కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/94 పేజీలు 3-4
  • ప్రవచన వాక్యమునకు శ్రద్ధనివ్వండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రవచన వాక్యమునకు శ్రద్ధనివ్వండి
  • మన రాజ్య పరిచర్య—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • దేవుని ప్రవచన వాక్యంపై విశ్వాసం ఉంచండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • దేవుని ప్రవచన వాక్యమునకు ధ్యానమిమ్ము!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • దేవుని ప్రవచన వాక్యం భవిష్యత్తుపై ఆశనిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1994
km 12/94 పేజీలు 3-4

ప్రవచన వాక్యమునకు శ్రద్ధనివ్వండి

1 “ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది.” (2 పేతు. 1:19) పేతురు ఎందుకిలా అన్నాడు? దాదాపు 32 సంవత్సరాల క్రితం పేతురు, మరి యిద్దరు శిష్యులు చూసిన, వినిన రూపాంతరం ద్వారా హెబ్రీ లేఖనాల్లోని రాజ్య ప్రవచనాలు, అలాగే యేసుక్రీస్తు స్వయంగా పలికిన ప్రవచనాలు రూఢిపరచబడ్డాయి లేదా ‘ఇంతకంటె స్థిరపరచబడ్డాయి.’ ఈ నాటకీయమైన దర్శనం, యేసు తేజోమయమైన మహిమతో, తన తండ్రి యొక్క పూర్తి మద్దతుతో రాజ్యాధికారంలోకి తప్పకుండా వస్తాడని వారికి హామీ యిచ్చింది. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ‘వెలుగిచ్చు దీపమన్నట్లుగా ఆ ప్రవచన వాక్యమునందు లక్ష్యముంచారు,’ లేకపోతే వారి హృదయాలు చీకటిగా ఉండేవే. ప్రకాశిస్తున్న ప్రవచన వాక్యమునకు శ్రద్ధనివ్వడం “వేకువ చుక్క” అయిన క్రీస్తు రాజ్యమహిమలో వచ్చేటప్పుడు వారిని అప్రమత్తంగాను, మరోరోజు ఉదయించే వేళకు జ్ఞానాభివృద్ధి కలుగునట్లుగాను చేసేది.—2 పేతు. 1:16-19; మత్త. 17:1-9.

2 పేతురుతో పాటు దివ్యమైన ఆ రూపాంతర దృశ్యాన్ని చూడడానికి మనమక్కడ లేము. అయినప్పటికినీ, ఆ ప్రవచన వాక్యమునకు శ్రద్ధచూపించిన యీ తరంలోని క్రైస్తవులు క్రీస్తు రాజ్యాన్ని గూర్చిన పూర్వప్రదర్శనను కాదుగాని, మహిమగల రాజు నిజంగా ఏలుతున్నాడన్న అధికమైన రుజువును చూసే ఆధిక్యత కలిగి ఉన్నారు! పందొమ్మిది వందల పద్నాలుగు నుండి ప్రతి సంవత్సరం గడుస్తున్న కొలది, యేసు తన రాజరిక “ప్రత్యక్షతను” గూర్చి యిచ్చిన స్పష్టమైన “సూచన” లోని వివిధ అంశాలు నెరవేరడం మనం చూస్తుండగా ప్రవచన వాక్యము మరింత స్థిరమవుతుంది. ఆ సూచనయొక్క ముఖ్య భాగమేదంటే రాజు యీ విధానానికి అంతం తెచ్చే ముందు సకల జనముల ముందు ఆయన ప్రభుత్వాన్ని లేదా రాజ్యాన్ని గూర్చి ప్రకటించబడుటయే. క్రీస్తు నడిపింపు క్రింద, యిప్పుడు రాజ్య ప్రకటన పని 231 దేశాల్లో యింతకు ముందెన్నడు ఊహించని సుదూర ప్రాంతాల్లో జరుగుతుంది. (మత్త. 24:3-14) అంతేకాక, “మహాశ్రమల” సమయం సమీపిస్తుండగా, సింహాసనాసీనుడైన రాజు క్రయధనమగు “గొఱ్ఱెపిల్ల రక్తము”లో విశ్వాసముంచడానికి “ప్రతి జనములోనుండియు” వచ్చు ‘గొప్ప సమూహాన్ని’ కూడా సమకూర్చుతున్నాడు.—ప్రక. 7:9, 10, 14.

3 “వేకువ చుక్క” లేచినప్పటికీ, అంటే క్రీస్తు రాజ్యాధికారానికి వచ్చినప్పటికీ, యింకా ప్రవచన వాక్యమునకు శ్రద్ధనివ్వవలసిన హేతువుందా? ఉంది! యేసుక్రీస్తు అపొస్తలుడైన యోహానుకు, ప్రకటన పుస్తకంగా మారిన దర్శనాల పరంపరను యిచ్చాడు. అవి తొలి క్రైస్తవుల ప్రోత్సాహానికి, మార్గనిర్దేశాల కొరకైనప్పటికీ, మనం యిప్పుడు జీవిస్తున్న ‘ప్రభువు దినమున’ వాటికి ప్రత్యేక మూల్యముంది. (ప్రక. 1:10) అందుకే యెహోవాప్రజల సంఘాలు యిప్పుడు ప్రకటన ముగింపు అనే పుస్తకాన్ని మళ్ళీ పఠిస్తున్నాయి.

4 “సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.” (ప్రక. 1:3) మనం సంతోషంగా ఉండాలంటే, అవును, మనం ప్రవచన దర్శనాల అర్థాన్ని, నిజమైన భావాన్ని తప్పకుండా గ్రహించాలి. దీనికి ఏది అవసరమై ఉంది? ప్రకటన వృత్తాంతము యొక్క ప్రాముఖ్యతను గూర్చి పూర్తిగా అర్థం చేసుకొని మనస్సులో ఉంచుకోడానికి పునరావృత్తి అవసరము. మొదటి శతాబ్దంలోని పెద్దల సంఘంలో సభ్యుడును, అపొస్తలుడునైన పేతురు తన సహోదరులను ఆత్మీయంగా ‘పురికొల్పేందుకు’ ప్రాథమిక సత్యాలను పునరుక్తి చేయడంలోని విలువను గుర్తించాడు. (2 పేతు. 1:12-14) ఆధునిక-దిన “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు” కూడా ప్రవచన వాక్యమునకు మరల మరల మన అవధానాన్ని మళ్ళిస్తూ, మన మెప్పుదలను సజీవంగా ఉంచేందుకు సహాయపడుతున్నాడు.—మత్త. 24:45-47.

5 ఎలా శ్రద్ధనివ్వవచ్చు: ప్రకటనలోని ఆ ప్రవచన వాక్యమునకు ఎలాంటి శ్రద్ధ చూపవలసి ఉంది? క్రైస్తవులకు పూర్వమున్న దాసులతో దేవుడు దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడినట్లు, క్రైస్తవులతో మాట్లాడలేదని అపొస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. బదులుగా యెహోవా “సమస్తమునకును వారసునిగా” నియమించిన తన అత్యంత ప్రియమైన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. (హెబ్రీ. 1:1, 2) “కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.” (హెబ్రీ. 2:1) అవును, మనం దేవుని వాక్యానికి, ప్రత్యేకంగా యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ప్రవచన వాక్యమునకు శ్రద్ధ యివ్వాలి. మనం మన ప్రకటన పఠనంలో ప్రత్యేక శ్రద్ధను ఎలా నిలపగలము?

6 మొదటిది, ప్రతివారం సంఘ పుస్తక పఠనానికి హాజరు కావడం ప్రాముఖ్యము. నిజమే, మనలో అనేకులు ప్రకటన ముగింపు అనే పుస్తకాన్ని పఠించడమంటే యిది మూడవ సారి కావచ్చు. కాబట్టి, ఒక కూటానికి రాకపోయినా, ఆ సమాచారం తమకు తెలిసిందేనని భావిస్తూ, చాలా మంది పుస్తక పఠనానికి హాజరు కావడాన్ని ఉదాసీనంగా దృష్టించవచ్చు. అయినప్పటికీ, ప్రకటన ముగింపు అనే పుస్తకాన్ని 1989 లో సంఘ పుస్తక పఠనంలో మనం మొదటిసారిగా పరిశీలించడం ఆరంభించినప్పటికన్నా, ప్రతి సంవత్సరం గడుస్తున్న కొలది, యీ ప్రవచన సమాచారం మరింత ఉచితంగాను, సమయోచితంగాను మారుతోంది. ప్రస్తుత దిన సంఘటనలు అతి వేగంగా ప్రకటన ప్రవచనాల నెరవేర్పుకు పరుగెడుతుండగా మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరముంది. అప్పుడు మనం యెహోవా యిష్టానికి అనుగుణంగా ప్రవర్తించడానికి సిద్ధపడగలము. సాధ్యమైతే, ఈ ప్రాముఖ్యమైన ప్రకటన పరిశీలనలో, వ్యక్తిగతంగా ఒక్క పుస్తక పఠనానికి కూడా హాజరు కాకుండా ఉండకూడదని లక్ష్యం పెట్టుకోండి.

7 రెండవది, మీ పాఠాన్ని బాగా సిద్ధపడండి. ఉదాహరించబడిన లేఖనాలను చూసి, పఠిస్తున్న ప్రకటన వచనాల వివరణలకు అవి ఎలా మద్దతునిస్తున్నాయో గమనించండి. ఈ విధంగా మీరు కేవలం ప్రశ్నలకు జవాబులు కాకుండా అంతకన్నా ఎక్కువగానే తెలుసుకోగలరు. కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాక, వివేకమును, అవగాహనను సంపాదించేందుకు ప్రయత్నం చేయండి. (సామె. 4:7) మూడవది, వ్యాఖ్యానాలిస్తూ, లేఖనాలను చదువుతూ చురుకుగా పాల్గొనండి. ప్రతి పఠనంలో అనేకసార్లు జవాబులివ్వాలని, కనీసం ఒక్కసారైనా జవాబివ్వాలని లక్ష్యం పెట్టుకోండి. ఆ విధంగా చేయడం పాఠంపై మీ మనస్సును నిలపడానికి తోడ్పడుతుంది.

8 ప్రవచన వాక్యమునకు విశేష శ్రద్ధ నిలపడంలో సిద్ధపడడం, హాజరు కావడం, పాల్గొనడం కన్నా ఎక్కువే యిమిడి ఉంది. పఠనం తర్వాత కూడా ‘వాటిని మనస్కరించుచు, వాటియందే సాధకము చేయడంలో’ కూడా మనం కొనసాగుతామని దాని అర్థం. (1 తిమో. 4:15) మన హృదయంలో ప్రవచన వాక్యము దీపమువలె ప్రకాశించాలంటే, మన లోపలి వ్యక్తిని—మన తలంపులను, కోరికలను, భావోద్రేకాలను, ఉద్దేశాలను మరియు లక్ష్యాలను లోతుగా ప్రభావితం చేయడానికి అనుమతించవలసిందే. (2 పేతు. 1:19) కాబట్టి, మనకు మనమే యిలాంటి ప్రశ్నలు వేసుకోవాలి: ఈ సమాచారం నాకు వ్యక్తిగతంగా ఏ భావాన్ని కలిగివుంది? నేను యెహోవాను గూర్చి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి ఏమి నేర్చుకున్నాను? ఈ సమాచారంలో ఏ సూత్రాలు యిమిడి ఉన్నాయి? నేను పఠనంలో గ్రహించిన వాటిని హృదయంలోకి తీసుకుంటున్నానా? నేను యీ సత్యాలను నా జీవితంలో ఎలా అన్వర్తించగలను? నా కుటుంబంలో ఎలా అన్వర్తించగలను? సంఘంలో ఎలా అన్వర్తించగలను? మనం నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా మనం కీర్తన రచయితవలె చెప్పగలము: “నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై యున్నది.”—కీర్త. 119:105; యోబు 29:3, 4.

9 క్లిష్టమైన కాలాల్లో మెలకువగా ఉండండి: సా.శ. 33 లో యెరూషలేముకు రాబోయే నాశనమును గూర్చి, సురక్షితమైన స్థలానికి పారిపోవలసిన సమయాన్ని సూచించే పరిస్థితిని గూర్చి యేసు తన శిష్యులను హెచ్చరించాడు. (లూకా 19:41-44; 21:7-21) తర్వాత, 30 సంవత్సరాలు దాటిపోయాయి. సమీప భవిష్యత్తులో పెద్ద మార్పు జరుగుతుందని యూదయలోని కొందరు క్రైస్తవులకు అనిపించనేలేదు. దాదాపు సా.శ. 64 లో ప్రియ అపొస్తలుడైన పేతురు వ్రాసిన రెండవ పత్రికలో ‘ప్రవచన వాక్యమునందు లక్ష్యముంచుడి’ అనే ఉపదేశము ఎంత సమయోచితమైనది! (2 పేతు. 1:19) త్వరలోనే, సా.శ. 66 లో యెరూషలేము రోమా సైన్యములచేత చుట్టబడింది. రోమా సైన్యములు ఏదో అస్పష్టమైన కారణం వలన అకస్మాత్తుగా వెనక్కి వెళ్ళినప్పుడు, మెలకువగావున్న యూదాలోని క్రైస్తవులు యేసు ఉపదేశాలను పాటించి, పారిపోయారు. తర్వాత సా.శ. 70 లో రోమా సైన్యములు తిరిగి వచ్చి, యెరూషలేమును పూర్తిగా నాశనము చేశాయి. ఆ క్రైస్తవులు యేసు ప్రవచన వాక్యమునందు తాము చక్కని శ్రద్ధనుంచినందుకు ఎంత సంతోషపడి ఉండవచ్చో!

10 ఆధునిక దిన క్రైస్తవులు వేటిని గూర్చి అప్రమత్తులుగా ఉండాలి? యేసు ప్రకటన దర్శనాల్లో, యిప్పుడు జీవిస్తున్న క్రైస్తవులను, ప్రభువు దినమందు సంభవించనున్న అనేక సంఘటనలను గూర్చి అప్రమత్తులుగా చేశాడు. గత 80 సంవత్సరాలుగా, యీ సంఘటనలలో అనేకము సంభవించాయి; రాజ్య జననము; పరలోకంలో యుద్ధం, దాని తర్వాత సాతాను, మరియు అతని దయ్యముల పరాజయము, తర్వాత వారిని భూమండలపు హద్దుల్లో ఉంచడం; మహాబబులోను పడిపోవడం; ఎఱ్ఱని క్రూరమృగం, అంటే ఎనిమిదవ ప్రపంచశక్తి కనబడడం. ప్రకటనలోని ప్రవచన వాక్యములోని యీ అంశాల నెరవేర్పు, యిక మిగిలిన నాటకీయమైన సంఘటనలు త్వరలో జరుగనున్నవని రూఢి చేస్తుంది: 144,000 మందిలోని చివరి సభ్యులకు ముద్రవేయడం, గొప్ప సమూహాన్ని పూర్తిగా సమకూర్చడం, మహాబబులోను నాశనము, అర్మగిద్దోను యుద్ధం, సాతానును అగాధంలో పడవేయడం; క్రీస్తు వెయ్యేండ్ల పాలన. యేసు హెచ్చరికకు మనం శ్రద్ధనివ్వడం ఎంత ప్రాముఖ్యము: “ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు”!—ప్రక. 16:15, 16.

11 మనం మెలకువగా ఉంటున్నామా? మనం ప్రవచన వాక్యమును ఎంత గంభీరంగా తీసుకుంటున్నాము? మనం మన జీవితాలను యెహోవాకు 5 సంవత్సరాల ముందు సమర్పించుకున్నా, లేక 50 సంవత్సరాల ముందు సమర్పించుకున్నా, రోమా క్రైస్తవులకు పౌలు వ్రాసిన మాటలు మనకు కూడా వర్తిస్తాయి: “మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసుల మైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది.” తర్వాత పౌలు క్రైస్తవులను యిలా ఉద్బోధిస్తున్నాడు, “అంధకార క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము,” “మర్యాదగా నడుచుకొందము.” (రోమా. 13:11-13) నైతికంగా పూర్తి అంధకారంలో ఉన్న లోకంలో మనం జీవిస్తున్నాము. కేవలం 30, 40 సంవత్సరాల క్రితం దిగ్భ్రాంతి కలిగించే ప్రవర్తన, నేడు 20 వ శతాబ్దపు అంతంలోని లోక ప్రజలకు చాలా మామూలైపోయింది. సహోదరులారా, లోక అంధకారంలో పడిపోడానికి, నైతికంగా మందులు కావడానికి మిమ్మల్ని మీరు అనుమతించకండి. లోకపు దిగజారిన తలంపుకు, జీవిత విధానానికి మీరు అవకాశమిచ్చేవారిగాను, సహించేవారిగాను మిమ్మల్ని మీరు అనుమతిస్తే, నేడు మనం ఎదుర్కొంటున్న యిక ఎన్నటికీ లేకుండా చక్కబెట్టబడే పెద్ద వివాదాంశాలైన యెహోవా సార్వభౌమాధిపత్యం స్థాపించబడడం, ఆయన నామం పరిశుద్ధపరచబడడం అనే వాటిపై శ్రద్ధను కోల్పోతారు. ఆత్మీయ మగత ఆసన్నమైన ఒకరి రక్షణను అపాయంలో పడవేస్తుంది.

12 ప్రవచన వాక్యము యెడల హృదయపూర్వక మెప్పుదలయందు పెరగండి: పురాతన హెబ్రీ ప్రవక్తలు మెస్సీయాను గూర్చిన పరిశుద్ధాత్మ ప్రేరేపిత పలుకుల నెరవేర్పునందు ఎంతో శ్రద్ధను చూపించారు. వారు దేవుని సంకల్పం ఎలా నెరవేరుతుంది అనే దాని గురించి, ‘శ్రద్ధగా పరిశీలించి, జాగ్రత్తగా పరిశోధించారు.’ (1 పేతు. 1:10, 11) అలాగే మీరు కూడా ప్రకటన పుస్తకంలోని ప్రవచన వాక్యమునందు శ్రద్ధ చూపితే, మీరు ఆత్మీయ విషయాలను గూర్చిన మెప్పుదలయందు పెరుగుతారు. మీ ఆత్మీయ ఆకలి తీవ్రమౌతుంది, అలా మీరు “దేవుని మర్మములను” పరిశోధించి తెలుసుకునేందుకు పురికొల్పబడుతారు. (1 కొరి. 2:10) ప్రవచన వాక్యముయెడల మెప్పుదలతో, ప్రేమతో మీ హృదయాన్ని నింపుకున్నట్లయితే, మీరు కూటాలకు హాజరు కావాలని ఎవరైనా బలవంతపెట్టవలసిన అవసరం ఉండదు; క్రమంగా హాజరై, పాల్గొనాలని మీరు పురికొల్పబడుతారు. (లూకా 6:45) ‘వాక్యము మీ హృదయంలో’ ఉన్నట్లయితే, మీరు ‘రక్షణ కలుగునట్లు బహిరంగంగా ఒప్పుకోవడానికి’ పురికొల్పబడుతారు.—రోమా. 10:8-10.

13 అంతము మరింత సమీపిస్తుండగా, దేవుని ప్రవచన ప్రకటనలలో మనం విశ్వాసముంచడాన్ని ఎగతాళిచేసే పరిహాసకులు ఎక్కువవుతారు! (2 పేతు. 3:3, 4) అయినప్పటికీ, మనం ప్రవచన వాక్యమును బట్టి మెలకువగా ఉంటాము. దేవుని వాక్యమనే దీపము మనం కాల ప్రవాహంలో ఎక్కడ ఉన్నామో మనకు చూపిస్తుంది. ఈ అంధకార లోకము యొక్క అంత్యదినాల్లో మనమున్నామన్న వాస్తవాన్ని అది తెలియజేస్తుంది. వేకువ చుక్క పొడిచింది! క్రీస్తు రాజ్యాధికారంలో ఉన్నాడు! చక్రవాళంలో మనమిప్పటికే మరో రోజు ఉదయించడాన్ని చూశాము. యేసు రూపాంతరాన్ని గూర్చిన అద్భుతమైన దర్శనంలో రాజ్యము యొక్క పూర్వప్రదర్శనను చూడడానికి ఆధిక్యత పొందిన ముగ్గురు అపొస్తలులకు అది ఎంత నిజంగా ఉండేదో మనకు కూడా దేవుడు వాగ్దానం చేసిన రాజ్యం అంత నిజమై ఉండునుగాక!

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి