“స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లా సమావేశములకు ఆహ్వానము!
స్వాతంత్ర్యము! ఆ పదము ఎంతటి ఉల్లసవంతమైన శబ్దము! నిర్బంధము లేదా బంధీలుగా ఉండి ఎవ్వరును ఆనందించలేరు. మనకు తెలిసినంతమట్టుకు మరి ఇతరమైన దేనికన్నా ఎక్కువగా నిరీక్షించబడిన రాజకీయ స్వాతంత్ర్యమునుగూర్చి ఇటీవలి సంవత్సరములలో ఎక్కువ చర్యలు గైకొనబడెను.
అయితే రాజకీయ స్వాతంత్ర్యము ఎంత కోరదగినదో, అంతకంటే ప్రాముఖ్యమైనదియు, కోరదగినదియునైన స్వాతంత్ర్యము ఒకటున్నది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తనశిష్యులతో మాట్లాడినప్పుడు ఈ స్వాతంత్ర్యమునుగూర్చి పేర్కొనెను: “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే, నిజంగా నాకు శిష్యులైయుండి, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును.” (యోహాను 8:31, 32) ఇది అబద్ధమత నమ్మకాలనుండి స్వతంత్రత, మనుష్యుల భయమునుండి స్వతంత్రత, పాపపు అలవాట్లకు బానిసయగుటనుండి స్వతంత్రత, ఇంకను అట్టి అనేకమైన వాటినుండి కలుగు స్వతంత్రతయైయున్నది.
ప్రపంచమందంతటా, 1991 చివరి నెలలలో ప్రారంభమై యెహోవా సాక్షులచే నడుపబడు “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్ల సమావేశములయొక్క ముఖ్యాంశమే. ఈ స్వాతంత్ర్యత వారిలో నడిపింపును తీసికొనుచున్న వారిపై ప్రభుత్వము ఆంక్షలను ఎత్తివేయడం జరిగిన 1919వ సంవత్సరం నుండి దేవుని ప్రజలు తమ స్వచ్ఛమైన ఆరాధనకు సంబంధించి అత్యధిక స్వాతంత్ర్యమును అనుభవించుచునే యున్నారు.
దైవిక సమావేశములందు అనేక సంవత్సరములనుండి స్వాతంత్ర్యత అనే అంశాన్ని ఉన్నతపరచుట తగినదే, వాటిలో “స్వేచ్ఛా జనాంగముల దైవిక సమావేశములు” మరియు “దేవుని కుమారుల విమోచన జిల్ల సమావేశములు” వంటి అంశాలను కలిగినవి కలవు. “ది ట్రూత్ షెల్ మేక్యు ఫ్రీ” మరియు లైఫ్ ఎవర్లాస్టింగ్—ఇన్ది ఫ్రీడం ఆఫ్ది సన్స్ ఆఫ్ గాడ్ అనే సాహిత్యములలోకూడ స్వాతంత్ర్యమునుగూర్చి విస్తృతంగా చర్చించబడెను.
యెహోవా సేవకులు కలిగియున్న దైవిక స్వాతంత్ర్యము వారు మాత్రమే క్షేమంగావుండి ఆనందించుటకు కాదు. గలతీయులు 6:1-3 నందు మనము చదువురీతిగా: “సహోదరులారా, మీరు స్వతంత్రులుగా శరీర క్రియలకు హేతువు చేసికొనక, ప్రేమకలిగినవారై ఒకనికొకడు దాసులైయుండుడి.” మన స్వతంత్రతయొక్క సంకల్పమును మెచ్చుకొనుటకు, విలువైన ఈ స్వాతంత్ర్యతను చేపట్టుకొనియుండుటకు, దానిని ఎంతగా ఉపయోగించుకొనవచ్చునో చూపుటకు “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లాసమావేశము మనకు సహాయము చేయును.
అటుపిమ్మట లభించబోవు ఆత్మీయాహారమునకు సరియైన అవధానమును నిల్పునట్లు చేయగల సంగీత కార్యక్రమముతో శుక్రవారం ఉదయం 10:20 కి సమావేశము ప్రారంభమగును. “మనలను స్వతంత్రులను చేయు సత్యమును ఎరిగియుండుట” అను మొదటిరోజు అంశము యోహాను 8:32పై ఆధారపడినది. మధ్యాహ్నమునకు కొంచెము ముందు అధ్యక్షుని ఆహ్వాన పలుకులు మరియు “దేవుడు మనకనుగ్రహించిన స్వాతంత్ర్యముయొక్క ఉద్దేశ్యము, దాని ఉపయోగము” అను మూలాంశ ప్రసంగము ఉండును. యెహోవాయొక్క ఖచ్ఛితమైన స్వాతంత్ర్యము, దేవుడు మనకనుగ్రహించు సంబంధిత స్వాతంత్ర్యమునకు మధ్యగల వ్యత్యాసమును ఈ ప్రసంగము ఉన్నతపరచును. మనము కలిగియున్న స్వతంత్రతను వీలైనంతమట్టుకు పూర్తిగా వినియోగించుకొనుమనికూడ ఆ ప్రసంగము మనలను ప్రోత్సహించును. మన స్వతంత్రత, మన పరిచర్యయొక్క వివిధ రూపములనుగూర్చి మధ్యాహ్న కార్యక్రమము వివరించి, “సత్యారాధనను వృద్ధిచేయుటకు స్వతంత్రత పొందుట” అనే నాటకముతో కార్యక్రమము ముగియును.
గలతీయులు 5:1 పై ఆధారపడిన, “దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యములో స్థిరముగా ఉండుట” అనునది రెండవదినముయొక్క అంశము. కుటుంబములోని వివిధ వ్యక్తులు కుటుంబవలయములో దేవుడనుగ్రహించిన స్వాతంత్ర్యతను ఎలా ఆనందించగలరో చూపు గోష్ఠిని ఉదయకాల కార్యక్రమము అందించును. సమర్పణ మరియు బాప్తిస్మముద్వారా స్వతంత్రత ఎలా సాధించబడునో అను దానినిగూర్చిన వివరములను బాప్తిస్మము కొరకు సిద్ధపడిన వారు ప్రాముఖ్యముగా అభినందించగలరు. వివాహము సంతోషానికి కీలకమా కాదా అనే ఆసక్తికరమైన చర్చ మధ్యాహ్న కార్యక్రమములో చేర్చబడింది. వివిధ ఉద్దేశ్యములతో కూడిన స్వాతంత్రతనుగూర్చి ఒక గోష్ఠి ఉంటుంది. ఆ పిమ్మట స్వాతంత్ర్యము మరియు నిత్యజీవమును అందించుటకు దేవుని ముఖ్యప్రతినిధిపై కేంద్రీకరించబడిన ముగింపు ప్రసంగముండును.
ఆదివారము కొరకు 2 కొరింథీయులు 3:17 పై ఆధారపడిన, “దేవుని ఆత్మకు అనుగుణ్యముగా మన స్వాతంత్ర్యమును ఉపయోగించుట” అను ముఖ్యాంశమున్నది. మత్తయి 13:47-50 నందు వ్రాయబడిన యేసు ఉపమానముపై ఒక ఆసక్తికరమైన గోష్ఠిని ఆరోజు కార్యక్రమము అందించి, యెహోవా సాక్షులు మనుష్యులను పట్టు జాలరులుగా ఎలా సేవచేయుచున్నారో వివరించును. మధ్యాహ్నమందు “స్వాతంత్ర్యమిచ్చు దేవుని నూతన లోకమునుగూర్చి జయధ్వని చేయుము!” అను బహిరంగ ప్రసంగమున్నది. అటుపిదప జిల్లాసమావేశము కొరకు ఒక క్రొత్త పరిచయము: ఆదివారము కొరకున్న కావలికోట పఠన సారాంశముంటుంది. దేవుడనుగ్రహించిన స్వాతంత్ర్యమును మన ప్రవర్తన, మన సాక్ష్యమునందు బాగుగా ఉపయోగించుటలో కొనసాగుచుండుమనే లేఖన హెచ్చరికతో కార్యక్రమము ముగియును.
స్వాతంత్ర్యమును ప్రేమించువారందరికి, గాయకుడైన దావీదు మాటలతో ఏకీభవించి ఇలా చెప్పుచున్నాము: “యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసికొనుడి.” (కీర్తన 34:8) ఈ సమావేశమునకు రావడానికి చేయుచున్న ఏ ప్రయత్నమును విడిచిపెట్టకుము. శుక్రవారం ప్రారంభ కార్యక్రమమునుండి ఆదివారం మధ్యాహ్న ముగింపు ప్రసంగము వరకు ఉండుట మీ కర్తవ్యముగా చేసికొనుము. మీ ఆత్మీయ అవసరతను సంపూర్ణంగా గుర్తించినవారై, సరియైన ఆత్మీయ ఆకలితో వచ్చినయెడల మీరు నిశ్చయముగా సంతోషించగలరు! (మత్తయి 5:3) “సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును” అనే సూత్రమును అలక్ష్యము చేయకయుందము. హాజరగుటకు ఎంతముందుగా మనము సిద్ధపడుచున్నాము, కార్యక్రమము అందించబడుచుండగా ఎంత ఆసక్తితో వినుచున్నాము, “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లాసమావేశము సంబంధముగా మనకివ్వబడిన స్వచ్ఛంద సేవాధిక్యతలను ఎటువంటివైనా వాటిని ఎంత ఉత్సాహంగా చేపట్టుచున్నామను దానికిక్కడ అది వర్తించును.—2 కొరింథీయులు 9:6. (w91 5/1)