కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 1/1 పేజీలు 23-28
  • “సమాధానమును వెదకి దాని వెంటాడుము”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సమాధానమును వెదకి దాని వెంటాడుము”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “శరీరానుసారమైన మనస్సు”
  • మన సహోదరులతో సమాధానము
  • “సమాధానపరచువారు ధన్యులు”
  • సమాధానకరమైన మాటలు
  • “మీ శక్తికొలది చేయుడి”
  • “దేవుని సమాధానము” మీ హృదయములకు కావలిగా ఉండనీయుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ‘సమాధానమును వెదకి దాని వెంటాడుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • శాంతి దాన్నెలా పొందవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • నిజమైన శాంతి—ఏ మూలం నుండి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 1/1 పేజీలు 23-28

“సమాధానమును వెదకి దాని వెంటాడుము”

“తన సేవకుని క్షేమమును (సమాధానమును, NW) చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక.”—కీర్తన 35:27.

1. ఈనాడు మనము ఏ సమాధానమును అనుభవించుచున్నాము?

ఈ విభాగింపబడిన లోకములో సమాధానముతో యుండుట ఎంత ఆనందదాయకము! “సమాధానకర్తయగు దేవు” డైన యెహోవాను ఆరాధిస్తూ, ఆయన “సమాధానార్ధపు నిబంధన” ఆశీర్వాదములలో పాలుపొందుట ఎంత మనోహరము! జీవితపు వత్తిడుల మధ్య “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును” తెలిసికొని వారి దేశము, భాష, జాతి లేక సాంఘిక మూలమేదైనను దేవుని ప్రజలను ఐక్యపరచు ‘సమాధాన బంధమును” అనుభవించుట ఎంతటి విశ్రాంతిదాయకము!—1 థెస్సలొనీకయులు 5:23; యెహెజ్కేలు 37:26; ఫిలిప్పీయులు 4:7; ఎఫెసీయులు 4:3.

2, 3. (ఎ) దేవుని ప్రజలు ఒక మొత్తముగా అట్లు నిలిచినను వ్యక్తిగతముగా ఆయావ్యక్తులకు ఏమి సంభవింపవచ్చును? (బి) బైబిలు ఏమి చేయవలెనని మనలను గట్టిగా కోరుచున్నది?

2 యెహోవాసాక్షులముగా ఈ సమాధానమును మనము ఒక సంపదగా కాపాడుకొందుము. ఏమైనను, దీనిని మనము ఊరకనే ప్రాప్తించి నిలుచుదానిగా ఎంచము. మనము క్రైస్తవ సంఘముతో సహవసిస్తున్నంత మాత్రమున లేక క్రైస్తవ కుటుంబములో ఉండుట తటస్థించినంత మాత్రమున సమాధానము దానంతటదే కాపాడబడదు. అభిషక్త శేషము వారి సహచరులైన “వేరేగొర్రెలు” అంతమువరకు ఒక్క మందగా నిలిచినను, వ్యక్తిగతముగా ఆయా వ్యక్తులు సమాధానమును కోల్పోయి, పడిపోవచ్చును.—యోహాను 10:16; మత్తయి 24:13; రోమీయులు 11:22; 1 కొరింథీయులు 10:12.

3 అపొస్తలుడైన పౌలు తనదినములలోని అభిషక్త క్రైస్తవులను ఇట్లు హెచ్చరించెను: “సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.” (హెబ్రీయులు 3:12) ఈ హెచ్చరిక గొప్పసమూహమునకు కూడ అన్వయించును. కావున బైబిలు క్రైస్తవులనిట్లు కోరుచున్నది: “సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతులమీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడుచేయువారికి విరోధముగా ఉన్నది.”—1 పేతురు 3:10-12; కీర్తన 34:14, 15.

“శరీరానుసారమైన మనస్సు”

4. దేవునితో మనకు గల సమాధానమును ఏది భంగముచేయగలదు?

4 సమాధానమును మనము వెంటాడుచుండుటను ఏది భంగముచేయ గలదు? పౌలు ఒకదానిని ప్రస్తావిస్తూ ఇట్లనుచున్నాడు: “శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది.” (రోమీయులు 8:5బి, 6, 7) “శరీరము” అనుటలో పౌలు స్వతంత్రించుకొనిన పాపపు స్వభావములతోవున్న అసంపూర్ణ మానవులుగా మనయొక్క పతనమైన స్థితిని సూచించుచున్నాడు. పడిపోయివున్న మన శరీర స్వభావములకు లోబడుట మన సమాధానమును నాశనముచేయగలదు. ఒక క్రైస్తవుడు పశ్చాత్తాపమునొందక లైంగికదుర్నీతిని, అబద్ధములను, దొంగతనములను జరిగిస్తూ, మత్తుమందులనువాడుట, లేక ఇంకొకరీతిలో దైవిక ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నట్లయిన తాను ఒకప్పుడు యెహోవాతో అనుభవించిన సమాధానమును భంగము చేసికొనును. (సామెతలు 15:8, 29; 1 కొరింథీయులు 6:9, 10; ప్రకటన 21:8) అంతేగాక తాను వస్తుసంబంధమైన విషయములను తనకు ఆత్మీయ విషయములకంటెను ప్రాముఖ్యమైనవిగా తయారగునట్లు చేసుకొనిన దేవునితో తనకుగల సమాధానము తీవ్ర అపాయమందున్నది.—మత్తయి 6:24; 1 యోహాను 2:15-17.

5. సమాధానమును వెంటాడుటలో ఏమి ఇమిడియున్నది?

5 మరొక ప్రక్క పౌలు ఇట్లు చెప్పెను: “ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.” సమాధానము ఆత్మఫలములలో భాగమైయున్నది. మనము మన హృదయమునకు ఆత్మీయవిషయములను మెచ్చుకొనునట్లు శిక్షణ ఇచ్చి, ఈ విషయములో సహాయముచేయుటకై దేవుని ఆత్మకొరకు ప్రార్థించిననట్లయిన అప్పుడు మనము “శరీరానుసారమైన మనస్సును” కలిగియుండుటను నిరోధించగలము. (గలతీయులు 5:22-24) 1 పేతురు 3:10-12 నందు, సమాధానము నీతితో ముడిపెట్టబడియున్నది. (రోమీయులు 5:1) సమాధానమును వెంటాడుటలో ‘కీడునుండి తొలగి మేలుచేయుట’ ఇమిడియున్నదని పేతురు చెప్పుచున్నాడు. దేవుని ఆత్మ మనకు “నీతిని వెంటాడునట్లు” సహాయము చేయగలిగి తద్వారా దేవునితో మనకుగల మన సంబంధమును కాపాడును.—1 తిమోతి 6:11, 12.

6. సంఘముయొక్క సమాధానమునుగూర్చిన పెద్దల బాధ్యతలలో ఒకటేమైయున్నది?

6 ఈ సమాధానమును వెంటాడుట సంఘములోని పెద్దలకు ఉన్నతమైన శ్రద్ధయైయున్నది. ఉదాహరణకు, ఒకరు సంఘములోకి కలుషితమైన అలవాట్లను ప్రవేశపెట్టుటకు ప్రయత్నించినట్లయిన, ఆ పాపిని గద్దించుటకు ప్రయత్నించుటద్వారా సంఘమును సంరక్షించవలసిన బాధ్యత పెద్దలదైయున్నది. అతను ఆ గద్దింపును అంగీకరించినట్లయిన తాను తన సమాధానమును తిరిగి సంపాదించుకొనును. (హెబ్రీయులు 12:11) అట్లు కాని పక్షమున సంఘము దేవునితో కలిగియున్న దాని సమాధానకరమైన సంబంధమును కాపాడు నిమిత్తము అతడు వెలివేయబడవలసి వచ్చును.—1 కొరింథీయులు 5:1-5.

మన సహోదరులతో సమాధానము

7. ‘శరీరానుసారమైన మనస్సును’ వెల్లడిచేయు దేనినిగూర్చి పౌలు కొరింథీయులను హెచ్చరించెను?

7 ‘శరీరముపై మనస్సునుంచుట’ దేవునితోగల మన సమాధానమునే గాక ఇతర క్రైస్తవులతో మనకుగల మంచి సంబంధమును కూడ నాశనముచేయును. కొరింథీయులకు పౌలు ఇట్లు వ్రాసెను: “మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీరసంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా?” (1 కొరింథీయులు 3:3) అసూయ మరియు కలహము సమాధానమునకు పూర్తి విరుద్ధమైనవి.

8. (ఎ) సంఘములో అసూయ మరియు కలహమునకు కారణమగువానికి ఏమి సంభవించవచ్చును? (బి) దేవునితో మన సమాధానము దేనిపై ఆధారపడియున్నది?

8 అసూయ మరియు కలహమును కలుగజేయుటవలన సంఘ సమాధానమును భంగముచేయుట చాల గంభీరమైనది. ఆత్మఫలముగా సమాధానమునకు సంబంధించిన ఒక లక్షణమునుగూర్చి మాట్లాడుచు అపొస్తలుడైన యోహాను ఇట్లు హెచ్చరించెను: “ఎవడైనను—నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.” (1 యోహాను 4:20) ఆలాగే, ఒక వ్యక్తి సహోదరుల మధ్య అసూయ మరియు కలహమును కలుగజేసిన, తాను దేవునితో నిజముగా సమాధానము కలిగియుండ గలడా? నిశ్చయముగా లేదు! మనమిట్లు గట్టిగా కోరబడుచున్నాము: “సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి (దిద్దబడుటకు అనుకూలముగాయుండుడి NW), ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సుగలవారై యుండుడి, సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.” (2 కొరింథీయులు 13:11) ఔను, మనము ఒకరితో ఒకరము సమాధానముగా జీవించుటలో కొనసాగి నట్లయిన, అప్పుడు ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మనకు తోడైయుండును.

9. కొన్నిసార్లు క్రైస్తవులలో అపార్ధములు మరియు విబేధములు ఉండునని మనకెట్లు తెలియును?

9 దీని భావము క్రైస్తవుల మధ్య అపార్ధములు ఎప్పటికిని చోటుచేసుకొనవని కాదు. పెంతెకొస్తు గడచిన కొన్ని వారములకు యౌవనదశయందున్న క్రైస్తవ సంఘములో అనుదిన ఆహారమును పంచుట విషయములో విబేధము తలెత్తెను. (అపొస్తలుల కార్యములు 6:1) ఇంకోసారి, పౌలు మరియు బర్నబాలమధ్య తలెత్తిన విబేధము “తీవ్రవాదమునకు” దారితీసినది. (అపొస్తలుల కార్యములు 15:39) నిస్సందేహముగా మంచి ఆసక్తిగల సహోదరీలగు యువొదియ, సుంటుకేలను “ప్రభువునందు ఏకమనస్సు గలవారైయుండుడని” పౌలు ఉపదేశించవలసి వచ్చెను. (ఫిలిప్పీయులు 4:2) క్రైస్తవుల మధ్య సమాధానమును భంగపరచువాటిని పరిష్కరించుకొనుటలో వివరమైన సలహానిచ్చి, వాటిని తక్షణమే దిద్దుకొనవలసిన అత్యవసరతను యేసు ఉన్నతపరచుటలో ఆశ్చర్యముమేమియు లేదు. (మత్తయి 5:23-25; 18:15-17) తన అనుచరుల మధ్య ఇటువంటి ఇబ్బందులు ఉండవని ఆయన తలంచినట్లయిన, ఈ ఉపదేశమును ఆయన ఇచ్చియుండేవాడు కాదు.

10. సంఘములో కొన్నిసార్లు ఏ పరిస్థితులు ఉత్పన్నమగును, మరియు ఇది అందులో ఇమిడియున్నవారందరిపై ఏ బాధ్యతను మోపుచున్నది?

10 ఈనాడు, ఒకరు తన తోటి క్రైస్తవుని అనాలోచితమైన మాటవలననో, లేక తనను అగౌరవముగా చూచారనియో నొప్పించబడుట చాలా సామాన్యము. ఒక వ్యక్తిలోని ఒక లక్షణము మరొకరికి తీవ్రకోపమునకు కారణమవ వచ్చును. వ్యక్తిత్వములు విరుద్ధముగా ఉండవచ్చును. ఇంకొకరు పెద్దల నిర్ణయమును బలంగా వ్యతిరేకించవచ్చును. పెద్దల సమూహములోనే, ఒక పెద్ద దృఢమైన మనస్సుతో, ఇతర పెద్దలను అధికమించుటకు ప్రయత్నించవచ్చును. అటువంటి విషయములు సంభవించుట వాస్తవమైనను, ఇంకను మనము సమాధానమును వెదకి వెంటాడవలెను. ఇచ్చట సవాలేమనగా ‘ఐక్యపరచు సమాధాన బంధమును కాపాడునట్లు’ సమస్యలతో క్రైస్తవ పద్ధతిన వ్యవహరించుటైయున్నది.—ఎఫెసీయులు 4:3.

11. ఒకరితో ఒకరము సమాధానమును కలిగియుండునట్లు మనకు సహాయపడుటకు యెహోవా యే ఏర్పాట్లను చేసెను?

11 బైబిలు ఇట్లు చెప్పుచున్నది: “తన సేవకుని క్షేమమును (సమాధానమును NW) చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక.” (కీర్తన 35:27) ఔను, యెహోవా మనలను సమాధానమందుండవలెనని కోరుచున్నాడు. కావున, మనమధ్య మనలోను మరియు ఆయనతోను సమాధానమును కాపాడుకొనునట్లు మనకు సహాయపడుటకు ఆయన రెండు ఉన్నతమైన ఏర్పాటులను చేసియున్నాడు. వాటిలో ఒకటి పరిశుద్ధాత్మ. సమాధానము దానికి సంబంధించిన ఇతర సమాధానకర లక్షణములగు దీర్ఘశాంతము, దయ, సాత్వికము మరియు ఆశానిగ్రహములతోపాటు దాని ఫలమైయున్నది. (గలతీయులు 5:22, 23) ఇంకొకటి దైవిక జ్ఞానము. దీనిని గూర్చి మనమిట్లు చదువుదుము: “అయితే, పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది (సహేతుకమైనది NW), సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది.”—యాకోబు 3:17, 18.

12. మన సహోదరులతో మనకుగల సమాధానము భంగమైనప్పుడు మనమేమి చేయవలెను?

12 కావున ఇతరులతోగల మన సమాధానము భంగమైనప్పుడు, మనమెట్లు పనిచేయవలెనో చూపు పైనుండివచ్చు జ్ఞానము కొరకు ప్రార్థించవలెను. మరియు మనము సరైన దానిని చేయునట్లు మనలను బలపరచుటకై పరిశుద్ధాత్మకొరకును అడుగవలెను. (లూకా 11:13; యాకోబు 1:5; 1 యోహాను 3:22) మన ప్రార్థనకు అనుగుణ్యముగా, నడిపింపు కొరకు, దైవిక జ్ఞానమునకు మూలమైన బైబిలులో చూడవచ్చును. అలాగే లభ్యమగు ఇతర బైబిలు సాహిత్యములను కూడ ఉపదేశము మరియు లేఖనములను అన్వయించుకొనవలసిన పద్ధతికొరకు చూడవచ్చును. (2 తిమోతి 3:16) ఇంకను మనము సంఘములోని పెద్దలనుండి కూడ సలహాను వెదకుటకు ఇష్టపడవచ్చును. చివరి మెట్టేమనగా పొందియున్న నడిపింపును అనుసరించుటైయుండును. యెషయా 54:13 ఇట్లు చెప్పుచున్నది: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి (సమాధానము NW) కలుగును.” ఇది మనకు, యెహోవా మనకు బోధించు వాటిని అభ్యాసములో పెట్టుటపై మన సమాధానము ఆధారపడియున్నదని అంతర్గతంగా సూచిస్తున్నది.

“సమాధానపరచువారు ధన్యులు”

13, 14. (ఎ) “సమాధానకరమైన” అను యేసు మాట, అంతర్గతంగా ఏ భావమును సూచిస్తుంది? (బి) మన మెట్లు సమాధానపరచువారముగా ఉండగలము?

13 యేసు, తన కొండమీది ప్రసంగములో, “సమాధానపరచువారు (సమాధానకరమైనవారు NW) ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు” అని చెప్పెను. (మత్తయి 5:9) “సమాధానకరమైనవారు (NW)” అనగా ఇచ్చట అది స్వభావసిద్ధముగా నెమ్మదస్థుడైన వానినిగూర్చి చెప్పుటలేదు. మొట్టమొదటి గ్రీకు మూలపద భావము “సమాధానపరచువారు” అని. సమాధానపరచువాడు సమాధానము చెదరిపోయినప్పుడు దానిని తిరిగి పునరుద్ధరించుటలో నేర్పుగలవాడు. అయినను, అంతకంటె ముఖ్యముగా సమధానపరచువాడు మొట్టమొదట అసలు సమాధానము భంగము కాకుండానే చూచుటకు ప్రయత్నించును. ‘వాని హృదయమును సమాధానము ఏలుచుండును.’ (కొలొస్సయులు 3:15) దేవుని సేవకులు సమాధానపరచువారిగా ఉండుటకు కృషిచేస్తున్నట్లయిన, వారిమధ్య సమస్యలు అతి తక్కువగా యుండును.

14 సమాధానపరచువారిగా యుండుటలో మన స్వంత బలహీనతలను గుర్తించుట కూడ ఇమిడియున్నది. ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు ఉద్రేకపూరితమైన కోపము లేక చిన్నవిషయమును దోషముగాయెంచు లేక సులభముగా బాధపడు వాడైయుండవచ్చును. వత్తిడులలో తన భావోద్రేకములు తనను బైబిలు సూత్రములను మరచిపోవునట్లు చేయవచ్చును. అసంపూర్ణ మానవులలో ఇది ఎదురుచూడనిదేమి కాదు. (రోమీయులు 7:21-23) అయినను ద్వేషములు, కలహము, క్రోధములు శరీర కార్యముల క్రింద లిఖించబడియున్నవి. మనలో మనము అటువంటి స్వభావములను కనుగొనిన లేక ఇతరులవలన అవి మన దృష్టికి తేబడినట్లయిన మనము మనలో ఆశానిగ్రహమును, సాత్వికమును వృద్ధిచేసికొనునట్లు యెహోవా ఆత్మకొరకు యెడతెగక బ్రతిమాలుచు ప్రార్థించవలెను. నిశ్చయముగా, ప్రతివాడు తన నవీన స్వభావములో భాగముగా ఈ లక్షణములను సాగుచేసికొనుటకు కృషిచేయవలెను.—ఎఫెసీయులు 4:23, 24; కొలొస్సయులు 3:10, 15.

15. పైనుండివచ్చు జ్ఞానము ఎట్లు నిర్హేతుకమైన మొండితనమునకు విరుద్ధమైయున్నది?

15 ఒక సందర్భములో, ఒక సంఘము లేక ఒక పెద్దల సమూహము ఎల్లప్పుడు తన విధానమే జరగాలని పట్టుబట్టు మొండివానివలన కలతచెందినది. నిజమే, దైవాజ్ఞకు సంబంధించినపుడు, ఒక క్రైస్తవుడు పట్టువదలని మనస్సుగలవాడై, అటుఇటు వంగనట్లు గట్టిగాయుండవచ్చును. మరియు మనము ఇతరులకొరకు ప్రయోజనకరమైన తలంపును కలిగియున్నామని భావించి, అందుకు కారణములను వివరించగలిగినంతవరకు దానినిగూర్చి నిర్మొహమాటముగా మనలను మనము తెలియజెప్పుకొనుటలో తప్పేమి లేదు. అయితే లోకములోని “అతి ద్వేషుల” వలె (ఏ ఒప్పందమునకైనను ఏకీభవించనివారివలె NW) యుండకూడదు. (2 తిమోతి 3:1-4) పైనుండి వచ్చు జ్ఞానము సమాధానకరమైనది, సహేతుకమైనది. ఎవరి కార్యములైతే మొండిగా మృదుత్వములేని విధానమును కనపరచునో అట్టివారు, ‘వృధాతిశయముచేత ఏమియు చేయవద్దు” అని ఫిలిప్పీయులకు పౌలు ఇచ్చిన ఉపదేశమును గైకొనవలెను.—ఫిలిప్పీయులు 2:3.

16. వృధాతిశయమును జయించుటకు ఫిలిప్పీయులకు వ్రాసిన పుస్తకములోని పౌలు ఉపదేశము మనకు ఎట్లు సహాయపడును?

16 అదే పత్రికలో పౌలు, మనము ‘వినయమైన మనస్సుగలవారమై’ నిష్కపటముగా ‘యితరులు తనకంటె యోగ్యులని యెంచవలెనని’ గట్టిగా కోరుచున్నాడు. ఇది వృధాతిశయమునకు పూర్తిగా భిన్నమైనది. ఒక పరిపక్వతగల క్రైస్తవుడు మొదట తన తలంపులను బలవంతముగా ప్రవేశపెట్టుటనుగాని, ముఖమును దాచుకొనుటనుగాని లేక తన స్థానమును మరియు అధికారమును భద్రపరచుకొనుటనుగాని తలంచడు. ఇది పౌలు చేసిన ఉద్బోధకు భిన్నముగా యుండును. అదేమనగా, ‘ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమేగాక, యితరుల కార్యములను కూడ చూడవలెను.’—ఫిలిప్పీయులు 2:3; 1 పేతురు 5:2, 3, 6.

సమాధానకరమైన మాటలు

17. నాలుకను ఏ రీతిలో చెడుగా ఉపయోగించుట సంఘ సమాధానమును భంగము చేయగలదు?

17 సమాధానమును వెంటాడు వ్యక్తి తన నాలుకను ఉపయోగించుటలో ప్రత్యేకముగా జాగ్రత్తపడును. యాకోబు ఇట్లు హెచ్చరించుచున్నాడు: “నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!” (యాకోబు 3:5) మోసకరమైన వదరుబోతు మాటలు, ఇతరులను వారి వెనుక విమర్శించుట, నిర్దయ మరియు కఠినమైన మాటలు, సణుగులు మరియు ఫిర్యాదులు, అలాగే స్వప్రయోజనముకొరకు కపటముతో కూడిన పొగడ్తలు ఇవన్నియు దేవుని ప్రజల సమాధానమును భంగముచేయు శరీరకార్యములైయున్నవి.—1 కొరింథీయులు 10:10; 2 కొరింథీయులు 12:20; 1 తిమోతి 5:13; యూదా 16.

18. (ఎ) తలవనితలంపులో నాలుకను చెడుగా ఉపయోగించిన పరిస్థితిలో, అందులో ఇమిడియున్న ప్రతిఒక్కరు గైకొనవలసిన సరైన విధానమేమి? (బి) కోపము ఒకరిని గాయము కల్గించు మాటలను అనునట్లు చేసిన, పరిపక్వతగల క్రైస్తవులు ఎట్లు ప్రతిస్పందింతురు?

18 నిజమే, యాకోబు ఇలా చెప్పెను: “యే నరుడును నాలుకను సాధుచేయ నేరడు.” (యాకోబు 3:8) కొన్నిసార్లు చివరకు పరిపక్వతగల క్రైస్తవులు సహితము తరువాత వారు నిజముగా వాటి విషయమై బాధపడు మాటలను పలుకుదురు. మనము వారిని క్షమించునట్లు అటువంటి పొరపాట్లనుబట్టి ఇతరులును మనలను క్షమించవలెనని మనమందరము ఆశింతుము. (మత్తయి 6:9, 12) కొన్నిసార్లు అకస్మాత్తుగా పెల్లుబికిన కోపము గాయపరచు మాటలను పుట్టించును. అలాంటప్పుడు సమాధానపరచువాడు “మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపున” నుదానిని జ్ఞాపకమునకు తెచ్చుకొనును. (సామెతలు 15:1) తరచు తాను, కొంత దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని (నిమ్మళపరచుకొని), కోపకరమైన మాటలకు మరెక్కువ కోపమును పుట్టించు మాటలతో జవాబివ్వకుండ ఉండవలసియుండును. తరువాత ఉద్రేకము చల్లబడినప్పుడు, విశాల హృదయముగల ఆ సమాధానపరచు వ్యక్తికి ఉద్రేకపూరితమైన ఆ తరుణంలో పలికిన మాటలను ఎట్లు పట్టించుకొనకుండ దాటిపోవలెనో తెలియును. మరియు వినయముగల క్రైస్తవుడు ఎట్లు క్షమాపణ చెప్పుకొనవలెనో తెలిసికొనిన వాడై, తాను కలుగజేసిన గాయములను మాన్పుటకు ప్రయత్నించును. యథార్థముగా “నాది పొరపాటు” అని చెప్పుట నైతిక బలమునకు గుర్తెయున్నది.

19. హెచ్చరిక నిచ్చు పద్దతిని గూర్చి పౌలు మరియు యేసు నుండి మనము ఏమి నేర్చుకొందుము?

19 నాలుకను ఇతరులను హెచ్చరించుటకై ఉపయోగించవలసి వచ్చును. పేతురు అంతియొకయలో అయుక్తముగా ప్రవర్తించినపుడు పౌలు ఆయనను బహిరంగముగా గద్దించెను. మరియు యేసు ఏడు సంఘములకు అందచేసిన తన వర్తమానములో తీవ్రమైన హెచ్చరికలను అందజేసెను. (గలతీయులు 2:11-12; ప్రకటన, 2, 3 అధ్యాయములు) ఈ ఉదాహరణలను పరిశీలించిన, మనమిచ్చు హెచ్చరిక దాని అసలై అంశమును చూపించలేనంత దీనముగా ఉండకూడదనియు నేర్చుకొనుచున్నాము. అయినప్పటికిని పౌలు మరియు యేసు కఠినముగా లేక క్రూరముగా ఉండలేదు. వారిచ్చిన హెచ్చరిక వారి చీరాకునుండి వెలువడిన వాక్కులు కావు. వారు నిజముగా తమ సహోదరులకు సహాయముచేయుటకు ప్రయత్నించుచుండిరి. హెచ్చరికను చేయు వ్యక్తి తన నాలుక పూర్తిగా తన అదుపులో లేనట్లు గ్రహించిన, ఆ సమయమునకు కొంచెము ఆగి, ఏదైన చెప్పుటకు ముందు కొంచెము చల్లబడుటకు నిర్ణయించుకొనవచ్చును. లేనట్లయిన తాను కఠినమైన మాటలు మాట్లాడి, తాను వ్యవహరించవలసిన సమస్యకంటె ఇంకా నీచమైన సమస్యను కలుగజేయును.—సామెతలు 12:18.

20. మన సహోదర సహోదరీలతో చెప్పు ప్రతిదానిని లేక వారిని గూర్చి చెప్పు ప్రతిదానిని ఏది నడిపించవలెను?

20 ఇప్పటికే ప్రస్తావించబడినట్లుగా ఆత్మ ఫలములుగా ప్రేమ మరియు సమాధానము సన్నిహిత సంబంధమును కలిగియున్నవి. మనము మన సహోదరులకు చెప్పునదేకాని, లేక వారినిగూర్చి చెప్పునదేగాని, ఎల్లప్పుడు వారియెడలగల మన ప్రేమను ప్రతిబింబించునదైన, అప్పుడది సంఘ సమాధానమునకు దోహదపడును. (యోహాను 15:12, 13) మన మాటలు “కృపాసహితముగా ఉప్పువేసినట్టు” ఉండవలెను. (కొలొస్సయులు 4:6) అవి హృదయమునకు ప్రీతికరముగా యుండునట్లు రుచిగలవిగా యుండవలెను. యేసు ఇట్లు హెచ్చరించెను: “మీలో మీరు ఉప్పుసారముగలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడి.”—మార్కు 9:50.

“మీ శక్తికొలది చేయుడి”

21. దేవుని ప్రజలనుగూర్చి వారి వారపు కూటములలో, చిన్న మరియు పెద్ద సమావేశములలో ఏమి స్పష్టమవుతుంది?

21 కీర్తనల రచయిత ఇట్లు వ్రాసెను: “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” (కీర్తన 133:1) నిజముగా మనము మన సహోదరులతో యుండుటకు, ప్రత్యేకముగా మన వారపు కూటములలో, చిన్న మరియు పెద్ద సమావేశములలో వారితో యుండుటకు ఆనందించెదము. అలాంటి సమయములలో చివరకు బయటివారికి కూడ మన సమాధానము స్పష్టమవుచున్నది.

22. (ఎ) ఏ అబద్ధపూరితమైన సమాధానమును తాము పొందబోవుచున్నామని త్వరలో జనాంగములు తలంచును, అది దేనికి నడుపును? (బి) దేవుని సమాధానార్థమైన నిబంధన ఏ నిజమైన సమాధానమునకు నడుపును?

22 త్వరలో జనాంగములు యెహోవా లేకుండానే తాము శాంతిని సాధించబోవుచున్నామని తలంచును. అయితే వారు “శాంతి భద్రత” అని చెప్పుచుండగా దేవునితో సమాధానముగా లేనివారందరి మీదికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. (1 థెస్సలొనీకయులు 5:3 NW) దాని తరువాత గొప్ప సమాధానాధిపతి మానవుడు తొలుత దేవునితో సమాధానమును పొగొట్టుకొనుటవలన కలిగిన విపత్కర ఫలితములనుండి మానవజాతిని స్వస్థపరచుటకు మొదలిడును. (యెషయా 9:6, 7; ప్రకటన 22:1, 2) అప్పుడు దేవుని సమాధానార్థమైన నిబంధన ప్రపంచవ్యాప్తముగా నిమ్మళమైన ఫలితమునిచ్చును. చివరకు పొలములలోని క్రూర మృగములు సహితము వైరమునుండి విశ్రమించును.—కీర్తన 37:10, 11; 72:3-7; యెషయా 11:1-9; ప్రకటన 21:3, 4.

23. సమాధానకరమైన నూతనలోకపు నిరీక్షణను మనము కాపాడుకొనదలచినట్లయిన, మనమిప్పుడు ఏమి చేయవలెను?

23 అది ఎంతటి మహిమగల సమయమైయుండును! దానిని నీవు ఆతురతతో ఎదురుచూచెదవా? అట్లయిన “అందరితో సమాధానము కలిగియుండుటకు” వెంటాడుము. ఇప్పుడు నీ సహోదరులతో, ప్రత్యేకముగా యెహోవాతో సమాధానమును వెదకుము. ఔను, “వీటికొరకు కనిపెట్టు వారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి.”—హెబ్రీయులు 12:14; 2 పేతురు 3:14. (w91 3/1)

మీరు జ్ఞాపకము చేసికొనగలరా?

◻ యెహోవాతో మనకు గల సమాధానమును ఏది బ్రద్దలుచేయును?

◻ సంఘములో ఎటువంటి అపార్ధములను పరిష్కరించుకొనవలసి వచ్చును?

◻ సమాధానమును వెదకి వెంటాడుటకు యెహోవా ఏ ఏర్పాటును చేసియున్నాడు?

◻ ఏ శరీర స్వభావములు సంఘ సమాధానమును భంగముచేయగలవు, అటువంటివాటికి మనమెట్లు ప్రతిస్పందించవలెను?

[25వ పేజీలోని చిత్రాలు]

యెహోవాచే ఉపదేశమునొందువారి మధ్య సమాధానము సమృద్ధిగాయుండును

[27వ పేజీలోని చిత్రాలు]

ఐక్యతతో సేవించు సహోదరుల సమాధానము ఎంత మనోహరము

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి