కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 67 పేజీ 158-పేజీ 159 పేరా 1
  • యెరూషలేము గోడలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెరూషలేము గోడలు
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెరూషలేము గోడలు
    నా బైబిలు కథల పుస్తకము
  • నెహెమ్యా పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • “మేలు చేత కీడును జయించుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యెరూషలేము—అది ‘మీ ముఖ్య సంతోషంకన్నా హెచ్చుగా ఉన్నదా’?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 67 పేజీ 158-పేజీ 159 పేరా 1
యెరూషలేము గోడలను ఎలా కట్టాలో, సైనికులను రక్షణగా ఎలా పెట్టాలో నెహెమ్యా వివరిస్తున్నాడు

లెసన్‌ 67

యెరూషలేము గోడలు

కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్దాం. పర్షియా పట్టణమైన షూషనులో నెహెమ్యా అనే ఇశ్రాయేలీయుడు ఉండేవాడు. అతను అర్తహషస్త రాజు సేవకుడు. నెహెమ్యా సోదరుడు యూదా నుండి ఒక చేదు వార్తను తీసుకొస్తాడు. అతను: ‘యెరూషలేముకు తిరిగి వెళ్లిన ప్రజలు సురక్షితంగా లేరు. బబులోనీయులు నాశనం చేసిన పట్టణ గోడలు, గేట్‌లు ఇంకా కట్టలేదు’ అని చెప్తాడు. నెహెమ్యాకు చాలా బాధేసింది. అతను సహాయం చేయడానికి యెరూషలేముకు వెళ్లాలని అనుకుంటాడు, అందుకే రాజు తనను పంపించేలా చేయమని ప్రార్థన చేస్తాడు.

తర్వాత, నెహెమ్యా బాధగా ఉండడాన్ని గమనించి రాజు ఇలా అడుగుతాడు: ‘నిన్ను నేను ఇలా ఎప్పుడూ చూడలేదు. ఏమి జరిగింది?’ నెహెమ్యా ఇలా చెప్తాడు, ‘మా పట్టణం యెరూషలేము పాడైపోయి ఉంటే నాకు బాధే కదా?’ అప్పుడు రాజు ఇలా అడుగుతాడు: ‘నీ కోసం నన్ను ఏమి చేయమంటావు?’ వెంటనే, నెహెమ్యా మనసులో దేవునికి ప్రార్థన చేసుకుని ఇలా అడుగుతాడు: ‘యెరూషలేముకు వెళ్లి గోడలను తిరిగి కట్టడానికి దయచేసి నన్ను పంపించండి.’ నెహెమ్యా వెళ్లవచ్చని రాజైన అర్తహషస్త చెప్తాడు. అతను ఆ దూర ప్రాంతానికి క్షేమంగా వెళ్లేలా రాజు ఏర్పాట్లు చేస్తాడు. నెహెమ్యాను యూదాకు అధిపతిగా చేసి, పట్టణ గేట్లు కట్టడానికి చెక్కను కూడా ఇస్తాడు.

నెహెమ్యా యెరూషలేముకు చేరుకున్నాక పట్టణ గోడలు ఎలా ఉన్నాయో వెళ్లి చూస్తాడు. తర్వాత ఆయన యాజకులను, నాయకులను పిలిచి ఇలా చెప్తాడు: ‘ఇది చాలా ఘోరం. మనం వెంటనే పని మొదలుపెట్టాలి.’ ప్రజలు ఒప్పుకుని గోడలు తిరిగి కట్టడం మొదలుపెడతారు.

కానీ ఇశ్రాయేలీయుల శత్రువులు కొంతమంది వాళ్లను వెక్కిరిస్తారు, వాళ్లు ఇలా అంటారు: ‘మీరు కట్టే ఈ గోడను ఒక నక్క పడేయగలదు.’ కానీ పనిచేసేవాళ్లు వాటిని పట్టించుకోకుండా కడుతూనే ఉన్నారు. గోడలు ఎత్తుగా, బలంగా అయ్యాయి.

శత్రువులు వేర్వేరు వైపుల నుండి వచ్చి రహస్యంగా యెరూషలేము మీద దాడి చేయాలని అనుకున్నారు. అది విని యూదులు చాలా భయపడ్డారు. కానీ నెహెమ్యా ‘భయపడకండి, యెహోవా మనతో ఉన్నాడు’ అని చెప్పాడు. పనిచేసేవాళ్లను కాపాడడం కోసం నెహెమ్యా కొంతమంది సైనికులను అడ్డుగా పెట్టాడు, అప్పుడు శత్రువులు దాడి చేయలేకపోతారు.

కేవలం 52 రోజుల్లో గోడలు, గేట్‌లు పూర్తి అయ్యాయి. పూర్తైన సంతోషంలో నెహెమ్యా యాజకులందర్నీ యెరూషలేముకు పిలిపించాడు. వాళ్లను పాటలు పాడడానికి రెండు భాగాలుగా చేశాడు. ఊట గుమ్మం దగ్గర ఉన్న మెట్లు ఎక్కి ఒక్కో గుంపు ఒక్కో వైపు వెళ్లి పట్టణం చుట్టూ నడిచారు. వాళ్లు బూరలు, తాళాలు, హార్ప్‌లు వాయిస్తూ యెహోవాకు పాటలు పాడారు. ఎజ్రా ఒక గుంపుతో, నెహెమ్యా మరో గుంపుతో వెళ్లారు. ఆ రెండు గుంపులు నడుచుకుంటూ వెళ్లి ఆలయం దగ్గర కలుసుకున్నారు. ప్రజలందరూ పురుషులు, స్త్రీలు, పిల్లలు యెహోవాకు బలులు అర్పించి, పండుగ జరుపుకున్నారు. సంతోషంతో వాళ్లు వేసిన కేకలు చాలా దూరం వరకు వినిపించాయి.

“నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమైనా అస్సలు వర్ధిల్లదు.”—యెషయా 54:17

ప్రశ్నలు: నెహెమ్యా యెరూషలేముకు ఎందుకు వెళ్లాడు? యెరూషలేము గోడలు తిరిగి కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది?

నెహెమ్యా 1:1-11; 2:1-20; 4:1-23; 5:14; 6:1-19; 12:27-43

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి