కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wtsbr 3/15 పేజీలు 11-15
  • యెహోవా కనికరం మనల్ని నిరాశనుండి రక్షిస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా కనికరం మనల్ని నిరాశనుండి రక్షిస్తుంది
  • కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తప్పటడుగులు ఘోరపాపానికి దారితీయవచ్చు
  • ఒప్పుకొనడం వల్ల ఉపశమనం కలుగుతుంది
  • మనం దేవునికి జవాబుదారులమైయున్నాము
  • దుర్భల పరిస్థితులు
  • పవిత్రపరచబడుట కొరకు ప్రార్థన
  • స్వస్థత కొరకు ప్రార్థన
  • ఒకవేళ మీరు తప్పుచేస్తే?
  • పాపాన్ని ఒప్పుకోవడం స్వస్థతకు నడిపిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • విరిగిన హృదయాన్ని యెహోవా తృణీకరించడు
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • మారుతున్న జీవన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు దేవుని ఆత్మపై ఆధారపడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
wtsbr 3/15 పేజీలు 11-15

యెహోవా కనికరం మనల్ని నిరాశనుండి రక్షిస్తుంది

“దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము.”—కీర్తన 51:1.

1, 2. యెహోవా సేవకులలో ఎవరి మీదనైనా వారు చేసిన గంభీరపాపం ఎలాంటి ప్రభావం చూపగలదు?

యెహోవా శాసనాన్ని ఉల్లంఘించి శిక్ష పొందకుండా ఉండలేము. మనం దేవునికి విరుద్ధంగా ఏదైనా దుఃఖకరమైన పాపం చేసినప్పుడు ఈ విషయం ఎంత స్పష్టంగా కనబడుతుందో! మనం ఏళ్ళతరబడి యెహోవాను నమ్మకంగా సేవించినా, ఆయన శాసనాన్ని ఉల్లంఘించడం గొప్ప వ్యాకులతను లేక విపరీత వ్యధను తేగలదు. యెహోవా మనల్ని వదిలేశాడని, మనం ఆయనను సేవించడానికి ఇక పనికిరామని మనం భావించవచ్చు. మన పాపం ఒక పెద్ద మేఘంవంటిదై యెహోవా అనుగ్రహా వెలుగును అడ్డగిస్తుందని అనిపించవచ్చు.

2 ప్రాచీన ఇశ్రాయేలీయుల రాజైన దావీదు తానే ఒకసారి అటువంటి స్థితిలో ఉన్నట్లు గమనించాడు. ఈ పరిస్థితి ఎలా ఉత్పన్నమైంది?

తప్పటడుగులు ఘోరపాపానికి దారితీయవచ్చు

3, 4. తాను విరాజిల్లు కాలంలో దావీదుకు ఏమి సంభవించింది?

3 దావీదు దేవున్ని ప్రేమించాడు కాని ఆయన వేసిన తప్పటడుగులు ఘోరపాపాలకు దారితీశాయి. (గలతీయులు 6:1 ని పోల్చండి.) ఇది ఏ అసంపూర్ణ మానవునికైనా సంభవించవచ్చు, ప్రాముఖ్యంగా అతనికి ఇతరుల మీద అధికారము ఉన్నప్పుడు అలా జరుగవచ్చు. ఓ వర్థిల్లుతున్న రాజుగా, దావీదు పేరు ప్రతిష్టను, అధికారాన్ని అనుభవించాడు. అతని మాటను ధిక్కరించడానికి ఎవరికి ధైర్యముండేది? సమర్థులైన మనుష్యులు అతనివద్ద ఇష్టంతో పనిచేశారు, ప్రజలు అతను చెప్పిందంతా సిరసావహించారు. అయినను, తాను అనేకమంది భార్యలను చేసుకొనడం వల్లనూ, జనాబాను లెక్కించడం ద్వారాను దావీదు తప్పిదం చేశాడు.—ద్వితీయోపదేశకాండము 17:14-20; 1 దినవృత్తాంతములు 21:1.

4 తాను ఐశ్వర్యంతో విరాజిల్లుతున్న యీ కాలంలో, దావీదు దేవునికి మానవునికి విరుద్ధంగా గంభీరమైన తప్పులు చేశాడు. అందుకే, సాతాను అల్లిన అల్లికలో పడి ఆయన ఒక పాపం తర్వాత మరొకటి చేయసాగాడు! తోటి ఇశ్రాయేలీయులు అమ్మోనీయులతో యుద్ధం చేస్తుంటే, దావీదు తన మేడ మీదనుండి ఊరియా యొక్క అందమైన భార్య బత్షెబ స్నానం చేస్తుంటే చూశాడు. ఊరియా యుద్ధంలో ఉంటే, రాజు ఆ స్త్రీని తన రాజనగరుకు రప్పించి ఆమెతో జారత్వం చేశాడు. ఆమె గర్భవతి అయిందని తర్వాత తెలిసికొని అతనెంత నిర్ఘాంతపోయాడో ఉహించండి! ఊరియా ఆ రాత్రి బత్షెబతో గడిపి ఆ శిశువును తనదిగా పరిగణిస్తాడని ఆశించి, దావీదు అతన్ని పిలిపించాడు. దావీదు అతని బహుగా తాగించిననూ, ఊరియా ఆమెతో శయనించడానికి నిరాకరించాడు. దావీదు నిరాశచెంది, ఊరియా నిశ్చయంగా చనిపోవుటకు అవకాశమున్న యుద్ధ రంగంలో ముందు వరుసలో అతన్ని నిలబెట్టమని సేనాధిపతియగు యోవాబుకు రహస్య ఆజ్ఞలు పంపాడు. ఊరియా యుద్ధంలో చంపబడ్డాడు, విధవరాలైన అతని భార్య సాధారణ అంగలార్పు కాలం పాటించింది, ఆమె గర్భవతియైనట్లు ప్రజలకు తెలియక ముందే దావీదు ఆమెను వివాహమాడాడు.—2 సమూయేలు 11:1-27.

5. దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు ఏమి జరిగింది, అతని పాపం అతనిపై ఎట్టి ప్రభావాన్ని చూపింది?

5 ప్రవక్తయగు నాతాను ద్వారా, దేవుడు దావీదు తప్పిదాన్ని బయల్పరచి ఇలా చెప్పాడు: “నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును.” తదనుగుణ్యంగానే, బత్షెబకు జన్మించిన శిశువు మరణించాడు. (2 సమూయేలు 12:1-23) దావీదు జ్యేష్టకుమారుడైన అమ్నోను తన స్వంత పినతల్లి కూతురైన తామారును మానభంగం చేశాడు, అందుకని ఆమె అన్న అతనిని హతమార్చాడు. (2 సమూయేలు 13:1-33) రాజుకుమారుడైన అబ్షాలోము సింహాసనాన్ని అన్యాయంగా ఆక్రమించడానికి ప్రయత్నించాడు, దావీదు ఉపపత్నులతో అక్రమ సంబంధం ఏర్పరచుకొని తన తండ్రిని అవమానపరిచాడు. (2 సమూయేలు 15:1–16:22) అబ్షాలోము మరణంతో అంతర్యుద్ధం ముగిసింది, దావీదు మరింత దుఃఖాక్రాంతుడయ్యాడు. (2 సమూయేలు 18:1-33) అయినప్పటికీ, దావీదు చేసిన పాపాలు అతన్ని దీనునిగా చేసి, తన కరుణామయుడైన దేవునికి దగ్గరగా ఉండవలసిన అవసరతను అతనికి తెలియజేశాయి. మనం తప్పుచేసినట్లైతే, వినయంతో పశ్చాత్తాపపడి యెహోవాకు దగ్గరౌదాము.—యాకోబు 4:8 ను పోల్చండి.

6. దావీదు రాజు ముఖ్యంగా ఎందుకు దోషియైయుండెను?

6 తాను యెహోవా శాసనాలు తెలిసిన ఇశ్రాయేలు పాలకుడు గనుక దావీదు అత్యధికంగా దోషి అయ్యాడు. (ద్వితీయోపదేశకాండము 17:18-20) దేవుని అనంగీకారమున్న పనులు పదేపదే చేయడానికి, అతడు ఆ విషయాలు తెలియని ఐగుప్తు ఫరో లేక బబులోను రాజేమీ కాదు. (ఎఫెసీయులు 2:12; 4:18 పోల్చండి.) యెహోవాకు సమర్పించుకున్న జనాంగంలోని సభ్యునిగా, జారత్వం, హత్య ఘోరమైన పాపాలని దావీదు ముందుగానే గ్రహించాడు. (నిర్గమకాండము 20:13, 14) క్రైస్తవులకు కూడా దేవుని శాసనాలు తెలుసు. అయినను, దావీదు వల్లే, కొందరు పారంపర్యంగా వచ్చిన పాపం, మానవ బలహీనత, ఎదురులేని శోధనను బట్టి శాసనాన్ని అతిక్రమిస్తారు. ఒకవేళ అది మనలో ఒకరికి సంభవిస్తే, మనకు విపరీతమైన నిరాశను కలుగజేసి, మన ఆత్మీయ దృష్టిని మందగింపజేసే అంధకార స్థితిలో మనం ఉండాల్సిన అవసరం లేదు.

ఒప్పుకొనడం వల్ల ఉపశమనం కలుగుతుంది

7, 8. (ఎ) తన తప్పులను దాచుకొనుటకు ప్రయత్నించినప్పుడు దావీదుకు ఏమి సంభవించింది? (బి) ఎందుకు ఒకడు పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి?

7 మనం దేవుని శాసనాలను ఘోరంగా అతిక్రమిస్తే, యెహోవా ఎదుట కూడా మన తప్పులు ఒప్పకొనడం కష్టమనిపిస్తుంది. అటువంటి పరిస్థితులలో ఏమి సంభవించవచ్చు? దావీదు 32 వ కీర్తనలో ఇలా ఒప్పుకున్నాడు: “నేను [ఒప్పుకొనుటకు బదులు] మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయొముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ [యెహోవా] చెయ్యి నామీద బరువుగానుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను.” (3, 4 వచనాలు) తన తప్పును దాచుకొనడం, దోషం చేశానన్న భావనను అణచుకొనడం దారితప్పిన దావీదును కృంగదీశాయి. క్షోభవల్ల అతని శక్తి ఎంతగా క్షీణించిందంటే జీవనాధారమైన తడిలేక మోడుబారిన వృక్షంలా ఉన్నాడు. వాస్తవానికి, మానసిక, శారీరక చెడు ప్రభావాలను కూడా ఆయన అనుభవించియుండవచ్చు. ఏమైనను, అతను తన సంతోషాన్ని కోల్పోయాడు. మనలో ఎవరమైనా అటువంటి స్థితిలో ఉంటే, మనమేమి చేయాలి?

8 తప్పులను దేవుని ఎదుట ఒప్పుకొనడంవల్ల క్షమాపణ, ఉపశమనం పొందవచ్చు. “నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని,” అని దావీదు గానం చేశాడు. “యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు.” (కీర్తన 32:5) ఏదైనా తప్పు దాచుకున్నందుకు మీరు దుఃఖిస్తున్నారా? దేవుని కనికరం పొందడానికి ఆ తప్పును ఒప్పుకుని మళ్లీ దాన్ని చేయకుండా ఉండడం మంచిది కాదా? సంఘ పెద్దలను పిలిపించి ఆత్మీయ స్వస్థతను ఎందుకు కోరకూడదు? (సామెతలు 28:13; యాకోబు 5:13-20) మీ పశ్చాత్తాప స్వభావం సమ్మతించబడుతుంది, మీ క్రైస్తవ ఆనందం పునరుద్ధరించబడుతుంది. “తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు,” అని దావీదు పలికాడు. “యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు, ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.”—కీర్తన 32:1, 2.

9. కీర్తన 51 ఎప్పుడు రచించబడింది, ఎందుకు?

9 దావీదు బత్షెబాలిద్దరు తమ తప్పుకై యెహోవా దేవునికి జవాబుదారులైయుండిరి. దేవుడు, వారి పాపానికై వారిని చంపివేయవచ్చు కానీ, వారిపై కనికరం చూపాడు. ప్రాముఖ్యంగా రాజ్య నిబంధన విషయమై ఆయన దావీదుపై కనికరం చూపాడు. (2 సమూయేలు 7:11-16) బత్షెబ విషయంలో తాను చేసిన తప్పులను గూర్చి దావీదు చూపిన పశ్చాత్తాప వైఖరి 51 వ కీర్తనలో కనిపిస్తుంది. నాతాను ప్రవక్త వచ్చి దైవ శాసనాలకు విరుద్ధంగా ఆయన చేసిన దోషం యొక్క తీవ్రతను తన దృష్టికి తెచ్చినప్పుడు, పశ్చాత్తాపం చెందిన రాజు ఈ కీర్తనను రచించాడు. దావీదు తప్పులను గూర్చి అతనికి చెప్పాలంటే నాతానుకు ధైర్యం కావలసి ఉండింది, ఈనాడు సంఘాల్లో నియమించబడిన క్రైస్తవ పెద్దలు కూడా అలా గద్దించాలంటే ధైర్యవంతులైయుండాలి. తన నేరాన్ని నిరాకరించి నాతానును చంపమని ఆజ్ఞాపించుటకు బదులు, రాజు దీనంగా తప్పును ఒప్పుకున్నాడు. (2 సమూయేలు 12:1-14) తాను చేసిన అవమానకరమైన పనిని గూర్చి ఆయన తన ప్రార్థనలో దేవునితో ఏమి చెప్పాడో 51 వ కీర్తన తెలియజేస్తుంది. ప్రాముఖ్యంగా మనం ఏదైనా తప్పు చేసి యెహోవా దయ కొరకు పరితపిస్తూ వుండి, దాన్ని గూర్చి ప్రార్థనా పూర్వకంగా ధ్యానించడానికి మనకు ఆ కీర్తన చక్కగా సరిపోతుంది.

మనం దేవునికి జవాబుదారులమైయున్నాము

10. దావీదు ఆత్మీయ స్వస్థతను ఎలా అనుభవించగలిగాడు?

10 దావీదు తన తప్పును మన్నించమని అడగలేదు గాని, ఇలా ప్రాధేయపడ్డాడు: “దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము.” (కీర్తన 51:1) ఉల్లంఘించుట ద్వారా దావీదు దేవుని శాసన హద్దులను దాటాడు. అయితే, దేవుడు తన కృపచొప్పున లేక యథార్థమైన ప్రేమను బట్టి ఆయనను కరుణిస్తే, మరలా ఆత్మీయంగా కోలుకునే అవకాశం ఆయనకు ఉండేది. దేవుడు పూర్వం చూపిన వాత్సల్యబాహుళ్యములే, తన సృష్టికర్త తన పాపాలను తుడిచివేస్తాడని విశ్వసించడానికి పశ్చాత్తాపం చెందిన రాజుకు ఆధారమేర్పరచినవి.

11. పాపపరిహారార్థ దిన బలుల ద్వారా ఏమి సూచించబడింది, రక్షించబడుటకు నేడేమి అవసరము?

11 పాపపరిహారార్థ బలుల యొక్క ప్రవచనార్థక సూచన ద్వారా పశ్చాత్తాపం చెందిన వారి దోషాన్ని శుభ్రపరచడానికి తానొక పద్ధతిని కలిగి ఉన్నాడని యెహోవా తెలియజేశాడు. యేసుక్రీస్తు యొక్క విమోచన క్రయధనమందు మనముంచే విశ్వాసంపై ఆధారపడి, దేవుని కనికరం క్షమాపణ మనకు లభిస్తాయని మనకు తెలుసు. దావీదు కేవలం ఈ బలి యొక్క సూచనలనూ గుర్తులనూ మనస్సులో ఉంచుకొనే యెహోవా యొక్క కృపను వాత్సల్యాన్ని నమ్మగలిగితే, ఈనాటి దేవుని సేవకులు వారి రక్షణకై ఇవ్వబడిన విమోచనయందు ఇంకెంత ఎక్కువ విశ్వాసాన్ని కలిగుండాలో గదా!—రోమీయులు 5:8; హెబ్రీయులు 10:1.

12. పాపము చేయుట అనగా ఏమిటి, మరి దావీదు తన తప్పిదాన్ని గూర్చి ఎలా భావించాడు?

12 దేవున్ని వేడుకుంటూ, దావీదు ఇలా అన్నాడు: “నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.” (కీర్తన 51:2, 3) పాపం చేయడమంటే యెహోవా కట్టడల విషయంలో తప్పిపోవడం. దావీదు నిశ్చయంగా అదే చేశాడు. అయితే, అతను తన తప్పును గూర్చి పట్టించుకోకుండా కేవలం శిక్షపడుతుందని లేక వ్యాధి సోకుతుందని దుఃఖించే, హంతకునివలె లేక జారునివలె లేడు. యెహోవాను ప్రేమించే వ్యక్తిగా దావీదు చెడును అసహ్యించుకున్నాడు. (కీర్తన 97:10) ఆయన తన తప్పును అసహ్యించుకుంటూ, దానినుండి దేవుడు తనను పూర్తిగా పవిత్రపరచాలని కోరుకున్నాడు. దావీదుకు తన అతిక్రమములను గూర్చి పూర్తిగా తెలుసు, మరి తన పాపభరిత కోరిక తనను అధిగమించినందుకు అతను మిక్కిలి దుఃఖించాడు. ఆయన పాపం ఎల్లప్పుడూ ఆయన ఎదుటనే ఉండెను, ఎందుకంటే ఒక దైవ భక్తిగల వ్యక్తి యొక్క దోషారోపణతో కూడిన మనస్సాక్షి పశ్చాత్తాపపడి, ఒప్పుకుని, యెహోవా క్షమాపణ పొందనిదే ఉపశమించదు.

13. తాను కేవలం దేవునికి విరుద్ధంగా మాత్రమే పాపంచేశానని దావీదు ఎందుకు చెప్పగలిగాడు?

13 యెహోవాకు తాను జవాబుదారుడని అంగీకరిస్తూ దావీదు ఇలా అన్నాడు: “నీకు, కేవలము నీకే, విరోధముగా నేను పాపము చేసి యున్నాను. నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు, తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.” (కీర్తన 51:4) దావీదు దేవుని శాసనాన్ని అతిక్రమించడం ద్వారా, రాజధర్మాన్ని అగౌరవపరిచాడు, దేవున్ని నిందకు గురిచేస్తూ “యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు . . . గొప్ప హేతువు కలుగజేశాడు.” (2 సమూయేలు 12:14, 15; నిర్గమకాండము 20:13, 14, 17) ఒక బాప్తిస్మం పొందిన తప్పిదస్థుడు క్రైస్తవ సంఘానికే కాక తనను ప్రేమించువారికి కూడా బాధను లేక దుఃఖాన్ని కలుగజేసినట్టే, దావీదు యొక్క పాపభరిత క్రియలు ఇశ్రాయేలు సమాజానికి, తన కుటుంబానికి విరుద్ధంగా చేసిన నేరాలే. తాను ఊరియా వంటి తోటి మానవులపట్ల తప్పుచేసినట్లు పశ్చాత్తాపం నొందిన యీ రాజుకు తెలిసిననూ, తాను యెహోవా పట్ల ఎక్కువ బాధ్యత కలిగియున్నాడని గ్రహించాడు. (ఆదికాండము 39:7-9 పోల్చండి.) యెహోవా తీర్పు న్యాయవంతమైందిగా ఉంటుందని దావీదు గ్రహించాడు. (రోమీయులు 3:4) పాపంచేసిన క్రైస్తవులు కూడా అటువంటి వైఖరినే కల్గియుండాల్సిన అవసరముంది.

దుర్భల పరిస్థితులు

14. దావీదు ఏ దుర్భల పరిస్థితులను గూర్చి ప్రస్తావించాడు?

14 దావీదు తనను తాను సమర్థించుకొనుటకు ప్రయత్నించక పోయినను, ఆయనిలా అన్నాడు: “నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.” (కీర్తన 51:5) దావీదు పాపంలో పుట్టినవాడు, అతని తల్లి వారసత్వంగా సంక్రమించిన పాపంవల్ల ప్రసవ వేదనను అనుభవించింది. (ఆదికాండము 3:16; రోమీయులు 5:12) వివాహం మరియు పిల్లలను కనడమనే వాటిని దేవుడే అనుగ్రహించాడు కాబట్టి, సరైన వైవాహిక సంబంధాలు, గర్భధారణ, జననం పాపకరమైనవని అతని ఉద్దేశ్యం కాదు; లేక దావీదు తన తల్లి యొక్క ఒక ప్రత్యేక తప్పును సూచించడంలేదు. ఆయన తల్లిదండ్రులు కూడా అందరు అసంపూర్ణ మానవులవలె పాపభరితులే గనుక తానూ పాపంలోనే గర్భం ధరించబడ్డాడు.—యోబు 14:4.

15. దుర్భల పరిస్థితులను దేవుడు పరిగణలోనికి తీసుకున్ననూ, మనమేమి చేయకూడదు?

15 ఒకవేళ మనం పాపం చేసినట్లైతే, మన తప్పిదానికి దోహదపడిన దుర్భల పరిస్థితులను గూర్చి దేవునికి ప్రార్థనలో విన్నవించుకోవచ్చు. అయితే మనం దేవుని కృపాతిశయాన్ని, మన చెడునడవడికి ఒక సాకుగా మార్చకూడదు లేక వారసత్వపు పాపాన్ని మన తప్పుల బాధ్యతనుండి మనం తప్పించుకోవడానికి దాగియుండే ఒక అడ్డుతెరగా ఉపయోగించకుండా ఉందాము. (యూదా 3, 4) చెడు తలంపులను కలిగి ఉండడానికి శోధనకు లొంగిపోవడానికి బాధ్యుడు తానే అని దావీదు ఒప్పుకున్నాడు. మనం శోధింపబడకుండుటకు ప్రార్థన చేద్దాం మరియు ఆ ప్రార్థనకు అనుగుణ్యంగా నడుద్దాము.—మత్తయి 6:13.

పవిత్రపరచబడుట కొరకు ప్రార్థన

16. దేవుడు ఏ లక్షణాన్ని ఇష్టపడుతున్నాడు, మరియు అది మన ప్రవర్తనను ఎలా ప్రభావితం చేయాలి?

16 ప్రజలు మంచి వ్యక్తుల్లాగ దేవునికి సమర్పించుకున్న వారిలా కనిపించవచ్చు, కాని ఆయన ఇంకా లోతుగా పరిశీలిస్తాడు, వారు లోన ఏమైయున్నారో చూస్తాడు. దావీదు ఇలా అన్నాడు: “నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు; ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.” (కీర్తన 51:6) కుట్రపన్ని ఊరీయాను చంపడం, బత్షెబ గర్భాన్ని గూర్చిన వాస్తవాలను దాచడానికి ప్రయత్నించడం ద్వారా దావీదు మోసం, కుటిలత కల్గియున్నందుకు దోషియే. అయిననూ, దేవుడు సత్యం, పరిశుద్ధతలను ఇష్టపడతాడని ఆయనకు తెలుసు. ఇది మన ప్రవర్తనను మంచి మార్గంలో ఉంచుకొనునట్లు ప్రభావితం చేయాలి, ఎందుకంటే మనం ఒకవేళ మోసగాళ్లమైతే యెహోవా మనల్ని ఖండిస్తాడు. (సామెతలు 3:32) దేవుడు ‘అతనికి జ్ఞానము తెలియజేసిన,’ యెడల పశ్చాత్తాపపడిన రాజుగా, అతడు తన శేషజీవితంలో దైవిక కట్టడలకు సరితూగగలడని కూడా దావీదు గ్రహించాడు.

17. హిస్సోపుతో పవిత్రపరచుమని ప్రార్థించడంలోని ప్రాముఖ్యత ఏమిటి?

17 పాపపు తలంపులను అధిగమించడానికి దేవుని సహాయం అవసరమని కీర్తనల గ్రంథకర్త గ్రహించాడు కనుక, ఆయనింకా ఇలా విన్నవించాడు: “నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము; హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.” (కీర్తన 51:7) ఒక్కప్పుడు కుష్ఠువ్యాధితో బాధపడిన వారిని శుభ్రపరచు ఆచారంలో ఉపయోగించే ఇతర వస్తువులలో హిస్సోపు చెట్టు (బహుశా మరువము, లేక ఓరిగానమ్‌ మరూ) ఒకటి. (లేవీయకాండము 14:2-7) కావున హిస్సోపుతో తన దోషం పవిత్రపరచబడాలని దావీదు ప్రార్థించడం సమంజసంగా ఉంది. పవిత్రపరచబడాలనే ఆలోచన యెహోవా తనను కడగాలనీ తాను చెత్త, చెదారంతో మలినంకాని హిమంకంటే తెల్లగా, పూర్తిగా శుభ్రపరచబడాలన్న ఆయన విన్నపంతో పొందిక కలిగి ఉంది. (యెషయా 1:18) ఒకవేళ మనలో ఎవరిమైనా ఏదైనా తప్పిదం విషయమై ఇప్పుడు మనస్తాపం చెందుతూవుంటే, పశ్చాత్తాపంతో దేవుని క్షమాపణను కోరినయెడల, యేసు విమోచనా క్రయధనాన్ని బట్టి ఆయన మనల్ని శుభ్రపరిచి, పవిత్రపరచగలడను విశ్వాసాన్ని కలిగి ఉందాము.

స్వస్థత కొరకు ప్రార్థన

18. దావీదు పశ్చాత్తాపపడి తన దోషాలను ఒప్పుకొనకముందు అతని పరిస్థితి ఏమిటి, మరియు దీనిని తెలిసికొనుట వలన నేడు ఇదెట్లు సహాయకరంగా ఉంటుంది?

18 తాను దోషియనే భావాన్ని ఏ క్రైస్తవుడైనా ఎప్పుడైనా కలిగి ఉంటే దావీదు పలికిన ఈ మాటలను అర్థంచేసుకొనగలడు: “ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును.” (కీర్తన 51:8) దావీదు పశ్చాత్తాపం చెంది తన దోషాలను ఒప్పుకొనకముందు, దెబ్బతిన్న మనస్సాక్షి అతన్ని కృంగదీసింది. ఉత్తమ గాయకులు, సంగీతకళాకారులు పాడిన ఉత్సాహ, ఆనందగీతాల ద్వారా కూడా ఆయన సంతోషించలేదు. దేవుని అనంగీకారంవల్ల దోషియైన దావీదుకు ఎంత దుఃఖంకలిగిందంటే, ఆయన యెముకలు నలుగగొట్టబడిన మనిషిలా బాధపడ్డాడు. క్షమాపణ, ఆత్మీయ స్వస్థత, తాను ముందు అనుభవించిన ఆనందాన్ని తిరిగి పొందాలని పరితపించాడు. నేడు ఒక పశ్చాత్తాపం చెందిన తప్పిదస్థుడు, దేవునితో తనకున్న సంబంధం దెబ్బ తినకముందు ఆయనతో తనకున్న ఆనందాన్ని తిరిగి పొందాలంటే యెహోవా క్షమాభిక్ష కూడా అతనికి అవసరం. పశ్చాత్తాపం చెందిన వ్యక్తికి “పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందము” పునరుద్ధరింపబడుట వలన యెహోవా అతన్ని క్షమించాడని, తనను ప్రేమిస్తున్నాడని తెలియజేస్తుంది. (1 థెస్సలొనీకయులు 1:6) అది ఎటువంటి ఓదార్పును తెస్తుంది!

19. దేవుడు ఒకవేళ దావీదు తప్పిదాలన్నింటినీ తుడిచివేసివుంటే తను ఎలా భావించేవాడు?

19 దావీదు ఇంకా ఇలా ప్రార్థించాడు: “నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయుము.” (కీర్తన 51:9) యెహోవా దోషాన్ని అంగీకరిస్తాడని ఎదురుచూడ కూడదు. అందువల్ల, దావీదు తన తప్పులను చూడకుండా ఉండమని ఆయన్ని అడిగాడు. రాజు తన తప్పులన్ననింటినీ తుడిచివేయవలెనని, తన దోషమంతటిని కడగమని దేవునికి ప్రార్థించాడు. యెహోవా అలా చేసియుంటే! అది దావీదును ఉల్లసింపజేస్తుంది, దెబ్బతిన్న మనస్సాక్షివల్ల కలిగే వ్యధను తీసేస్తుంది, అప్పుడు, పశ్చాత్తాపం చెందిన రాజు తన ప్రేమగల దేవుడు తనను క్షమించాడని తెలుసుకుంటాడు.

ఒకవేళ మీరు తప్పుచేస్తే?

20. గంభీరమైన తప్పిదం చేసిన ఏ క్రైస్తవునికైనా ఏ సలహా ఇవ్వబడింది?

20 యెహోవా సమర్పిత సాక్షులెవరైనా గంభీరమైన తప్పుచేసి, పశ్చాత్తాపపడితే తమ తప్పును కడిగి తమకు కృపచూపమని దేవున్ని ధైర్యంగా అడగవచ్చని 51 వ కీర్తన సూచిస్తుంది. ఒకవేళ మీరు అలా తప్పుచేసినట్లైన, దీనప్రార్థన ద్వారా మన పరలోక తండ్రి క్షమాపణకై ఎందుకు అడుగకూడదు? దేవుని ఎదుట అంగీకారపాత్రులుగా నిలుచుటకు ఆయన సహాయం అవసరమని అంగీకరించి, మీ మునుపటి సంతోషాన్ని మీకు అనుగ్రహించమని అడగండి. “ఆయన బహుగా క్షమించును” గనుక పశ్చాత్తాపం చెందిన క్రైస్తవులు దృఢ విశ్వాసంతో క్షమించుమని యెహోవాను ప్రార్థనలో అర్థించవచ్చు. (యెషయా 55:7; కీర్తన 103:10-14) అయితే, అవసరమైన ఆత్మీయ సహాయాన్నదించడానికి సంఘ పెద్దలను పిలిపించాలి.—యాకోబు 5:13-15.

21. తర్వాత మనమేమి పరిశీలిస్తాము?

21 యెహోవా కనికరం తన ప్రజల్ని నిరాశనుండి తప్పక రక్షిస్తుంది. అయితే 51 వ కీర్తనలో పశ్చాత్తాపం చెందిన దావీదు మనస్ఫూర్తిగా చేసిన ఇతర విజ్ఞాపనలను పరిశీలిద్దాం. యెహోవా నలిగిన హృదయాన్ని తృణీకరించడని మన పఠనం తెలియజేస్తుంది. (w93 3/15)

మీరెలా జవాబిస్తారు?

▫ యెహోవా సేవకులలో ఎవరిమీదనైనా గంభీరమైన పాపం ఎటువంటి ప్రభావాన్ని కల్గివుంటుంది?

▫ తన దోషమును కప్పిపుచ్చుకొనుటకు ప్రయత్నించినప్పుడు దావీదు ఎలా ప్రభావితుడయ్యాడు?

▫ తాను కేవలం దేవునికి విరుద్ధంగా మాత్రమే పాపంచేశానని దావీదు ఎందుకు అన్నాడు?

▫ మనము పాపం చేసినప్పుడు దుర్భల పరిస్థితులను దేవుడు పరిగణలోనికి తీసుకున్ననూ, మనమేమి చేయకూడదు?

▫ ఒక క్రైస్తవుడు గంభీరమైన పాపం చేసినప్పుడు అతడేమి చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి