దేవుని ప్రవచన వాక్యమునకు ధ్యానమిమ్ము!
రెండవ పేతురు నుండి ఉన్నతాంశములు
యెహోవా ప్రవచన వాక్యము లేదా వర్తమానము అంధకారములో వెలుగునిచ్చుచున్న దీపమువలెనున్నది. నిజక్రైస్తవులు దానికి అత్యంత అవధానమియ్యవలసియున్నది. అబద్ధబోధకులు మతభ్రష్టత్వమును ప్రవేశపెట్టుటకు ప్రయత్నించుచున్నప్పుడు అది అంత సులభము కాదు. కాని దైవ సహాయముతో దానిని చేయవచ్చును. అతివేగంగా సమీపిస్తున్న యెహోవా దినమును తప్పించుకొనవలెనంటే మనము దేవుని వాక్యమునకు దృఢముగా హత్తుకొనియుండవలెను.
దేవుని ప్రవచన వాక్యమునకు అవధానమిచ్చుటలో అపొస్తలుడైన పేతురుయొక్క రెండవ ప్రేరేపిత పత్రిక మనకు సహాయపడును. పేతురు ఈ పత్రికను దాదాపు సా.శ. 64లో బహుశ బబులోను నుండి వ్రాసియుండవచ్చును. తన పత్రికలో అతడు దేవుని సత్యము పక్షముగా వాదించి దొంగవలె వచ్చుచున్న యెహోవా దినమునుగూర్చి తోటి విశ్వాసులను హెచ్చరించి, శాసనములను ఉల్లంఘించు వారి పొరపాట్లనుబట్టి ఈడ్వబడకుండునట్లు తన పాఠకులకు సహాయము చేసెను. యెహోవా దినము అతి సమీపంగా ఉన్నది కనుక, పేతురుయొక్క ప్రేరేపిత మాటలనుబట్టి మనము బహుగా ప్రయోజనము పొందగలము.
ప్రవచన వాక్యమందు నమ్మకము
క్రైస్తవులముగా దైవిక లక్షణములను కనుపర్చుటకు మనము ప్రయాసపడవలెను మరియు ప్రవచన వాక్యమునకు ధ్యానమియ్యవలెను. (2 పేతురు 1:1-21) నిష్క్రియ లోనికి పోకుండా లేదా ఫలించని వారముగా ఉండకుండా మన విశ్వాసమునకు సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదరప్రేమ, మరియు ప్రేమను అందించవలయును. యేసు రూపాంతరము పొందుటను పేతురు చూచి ఆ సందర్భములో క్రీస్తును గూర్చి దేవుడు మాట్లాడిన దానిని వినినప్పుడు ప్రవచన వాక్యము మరింత నిజమాయెను. (మార్కు 9:1-8) అట్టి దైవ ప్రేరేపిత వాక్యమునకు మనము ధ్యానమియ్యవలెను.
మతభ్రష్టులనుండి కాపాడుకొనుము
దేవుని ప్రవచన వాక్యమునకు సరియైన అవధానమిచ్చుట మూలంగా, మత భ్రష్టులనుండి, చెరిపివేయు యితరులనుండి మనలను మనము కాపాడుకొనగలము. (2:1-22) అబద్ధ బోధకులు సంఘమును కలచివేస్తారని పేతురు హెచ్చరించెను. అయితే, అవిధేయులైన దేవదూతలకు, నోవహు దినమందలి భక్తిహీన లోకమునకు, సొదొమ గొమొఱ్ఱా పట్టణములకు తీర్పుతీర్చిన విధముగా ఈ మత భ్రష్టులకు కూడ యెహోవా తీర్పుచేయును. అబద్ధబోధకులు దేవుడిచ్చిన అధికారమును నిర్లక్ష్యముచేసి చెడుకార్యములలో తమతో ఏకీభవించుమని బలహీనులను వంచించెదరు. అట్టి మత భ్రష్టులకు “నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగి పోవుటకంటె” ఆ మార్గము తెలియకుండుటయే మేలు.
యెహోవా దినము వచ్చుచున్నది!
ఈ అంత్యదినములలో ప్రవచన వాక్యమునకు ధ్యానమిచ్చుచున్న వారముగా, యేసు ప్రత్యక్షతను గూర్చి అపహాస్యముచేయు అపహాసకులచే ప్రభావితమగుటకు మనలను మనము అనుమతించకూడదు. (3:1-18) ఈ విధానమును నాశనము చేయ సంకల్పించిన దేవుడు జలప్రళయమునకు ముందున్న లోకమును నాశనము చేసెనని వారు మరిచారు. యెహోవా దీర్ఘశాంతమును బట్టి ఆయన ఆలస్యము చేయువాడని తలంచకూడదు, ఆయన అందరూ మారు మనస్సుపొందవలెనని కోరుచున్నాడు. ఈ విధానము “యెహోవా దినమున” నాశనమై దాని స్థానములో ‘క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి వచ్చును, అందు నీతి నివసించును’ అందుచేత “నిష్కళంకులుగాను, నిందారహితులుగాను సమాధానముతో” నుండుటకు శక్తివంచన లేకుండా మనము కృషిచేయాలి. అబద్ద బోధకులచే వంచింపబడుటకు బదులు, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమందు అభివృద్ధిపొందుదము.
పేతురు మాటలను లక్ష్యపెట్టుదము. అబద్ధ బోధకుల నుండి కాపాడుకొనుటలో ఎన్నడు తప్పిపోకయుందము. యెహోవా దినము త్వరలో రానైయున్నదను మెలకువతో జీవించుదము. ఎల్లప్పుడు దేవుని ప్రవచన వాక్యమునకు ధ్యానమిచ్చెదము. (w91 3/15)
[31వ పేజీలోని బాక్సు/చిత్రం]
టార్టారస్ లోనికి త్రోయుట: “దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళ లోకమందలి కటికచీకటిగల బిలములోనికి (టార్టారస్) త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.” (2 పేతురు 2:4) అల్పులైన అబద్ధ దేవతలు, క్రోనస్ మరి యితర టిటాన్ ఆత్మలు బంధించబడు భూ అంతర్భాగమని హోమర్ వ్రాసిన ఇలియాడ్ (గ్రీకు కావ్యము) చూపబడిన పురాణ సంబంధిత పాతాళలోకము కాదిది. బైబిలు టార్టారస్ అనగా నోవహు దినమందలి అవిధేయ దేవదూతలను దేవుడు త్రోసివేసిన అగాధము, చెరవంటి పరిస్థితి. (ఆదికాండము 6:1-8; 1 పేతురు 3:19, 20; యూదా 6) వారు దేవుని కుటుంబమునుండి తొలివేయబడిన కారణంగా ఆయన నుండివచ్చు ఆత్మీయ వెలుగునుండి వేరైనందుకు కటికచీకటి వారికి సంభవించింది. వారికి ప్రతికూల తీర్పు నిర్ణయించబడినందువలన, వారిది అంధకార భవిష్యత్తే. క్రీస్తు వెయ్యేండ్ల పాలనకు ముందు సాతాను అతని దయ్యములు అగాధములో పడవేయబడుదానికి ముందుగా యివ్వబడిన శాపమే టార్టారస్. యేసు వెయ్యేండ్ల పాలన అనంతరం వారి నాశనము సంభవించును.—మత్తయి 25:41; ప్రకటన 20:1-3, 7-10, 14.
[చిత్రం]
అల్పులైన దేవతలను ద్యుపతి పురాణ సంబంధమైన టార్టారస్లో త్రోసివేయును
[క్రెడిట్ లైను]
National Archaeological Museum, Athens, Greece