వినయమును ఎందుకు ధరించుకొనవలెను?
అమెరికన్ రచయిత ఎడ్గార్ ఆలన్ పోయ్ కొంతమంది స్నేహితులకొరకు తన కొత్త కథను చదివి వినిపించడం అప్పుడే ముగించాడు. వారు తమాషాగా హీరో పేరును అతడు బహు తరచుగా వాడెనని అన్నారు. దానికి పోయ్ ఎలా స్పందించాడు? ఒక స్నేహితుడిలా జ్ఞాపకం చేసికొనుచున్నాడు: “అట్టి బాహాటపు తిరస్కారమునకు అతని అహంకార స్వభావము నిలువ జాలకపోయెను. కనుక కోపోద్రేకములో అతని స్నేహితులు అతనిని నివారించకముందే, మండుచున్న మంటలో ప్రతి ఒక్క కాగితమును అతడు విసిరివేశాడు.” “అతని సర్వసాధారణ వ్యాకులమైన కథలకు పూర్తిగా భిన్నమైన అత్యంత వినోదమయమగు కథ కోల్పోబడింది.” వినయము దానిని కాపాడగల్గియుండేది.
గర్వము ప్రజలచే అజ్ఞానమగు పనులను చేయించుచున్నను, ప్రపంచమున అది తాండవమాడుచున్నది. అయితే యెహోవా సేవకులు వ్యత్యాసంగా ఉండాలి. రమ్యముగా చిత్రీకరించబడిన వినయమనే వస్త్రమును వారు ధరించుకొనవలసియున్నది.
వినయమంటే ఏమిటి?
ప్రాచీన నగరమైన కొలొస్సయిలోనున్న తోటి విశ్వాసులకు అపొస్తలుడైన పౌలు వ్రాయుచున్నప్పుడు అందమైన క్రైస్తవ వస్త్రమగు వినయమును ఆయన సూచించాడు. ఆయన యిలా వేడుకున్నాడు: “దేవుని చేత ఏర్పరచబడినవారును, పరిశుద్ధులును, ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగలమనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.”—కొలొస్సయులు 3:12.
అవును, వినయమంటే, “నమ్రబుద్ధి.” అది “దీనమనస్సు; గర్వములేనిది, సాధువైనది.” వినయ విధేయతలు గలవ్యక్తి “అణకువ స్వభావము కల్గియుంటాడు; గర్విష్టికాదు.” అతడు ప్రగాఢమైన లేదా గౌరవనీయుడైన మర్యాదపరుడు.” (ది వరల్డ్ బుక్ డిక్షనరీ వాల్యూమ్ 1, పేజి 1030) వినయమనేది పిరికితనము కాదు లేదా బలహీనతకాదు. నిజం చెప్పాలంటే, గర్వము బలహీనతను ప్రతిబింబిస్తుంది, అయితే వినయమును చూపాలంటే ధైర్యము, బలము కావాలి.
లేఖనములలో, “నిన్ను నీవు తగ్గించుకో” అని తర్జుమా చేయబడిన హెబ్రీమాటకు “నిన్ను నీవే అణచుకొనుము” అనే అక్షరార్థమైన భావమున్నది. అందుచేత, సామెతలను వ్రాసిన జ్ఞానియిలా హితవు చెప్పెను: “నా కుమారుడా,. . .నీ నోటిమాటచేత నీవు పట్టబడియున్న యెడల . . .నీ చెలికాని చేత చిక్కుబడితివి గనుక నిన్ను నీవు విడిపించుకొనుము. నిన్ను నీవు తగ్గించుకొని [నిన్ను నీవు అణచుకొని] నీ చెలికానిని తొందరపెట్టి గోజాడుము.” (సామెతలు 6:1-3) అనగా గర్వమును విడనాడి, నీ తప్పును ఒప్పుకొని సంగతులను చక్కదిద్దుము.
అది నమ్మదగినదైయుండాలి
వినయముగా కన్పించు అందరూ నమ్మదగిన వినయమును కల్గియుండరు. పైకి వినయంగా కన్పించు కొందరు నిజానికి గర్విష్టులై తమ యిష్టాన్ని నెరవేర్చుకొనుటకు వెనుకాడరు. ఇతరులను మెప్పించడాన్కి భూటకపు వినయమును ప్రదర్శించువారు కూడా ఉంటారు. ఉదాహరణకు, “అతివినయమును” ప్రదర్శించిన కొందరిని పౌలు కలుసుకొనెను. ఎవరైనా అట్టి దానిని చేయుచున్న యెడల “శరీర సంబంధమైన మనస్సువలన ఊరక ఉప్పొంగుచు ఉంటాడని ఆయన సూచించెను. అట్టి వ్యక్తి తాను తినిన, త్రాగిన, లేదా దేనినైన తాకిన లేదా మత సంబంధ దినములను ఆచరించిన, ఆచరించక పోయిన వాటిపైన దేవుని అనుగ్రహము ఆధారపడియుండునని తప్పుగా తలంచెను. నిజమే, అతడు భక్తి కల్గి, వినయుడైయుండవచ్చును, కాని అతని భూటకపు వినయము నిరుపయోగమైనదైయుండెను. (కొలొస్సయులు 2:18, 23) వాస్తవానికి, ఎవరైతే ధన సంపత్తిని విడనాడుదురో వారికి జీవమనే బహుమానము యివ్వబడునని తలంచుటకది అతనిని నడిపినది. అంతేకాకుండా మోసపూరిత ధనాపేక్షకు అది దారిచూపింది, ఎందుకంటే వైరాగ్యపు నిషేధములు తాను విడనాడెనని చెప్పుకొనుచున్న ధన సంపత్తిపై ధ్యానమును మళ్లించినవి.
అయితే నమ్మదగిన వినయము, దుస్తులు కేశాలంకరణ జీవితవిధానముపై స్వయం ప్రాధాన్యత నివ్వకుండా ఒక వ్యక్తిని అడ్డగించును. (1 యోహాను 2:15-17) వినయమనే వస్త్రమును ధరించుకొనిన వ్యక్తి తనవైపుగాని తన సామర్థ్యములవైపుగాని అనవసరమైన ఆకర్షణను రాబట్టడు. బదులుగా, వివేకముగా యితరులతో వ్యవహరించుటకు, దేవుడు తన్ను ఎట్లు పరిగణిస్తున్నాడో అట్లే తన్ను తాను ఎంచుకొనునట్లు వినయము అతనికి దోహదపడును. అది ఎలా?
యెహోవా యొక్క బావ దృక్పథము
ఇశ్రాయేలు జనాంగమునకు క్రొత్తరాజును అభిషేకించడానికి ప్రవక్తయైన సమూయేలు ఉపక్రమించినప్పుడు, యెష్షయి కుమారుడైన ఏలియాబు యెహోవా ఎంపికకు తగినవాడని అతడు తలంచెను. కాని దేవుడు సమూయేలుతో యిట్లనెను: “అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్య పెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతనిని తృణీకరించి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” యెష్షయి ఏడుగురు కుమారులు కూడ తృణీకరింపబడిరి. దేవుడు దావీదును ఎంచుకొనెను, అతడు యథార్థవంతుడును, వినయముగల మనుష్యుడని నిరూపించబడెను.—1 సమూయేలు 13:14; 16:4-13.
మనము గర్విష్టులము అహంకారులమై దేవుని అనంగీకారమును పొందకుండా ఉండేందుకు వినయమనే వస్త్రమును మనలను కాపాడగలదు. ఆయన “అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (యాకోబు 4:6) కీర్తనల రచయిత మాటలలో ఆయన దృక్పథము చూపబడెను: “యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరమునుండి గర్విష్టులను బాగుగా ఎరుగును.” (కీర్తన 138:6; 1 పేతురు 5:5, 6) యెహోవా తన సేవకులనుండి ఏమి అపేక్షించుచుండెనో మీకా 6:8 నందు లేవనెత్తబడిన ప్రశ్నద్వారా తేటతెల్లమగుచున్నది: “న్యాయముగా నడచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవునియెదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు?”
దేవునిచే మరియు క్రీస్తుచే ప్రదర్శించబడెను
వినయమును ప్రదర్శించాలని యెహోవా మనలనుండి అపేక్షించుట ఆశ్చర్యము కాదు! అది తన స్వంత లక్షణములలో ఒకటి. తన శత్రువులనుండి యెహోవా తన్ను తప్పించిన తరువాత దావీదు యిలా పాడెను: “నీ రక్షణ కేడెమును నీవు [యెహోవా] నా కందించుచున్నావు. నీ సాత్వికము నన్ను గొప్పచేసెను.” (కీర్తన 18:35; 2 సమూయేలు 22:1, 36) యెహోవా ఉన్నత ఆకాశమందున్నను “ఆయన భూమ్యాకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు, ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తి, పెంటకుప్ప మీదనుండి బీదలను పైకెత్తి, ప్రధానులతో వారిని కూర్చుండ బెట్టును.” (కీర్తన 113:5-8) పాపులైన మానవుల యెడల కనికరమును చూపుట ద్వారా దేవుడు వినయమును కనపర్చుచున్నాడు. పాపాత్ములతో ఆయన వ్యవహరించుట, మరియు పాపముల కొరకు తన కుమారుని బలిగా అర్పించుట, ఆయన వినయము, ప్రేమ మరియు ఇతర లక్షణముల ప్రదర్శనయైయున్నది.—రోమీయులు 5:8; 8:20, 21.
“సాత్వికుడును దీనమనస్సుగల” యేసుక్రీస్తు వినయమునకు గొప్ప మానవ దృష్టాంతమును చూపెను. (మత్తయి 11:29) తన శిష్యులకు ఆయన ఇట్లు చెప్పెను: “తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.” (మత్తయి 23:12) అది కేవలము ఉత్ప్రేక్షాలంకారము కాదు. తాను చనిపోయే ముందురోజు సాయంకాలమున యేసు తన అపొస్తలుల పాదములను కడిగి, సాంప్రదాయకంగా సేవకులచే చేయబడు సేవను ఆయనచేసెను. (యోహాను 13:2-5, 12-17) భూమి మీదికి రాక మునుపు యేసు దేవునికి వినయపూర్వకమైన సేవను చేసెను మరియు తాను పరలోకములో మహిమగల స్థానమునకు పునరుత్థానము చేయబడినప్పటినుండి వినయమును ప్రదర్శించెను. కనుకనే పౌలు తోటివిశ్వాసులకు యేసుక్రీస్తు కల్గియున్న వినయ స్వభావమును కల్గియుండి “యితరులు తమకంటె ఉన్నతమైన వారని ఎంచుకొనుమని” సలహానిచ్చెను.—ఫిలిప్పీయులు 2:3, 5-11.
దేవుడు మరియు యేసుక్రీస్తు వినయమును కనపర్చుచున్నారు కనుక, దైవిక అనుగ్రహమును పొంద నపేక్షించువారు ఈ లక్షణమును చూపాల్సియున్నది. కొన్ని పర్యాయములు మనము గర్వహృదయులమైతే, మనలను మనము తగ్గించుకొని దేవుని క్షమాపణకొరకు ప్రార్థించుట జ్ఞానయుక్తము. (2 దినవృత్తాంతములు 32:24-26 పోల్చుము.) మనలను గూర్చి మనము డంబపు యోచనలు కల్గియుండే బదులు, పౌలు సలహాను పాటించవలసియున్నాము: “హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులైయుండుడి.” (రోమీయులు 12:16) అట్లయితే, మనకును, యితరులకును వినయము ఎట్లు ప్రయోజనకరము కాగలదు?
వినయముయొక్క ప్రయోజనములు
వినయముయొక్క ప్రయోజనములలో ఒకటి అది మనము డంభములు పల్కుటనుండి నివారించును. ఆ ప్రకారంగా మనము యితరుల ఉపద్రవములను సహించి, మన కార్య సాధనకు వారు బద్ధులుకాకపోతే వ్యక్తిగత తత్తరపాటును విడనాడగలము. మనము యెహోవాయందు అతిశయించవలసియున్నాము గాని మనలను బట్టికాదు.—1 కొరింథీయులు 1:31.
దైవికనడిపింపును పొందుటకు వినయము మనకు సహాయపడగలదు. నడిపింపుకొరకు, వివేచనకొరకు దానియేలు అన్వేషించుచున్నపుడు, ఆ ప్రవక్త దేవునియెదుట తన్నుతాను తగ్గించుకొనినందున యెహోవా దర్శనమునిచ్చి ఒక దూతను అతనియొద్దకు పంపెను. (దానియేలు 10:12) యెరూషలేమునందలి దేవాలయమును సుందరవంతముగా తీర్చి దిద్దుటకు విస్తారమైన బంగారము, వెండితోపాటు యెహోవా ప్రజలు బబులోను నుండి వెళ్లుచున్నపుడు, ఎజ్రావారిని నడిపించవలసియుండగా, వారంతా దేవునియెదుట తమ్మును తాము వినయపర్చుకొనులాగున ఉపవాసముండవలెనని అతడు ప్రకటించెను. ఫలితమేమిటి? అట్టి అపాయకరమైన ప్రయాణములో శత్రువుల బారినుండి యెహోవా వారిని కాపాడెను. (ఎజ్రా 8:1-14, 21-32) దేవుడు అప్పగించిన కర్తవ్యములను మన స్వంత జ్ఞానము, సామర్ధ్యములతో నెరవేర్చుటకు ప్రయత్నించేబదులు దానియేలు, ఎజ్రాలవలె మనమును వినయమును ప్రదర్శించి, యెహోవా నడిపింపును వెదకుదము.
వినయమనే వస్త్రమును మనము ధరించుకొన్నట్లయితే, మనము యితరులను గౌరవిస్తాము. దృష్టాంతమునకు, వినయముగల పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించి వారికి లోబడియుంటారు. వినయముగల క్రైస్తవులు కూడా యితర దేశముల జాతుల గత జీవితచరిత్రలుగల తమ తోటివిశ్వాసులను గౌరవిస్తారు, ఎందుకంటే వినయము మనలను నిష్పక్షపాతునిగా చేయును.—అపొస్తలుల కార్యములు 10:34, 35; 17:26.
వినయము ప్రేమా, సమాధానములను వృద్ధిచేయును. వినయస్థుడు తన హక్కులు అనబడేవాటిని స్థిరపర్చే ప్రయత్నములో తోటి విశ్వాసులతో పోరాడడు. ప్రోత్సాహకరమైనవాటిని, ఒక సహోదరుని మనస్సాక్షిని యిబ్బంది పెట్టని వాటినే పౌలు చేసియుండెను. (రోమీయులు 14:19-21; 1 కొరింథీయులు 8:9-13; 10:23-33) ఇతరులు మనకు విరోధముగా చేసిన పాపములను క్షమించుట ద్వారా ప్రేమా సమాధానములను వృద్ధిచేయుటకు కూడ వినయము మనకు సహాయపడగలదు. (మత్తయి 6:12-15; 18:21, 22) అభ్యంతరపడిన వ్యక్తినొద్దకు వెళ్ళి మనపొరపాటును ఒప్పుకొని, అతని క్షమాభిక్షనడిగి, మనము ఏదైన తప్పుచేసియుంటే దానిని సరిదిద్దుటకు మనము చేయదగిన కార్యమును చేయుటకు అది మనలను కదల్చును. (మత్తయి 5:23, 24; లూకా 19:8) అభ్యంతరపడిన వ్యక్తి మనలను సమీపిస్తే, ప్రేమతో ఆ విషయాలను శాంతియుతంగా పరిష్కరించుకొనుటకు వినయము మనలను ప్రేరేపించును.—మత్తయి 18:15; లూకా 17:3.
వినయమును కనుపర్చుటను బట్టి రక్షణ ఆధారపడియుండును. దృష్టాంతమునకు దేవుని గూర్చి యిట్లు చెప్పబడెను: “వినయము గలవారిని నీవు రక్షించెదవుగాని గర్విష్టులకు విరోధివై వారిని అణచివేసెదవు.” (2 సమూయేలు 22:28 NW) రాజైన యేసుక్రీస్తు “సత్యమును, వినయమును స్థాపించుటకు బయలు దేరునప్పుడు’ తనయెదుట, తన తండ్రియెదుట వినయమును కనుపర్చువారిని ఆయన రక్షించును. (కీర్తన 45:4) వినయముగల వారు ఈ మాటలనుబట్టి ఓదార్పునొందుదురు: “భూమిమీద సాత్వికులై ఆయన న్యాయవిధులను ఆచరించుచున్న సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. నీతిననుసరించండి, వినయము గల్గియుండండి. యెహోవా ఉగ్రత దినమున ఒకవేళ మీరు దాచబడ వచ్చును.”—జెఫన్యా 2:3 NW.
వినయము మరియు దేవుని సంస్థ
దేవుని సంస్థను అభినందించి, యథార్థతను కాపాడుకొను వారిగా దానిని హత్తుకొనియుండునట్లు వినయము దేవుని ప్రజలను నడిపించును. (యోహాను 6:66-69 పోల్చి చూడుము.) మనము పొంద నిరీక్షించిన సేవా ఆధిక్యత మనకు లభించక పోయినయెడల సంఘములో బాధ్యతను కల్గియున్నవారితో సహకరించుటకు వినయము మనకు తోడ్పడగలదు. వినయముతో కూడిన మన సహకారము మంచి మాదిరి కాగలదు.
మరోవైపు, యెహోవా ప్రజలమధ్య మనకీయబడిన సేవా ఆధిక్యతల విషయములో నిరాశను వ్యక్తపర్చకుండా వినయము మనలను కాపాడును. దేవుని సంస్థతో మనకివ్వబడిన ఆధిక్యతనుబట్టి కొనియాడబడ వలెనని ఆశించకుండా అది మనలను నివారించును. అంతేకాదు, మనము పెద్దలుగా సేవచేస్తున్నట్లయితే, దేవుని మందను మృదువుగా కాయుటకు వినయము మనకు సహాయపడును.—అపొస్తలుల కార్యములు 20:28, 29; 1 పేతురు 3:8.
వినయము మరియు క్రమశిక్షణ
వినయమనే వస్త్రము క్రమ శిక్షణను అంగీకరించుటకు మనకు సహాయపడును. వినయముగల వారు యూదారాజైన ఉజ్జియావంటివారుకారు, అతని హృదయము యాజకుల పనిని తాను బలవంతముగా లాక్కుని చేసేటంత గర్వముగలదైనది. అతడు ‘యెహోవాకు వ్యతిరేకముగా అపనమ్మకస్థునివలె వ్యవహరించి ధూపపీఠముమీద ధూపము వేయుటకై మందిరములోనికి ప్రవేశించెను.” తనను మందలించినందుకు ఉజ్జియా యాజకులపై రౌద్రుడైనప్పుడు, అతడు కుష్టరోగియాయెను. వినయము లేకపోవుటవలన ఎంతటి కీడు సంభవించింది! (2 దినవృత్తాంతములు 26:16-21; సామెతలు 16:18) దేవుని నుండి ఆయన వాక్యము మరియు సంస్థద్వారా యివ్వబడుచున్న శిక్షణను అంగీకరించేందుకు గర్వము మిమ్మును ఆటంక పర్చునట్లు ఎన్నడు ఉజ్జియావలె ఉండవద్దు.
ఈ విషయమై పౌలు అభిషక్త హెబ్రీ క్రైస్తవులకిట్లు చెప్పెను: “నాకుమారుడా, యెహోవా చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. యెహోవా తన్ను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతికుమారుని దండించును. అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి . . . ప్రస్తుతము సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని, సంతోషకరముగా కనబడదు; అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.” (హెబ్రీయులు 12:5-11) “శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు” అని కూడ గుర్తించుకొనుము.—సామెతలు 6:23.
వినయమును ధరించుకొని కొనసాగుము
క్రైస్తవులు ఎల్లవేళల వినయమనే వస్త్రమును ధరించుకొని యుండుట ఎంత ప్రాముఖ్యమైనది! “నిత్యజీవముకొరకు యోగ్యులైన” వారిని వెదకుచు యింటింట వినయముతో సాక్ష్య మిచ్చుచునుండు రాజ్య ప్రచారకులుగా పట్టుదల కల్గియుండునట్లు అది మనలను పురికొల్పును. (అపొస్తలుల కార్యములు 13:48; 20:20) నిజమే, గర్విష్టులైన వ్యతిరేకులు మన నీతియుక్త విధానమును ద్వేషించుచున్నను, సకల విషయములలో మన దేవునికి విధేయులమై కొనసాగుటకు వినయము మనకు సహాయపడగలదు.—కీర్తన 34:21.
వినయము మనలను “పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మికయుంచునట్లు” చేయును గనుక ఆయన మన మార్గములను సరాళముచేయును. (సామెతలు 3:5, 6) వాస్తవానికి, మనము ఈ శ్రేష్టమైన లక్షణమును ధరించుకొన్నప్పుడు మాత్రమే, మనము నిజంగా దేవునితో నడువగల్గి ఆయన అనుగ్రహమును, ఆశీర్వాదమును అనుభవించగలము. శిష్యుడైన యాకోబు వ్రాసినట్లుగా: “యెహోవా దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును.” (యాకోబు 4:10 NW) అందుచేత యెహోవా దేవునిచే సొగసుగా తయారుచేయబడిన అందమైన వస్త్రమగు వినయమును ధరించుకొనియుందము. (w91 5/1)