కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 12/1 పేజీలు 4-10
  • ప్రకృతి వైపరీత్యాలు—వాటికి దేవుడు బాధ్యుడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకృతి వైపరీత్యాలు—వాటికి దేవుడు బాధ్యుడా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ప్రకృతి వైపరీత్యం” అంటే ఏమిటి?
  • ఎవరు బాధ్యులు
  • వీటి పరిష్కారాలేవి?
  • భవిష్యత్తులో దేవుని కార్యాలు
  • ప్రకృతి విపత్తుల గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఎందుకిన్ని ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ప్రకృతి వైపరీత్యాలు దాడిచేసినప్పుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ప్రకృతి వైపరీత్యాలు—ఈ కాలానికి సూచనలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 12/1 పేజీలు 4-10

ప్రకృతి వైపరీత్యాలు—వాటికి దేవుడు బాధ్యుడా?

“దేవా, నీవు మాకేం చేశావయ్యా?”

నవంబరు 13, 1985లో కొలంబియా నందు నివాడో డెల్‌ రూఎజ్‌ మంచుపర్వతం బ్రద్దలవ్వడం వల్ల కల్గిన వినాశనం నుండి తప్పించుకు బయటపడ్డ వ్యక్తి ప్రతిస్పందన అలా నివేదించబడింది. అలా అందులోనుండి వచ్చిన మట్టిపెల్ల అర్‌మీరో పట్టణాన్నంతటినీ పూడ్చేసి, ఒక్క రాత్రిలోనే 20,000 కంటే ఎక్కువమంది ప్రజలను చంపేసింది.

తప్పించుకున్న వ్యక్తి అలా స్పందించడం మనం అర్థం చేసుకోగల్గిందే. భయోత్పాత ప్రకృతి శక్తులను ఎదుర్కొన్నప్పుడు నిస్సహాయులైన ప్రజలు అనాది నుంది కూడా యిలాంటి విపత్కర సంఘటనలను దేవునికి ఆపాదించారు. ప్రాచీన ప్రజలు, తమ దేవుళ్లయిన సముద్రం, ఆకాశం, భూమి, పర్వతం, అగ్ని పర్వతం అపాయానికి కారణములగు మరి యితర వాటికి బలులనూ, చివరికి మానవ బలులను సహితం అర్పించేవారు. ఈనాడు కూడ విపత్కరమైన ప్రకృతి సంఘటనల పర్యవసానాలు కేవలం విధివల్ల లేక దేవుని వల్ల కలిగాయని కొందరు అంగీకరిస్తున్నారు.

ప్రపంచమంతటావున్న మానవులకు యింతటి బారీ నష్టాన్ని బాధను కలుగజేసే విపత్తులకు దేవుడే నిజంగా బాధ్యుడా? నిందించవలసింది ఆయన్నేనా? వీటికి జవాబును కనుగొనడానికి ఈ విపత్తుల్లో ఏమి యిమిడివుందన్న విషయాన్ని మనం విపులంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. నిజానికి, మనకు తెలిసిన కొన్ని వాస్తవాలను పునఃపరిశీలించాల్సివుంది.

“ప్రకృతి వైపరీత్యం” అంటే ఏమిటి?

చైనా నందలి టాంగ్షన్‌లో భూకంపం సంభవించినప్పుడు, చైనా అధికారిక నివేదిక ప్రకారం 2,42,000 మంది ప్రజలు చనిపోయారు. అలాగే ఆండ్రూ తుపాను దక్షిణ ఫ్లోరిడా, లౌసియానా అమెరికాపై విరుచుకుపడినప్పుడు కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. అటువంటి ప్రకృతి వైపరీత్యాలు, అంతర్జాతీయ వార్తలలో ముఖ్యాంశాలయ్యాయి. అయితే, టాంగ్‌షన్‌కు నైరుతి దిక్కున 1,100 కిలోమీటర్ల దూరంలో నిర్జనంగానున్న గోబీ ఎడారిలో భూకంపం సంభవించివుంటే, లేక ఆండ్రూ తుపాను మరో దారిన మరలి పూర్తి భూబాగాన్ని విడిచిపెట్టి సముద్రంలోనే అంతరించి ఉంటే ఏమి జరిగుండేది? నేడు వాటి జ్ఞాపకమే ఉండేది కాదు.

కాబట్టి, ప్రకృతి వైపరీత్యాలను గూర్చి మనం మాట్లాడినప్పుడు ప్రకృతి శక్తుల నాటకీయ ప్రదర్శనను గూర్చి మాత్రమే మనం మాట్లాడటం లేదు. ప్రతి సంవత్సరము వేలకొలది చిన్న, పెద్ద భూకంపాలూ, డజన్ల కొలది గాలివానలూ తుపాన్లూ పెనుతుపాన్లు, అగ్ని పర్వత విస్పోటాలు, యితర ఉదృత అసాధారణ సంఘటనలు సంభవించి, కేవలం రికార్డుల్లోకి ఎక్కడం తప్పించి మరే యితర ప్రభావాన్ని చూపలేవు. అయితే, ఆలాంటి సంఘటనలు అధిక మొత్తంలో ప్రాణ నష్టం, ఆస్తినష్టాన్ని కల్గించి, సహజ జీవనానికి విఘాతం కల్గించినప్పుడు అవి విపత్తులౌతాయి.

నాశనం, తత్ఫలితంగా వచ్చే నష్టం, దానిలో యిమిడివున్న ప్రకృతి శక్తులతో ఎల్లప్పుడూ తులనాత్మకంగా ఉండవన్న విషయాన్ని గమనించాలి. అతి గొప్ప వినాశనం, అతి శక్తివంతమైన ప్రకృతి శక్తివల్లనే కలగాలని లేదు. ఉదాహరణకు, 1971లో సాన్‌ ఫెర్నాండో, కాలిఫోర్నియా అమెరికా నందు రిక్టర్‌ స్కేల్‌పై 6.6గా నమోదు చేయబడిన భూకంపం 65 మంది ప్రజలనే మింగేసింది. అదే సంవత్సరం నికరాగ్వా నందున్న మనాగ్వలో 6.2గా నమోదయిన కంపనం 5,000 మంది ప్రజలను పొట్టనబెట్టుకుంది!

కాబట్టి, ప్రకృతి శక్తుల మూలంగా పెరిగిన నాశనాన్ని గూర్చి మాట్లాడేటప్పుడు మనం యిలా ప్రశ్నించాలి, ప్రకృతి శక్తులు అంత ఉదృతమయ్యాయా? లేక మానవ వ్యవహారాలు ఆ సమస్యకు దోహదపడ్డాయా?

ఎవరు బాధ్యులు

ఈ భూమిమీదనున్న ప్రకృతి శక్తులతో సహా సమస్తానికి యెహోవాయే మహా సృష్టికర్త అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 1:1; నెహెమ్యా 9:6; హెబ్రీయులు 3:4; ప్రకటన 4:11) దాని భావం, ఆయన ప్రతి గాలి కదలికను లేదా వర్షపు జల్లును కలుగజేస్తాడని కాదు. అలా కాకుండా, భూమిని దాని పర్యావరణాన్ని నడిపించడానికి ఆయన కొన్ని నియమాలను ఏర్పాటుచేశాడు. ఉదాహరణకు ప్రసంగి 1:5-7లో, భూమి మీద జీవితం సాధ్యమయ్యేలా చేసే మూడు ప్రాథమిక నిర్వహణలను గూర్చి మనం చదువుతాం. అవి, ప్రతి రోజు జరిగే సూర్యుని ఉదయాస్తమయాలు, మార్పులేని గాలి విధానం, నీటి చక్రం. వాటిని గూర్చి మానవజాతికి తెలిసినా తెలియకపోయినా, ఈ ప్రకృతి పద్ధతులూ వాటితోపాటు భూమికి సంబంధించిన వాతావరణమూ భూగర్భశాస్త్రం, పర్యావరణం కూడా కొన్ని వేల సంవత్సరాలనుండి పనిచేస్తూనే ఉన్నాయి. వాస్తవానికి ప్రసంగి రచయిత మార్పులేకుండా నిత్యము కొనసాగే సృష్టి పద్ధతులు, మార్పు చెందుతూ తాత్కాలికంగా ఉండే మానవ జీవిత విధానానికి మధ్య ఉండే గొప్ప భేదమువైపు మన దృష్టిని తిప్పుతున్నాడు.

యెహోవా కేవలం ప్రకృతి శక్తులకు సృష్టికర్తే కాదు, వాటిని అదుపులో ఉంచే శక్తి కూడా ఆయనకు ఉంది. యెహోవా తన సంకల్పాలను జరిగించడానికి అలాంటి శక్తులను అదుపులో ఉంచడమో లేక నిర్ణయించిన పద్ధతి ప్రకారం వాటిని నడిపిన వృత్తాంతాలను బైబిలంతటిలో మనం కనుగొంటాం. వీటిలో, మోషే కాలమందు ఎర్ర సముద్రాన్ని పాయలుచేయడం, యెహోషువా కాలంలో సూర్య చంద్రుల క్రమాన్ని ఆపడం వంటివి యిమిడివున్నాయి. (నిర్గమకాండము 14:21-28; యెహోషువా 10:12, 13) దేవుని కుమారుడునూ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు కూడా ప్రకృతి శక్తులపై తన శక్తిని ప్రదర్శించాడు. ఉదాహరణకు, ఆయన గలిలయ సముద్రంలోని గాలివానను నిమ్మళపర్చాడు. (మార్కు 4:37-39) ఇలాంటి వృత్తాంతాలు యెహోవా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, యీ భూమిపైనున్న జీవరాసులను ప్రభావితం చేసే ప్రతిదాన్నీ అదుపుచేయగలరని నిస్సందేహంగా ధృవపరుస్తున్నాయి.—2 దినవృత్తాంతములు 20:6; యిర్మీయా 32:17; మత్తయి 19:26.

అది నిజం గనుక, యిటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల ఫలితమైన అధిక నాశనం, నష్టాలకూ దేవుడే బాధ్యుడని మనం అనగలమా? ఈ ప్రశ్నకు జవాబివ్వడానికి, మొదట మనం ప్రకృతి శక్తులు నాటకీయంగా యిటీవలి కాలాల్లో ఎక్కువ ఉదృత మౌతున్నాయనడానికి, బహుశా అదుపు లేకుండా పోతున్నాయనడానికి గల ఆధారాలను పరిశీలించాలి.

ఈ విషయంపై, నాచురల్‌ డిసాస్టర్స్‌—ఆక్ట్స్‌ ఆఫ్‌ గాడ్‌ ఆర్‌ ఆక్ట్స్‌ ఆఫ్‌ మ్యాన్‌? అనే పుస్తకం ఏం చెబుతోందో పరిశీలించండి: “అనావృష్టి, వరదలూ తుపానులకు సంబంధించిన వాతావరణ వ్యవస్థ మారుతోందనడానికి ఏ ఆధారమూ లేదు. అంతేకాకుండా భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటాలు లేక భూప్రకంపన తరంగాలకు సంబంధించి భూమి కదలికలు ఉదృతమౌతున్నాయని ఏ భూగర్భశాస్త్రజ్ఞుడు కూడా చెప్పడం లేదు.” ఎర్త్‌షాక్‌ అనే పుస్తకం కూడ అదే ప్రకారం పేర్కొన్నది: “ప్రతి ఖండంలోని రాళ్లలో లెక్కలేనన్ని చిన్నా పెద్దా భూకదలికలు జరిగినట్లు వివరమున్నది. ఈనాడే అవి సంభవిస్తే అందులోని ప్రతి ఒక్కటీ కూడా మానవునికి ఒక వినాశనకర విపత్తవుతుంది—విజ్ఞానపరంగా అలాంటి సంఘటనలు భవిష్యత్తులో మరలా మరలా తప్పక జరుగుతాయనేది నిశ్చయం.” మరో మాటలో చెప్పాలంటే, భూమి, దాని చురుకైన శక్తులు అన్ని కాలాల్లో కొద్దో గొప్పో ఒకేలాగ ఉన్నాయి. కాబట్టి, భూసంబంధమైన యితర కార్యాలలో ఏదోరకమైన పెరుగుదలను కొన్ని లెక్కలు చూపించినా చూపించకపోయినా, యిటీవలి కాలంలో భూమిపై అదుపులో పట్టలేనంత ఉదృతంగా అవి తయారు కాలేదు.

అయితే, తరచూ సంభవించే ప్రకృతి వైపరీత్యాలు అవి తెచ్చే నాశనాలను గూర్చి మనం చదివేవాటి విషయమేమిటి? ప్రకృతి శక్తులు నిందింపదగనివైతే, ఆ నింద మానవులపై పడుతున్నట్లుంది. నిజానికి మానవ చర్యలు మన పర్యావరణాన్ని ప్రకృతి వైపరీత్యాలకు ఉన్ముఖం చేశాయి, అవి సంభవించడానికి సాధ్యపర్చాయని అధికారులు గుర్తించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరిగే ఆహార అవసరతలు, వ్యవసాయదారులు తమకున్న భూమిని పదేపదే అధికంగా సేద్యపర్చడానికో లేక ముఖ్యమైన అడవులను కొట్టివేసి దాన్ని సేద్యపర్చేలాగో బలవంతపెడుతున్నాయి. అది విపరీతమైన భూక్షయానికి దారితీస్తుంది. పెరిగే జనాబా కూడా మురికి వాడలను అనాలోచితంగా అపాయకరమైన ప్రాంతాల్లో నిర్మించిన గుడిసెల పెరుగుదలనూ త్వరపెడుతోంది. వర్థమాన దేశాల్లో సహితం, కాలిఫోర్నియా, సాన్‌ ఆన్‌డ్రియాస్‌ ఫాల్ట్‌ ప్రక్కన జీవిస్తున్న లక్షలమంది ప్రజల వంటివారు అపాయ స్థలాలని స్పష్టమైన హెచ్చరికనిచ్చినప్పటికి తమ్మును తాము ఆ అపాయానికి లోను చేసుకుంటున్నారు. అటువంటి సందర్భాల్లో గాలివాన వరద లేక ఒక భూకంపం వంటి అసహజ సంఘటనలు సంభవించినప్పుడు, ఆ విపత్కర ఫలితాలు “ప్రకృతి” సంబంధమైనవని నిజంగా అనగలమా?

ఆఫ్రికా సాహెల్‌ నందు సంభవించిన అనావృష్టిలో యిలాంటి ఉదాహరణే ఉంది. అనావృష్టి అంటే సహజంగా, కరువు, ఆకలి మరణాలకు దారితీసే వర్షం లేక నీళ్ళు లేని పరిస్థితని మనం అనుకుంటాం. అయితే, యింతటి కరువూ ఆకలిదప్పులూ కేవలం ఆ ప్రాంతంలో నీళ్ళు లేకపోడం వల్లనే కలిగాయా? నేచర్‌ ఆన్‌ ది రామ్‌పేజ్‌ పుస్తకం యిలా అంటోంది: “దీర్ఘకాలీన అనావృష్టి వల్ల కలిగినంత కరువు, ఎడతెరిపి లేకుండా భూమీ నీటి వనరులను దుర్వినియోగపర్చినందువల్ల కలిగిన కరువు అధికంగా ఉంది. . . . ఇలా సాహేలు ఎడతెగక ఎడారి కావడానికి మానవ నిర్మిత విషయాలే ఎక్కువమట్టుకు కారణాలని వైజ్ఞానికులు సహాయక ఏజెన్సీల నుండి సేకరించిన ఆధారాలు తెల్పాయి.” దక్షిణాఫ్రికా వార్తాపత్రికైన ది నేటల్‌ విట్నెస్‌ యిలా పేర్కొంది: “కరువు ఆహార కొరత వల్ల కలిగేది కాదు; ఆహారాన్ని పొందలేకపోవడం వల్ల కలిగేది. మరో మాటలో, అది పేదరికంవల్ల కలిగేదే.”

ఇతర విపత్తులనుండి పరిణమించే నాశనాన్ని గూర్చి కూడా అదే చెప్పవచ్చు. పరిశోధనలు తెలిపేదేమంటే, ధనిక దేశాలకంటే కూడా పేద దేశాల ప్రజలు యిటువంటి ప్రకృతి వైపరీత్యాలందు అధిక సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉదాహరణకు, ఒక పరిశోధన ప్రకారం 1960 నుండి 1981 వరకూ, జపాన్‌లో 43 భూకంపాలూ యితర విపత్తులూ సంభవించాయి, వాటిల్లో 2,700 ప్రాణాలు పోయాయి, అంటే ఒక విపత్తుకు సగటున 63 మరణాలు సంభవించాయి. అదే సమయంలో పెరూ నందు 31 విపత్తులు సంభవించాయి, వాటిల్లో 91,000 మరణాలు లేక ఒక విపత్తులో 2,900 మంది చనిపోయారు. ఎందుకీ తేడా? ప్రకృతి శక్తులే ప్రకృతి వైపరీత్యాలను కలుగజేసి ఉండవచ్చు, అయితే మానవ సాంఘిక, ఆర్థిక, రాజకీయ కార్యాలే వాటివల్ల కల్గిన ప్రాణనష్టం, ఆస్తి నష్టాలకు బాధ్యతను వహించాలి.

వీటి పరిష్కారాలేవి?

ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడానికి వైజ్ఞానికులూ నిపుణులూ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. వారు భూకంపాలూ అగ్ని పర్వతాలు బ్రద్దలుకావడానికి గల కారణాలనూ తెలుసుకోడానికి భూమి అంతర్భాగాన్ని పరిశీలిస్తున్నారు. అంతరిక్షయానాలతో వారు, పెనుగాలులూ తుపానులు పయనించే మార్గాలను లేక వరదలనూ అనావృష్టినీ పరిశీలిస్తారు. ఈ పరిశోధన ద్వారా ఈ ప్రకృతి శక్తుల ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైనంత సమాచారాన్ని తాము పొందామని వారు భావిస్తున్నారు.

అటువంటి ప్రయాసలు ఫలించాయా? ఈ రకమైన ఖరీదైన ఉన్నత సాంకేతిక స్థాయిని గూర్చి, పర్యావరణాన్ని పరిశీలించే ఒక సంస్థ యిలా పేర్కొంది: “వీటికంత పెద్ద ప్రాముఖ్యతేమీ లేదు. అయితే, యివి లెక్కలేనంత డబ్బును శ్రామిక శక్తినీ కాజేసి—విపత్తులను విపరీతంచేసి, బాధితులకు సంభవించే విపత్తులను విస్మరించడానికి ఇవి కారణమైనప్పుడు అవి మేలుకంటే కీడునే ఎక్కువచేస్తాయి.” ఉదాహరణకు, బంగ్లాదేశ్‌ కోస్తా డెల్టా ప్రాంతానికి ఆటుపోటు అలలు వరదలు ఎడతెగక వచ్చే ప్రమాదం ఉందని తెలుసుకోవడం ఉపయుక్తమైనా, అక్కడే విధిలేక నివసించే లక్షలాది మంది బంగ్లాదేశీయులను నిరోధించడానికి ఆ జ్ఞానం ఉపయోగపడటం లేదు. దాని ఫలితం, లక్షలాది మరణాలతో కూడిన విపత్తులు పదేపదే సంభవించడమే.

స్పష్టంగా, సాంకేతిక సమాచారం కొంతమేరకే సహాయకరం. అవసరమైన మరో విషయమేమంటే, అలాంటి అపాయం సంభవిస్తుంది అన్న ప్రాంతాల్లో లేదా పర్యావరణాన్ని నాశనం చేసే యిలాంటి విధాల్లో తప్ప మరేలాగూ వీలుపడదనేంత ఒత్తిడులను ప్రజలపైనుండి తొలగించే సామర్థ్యం కావాలి. అంటే, ప్రకృతి శక్తులు తెచ్చే నష్టాన్ని తగ్గించడానికి, మనం జీవించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల పునఃసంస్థీకరణ అవసరం. ఈ పనిని ఎవరు సాధించగలరు? కేవలం, ప్రకృతి వైపరీత్యాలను తెచ్చే ఈ శక్తులను అదుపులో పెట్టగల్గిన వాడే చేయగలడు.

భవిష్యత్తులో దేవుని కార్యాలు

యెహోవా దేవుడు కేవలం సూచనలతోనే వ్యవహరించడు అయితే, అలాకాక మానవ బాధకు ముఖ్యమైన కారణాన్ని పెరికివేస్తాడు. ఆయన “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చు” అత్యాగ్రహం, కౄరత్వంతో కూడిన రాజకీయ, వ్యాపార, మత వ్యవస్థలను నాశనం చేస్తాడు. (ప్రసంగి 8:9) బైబిలుతో పరిచయమున్న ఎవరైనా, దేవుడు భూమి మీద నుండి దుష్టత్వాన్నీ బాధలనూ తీసివేసి శాంతి, నీతితో కూడిన భూ పరదైసును పునఃస్థాపించే చర్యగైకొంటాడనే అనేక ప్రవచనాలను గమనించకపోయుండరు.—కీర్తన 37:9-11, 29; యెషయా 13:9; 65:17, 20-25; యిర్మీయా 25:31-33; 2 పేతురు 3:7; ప్రకటన 11:18.

కాబట్టి అది యేసు తన శిష్యులకు ప్రార్థించడానికి నేర్పినదే, ఉదాహరణకు, “నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:10) ప్రవక్తయైన దానియేలు ప్రవచించినట్లుగా, మెస్సీయా రాజ్యం అపరిపూర్ణ మానవ పరిపాలనకు మారుగా వస్తుంది: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.

దేవుని రాజ్యము, ఈనాటి రాజ్యాలు సాధించలేని వేటిని సాధిస్తుంది? బైబిలు రాబోయే వాటిని గూర్చి ముందుగా ఎంతో మనోహరంగా చూపుతోంది. ఈ పుటల్లో దృష్టాంతపరచబడిన కరువు, పేదరికాల వంటి వాటికి బదులుగా, “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట . . . తాండవమాడుచుండును,” అంతేకాకుండా “ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు.” (కీర్తన 72:16; యెహెజ్కేలు 34:27) ప్రకృతి వాతావరణాన్ని గూర్చి బైబిలు యిలా అంటోంది: “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును అది బహుగా పూయుచు ఉల్లసించును. . . . అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును.” (యెషయా 35:1, 6, 7) యుద్ధాలు యిక ఉండవు.—కీర్తన 46:9.

యెహోవా వీటిని ఎలా సాధ్యపరుస్తాడో, ఈ ప్రకృతి శక్తులు ఎన్నటికీ హాని కలిగించకుండా వాటితో ఎలా వ్యవహరిస్తాడో బైబిలు తెల్పడం లేదు. అయినప్పటికీ, నీతియుక్తమైన రాజ్యంలో జీవించేవారు “వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురు వారి సంతానపువారు వారియొద్దనే యుందురు” అన్నది మాత్రం నిశ్చయం.—యెషయా 65:23.

ఈ పత్రికలో, అలాగే వాచ్‌టవర్‌ సొసైటి వారి ఇతర ప్రచురణలందు యెహోవాసాక్షులు దేవుని రాజ్యం పరలోకమందు 1914వ సంవత్సరంలో స్థాపించబడిందని సూచించారు. ఆ రాజ్య నడిపింపు క్రింద, దాదాపు 80 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా సాక్ష్యమివ్వబడుతోంది, మరి యిప్పుడు మనం వాగ్దానం చేయబడిన “క్రొత్త ఆకాశము క్రొత్త భూమి” యొక్క ద్వారంవద్ద ఉన్నాము. మానవజాతి, ప్రకృతి వైపరీత్యాల సర్వనాశనం నుండే కాక గత ఆరు వేల సంవత్సరాలుగా మానవజాతిని పట్టిపీడిస్తున్న వేదన, బాధలనుండి కూడా విముక్తినొందుతుంది. ఆ కాలాన్ని గూర్చి వాస్తవంగా మనం యిలా అనవచ్చు: “మొదటి సంగతులు గతించి పోయెను.”—2 పేతురు 3:13; ప్రకటన 21:4.

మరి యిప్పటి మాటేమిటి? ప్రకృతి లేక యితర పరిస్థితులవల్ల వ్యధ చెందిన వారికొరకు దేవుడేమైనా చేస్తున్నాడా? ఆయన నిస్సందేహంగా చేశాడు కానీ అనేకమంది ప్రజలు అనుకున్న రీతిలో మాత్రం కాదు.

[8, 9వ పేజీలోని చిత్రాలు]

మానవ కార్యాలు మన పర్యావరణం ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా గురయ్యేట్లు చేశాయి

[క్రెడిట్‌ లైను]

Laif/Sipa Press

Chamussy/Sipa Press

Wesley Bocxe/Sipa Press

Jose Nicolas/Sipa Press

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి