి.]

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి