కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 12/1 పేజీలు 18-23
  • నూతన లోకములోనికి విడుదల కొరకు సిద్ధపడుము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నూతన లోకములోనికి విడుదల కొరకు సిద్ధపడుము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • లోక జీవన విధానమునకు మనమెట్లు ప్రతిస్పందింతుము
  • జీవితములో ఎవరు లేక ఏది మొదట వచ్చును?
  • మరింత గొప్ప విడుదలకు ప్రేమపూర్వక ఏర్పాట్లు
  • నిర్ణయాత్మక చర్య యిప్పుడు ఎందుకు అవసరము
  • విడుదలపొందు దృష్టితో దైవిక సహాయము
  • లోతు భార్యను గుర్తుపెట్టుకోండి
    నా బైబిలు పుస్తకం
  • లోతు భార్య వెనక్కి చూడడం
    నా బైబిలు కథల పుస్తకము
  • విమోచన సమీపిస్తుండగా ధైర్యంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • అంతం వచ్చినప్పుడు మీరు ఎక్కడుండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 12/1 పేజీలు 18-23

నూతన లోకములోనికి విడుదల కొరకు సిద్ధపడుము

“లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి.”—లూకా 17:32.

1. ఈనాటి మన పాఠము దైవిక విడుదలయొక్క ఏ చరిత్రాత్మకమైన ఉదాహరణను నొక్కిచెప్పును, మరియు అది మనకెట్లు ప్రయోజనమును తేగలదు?

నోవహు అతని కుటుంబమును యెహోవా అద్భుతరీతిగా విడిపించుటనుగూర్చి చెప్పిన తర్వాత, అపొస్తలుడైన పేతురు మరొక చరిత్రాత్మకమైన ఉదాహరణను ఎత్తి చూపించెను. 2 పేతురు 2:6-8లో మనము చదువునట్లుగా, సొదొమ గొమొర్రాలు భస్మము చేయబడినప్పుడు నీతిమంతుడైన లోతు తప్పింపబడుటవైపు ఆయన దృష్టినిమళ్లించెను. మన ప్రయోజనము కొరకు ఆ వివరములు భద్రము చేయబడెను. (రోమీయులు 15:4) ఆ విడుదల సంబంధముగా జరిగిన దానిని మన హృదయమునకు తీసుకొనుట దేవుని నూతన లోకములోనికి భద్రపరచబడువారి వరుసలో మనముండుటకు సహాయపడగలదు.

లోక జీవన విధానమునకు మనమెట్లు ప్రతిస్పందింతుము

2. సొదొమ గొమొర్రాలలోని ఏ ప్రవర్తన దేవుడు వారిని నాశనము చేయుటకు నడిపినది?

2 ఆ పట్టణములు దాని నివాసులు ఎందుకు నాశనము చేయబడిరి? “కామ వికారయుక్త నడవడిలో” మునిగియుండుటను అపొస్తలుడైన పేతురు ప్రస్తావించెను. (2 పేతురు 2:7) దేనినుండి ఆ పదము తర్జుమా చేయబడినదో ఆ గ్రీకు పదప్రయోగము సూచించినట్లుగా, సొదొమ గొమొర్రాల ప్రజలు నియమము మరియు అధికారము యెడల సిగ్గుకరమైన గౌరవహీనతను ప్రదర్శించిన, మరియు అవమానపరచిన దుర్నీతికరమైన నడవడిలో మునిగియుండిరి. వారు ‘బహుగా వ్యభిచరించుచు అసహజ క్రియలకై పరశరీరానుసారులైరని’ యూదా 7 చెప్పుచున్నది. తమ దోవతప్పిన తృష్ణలను తీర్చుకొనుటకు సొదొమవాసులు, “బాలురును వృద్ధులును, ప్రజలందరును,” లోతు యింటిని చుట్టుముట్టి సొదొమవారలకు అతని అతిథులను అప్పగింపవలెనని గట్టిగా అడుగుటలో వారి ప్రవర్తనా తీవ్రత ప్రత్యక్ష్యమైనది. వారి దిగజారిన అభ్యర్థనలను లోతు త్రోసిపుచ్చినందున వారు ఆయనను బహుగా తూలనాడిరి.—ఆదికాండము 13:13; 19:4, 5, 9.

3. (ఎ) అంతటి అవినీతి నిండిన సొదొమవంటి ప్రాంతమునకు జీవించుటకు లోతు కుటుంబము ఎట్లు అక్కడికి వచ్చెను? (బి) సొదొమలోని ప్రజల అవినీతి ప్రవర్తనయెడల లోతు ప్రతిస్పందన ఏమైయుండెను?

3 అది సారవంతమైన ప్రదేశమైనందున వస్తుదాయక క్షేమాభివృద్ధికలుగునని తొలుత లోతు సొదొమ సమీప ప్రాంతమునకు తరలివచ్చెను. తగిన కాలమున, ఆయన ఆ పట్టణములోనే నివసింపనారంభించెను. (ఆదికాండము 13:8-12; 14:12; 19:1) అయితే ఆయన ఆ పట్టణస్థుల కామాభిలాషా కృత్యములను అంగీకరించలేదు, అలాగే లోతు అతని కుటుంబము సాక్ష్యాధారముగా వారి సామాజిక జీవనమందు భాగము వహించని కారణమున, ఆ మనుష్యులును ఈయనను వారిలో ఒకనిగా ఎంచలేదు. 2 పేతురు 2:7, 8 చెప్పునట్లుగా; “లోతు . . . ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటిని బట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.” లోతు నీతిమంతునిగావుండి అలాంటి ప్రవర్తనను అసహ్యించుకొనెను గనుక, ఈ పరిస్థితులు ఆయనను బహుగా శోధించియుండవచ్చును.

4. (ఎ) ఏయే విధములుగా ఈనాటి పరిస్థితులు ప్రాచీన సొదొమలోని ప్రజల పరిస్థితులకు పోలియున్నవి? (బి) నీతిమంతుడైన లోతువలె మనమున్నట్లయిన, ప్రస్తుత అవినీతి పరిస్థితులకు మనమెట్లు ప్రతిస్పందింతుము?

4 మన దినములలో సహితము, మానవ సమాజ నైతికస్థాయి దిగజారిపోయినది. అనేక దేశములలో అంతకంతకు ఎక్కువమంది, వివాహమునకు ముందు లేక వివాహేతర లైంగిక సంబంధములలో పాల్గొనుచున్నారు. పాఠశాలలలో సహితము యౌవనులనేకులు ఈ తరహా జీవితమందు బాగా మునిగిపోయి, అలా వారితో చేరనివారిని హేళనచేయుట జరుగుచున్నది. సలింగసంయోగులు బాహాటముగా తమను వెల్లడి చేసుకొనుచు, తమను గుర్తించవలసిందిగా గట్టిగా అడుగుచు పెద్దపెద్ద పట్టణముల వీధులలో ప్రదర్శనలు చేయుచున్నారు. ఆ వికృతానందమునందు మతనాయకులును చేరిరి. అధికారికముగా, ఎక్కువ చర్చీలు తెలియబడియున్న సలింగసంయోగులను, జారులను మతనాయకులుగా నియమించుటలేదు. అయితే వాస్తవమందు, వార్తాపత్రికల నివేదికలు అనేకమార్లు చూపించినట్లు, మతనాయకుల వర్గములలో సలింగసంయోగులను, జారులను, వ్యభిచారులను కనుగొనుట ఏమంత కష్టముకాదు. నిజానికి కొందరు మతనాయకులు లైంగిక దుర్నీతిక్రియల ఆరోపణలమీద యితర పట్టణములకు కదిలింపబడుట లేక రాజీనామా చేయుటకు వత్తిడి చేయబడుట జరిగినది. నీతిని ప్రేమించువారు “చెడ్డదానిని అసహ్యించుకొందురు;” గనుక వారు అటువంటి దుష్టకృత్యములయెడల ఎలాంటి సానుభూతియు చూపరు. (రోమీయులు 12:9) ప్రత్యేకముగా వారు దేవుని సేవించుచున్నామని చెప్పుకొనుచు ఆయన నామమునకు అవమానము కలుగజేయుచు, తెలియని ప్రజలు ఏహ్యభావముతో సమస్త మతమునుండి వైదొలగుటకు కారణమగుచుండుటనుబట్టి నొప్పించుకొనుచున్నారు.—రోమీయులు 2:24.

5. సొదొమ గొమొర్రాలను యెహోవా నాశనము చేయుట ఏ ప్రశ్నకు మనకు జవాబునిచ్చును?

5 సంవత్సరములు గడచుచుండగా పరిస్థితి మరింత చెడ్డగా తయారగుచున్నది. దీనికి అంతమున్నదా? అవును, అలా జరుగును! ప్రాచీన సొదొమ గొమొర్రాలకు యెహోవా జరిగించినది, ఆయన తన నిర్ణయకాలమున తీర్పు తీర్చునని స్పష్టముగా సూచించుచున్నది. ఆయన దుష్టులను బొత్తిగా నాశనముచేయును, అయితే ఆయన తన యథార్థ సేవకులకు విడుదలను కలుగజేయును.

జీవితములో ఎవరు లేక ఏది మొదట వచ్చును?

6. (ఎ) లోతు కుమార్తెలను వివాహమాడవలసియున్న యౌవనస్థులను గూర్చిన వృత్తాంతమందు మనకు ఏ సమయానుకూలమైన పాఠము కలదు? (బి) తమకు కాబోయే భర్తల దృక్పధము లోతు కుమార్తెలను ఎట్లు పరీక్షించినది?

6 ఎవరైతే నిజమైన దైవభక్తిని ప్రదర్శింతురో వారు మాత్రమే తప్పింపబడుదురు. ఈ విషయములో, సొదొమ గొమొర్రాలను నాశనము చేయకముందు దూతలు లోతుతో ఏమని చెప్పిరో విచారించుము. “ఇక్కడ నీకు మరియెవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసుకొనిరమ్ము; మేము ఈ చోటును నాశనము చేయవచ్చితిమి.” కాబట్టి లోతు తన కుమార్తెలను వివాహమాడనైయున్న యౌవనస్థులతో ఈ విషయమును మాట్లాడెను. ఆయన వారిని మరలా మరలా యిట్లు బ్రతిమిలాడెను: “లెండి! ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడు.” లోతు కుటుంబముతో వారికున్న సంబంధమునుబట్టి వారికి తప్పించుకొను అవకాశమియ్యబడెను, అయితే వారు వ్యక్తిగతముగా చర్యగైకొనవలెను. వారు యెహోవాకు లోబడియుండుటను గూర్చిన స్పష్టమైన రుజువును యివ్వవలసియుండిరి. బదులుగా వారిదృష్టిలో లోతు, “ఎగతాళి చేయువానివలె నుండెను.” (ఆదికాండము 19:12-14) జరిగినదానిని వారువిన్నప్పుడు లోతు కుమార్తెలు ఎట్లు భావించియుండవచ్చునో మీరు ఊహించవచ్చును. దేవునియెడల వారి యథార్థతను అది పరీక్షించినది.

7, 8. (ఎ) తనకుటుంబమును తీసుకొని పారిపొమ్మని దూతలు లోతును బలవంతపెట్టినప్పుడు, అతడెట్లు స్పందించెను, కాగా యిది ఎందుకు అవివేకమై యుండెను? (బి) విడుదల చేయబడుటకు, లోతు అతని కుటుంబము కొరకు ఏమి అవశ్యకమై యుండెను?

7 ఆ మరుసటి దినము యిక తెల్లవారనైయుండగా, దూతలు లోతును త్వరపెట్టుచు యిట్లనిరి: “లెమ్ము! ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసుకొని రమ్ము!” అయితే అతడు, “తడవు చేసెను.” (ఆదికాండము 19:15, 16) ఎందుకు? ఆయనను ఏది వెనుకకు లాగిపట్టెను? ఆ ప్రాంతమునకు తరలి వచ్చేందుకు అతనిని ఆకర్షించిన—సొదొమలో ఆయన కలిగియున్న వస్తుదాయక ఆసక్తులా? ఆయనింకా వాటిని అంటిపెట్టుకొనినట్లయిన, సొదొమతోపాటు ఆయనయు నాశనము చేయబడును.

8 కరుణతో, ఆ దూతలు కుటుంబమందలివారి చేతులు పట్టుకొని త్వరగా వెలుపలికి తీసుకొనివచ్చి త్వరగా ఆ పట్టణము బయటనుంచిరి. ఆ పొలిమేరలలో యెహోవా దూత యిలా వారినాజ్ఞాపించెను: “నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము! నీ వెనుక చూడకుము! ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్ము!” యింకను లోతు తడవులాడెను. చివరకు, అతను అంతదూరముగా లేని ప్రాంతమునకు పోయెదమని అంగీకరించి, అక్కడికి తన కుటుంబముతో పారిపోయెను. (ఆదికాండము 19:17-22) యింకా ఆలస్యముచేయు పరిస్థితి అక్కడ లేకుండెను; విధేయత అవశ్యకమై యుండెను.

9, 10. (ఎ) కేవలము తన భర్తతో ఉండుటమాత్రమే, లోతు భార్య రక్షణను నిశ్చయపరచుటకు ఎందుకు సరిపోదు? (బి) లోతు భార్య చంపబడినప్పుడు, లోతు మరియు అతని కుమార్తెలమీదికి మరింకే పరీక్ష తీసుకు రాబడెను?

9 ఏమైనను, సొదొమనుండి వారు పారిపోవుటతోనే విడుదల పరిసమాప్తి కాలేదు. ఆదికాండము 19:23-25 మనకిలా తెలియజేయుచున్నది: “లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొర్రామీదను యెహోవాయొద్దనుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేల మొలకలను నాశనము చేసెను.” అయితే లోతు భార్య ఎక్కడ ఉండెను?

10 ఆమెకూడ తన భర్తతో పారిపోయెను. అయితే, ఆయన చేయుచున్న పనితో ఆమె పూర్తిగా ఏకీభవించెనా? సొదొమలోని లైంగిక దుర్నీతిని ఆమె అంగీకరించినదనుటకు ఏ సూచనయు లేదు. అయితే తనకు అక్కడున్న యిల్లు, వస్తుదాయక సంపత్తితోవున్న బంధముకంటే దేవునియెడల ఆమెకుగల ప్రేమ బలమైనదిగా యుండెనా? (లూకా 17:31, 32 పోల్చుము.) వత్తిడిక్రింద వున్నప్పుడు ఆమె హృదయమందున్న విషయము బయటపడెను. సాక్ష్యాధారముగా యిక ఊరిలోనికి ప్రవేశించునంత దగ్గరగా, సోయరును అప్పటికే వారు సమీపించియుండవచ్చును, ఆ సమయమున ఆమె అవిధేయురాలై వెనుకకు మరలి చూసెను. బైబిలు వ్రాత చెప్పునట్లుగా, ఆమె “ఉప్పుస్తంభమాయెను.” (ఆదికాండము 19:26) యిప్పుడు లోతుకు అతని కుమార్తెలకు మరొక యథార్థతాపరీక్ష ఎదురాయెను. చనిపోయిన తన భార్యయెడల లోతుకుగల బంధము లేక అయ్యో, అమ్మ చనిపోయినదనే కుమార్తెల భావన, ఈ విపత్తును తీసుకొని వచ్చిన యెహోవా యెడల వారికిగల ప్రేమకంటే బలముగా యున్నదా? వారికి అతిసన్నిహితమైన వ్యక్తి దేవునికి అవిధేయురాలైపోయినను, వారింకను ఆయనకు ఎడతెగక లోబడియుందురా? యెహోవాయందు పూర్తి నమ్మకముతో, వారు వెనుకకు తిరిగి చూడలేదు.

11. యెహోవా దయచేయు విడుదలనుగూర్చి యిక్కడ మనమేమి నేర్చుకొనియున్నాము?

11 అవును, తన భక్తులను శోధనలోనుండి ఎట్లు తప్పింపవలెనో యెహోవా ఎరిగియున్నాడు. స్వచ్ఛమైన ఆరాధనయందు ఐక్యమైయున్న కుటుంబములన్నింటిని ఎట్లు తప్పింపవలెనో ఆయన ఎరిగియున్నాడు; అలాగే ఆయావ్యక్తులను ఎట్లు తప్పింపవలెనోకూడ ఆయన ఎరిగియున్నాడు. వారాయనను నిజముగా ప్రేమించినప్పుడు, ఆయన వారితో వ్యవహరించుటయందు ఎంతో శ్రద్ధను చూపించును. “మనము నిర్మింపబడినరీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.” (కీర్తన 103:13, 14) అయితే ఎవరైతే దైవభక్తి కలిగియుందురో, ఎవరి భక్తి నిష్కల్మషమైనదో, ఎవరి విధేయత యథార్థతను వ్యక్తపరచునదిగా యుండునో వారికి మాత్రమే ఆయన విడుదల లభించును.

మరింత గొప్ప విడుదలకు ప్రేమపూర్వక ఏర్పాట్లు

12. మనము ఆతురతతో ఎదురుచూచుచున్న విడుదలను తీసుకొనివచ్చుటకు ముందు యెహోవా ఎలాంటి ప్రేమపూర్వక ఏర్పాట్లను చేయబోవుచుండెను?

12 నోవహు మరియు లోతు దినములలో జరిగించిన దానిద్వారా, యెహోవా దుష్టమైన ప్రతిదానిని శాశ్వతకాలముకొరకు నిర్మూలించలేదు. లేఖనము చెప్పుచున్నట్లుగా, అవి కేవలము రాబోవు సంగతులకు మాదిరిమాత్రమే. ఆ సంగతులు రాకపూర్వము తనను ప్రేమించు వారికి ప్రయోజనమును చేకూర్చుటకు సంకల్పించిన మరివిశేషమైన దానిని యెహోవా తన మనస్సునందు కలిగియుండెను. ఆయన తన అద్వితీయ కుమారుడైన, యేసుక్రీస్తును భూమికి పంపనైయుండెను. యిక్కడ, యేసు ఆదాము ఒక పరిపూర్ణ మానవునిగా దేవునికి చూపించవలసియున్న మరియు చూపించగల్గిన భక్తిని ప్రదర్శించుటద్వారా దేవుని నామమునకు కలిగిన నిందను తీసివేయును; అయితే యేసు దానిని ఎంతో కష్టమైన పరిస్థితులయందు చేయును. విశ్వసించు ఆదాము సంతానము ఆదాము పోగొట్టుకొనిన దానిని కలిగియుండునట్లు యేసు తన పరిపూర్ణ మానవ ప్రాణమును బలిగా అర్పించును. అప్పుడు క్రీస్తుతో పరలోక రాజ్యమందు భాగము వహించుటకు దేవుడు ఒక “చిన్నమందను” ఎంపిక చేసుకొనును, మరియు నూతన మానవ సమాజముయొక్క పునాదిగా అన్ని జనాంగములనుండి ఒక “గొప్ప సమూహము” సమకూర్చబడును. (లూకా 12:32; ప్రకటన 7:9) దానిని నెరవేర్చుటతో, దేవుడు జలప్రళయము మరియు సొదొమ గొమొర్రాల నాశనముతో సంబంధము కలిగియున్న సంఘటనలద్వారా ఛాయగా చూపబడిన మహాగొప్ప విడుదలను కలుగజేయును.

నిర్ణయాత్మక చర్య యిప్పుడు ఎందుకు అవసరము

13, 14. నోవహు మరియు లోతు దినములలోని భక్తిహీన ప్రజల నాశనముయొక్క ఉదాహరణలను పేతురు ఉపయోగించుటనుండి మనమేమి నేర్చుకొనగలము?

13 తన సేవకుల కొరకు యెహోవా అనేక సందర్భములలో విడుదలచేయు కార్యములను చేసెనని దేవుని వాక్య విద్యార్థులు ఎరిగియున్నారు. అయితే, అనేక సందర్భములలో ‘మనుష్యకుమారుని సాన్నిధ్య కాలమందును అట్లేయుండునని,’ బైబిలు చెప్పుట లేదు. అలాంటప్పుడు, పరిశుద్ధాత్మచే ప్రేరేపింపబడి అపొస్తలుడైన పేతురు కేవలము రెండు ఉదాహరణలను మాత్రమే ఎందుకు వేరుపరచి చెప్పుచున్నాడు? లోతు దినములలో జరిగిన దానికి నోవహు దినములలో జరిగినదానికి ప్రత్యేకత ఏమిటి?

14 ఒక ఖచ్ఛితమైన సూచనను మనము యూదా 7 నందు కనుగొనవచ్చును, అక్కడ మనమిలా చదువుదుము, “సొదొమ గొమొర్రాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును . . . నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.” అవును, ప్రస్తుత విధానాంతమందు దుష్టుల నాశనమువలెనే, ఆ పట్టణములోని ఆ ఘోర పాపుల నాశనము నిత్యనాశనమై యుండెను. (మత్తయి 25:46) అదేవిధముగా, నిత్యతీర్పులను చర్చించిన సందర్భములయందు నోవహు దిన జలప్రళయము సూచించబడెను. (2 పేతురు 2:4, 5, 9-12; 3:5-7) కాబట్టి లోతు మరియు నోవహు దినములలోని భక్తిహీన ప్రజలను నాశనము చేయుటద్వారా, యెహోవా దుర్నీతిని అభ్యసించువారిని నిత్య నాశనము చేయుటద్వారా తన సేవకులకు ఆయన విడుదల కలుగజేయునని ప్రదర్శించెను.—2 థెస్సలొనీకయులు 1:6-10.

15. (ఎ) దుష్ట అభ్యాసములయందు పాల్గొనుచున్న వారికి ఏ అత్యవసర హెచ్చరిక యివ్వబడినది? (బి) దుర్నీతిని విడువక యుండు వారందరిమీద ఎందుకు న్యాయము తీర్చబడును?

15 దుష్టుల నాశనము అటు యెహోవాకు గాని యిటు ఆయన సేవకులకుగాని సంతోషమును తీసుకురాదు. తన సాక్షులద్వారా యెహోవా ప్రజలనిట్లు బలవంతపెట్టుచున్నాడు: “మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతనుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు?” (యెహెజ్కేలు 33:11) అయినను, ప్రజలు ఈ విన్నపమునకు చెవియొగ్గక, తమ స్వార్థపూరిత జీవిత విధానమందు కొనసాగినట్లయిన, తన నామ పరిశుద్ధత యెడలగల గౌరవము మరియు భక్తిహీనుల చేతిలో బాధింపబడుచున్న తన యథార్థ సేవకుల యెడలగల ప్రేమ యెహోవా న్యాయము తీర్చునట్లు చేయును.

16. (ఎ) ముందే చెప్పబడిన విడుదల సమీపముగా ఉన్నదని మనమెందుకు నిశ్చయత కలిగియుండగలము? (బి) దేనినుండి మరియు దేనిలోనికి విడుదల వచ్చును?

16 విడుదల తేనైయున్న దేవుని సమయము బహు సమీపముగా యున్నది! తన సాన్నిధ్యము మరియు ఈ విధానాంతముయొక్క సూచనగా యేసు ముందేచెప్పిన దృక్పధములు మరియు సంఘటనలు స్పష్టముగా రుజువగుచున్నవి. ఆ సూచనయొక్క వివిధ విషయములు అగుపడుట దాదాపు 75 సంవత్సరముల పూర్వమే ప్రారంభమాయెను, కాగా యేసు ఈ భక్తిహీన లోకముమీద దేవుని తీర్పుతీర్చబడుటకు ముందు “ఈ తరము” ఎంతమాత్రము గతింపదని చెప్పెను. సకల జనములకు సాక్ష్యార్థమై భూమియందంతట కావల్సినంతగా రాజ్య వర్తమానము ప్రకటింపబడినదని యెహోవా తీర్మానించిన తర్వాత అంతము వచ్చును, దానికూడ దైవభక్తిగల ప్రజల విడుదలయు వచ్చును. (మత్తయి 24:3-34; లూకా 21:28-33) దేనినుండి విడుదల? భక్తిహీనులద్వారా కలిగిన పరీక్షలనుండి, మరియు నీతిమంతులుగా ప్రతిదినము వారనుభవించిన కృంగదీయు పరిస్థితులనుండి వారికి విడుదల కలుగును. మరియు ఎక్కడ రోగము, మరణము గతించిన సంగతులైయుండునో ఆ నూతన లోకములోనికి ప్రవేశించుటకును అది విడుదలైయుండును.

విడుదలపొందు దృష్టితో దైవిక సహాయము

17. (ఎ) ఏ గంభీరమైన ప్రశ్నను మనకై మనము ప్రశ్నించుకొనవలెను? (బి) నోవహు వలెనే మనము “దైవభయముచే” కదిలింపబడియున్నామని మనమెట్లు రుజువివ్వగలము?

17 మనమందరము వ్యక్తిగతముగా విచారించవలసిన ప్రశ్న ఏమనగా, ‘దేవుని ఆ చర్యకు నేను సిద్ధముగా ఉన్నానా?’ మనయందు మనమే లేక మన స్వనీతియందు నమ్మిక కలిగియుండినట్లయిన, మనము సిద్ధముగాలేము. అయితే, నోవహు వలెనే “దైవభయముచే” కదిలింపబడినట్లయిన మనమప్పుడు యెహోవా దయచేయుచున్న నడిపింపుకు ప్రత్యుత్తరమిచ్చిన వారమగుదుము, కాగా అది మనలను విడుదలకు నడిపించును.—హెబ్రీయులు 11:7.

18. నూతన లోకములోనికి విడుదల కొరకు సిద్ధపడుటలో దైవపరిపాలనా అధికారము యెడల నిష్కల్మషమైన గౌరవమును నేర్చుకొనుట ఎందుకు ప్రాముఖ్యమైన భాగమైయున్నది?

18 ప్రస్తుతమందును యెహోవాయిచ్చు రక్షణను అనుభవించువారిని బహు రమ్యముగా వర్ణించుచు, కీర్తన 91:1, 2 యిట్లు చెప్పుచున్నది: “సర్వోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ‘ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని’ నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.” తల్లిపక్షి బలమైన రెక్కలక్రిందగల పక్షిపిల్లలను పోలి దేవునిచే సంరక్షింపబడుచున్న ప్రజలగుంపు ఒకటి యిక్కడ కలదు. యెహోవాయందే వారి పూర్తి నమ్మకము. వారాయనను మహోన్నతునిగాను, సర్వశక్తునిగాను అంగీకరించుచున్నారు. దానిఫలితముగా వారు దైవపరిపాలనా అధికారమును గౌరవించుచు, అది తలిదండ్రులద్వారా లేక “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా చేయబడుచున్నను, తమనుతాము దానికి లోబరచుకొందురు. (మత్తయి 24:45-47) అది ఆయావ్యక్తులుగా మనవిషయములోను నిజమైయున్నదా? నోవహు వలెనే, మనము ‘యెహోవా ఆజ్ఞాపించిన సమస్తమును చేయుటకు,’ మరియు సంగతులను ఆయన పద్ధతి చొప్పున చేయుటకు నేర్చుకొనుచున్నామా? (ఆదికాండము 6:22) అట్లయిన, ఆయన నూతన లోకములోనికి విడుదల కొరకు యెహోవా యిచ్చుచున్న సిద్ధపాటుకు మనము ప్రత్యుత్తరమిచ్చుచున్నాము.

19. (ఎ) మన అలంకార హృదయము ఏమైయున్నది, దానికి మనము శ్రద్ధనిచ్చుట ఎందుకు అవశ్యకము? (సామెతలు 4:23) (బి) లోకాకర్షణల యెడల మన ప్రత్యుత్తరము సంబంధముగా లోతు ఉదాహరణనుండి మనమెట్లు ప్రయోజనము పొందగలము?

19 ఆ సిద్ధపాటునందు మన అలంకార హృదయమునకు శ్రద్ధనిచ్చుటయు చేరియున్నది. “హృదయ పరిశోధకుడు యెహోవాయే.” (సామెతలు 17:3) మనము బయటకు కన్పించువిధము కాదుగాని, మన అంతరంగ పురుషుడు, అనగా హృదయము లెక్కలోనికి తీసుకొనబడునని మనము గ్రహించుటకు ఆయన మనకు సహాయము చేయును. మనచుట్టువున్న లోకమువలె మనము బలాత్కారమందు లేక లైంగిక దుర్నీతియందు పాల్గొనకపోయినను, వీటిద్వారా లోబరచబడుటకు లేక వినోదముననుభవించుటకు వ్యతిరేకముగా మనము జాగ్రత్తపడవలెను. అటువంటి అకృత్యములుండుటనుగూర్చి, లోతువలెనే మనము నొచ్చుకొనవలెను. దుర్నీతిని ద్వేషించువారు దానిలో పాల్గొను మార్గములను వెదకరు; అయితే దానిని ద్వేషించని వారు దానినుండి భౌతికముగా తప్పుకొనవచ్చును గాని, దానియందు భాగము వహించుటను మానసికముగా యిష్టపడుచుండవచ్చును. “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి.”—కీర్తన 97:10.

20. (ఎ) ఐశ్వర్యాసక్తి జీవిత విధానమునకు వ్యతిరేకముగా బైబిలు ఏయే విధములుగా మనలను హెచ్చరించుచున్నది? (బి) ఐశ్వర్యాసక్తి సంబంధమైన బైబిలు ముఖ్యపాఠములు మన హృదయమున బాగుగా నాటుకొనినవని మనమెట్లు చెప్పగలము?

20 కేవలము లైంగిక దుర్నీతిగల ప్రవర్తననే కాకుండా, ఐశ్వర్యాసక్తిగల జీవన విధానమునుకూడ విసర్జించుమని యెహోవా ప్రేమతో మనకు బోధించుచున్నాడు. ‘అన్న వస్త్రములు గలవారై తృప్తికలిగియుండుడి’ అని ఆయన వాక్యము సలహాయిచ్చుచున్నది. (1 తిమోతి 6:8) నోవహు ఆయన కుమారులు ఓడలో ప్రవేశించుచుండగా తమ యిండ్లను వెనుక విడిచిపెట్టవలసి యుండిరి. తమ జీవితములను రక్షించుకొనుటకు లోతు అతని కుటుంబము తమ యింటిని ఆస్తిని వదిలివేయవలసి యుండెను. మన శ్రద్ధాసక్తులు ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నవి? “లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి.” (లూకా 17:32) యేసు యిట్లు బలవంతపెట్టెను: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:33) దానిని మనము చేయుచున్నామా? యెహోవా నీతికట్టడలు మనను నడిపించినట్లయిన, మన జీవితములలో ఆయన రాజ్యసువార్తను ప్రకటించుట మొదటి సంగతియైనట్లయిన, అప్పుడు మనము, నిజముగా తన నూతనలోకములోనికి విడుదల చేయుటకు ప్రజలను సిద్ధముచేయు ఆయన పనికి ప్రత్యుత్తరమిచ్చుచున్న వారమైయుందుము.

21. విడుదలనుగూర్చిన యెహోవా వాగ్ధానము త్వరలోనే నెరవేరునని మనము సరిగా ఎందుకు ఎదురుచూడగలము?

21 రాజ్యాధికారమందు తన సాన్నిధ్యమును గూర్చిన సూచన నెరవేరుటను చూచు దైవభక్తిగల ప్రజలకు యేసు యిట్లు చెప్పెను: “మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది.” (లూకా 21:28) సూచన దాని ప్రతివివరమందును నెరవేరుటను నీవు చూచియున్నావా? అట్లయిన విడుదల కొరకైన యెహోవా వాగ్ధాన నెరవేర్పు బహుగా సమీపించియున్నదను నమ్మకమును కలిగియుండుము! “భక్తులను శోధనలోనుండి తప్పించుటకు . . . యెహోవా సమర్థుడని,” సంపూర్ణనమ్మకమును కలిగియుండుము.—2 పేతురు 2:9 NW. (w90 4/15)

మీరేమి నేర్చుకొన్నారు?

◻ లోతు వలెనే, లోక జీవిత విధానమునకు మనమెట్లు ప్రత్యుత్తరమియ్యవలెను?

◻ సొదొమనుండి పారిపోవు సమయమునకూడ లోతు అతని కుటుంబము ఎటువంటి పరీక్షలను ఎదుర్కొనెను?

◻ పేతురు ఉపయోగించిన ఉదాహరణలు మనము యెహోవా పక్షమున స్థిరముగా నిలువబడవలసిన అత్యవసరతను ఎట్లు నెక్కితెల్పుచున్నవి?

◻ విడుదల కొరకు తన ప్రజలను సిద్ధముచేయుటలో, యెహోవా ఏ ప్రాముఖ్యమైన పాఠములను నేర్పుచున్నాడు?

[20వ పేజీలోని చిత్రాలు]

తమ తల్లి బలమైన రెక్కలక్రింది పక్షిపిల్లలను పోలి దేవుని ప్రజలు ఆయనద్వారా రక్షింపబడుచున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి