కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 10/15 పేజీలు 27-30
  • త్రిత్వము—బైబిలు నందు బోధింపబడిందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • త్రిత్వము—బైబిలు నందు బోధింపబడిందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఏమి చెబుతున్నది
  • లేఖనాల శుద్ధమైన భావం
  • పరిశుద్ధాత్మ అన్ని సత్యాలను వెల్లడి చేయుట
  • బైబిలు పఠనములను ప్రారంభించుటకు మెలకువగా యుండుడి
    మన రాజ్య పరిచర్య—1990
  • తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలకు సంబంధించిన సత్యం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • దేవునిలో ముగ్గురు ఉన్నారా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 10/15 పేజీలు 27-30

త్రిత్వము—బైబిలు నందు బోధింపబడిందా?

“ఏకత్వములో త్రిత్వాన్ని, త్రిత్వములో ఒక దేవున్ని మేమారాధిస్తాము, ఇది కాథోలిక్‌ విశ్వాసము. . . . కాబట్టి తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, మరియు పరిశుద్ధాత్మ దేవుడు. అయినా వారు ముగ్గురు దేవుళ్లు కాదుగాని ఒక్కడే దేవుడు.”

ఈ మాటలలో అథనేషియా విశ్వాస ప్రమాణము క్రైస్తవమతసామ్రాజ్య మూల సూత్రమైన త్రిత్వాన్ని వివరిస్తున్నది.a మీరు ఒక కాథోలిక్‌ లేక ప్రొటస్టెంటు చర్చి సభ్యులైతే, మీరు నమ్మవలసిన అత్యంత ముఖ్యమైన బోధ ఇదేనని మీతో చెప్పియుండవచ్చు. కాని మీరు ఆ సిద్ధాంతాన్ని వివరించగలరా? క్రైస్తవ మతసామ్రాజ్యంలోని కొంతమంది ప్రజ్ఞావంతులు కూడా త్రిత్వమును అర్థం చేసుకోవడంలోని తమ అసమర్థతను అంగీకరించారు.

అయినా వారు ఎందుకు దాన్ని నమ్ముతారు? బైబిలు ఆ సూత్రాన్ని బోధిస్తున్నదనా? బాగా అమ్ముడుపోతున్న తన పుస్తకమైన హానెస్ట్‌ టు గాడ్‌లో కీర్తిశేషుడైన ఆంగ్లికన్‌ బిషప్పు జాన్‌ రాబిన్‌సన్‌ ఈ ప్రశ్నకు ఆలోచన రేకెత్తించే జవాబిస్తూ ఆయనిలా వ్రాశాడు:

“జనసమ్మతమైన ప్రచారం, బోధన పని ఆచరణలో క్రీస్తును గూర్చి సహజత్వానికి అతీతమైన ఒక భావాన్ని అందిస్తుంది, ఇది క్రొత్త నిబంధన నుండి రూఢిపరచలేనిది. ‘క్రీస్తు’ మరియు ‘దేవుడు’ పరస్పరం మార్చబడగల పదాలని చెప్తూ యేసు దేవుడై యున్నాడని అది చెప్తుంది. కాని బైబిలులో ఎక్కడా ఇలా ఉపయోగింపబడలేదు. యేసు దేవుని వాక్యమైయుండెనని, దేవుడు క్రీస్తులో వుండెనని, యేసు దేవుని కుమారుడని క్రొత్తనిబంధన చెప్తున్నది; కాని యేసు దేవుడై యుండెనని అది ఏమాత్రం చెప్పడంలేదు.”

ఆంగ్లికన్‌ చర్చిలో జాన్‌ రాబిన్‌సన్‌ ఒక వివాదాస్పద వ్యక్తిగా వుండెను. అయినా, “అలా యేసు దేవుడని” “కొత్తనిబంధన”లో ఎక్కడా చెప్పబడలేదని ఆయన అనడంలో నిజమున్నదా?

బైబిలు ఏమి చెబుతున్నది

“ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను” అని తెలిపే యోహాను సువార్త ప్రారంభ వచనాన్ని ఉదహరిస్తూ కొంతమంది ఆ ప్రశ్నకు జవాబిస్తారు. (యోహాను 1:1, కింగ్‌జేమ్స్‌ వర్షన్‌) ఆంగ్లికన్‌ బిషప్పు చెప్పినదానితో ఇది వ్యతిరేకించడంలేదా? లేనేలేదు. జాన్‌ రాబిన్‌సన్‌కు నిస్సందేహంగా తెలిసినట్లే, ఆ వచనం యొక్క కింగ్‌జేమ్స్‌ వర్షన్‌ అనువాదంతో కొంతమంది ఆధునిక అనువాదకులు ఏకీభవించడం లేదు. ఎందుకు? ఎందుకంటే, ఆదిమ గ్రీకులో “వాక్యము దేవుడైయుండెను” అనే భావనలోని “దేవుడు” అనే పదానికి ముందు నిర్దిష్టమైన “ది” అనే ఉపపదం లేదు. “వాక్యము దేవుని యొద్ద ఉండెను,” అనే ముందు వచనంలో “దేవుడు” అనే పదం నిర్దిష్టమైనది అంటే, దానికి నిర్దిష్టమైన ఉపపదం వుంది. అందువల్ల, ఇది ఆ రెండు పదాలకు ఒకే విశేషత ఉండకుండా చేస్తుంది.

కాబట్టి, తమ అనువాదాలలో శ్రేష్ఠమైన ఆకృతి తేవటానికి కొన్ని అనువాదాలు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు, కొన్ని అనువాదాలు “వాక్యము దైవికమైయుండెను” అనే భావాన్నిచ్చాయి. (ఎన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌, స్కాన్‌ఫీల్డ్‌) మొఫెట్‌ “లోగోస్‌ దైవికమైయుండెను” అని అనువదించాడు. అయితే, “దైవిక” అనే పదం ఇక్కడ తగిన వివరణ నివ్వదని సూచిస్తూ జాన్‌ రాబిన్‌సన్‌, బ్రిటీషు మూలగ్రంథ విమర్శకుడైన సర్‌ ఫ్రెడరిక్‌ కెన్యాన్‌ ఎత్తిచూపిందేమిటంటే, యోహాను నొక్కి చెప్పాలనుకున్నది అదే అయితే, ఆయన “దైవిక” అనేదానికి గ్రీకు పదమైన థియోస్‌ను ఉపయోగించ వచ్చు. ది న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ సరైన విధంగా “దేవుడు” అనే పదాన్ని అనిర్దిష్టపదంగా దృష్టించి, అలాగే గ్రీకు పదం ద్వారా సూచింపబడిన శ్రేష్టమైన ఆకృతిని తెస్తూ, “వాక్యము ఒక దేవుడైయుండెను” అని ఇంగ్లీషులో అనిర్దిష్ట ఉపపదాన్ని ఉపయోగించింది.

న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌ అనువాద ప్రక్రియ డైరెక్టరైన ప్రొఫెసర్‌ సి. హెచ్‌. డాడ్‌ ఇట్టి అనువాదంపై ఇలా వ్యాఖ్యానించారు: “‘వాక్యము ఒక దేవుడైయుండెను’ అని అనువదించడమే సరియైనది . . . మక్కీకి మక్కీ అనువాదమని దీన్ని తప్పుపట్టకూడదు.” అయినా, ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌ ఆ వచనాన్ని అలా అనువదించలేదు. బదులుగా ఆ అనువాదంలో యోహాను 1:1 ఇలా వుంది: “సమస్తము ఆరంభమైనప్పుడు, వాక్యముండెను. వాక్యము దేవునితో నివసించెను, దేవుడేమై యుండెనో వాక్యమును అదే అయివుండెను.” అయితే అనువాద కమిటీ సుళువైన అనువాదాన్ని ఎందుకు ఎన్నుకోలేదు? దానికి ప్రొఫెసర్‌ డాడ్‌ ఇలా జవాబిస్తున్నాడు: “దానికిగల కారణమేమంటే, అది యోహాను వ్రాసిన దాని విషయమై ప్రస్తుతమున్న తలంపుకే కాదు నిజానికి యావత్‌ క్రైస్తవ తలంపుకే వ్యతిరేకంగా ఉన్నందున అది అనంగీకారంగా ఉంది.”—టెక్నికల్‌ పేపర్స్‌ ఫర్‌ ది బైబిల్‌ ట్రాన్స్‌లేటర్‌, సంపుటి 28, జనవరి 1977.

లేఖనాల శుద్ధమైన భావం

యేసు సృష్టికర్తయైన దేవుని వంటివాడు కాదుగాని ఒక దేవుడైయుండెనను తలంపు జోహన్నైన్‌ (అంటే అపొస్తలుడైన యెహాను) తలంపుకు, ఆలాగే మొత్తంగా క్రైస్తవ తలంపుకు విరుద్ధమని మనం చెప్పుదుమా? యేసును గూర్చి, దేవున్ని గూర్చి సూచించిన బైబిలు లేఖనాలను కొన్నింటిని మనం పరీక్షించి, అథనేసియా విశ్వాస ప్రమాణం సూత్రీకరింపబడక మునుపు జీవించిన కొంతమంది వ్యాఖ్యాతలు ఆ లేఖనాల గురించి ఏమి తలంచారో చూద్దాము.

“నేనును తండ్రియును ఏకమైయున్నాము.”—యోహాను 10:30.

నెవాశెన్‌ (సా.శ. 200-258 c) ఇలా వ్యాఖ్యానించాడు: “‘ఏక’ మైయున్నామని,[b] ఆయన అన్నాడు గాని ఆయన ‘ఏక’ వ్యక్తి అనలేదని మతవ్యతిరేకులు అర్థంచేసుకోనివ్వండి. తటస్థంగా ఉంచబడిన ఏకము అనే వ్యక్తిగత ఏకతను కాదుగాని సాంఘిక సామరస్యాన్ని సన్నిహితత్వాన్ని వివరిస్తుంది . . . అంతేకాకుండా, ఆయనను ఏకమని అన్నప్పుడు అది అంగీకారాన్ని సూచిస్తూ ఏకనిర్ణయాన్ని, ప్రేమపూర్వక సహవాసమును, కారణసహితంగా తండ్రి మరియు కుమారుడు అంగీకారం, ప్రేమ, అనురాగం విషయంలో ఒక్కటైయున్నట్లుగానే గుర్తిస్తుంది.”—ట్రీటీస్‌ కన్‌సర్నింగ్‌ ది ట్రినిటి, 27వ అధ్యాయము.

“తండ్రి నాకంటె గొప్పవాడు.”—యోహాను 14:28.

ఐరేనియస్‌ (సా.శ. 130-200 c): “మనము ఆయన [క్రీస్తు] ద్వారా తండ్రి అందరికంటే ఉన్నతుడని తెలుసుకోవచ్చు. ఎందుకంటే, ఆయన ‘తండ్రి నాకంటే గొప్పవాడు’ అని చెప్పాడు. కాబట్టి, జ్ఞానం విషయంలో తండ్రి అధికుడని మన ప్రభువు వెల్లడిచేశాడు.”—ఎగేనెస్ట్‌ హియరిసీస్‌, 2వ పుస్తకం, 28.8వ అధ్యాయం.

“అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.

అలెక్సాండ్రియాకు చెందిన క్లెమెంట్‌ (సా.శ. 150-215 c): “మొదటివాడు, ఉన్నతుడు, ఉత్తముడు అయిన దేవుని జ్ఞానం, గ్రహింపు పొందడం ద్వారా నిత్యత్వాన్నిచ్చే నిత్య దేవున్ని తెలుసుకోవచ్చును . . . ‘కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును ఎరుగని’ తండ్రిని మొదట తెలుసుకున్న వ్యక్తి నిజమైన జీవితాన్ని జీవిస్తాడు. (మత్తయి 11:27) ఆ పిమ్మట, ఆయన తరువాత వున్న రక్షకుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి.”—హూ ఈజ్‌ ది రిచ్‌ మాన్‌ దట్‌ శాల్‌ బి సేవ్డ్‌? VII, VIII.

“అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు”—ఎఫెసీయులు 4:6.

ఐరేనియస్‌: “ఆవిధంగా అందరికిపైగా, అందరిలోను, అందరి మధ్య వున్న తండ్రియైన ఒక్క దేవుడు ప్రకటింపబడ్డాడు. వాస్తవానికి తండ్రి అందరికిపైగా వున్నాడు, ఆయన క్రీస్తుకు శిరస్సు.”—ఎగేనెస్ట్‌ హియరిసీస్‌, 5వ పుస్తకం, 18.2వ అధ్యాయము.

తండ్రి అన్నిటికంటె, యేసుక్రీస్తుతో సహా అందరికంటే సర్వోన్నతుడని ఈ వచనాలు వివరిస్తున్నాయని ఈ తొలి వ్రాతగాళ్లు స్పష్టంగా అర్థంచేసుకున్నారు. వారు త్రిత్వాన్ని నమ్మినట్లు వారి వ్యాఖ్యానాలు ఏ మాత్రం సూచించడంలేదు.

పరిశుద్ధాత్మ అన్ని సత్యాలను వెల్లడి చేయుట

తన మరణ పునరుత్థానముల తరువాత, పరిశుద్ధాత్మ వారికి ఒక సహాయకునిగా ఇవ్వబడుతుందని యేసు తన శిష్యులకు వాగ్దానం చేశాడు. ఆయనిలా వాగ్దానం చేశాడు: “అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; . . . సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.”—యోహాను 14:16, 17; 15:26; 16:13.

యేసు మరణం తరువాత, ఆ వాగ్దానం నెరవేర్చబడింది. పరిశుద్ధాత్మ సహాయంతో క్రైస్తవ సంఘానికి క్రొత్త సిద్ధాంతాలు ఎలా వెల్లడిచేయబడ్డాయో లేక విశదపరచబడ్డాయో బైబిలులో వ్రాయబడింది. తరువాత బైబిలు యొక్క రెండవ భాగంగా తయారైన క్రైస్తవ గ్రీకు లేఖనాలు లేక “క్రొత్త నిబంధన” పుస్తకాలలో ఈ క్రొత్త బోధలు వ్రాయబడ్డాయి. ప్రవాహంవలే వచ్చిన ఈ పరిజ్ఞానమందు త్రిత్వ ఉనికిని గూర్చి ఏమైనా వెల్లడించబడిందా? లేదు. దేవుడు మరియు యేసును గూర్చి పరిశుద్ధాత్మ పూర్తిగా భిన్న విషయాన్ని వెల్లడిస్తున్నది.

ఉదాహరణకు, సా.శ. 33 పెంతెకొస్తు నందు, యెరూషలేములో చేరివున్న శిష్యుల మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, బయటవున్న ప్రజలకు అపొస్తలుడైన పేతురు యేసును గూర్చి సాక్ష్యమిచ్చాడు. ఆయన త్రిత్వాన్ని గూర్చి మాట్లాడాడా? ఆయన పలికిన కొన్ని వ్యాఖ్యానాలను పరిశీలించి మీకై మీరే ఒక నిర్ణయానికి రండి: “దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను.” “ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.” “మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.” (అపొస్తలుల కార్యములు 2:22, 32, 36) పరిశుద్ధాత్మచే నింపబడిన పేతురు పలికిన ఈ మాటలు త్రిత్వాన్ని బోధించుటకు బదులు యేసు తన తండ్రికి లోబడివుండుటను గూర్చి, దేవుని చిత్తం నెరవేర్చబడటానికి ఆయన ఒక ఉపకరణమని నొక్కిచెప్పాయి.

తరువాత వెంటనే, మరో నమ్మకస్థుడైన క్రైస్తవుడు యేసును గురించి మాట్లాడాడు. తనపై మోపబడిన నిందలకు సమాధానమిచ్చుటకు సమాజమందిరం యెదుటికి స్తెఫెను తేబడ్డాడు. ఆయన నిందించువారిని, తమ పూర్వీకులవలెనే ఎదురుతిరుగువారై యున్నారని నిందించాడు. చివరగా, ఆ నివేదిక ఇలా చెబుతున్నది: “అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి—ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.” (అపొస్తలుల కార్యములు 7:55, 56) యేసు కేవలం దేవుని కుడిపార్శ్వమున నిలబడివున్న “మనుష్యకుమారుడని,” తన తండ్రితో సమానంగా ఏకదేవునిలో భాగం కాదని పరిశుద్ధాత్మ ఎందుకు బయల్పర్చింది? స్పష్టంగా, స్తెఫెనుకు త్రిత్వంపై నమ్మకంలేదు.

పేతురు యేసును గూర్చిన సువార్త కొర్నేలికి తెలియజేసినప్పుడు, త్రిత్వ సిద్ధాంతాన్ని వెల్లడి పరచే మరియొక అవకాశం వుండింది. ఏం జరిగింది? “యేసుక్రీస్తు అందరికి ప్రభువు” అని పేతురు వివరించాడు. కాని ప్రభువుగా ఆయనకు ఈ అధికారం ఇంకా ఉన్నత మూలం నుండి వచ్చిందని వివరించాడు. “దేవుడు సజీవులకును, మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు” యేసు అయివుండెను. యేసు పునరుత్థానము తరువాత, అతని తండ్రి ఆయనను తన శిష్యులకు “ప్రత్యక్షముగా కనబడునట్లు [అతనికి అనుమతి] అనుగ్రహించెను.” మరి పరిశుద్ధాత్మ? అది ఈ సంభాషణలో వుంది కాని, త్రిత్వములో మూడవ వ్యక్తిగా కాదు. బదులుగా, “దేవుడు [యేసును] పరిశుద్ధాత్మతోను, శక్తితోను అభిషేకించెను.” ఆ విధంగా పరిశుద్ధాత్మ వ్యక్తి అని చూపించుటకు బదులు వ్యక్తిత్వములేనిదని, అదే వచనంలో కూడా చెప్పబడినట్లు “శక్తి” అని చెప్పబడింది. (అపొస్తలుల కార్యములు 10:36, 38, 40 42) మీరు బైబిలును జాగ్రత్తగా పరిశీలిస్తే, పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం గలది కాదుగాని ప్రజలలో నిండిపోగల, వారిని ప్రేరేపించే, వారిని ఉద్రేకపరిచే, వారిపై కుమ్మరింపబడగల చురుకైన శక్తి అని చెప్పటానికి ఇతర రుజువులను తెలుసుకొంటారు.

చివరకు, ఏథెన్సువారికి ప్రకటిస్తున్నప్పుడు—అది నిజమైన సిద్ధాంతమైతే—త్రిత్వాన్ని వివరించటానికి అపొస్తలుడైన పౌలుకు మంచి అవకాశం వుండెను. ఆయన తన ప్రసంగంలో వారి “తెలియబడని దేవుని” బలిపీఠమును గూర్చి ప్రస్తావిస్తూ ఇలా చెప్పాడు: “మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.” ఆయన త్రిత్వాన్ని ప్రచురించాడా? లేదు. ఆయన “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నాడని” వివరించాడు. కాని యేసు మాటేమిటి? “[దేవుడు] తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు.” (అపొస్తలుల కార్యములు 17:23, 24, 31) అక్కడ కూడ త్రిత్వాన్ని గూర్చిన ఏ సూచన లేదు!

వాస్తవానికి, యేసు మరియు ఆయన తండ్రి త్రిత్వములో సమభాగంగా వుండటాన్ని అసాధ్యం చేసే దేవుని సంకల్పాలను గూర్చి పౌలు వివరించాడు. ఆయనిలా వ్రాశాడు: “దేవుడు సమస్తమును [క్రీస్తు] పాదముల క్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.” (1 కొరింథీయులు 15:27, 28) అలా, దేవుడు యేసుతో సహా అందరికీ పైగానేవుంటాడు.

మరి త్రిత్వం బైబిలు నందు బోధింపబడిందా? లేదు. జాన్‌రాబిన్‌సన్‌ చెప్పింది సరియే. అది బైబిలులో లేదు, “క్రైస్తవ తలంపులో” భాగంకాదు. ఇది మీ ఆరాధనకు ప్రాముఖ్యమైనదని మీరు దృష్టిస్తారా? మీరలా దృష్టించాలి. యేసు ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) మనం మన దేవున్ని ఆరాధించడాన్ని గంభీరంగా తీసుకుంటే, ఆయన నిజంగా ఏమైయున్నాడో, తన గురించి తాను మనకొరకు ఏం వెల్లడిచేసుకున్నాడో తెలుసుకోవడం ప్రాముఖ్యం. అప్పుడే మనం “తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించు” “సత్యారాధికులలో” చేరివుండగలము.—యోహాను 4:23.

[అధస్సూచీలు]

a ది కాథోలిక్‌ ఎన్‌సైక్లోపీడియా, 1907 సంచిక, 2వ సంపుటి, 33వ పేజీ ప్రకారం.

b ఈ వచనంలో “ఏకం” అనే పదం తటస్థభావం కలది అన్న వాస్తవాన్ని నెవాశెన్‌ సూచిస్తున్నాడు. కాబట్టి, దాని సహజబావం “ఏక విషయమైయుంది.” “ఏకమైయున్నామని” చెప్పిన గ్రీకు పదం సరిగ్గా సమాంతరంగా ఉపయోగింపబడిన యోహాను 17:21ని పోల్చండి. ఆసక్తికరంగా, “పరిశుద్ధాత్మ దైవిక వ్యక్తిగా పరిగణింపబడడంలేదు” అని నెవాశెన్‌ డి ట్రినిటేట్‌ నందు చెప్పినప్పటికీ దానిని న్యూ కాథోలిక్‌ ఎన్‌సైక్లోపీడియా (1967 సంచిక) సాధారణంగా ఆమోదిస్తుంది.

[28వ పేజీలోని బాక్సు]

లేఖనాల శుద్ధ భావన యేసు ఆయన తండ్రి ఒకే దేవుడు కాదని స్పష్టంగా చూపిస్తున్నది

[28వ పేజీలోని బాక్సు]

సా.శ. 33 పెంతెకొస్తు తరువాత యేసు దేవుడని పరిశుద్ధాత్మ ఎందుకు వెల్లడిచేయలేదు?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి